Hyderabad Minor Girl Rape Case: BJP Chief Bandi Sanjay Open Letter To CM KCR - Sakshi
Sakshi News home page

Amnesia Pub Case: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ!

Published Sat, Jun 4 2022 1:18 PM | Last Updated on Sat, Jun 4 2022 3:45 PM

Hyderabad Amnesia Pub Incident: BJP Chief Open Letter To CM KCR - Sakshi

ఫైల్‌ ఫొటో

సాక్షి, హైదరాబాద్‌: అమ్నీషియా పబ్‌ అత్యాచార ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌కు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ బహిరంగ లేఖ రాశారు. 

అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారాయన. ఈ ఘటనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని, నాలుగు రోజులు గడుస్తున్నా పోలీస్‌ శాఖ పనితీరు అనుమానాకు తావిస్తోందని లేఖలో ఆయన ఆరోపించారు. 

ఘటనలో కేసీఆర్‌ రాజకీయ మిత్రుల వారసుల పేర్లు ప్రముఖంగా మీడియాలో, సోషల్‌ మీడియాలో వినిస్తున్నాయని తెలిపారు. అనుమానాలు నివృత్తి చేసి.. సంఘటనపై స్పష్టత ఇప్పించాలని తెలంగాణ బీజేపీ తరపున కోరుతున్నట్లు లేఖలో బండి సంజయ్‌ పేర్కొన్నారు.

చదవండి: అమ్నీషియా పబ్‌ కేసు: సంచలన ఫొటోలు, వీడియోలు బయటకు.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement