
రసూల్‌పురా: ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన బాలికను వివాహం చేసుకున్నాడు. ఆపై సహజీవనం చేశాడు. అనంతరం వేధింపులకు గురి చేస్తుండటంతో ఓ యువకుణ్ని కార్ఖాన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ మధుకర్‌స్వామి కథనం ప్రకారం.. సిద్దిపేటకు చెందిన అనీల్ (21) కొంతకాలంగా నగరంలోని మారేడుపల్లిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారానికి చెందిన ఓ బాలికతో (ప్రస్తుతం మేజర్) ఫేస్‌బుక్‌లో గత ఏడాది మార్చిలో పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత ఏడాది మే నెలలో ఓ ఆలయంలో వివాహం చేసుకుని సహజీవనం చేశాడు. కొద్దికాలంగా ఆమెను వేధిస్తుండటంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం కార్ఖాన పోలీసులు మారేడుపల్లిలో ఉంటున్న అనీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివాహం చేసుకున్న సమయంలో బాధితురాలు మైనర్ అని తేలడంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment