Sonu Sood Responds On Jubilee Hills Amnesia Pub Rape Case - Sakshi
Sakshi News home page

Sonu Sood: జూబ్లీహిల్స్‌ పబ్‌ కేసు: ఇలాంటి ఘటనలకు పబ్స్‌ కారణం కాదు

Published Tue, Jun 14 2022 1:49 PM | Last Updated on Tue, Jun 14 2022 5:54 PM

Sonu Sood Responds On Jubilee Hills Pub Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌ మైనర్ బాలిక అత్యాచార కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! రొమేనియాకు చెందిన బాలికను ఇంటి వద్ద డ్రాప్‌ చేస్తామని కారులో ఎక్కించుకుని ఆమెపై సామూహిక అ‍త్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులోని నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్‌ కొడుకు, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఇప్పటికే క్రైమ్‌సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.

తాజాగా ఈ ఘటనపై నటుడు సోనూసూద్‌ స్పందించాడు. ఇలాంటి ఘటనలకు పబ్స్‌ కారణమనేది తప్పని వారించాడు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, మనం చూసే విధానం తప్పుగా ఉంటే చెడు ఆలోచనలు వస్తాయని పేర్కొన్నాడు.

చదవండి: పెళ్లి చేసుకున్నాం, కానీ మా లైఫ్‌లో పెద్ద ఛేంజ్‌ ఏం లేదు
మైనర్లతో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement