girl marriage
-
అమ్మాయిల కనీస వివాహ వయసు ఎంత?
న్యూఢిల్లీ: మతంతో సంబంధం లేకుండా అమ్మాయిల వివాహ వయసులో ఏకరూపత ఉండాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలపాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. అమ్మాయి రజస్వల అయితే పెళ్లి చేసేయడానికి ముస్లిం మతాచారాలు అనుమతిస్తున్నాయని, ఇది పోస్కో చట్టానికి, ఐపీసీకి విరుద్ధమని మహిళా కమిషన్ పేర్కొంది. మతాలతో సంబంధం లేకుండా అమ్మాయిలకు 18 ఏళ్లు కనీస వివాహ వయసుగా నిర్ణయించాలని అభ్యర్థించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలుపాలంటూ నోటీసులు జారీచేసింది. ముస్లిం పర్సనల్ లా అమ్మాయి రజస్వల అయితే వివాహం చేయడానికి అర్హురాలేనని పేర్కొంటోందని, మిగతా మతాల పర్సనల్ లాల్లో మాత్రం 18 ఏళ్ల కనీస వివాహ వయసుందని మహిళా కమిషన్ పేర్కొంది. ఇదీ చదవండి: ఆప్‌లోకి కాంగ్రెస్ కౌన్సిలర్లు.. గంటల వ్యవధిలోనే సొంత గూటికి.. -
18 ఏళ్లకు ఆడపిల్ల ప్రధానిని ఎన్నుకోగలిగితే... పెళ్లెందుకు చేసుకోకూడదు!
Asaduddin Owaisi Comments 21 Years Minimum Marriage Age For Women: 18 ఏళ్లకే ఆడపిల్ల ప్రధానిని ఎన్నుకోగలిగితే ఎందుకు పెళ్లి చేసుకుని భాగస్వామిని కాకూడదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే దేశంలో అమ్మాయిల ఆరోగ్య దృష్ట్యా వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతున్నట్లు కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. (చదవండి: పాండా జూ నుంచి తప్పించుకోవాలని యత్నించి.. పాపం ఎలా టెంప్ట్ అయ్యిందో చూడండి!!) అయితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పితృస్వామ్యానికి పెద్ద పీటవేసిందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని విమర్శించారు. పైగా 18 ఏళ్ల వయస్సులో ఒక భారతీయ పౌరుడు ఒప్పందాలపై సంతకం చేయవచ్చు, వ్యాపారాలు ప్రారంభించవచ్చు, ప్రధాన మంత్రులను ఎన్నుకోవచ్చు ,ఎంపీలు,ఎమ్మెల్యేలను ఎన్నుకోవచ్చు గానీ పెళ్లిళ్లు చేసుకోకూడదా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు అబ్బాయిల వివాహ వయసు 21 ఏళ్ల వయోపరిమితిని 18కి తగ్గించాలంటూ తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అంతేకాదు మహిళల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఏఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. భారతదేశంలో బాల్య వివాహాలు తగ్గింది క్రిమినల్ చట్టాల వల్ల కాదని విద్య, ఆర్థిక ప్రగతి కారణంగానే తగ్గుముఖం పట్టాయాని అన్నారు. అయినా దాదాపు 12 మిలియన్ల మంది పిల్లలకు 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు అవుతున్నట్లు ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయని దుయ్యబట్టారు. 2005లో శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం 26 శాతంగా ఉందని అది కాస్త 2020 నాటికి 16 శాతానికి తగ్గిందని అన్నారు. అంతేకాదు తన దృష్టిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయసు 21 ఏళ్లు ఉండాలని నొక్కి చెప్పారు. ఈ క్రమంలో అమెరికాలో 14 ఏళ్లకు, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో 16 ఏళ్లకే వివాహం చేసుకునే హక్కు ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పైగా మహిళలు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడూ బిడ్డని కనాలనేది ఆమె గోప్యతకు సంబంధిన ప్రాథమిక హక్కు అని, ఆ విషయాన్ని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసిందని అన్నారు. (చదవండి: ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ తుపాను బీభత్సం.. 21 మంది మృతి) -
బాలికతో వివాహం.. ఆపై వేధింపులు
రసూల్‌పురా: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన బాలికను వివాహం చేసుకున్నాడు. ఆపై సహజీవనం చేశాడు. అనంతరం వేధింపులకు గురి చేస్తుండటంతో ఓ యువకుణ్ని కార్ఖాన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ మధుకర్‌స్వామి కథనం ప్రకారం.. సిద్దిపేటకు చెందిన అనీల్ (21) కొంతకాలంగా నగరంలోని మారేడుపల్లిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారానికి చెందిన ఓ బాలికతో (ప్రస్తుతం మేజర్) ఫేస్బుక్లో గత ఏడాది మార్చిలో పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత ఏడాది మే నెలలో ఓ ఆలయంలో వివాహం చేసుకుని సహజీవనం చేశాడు. కొద్దికాలంగా ఆమెను వేధిస్తుండటంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం కార్ఖాన పోలీసులు మారేడుపల్లిలో ఉంటున్న అనీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివాహం చేసుకున్న సమయంలో బాధితురాలు మైనర్ అని తేలడంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
రాత్రి పెళ్లి.. ఉదయం ఇంటర్ పరీక్ష!
ఆగ్రా : పెళ్లి కాగానే చాలామంది మహిళలు చదువును పక్కనపెట్టేస్తారు. ఇక పెళ్లి జరుగుతున్న సమయంలో అసలు చదువు ఆలోచనే రాదు. ఒకవేళ వచ్చినా కుటుంబసభ్యులు అందుకు అంగీకరించే సందర్భాలు అరుదు. సుదీర్ఘంగా సాగే పెళ్లితంతు మధ్య చదువు అటకెక్కడం ఖాయం. పెళ్లి సమయంలో పరీక్షలు ఉన్నా.. వాటిని పక్కనపెట్టాల్సిందే. పెళ్లికూతురిని చేయడం, మెహిందీ పెట్టడం.. పూజలు చేయడం.. తెల్లవార్లూ ఈ తంతు కొనసాగుతూనే ఉంటుంది. ఇంతటి సందడి మధ్య కూడా ఓ యువతి చదువును నిర్లక్ష్యం చేయలేదు. పరీక్షలేం రాస్తామని పక్కన పెట్టలేదు. ఏడాది పొడవునా చదివిన చదువును గౌరవిస్తూ.. పెళ్లయిన తెల్లారే.. పరీక్ష కేంద్రానికి వెళ్లింది. చక్కగా పన్నెండో తరగతి పరీక్షలు రాసింది. ఈ ఘటన ఆగ్రాలో జరిగింది. మంగళవారం రాత్రి వివాహం చేసుకున్న యువతి బుధవారం ఉదయమే పరీక్షా కేంద్రం వద్ద కనిపించడం అక్కడివారిని ఆశ్చర్యపరిచింది. పెళ్లి హడావిడిలోనూ పరీక్షలు మరిచిపోకుండా ధైర్యంగా ఎగ్జామ్‌కు హాజరైన ఆ యువతిని తోటి విద్యార్థులు, టీచర్లు అభినందించారు. -
కాంట్రాక్టు వివాహాల కలకలం
-
కాంట్రాక్టు వివాహాల కలకలం
నెక్కొండ(నర్సంపేట): అరబ్ షేక్‌ల తరహా మోసాలు వరంగల్‌లో వెలుగు చూశాయి. వయసుపై బడిన వారు బాలికలు, యువతులను పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఏజెంట్లను నియమించుకుని బాలికల తల్లిదండ్రులను ఒప్పిస్తున్నారు. లంబాడీ తండాలే కేంద్రాలుగా ఈ మోసాలు జరుగుతున్నాయి. ఈ తరహా మోసం వరంగల్ రూరల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. నెక్కొండ మండలం గొట్లకొండ తండాకు చెందిన ఇద్దరు బాలికలు, ఓ వివాహిత మొత్తం ముగ్గురిని ఇతర రాష్ట్రాలకు చెందిన యాభై ఏళ్లకు పైబడిన ముగ్గురు వ్యక్తులు పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో ఓ బాలిక పెళ్లికి నిరాకరించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. 17వ తేదీన.. ఉత్తరభారత దేశానికి చెందిన 50 ఏళ్లకు పైబడిన వయసు కలిగిన ముగ్గురు వ్యక్తులు మహబూబాబాద్ చుట్టు పక్కల గిరిజన యువతులను పెళ్లాడేందుకు ప్రయత్నించారు. వీరికి నెక్కొండ మండలం గొట్లకొండ గ్రామపంచాయితీ నాలుగో వార్డు సభ్యుడు గుగులోతు బిచ్చాతో పరిచయం అయ్యింది. తమ గ్రామానికి చెందిన ముగ్గురు పెళ్లికి సిద్ధంగా ఉన్నారంటూ బిచ్చా తెలిపారు. ఇందులో ఇద్దరు బాలికలు, వివాహం అయి భర్తతో దూరంగా ఉంటూ విడాకులకు ప్రయత్నిస్తున మరో మహిళ ఉన్నట్లు బిచ్చా చెప్పడంతో వయసుపైడిన ఆ ముగ్గురు వ్యక్తులు పెళ్లిల్ల కోసం రాజస్తాన్ నుంచి మహబూబాబాద్‌కు వచ్చారు. ఇద్దరు బాలికలు, వివాహితతోపాటు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులు కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ఓ పార్కుకు ఈనెల 17న చేరుకున్నారు. ఇందులో ఓ బాలిక పార్కులోకి వచ్చేందుకు నిరాకరించింది. దీంతో మిగిలిన ఇంకో బాలిక, వివాహితతో పెళ్లి తంతు జరిపించారు. ఆయా కుటుంబాల సంప్రదాయం ప్రకారం బాలిక, యువతిని కూర్చోబెట్టి వారి నుదుట పెళ్లి చేసుకునే వ్యక్తితో బొట్టు పెట్టించారు. ఈ తంతంగాన్ని వీడియో తీశారు. ఇష్టం లేక.. ఇనుగుర్తి పార్కులో పెళ్లి తంతులో భాగంగా బొట్టు పెట్టుడు కార్యక్రమం పూర్తయిన తర్వాత నవంబరు 18న నెక్కొండ మండలం గొట్లకొండకు బాలిక, వివాహిత చేరుకుంది. మరుసటి రోజు నుంచి పెళ్లి(బొట్టు పెట్టుడు) జరిగింది కాబట్టి తమ భార్యలను పంపిస్తే తీసుకెళ్తామంటూ రాజస్తాన్‌కు చెందిన వారు బిచ్చాకు ఫోన్ చేయడం ప్రారంభించారు. అలాగే వెళ్లిపోయిన బాలికను పెళ్లికి ఒప్పించాలంటూ ఒత్తిడి చేశారు. పెళ్లిపై ఒత్తిడి తీవ్రం కావడంతో నవంబరు 23 గురువారం రాత్రి సదరు బాలిక విషయాన్ని తండ్రికి తెలిపింది. దీంతో కూతురు ద్వారా నెక్కొండ పోలీసులకు గురువారం రాత్రి సమాచారం అందించారు. శుక్రవారం బిచ్చాపై కేసు నమోదు చేశారు. పెళ్లి తంతు నిర్వహిస్తున్న దృశ్యం ఒక్కో పెళ్లికి రూ.50వేలు ఇద్దరు బాలికలు, మరో వివాహితతో యాభైఏళ్లకు పైబడిన వ్యక్తులకు ఇచ్చి పెళ్లి జరిపించేందుకు నెక్కొండ నాలుగోవార్డు సభ్యుడు గుగులోతు బిచ్చా మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఇందుకు ఒక్కో పెళ్లికి రూ.50 కమీషన్‌గా తీసుకునేందుకు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులతో ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే లంబాడీ తండాలలో శిశువులను అమ్మకాలు జరుగుతున్న వైనం వివా దాస్పదం అవుతోంది. ఈ తరుణంలో అరబ్‌షేక్‌ల తరహాలో బాలికలను వయసు పైడిన వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేస్తున్న అంశం బయటపడటం చర్చనీయాంశంగా మారింది. పెళ్లి విషయంలో గ్రామస్తులు, బాలికల తలిదండ్రులకు సమాచారం లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. మహబూబాబాద్ అడ్డా.. మహబూబాబాద్ చుట్టు పక్కల ఉన్న మార్బుల్, గ్రానైట్ వ్యాపార లావాదేవీల కోసం రాజస్థాన్‌కు చెందిన వారు ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. ఇందులో కొందరు ఇక్కడి గిరిజన యువతులను పెళ్లిలు చేసుకుంటున్నారు. వయసు పైడిన వ్యక్తులకు గిరిజన యువతులను వెతికి పెట్టేందుకు మహబూబాబాద్ కేంద్రంగా కొన్ని ముఠాలు/వ్యక్తులు పనిచేస్తున్నారు. ఇందులో ఓ ముఠా సభ్యులతో బిచ్చాకు సంబంధాలు ఉన్నాయి. అలా ఈ పెళ్లి తంతు కార్యక్రమం జరిగింది. ఇప్పటికే మహబూబాబాద్ మండలం ఏటిగడ్డకు చెందిన ఓ ముఠా ఇదే తరహాలో ఐదు పెళ్లిల్లు జరిపించినట్లు సమాచారం. పరారీలో నిందితుడు బాధిత బాలిక కుటుంబం నుంచి ఫిర్యాదు తీసుకుని బిచ్చాపై కేసు నమోదు చేశాం. ప్రస్తుతం బిచ్చా పరారీలో ఉన్నాడు. బాలికలను పెళ్లి చేసుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరనే అంశంపై విచారణ చేస్తున్నాం. త్వరలో వీరిని అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరిస్తాం.– నవీన్, ఎస్సై, నెక్కొండ -
బాలికతో అరబ్ షేక్ వివాహం... అడ్డుకున్న పోలీసులు
చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): పేదరికం, నిరక్ష్యరాస్యతను ఆసరాగా చేసుకొని బాలికను వివాహం చేసుకునేందుకు ఓ అరబ్ షేక్ చేసిన ప్రయత్నాన్ని రెయిన్‌బజార్ పోలీసులు అడ్డుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... ఒమన్ దేశం మస్కట్ ప్రాంతానికి చెందిన అల్ బాలుచీ బాదర్ యూసుఫ్ సేద్(37) గత నెల 16వ తేదీన టూరిస్ట్ వీసాపై హైదరాబాద్‌కు వచ్చాడు. హిమాయత్‌నగర్ హైదర్‌గూడలోని హోటల్ హన్షు గ్రాండ్లో 18వ తేదీన దిగాడు. అక్కడ ఉన్న సమయంలోనే అయేషా అనే పెళ్లిళ్ల బ్రోకర్‌తో చర్చలు జరిపాడు. దీంతో అయేషా రెయిన్‌బజార్ అరబ్గల్లీకి చెందిన బస్సుడ్రైవర్ ఖయ్యూం, సయ్యదా హైదరీ ఫాతిమాల కుమార్తె(17) విషయం తెలిపింది. పేదరికంతో బాధ పడుతున్న వారికి రూ.5 లక్షలు ఇప్పిస్తానని, అరబ్ షేక్‌తో పెళ్లికి ఒప్పుకోవాలని ఆశపెట్టింది. తల్లిదండ్రులు అంగీకరించటంతో ఈ నెల 2వ తేదీన వివాహం చేయాలని నిశ్చయించి, ముందుగా ఖర్చుల కోసం అయేషా షేక్ నుంచి రూ.30 వేలు తీసుకుంది. దీంతో పాటు పాస్, పోర్టు వీసా వచ్చేంత వరకు రెండు నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు కూతురితో కలసి ఉండేందుకు ఒక గది అద్దెకు తీసుకోవాలని బాలిక తండ్రి ఖయ్యూంకు రూ.15 వేలు అందజేసింది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 10 గంటలకు వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో రెయిన్‌బజార్ ఎస్సై జి.శ్రీనివాస్ రెడ్డి అక్కడికి చేరుకొని విషయాన్ని పసిగట్టి వివాహాన్ని అడ్డుకున్నారు. వెంటనే అరబ్ షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. విలేకర్ల సమావేశంలో మీడియా ముందుకు అరబ్ షేక్‌ను తీసుకొచ్చిన సమయంలో అతడు నవ్వులు చిందిస్తూ కనిపించడం గమనార్హం.