ఆగ్రా : పెళ్లి కాగానే చాలామంది మహిళలు చదువును పక్కనపెట్టేస్తారు. ఇక పెళ్లి జరుగుతున్న సమయంలో అసలు చదువు ఆలోచనే రాదు. ఒకవేళ వచ్చినా కుటుంబసభ్యులు అందుకు అంగీకరించే సందర్భాలు అరుదు. సుదీర్ఘంగా సాగే పెళ్లితంతు మధ్య చదువు అటకెక్కడం ఖాయం. పెళ్లి సమయంలో పరీక్షలు ఉన్నా.. వాటిని పక్కనపెట్టాల్సిందే. పెళ్లికూతురిని చేయడం, మెహిందీ పెట్టడం.. పూజలు చేయడం.. తెల్లవార్లూ ఈ తంతు కొనసాగుతూనే ఉంటుంది.
ఇంతటి సందడి మధ్య కూడా ఓ యువతి చదువును నిర్లక్ష్యం చేయలేదు. పరీక్షలేం రాస్తామని పక్కన పెట్టలేదు. ఏడాది పొడవునా చదివిన చదువును గౌరవిస్తూ.. పెళ్లయిన తెల్లారే.. పరీక్ష కేంద్రానికి వెళ్లింది. చక్కగా పన్నెండో తరగతి పరీక్షలు రాసింది. ఈ ఘటన ఆగ్రాలో జరిగింది. మంగళవారం రాత్రి వివాహం చేసుకున్న యువతి బుధవారం ఉదయమే పరీక్షా కేంద్రం వద్ద కనిపించడం అక్కడివారిని ఆశ్చర్యపరిచింది. పెళ్లి హడావిడిలోనూ పరీక్షలు మరిచిపోకుండా ధైర్యంగా ఎగ్జామ్‌కు హాజరైన ఆ యువతిని తోటి విద్యార్థులు, టీచర్లు అభినందించారు.
Published Wed, Feb 21 2018 10:03 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment