న్యూఢిల్లీ: మతంతో సంబంధం లేకుండా అమ్మాయిల వివాహ వయసులో ఏకరూపత ఉండాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలపాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. అమ్మాయి రజస్వల అయితే పెళ్లి చేసేయడానికి ముస్లిం మతాచారాలు అనుమతిస్తున్నాయని, ఇది పోస్కో చట్టానికి, ఐపీసీకి విరుద్ధమని మహిళా కమిషన్ పేర్కొంది. మతాలతో సంబంధం లేకుండా అమ్మాయిలకు 18 ఏళ్లు కనీస వివాహ వయసుగా నిర్ణయించాలని అభ్యర్థించింది.
పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలుపాలంటూ నోటీసులు జారీచేసింది. ముస్లిం పర్సనల్ లా అమ్మాయి రజస్వల అయితే వివాహం చేయడానికి అర్హురాలేనని పేర్కొంటోందని, మిగతా మతాల పర్సనల్ లాల్లో మాత్రం 18 ఏళ్ల కనీస వివాహ వయసుందని మహిళా కమిషన్ పేర్కొంది.
ఇదీ చదవండి: ఆప్‌లోకి కాంగ్రెస్ కౌన్సిలర్లు.. గంటల వ్యవధిలోనే సొంత గూటికి..
Comments
Please login to add a commentAdd a comment