Asaduddin Owaisi Comments 21 Years Minimum Marriage Age For Women: 18 ఏళ్లకే ఆడపిల్ల ప్రధానిని ఎన్నుకోగలిగితే ఎందుకు పెళ్లి చేసుకుని భాగస్వామిని కాకూడదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే దేశంలో అమ్మాయిల ఆరోగ్య దృష్ట్యా వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతున్నట్లు కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
(చదవండి: పాండా జూ నుంచి తప్పించుకోవాలని యత్నించి.. పాపం ఎలా టెంప్ట్ అయ్యిందో చూడండి!!)
అయితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పితృస్వామ్యానికి పెద్ద పీటవేసిందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని విమర్శించారు. పైగా 18 ఏళ్ల వయస్సులో ఒక భారతీయ పౌరుడు ఒప్పందాలపై సంతకం చేయవచ్చు, వ్యాపారాలు ప్రారంభించవచ్చు, ప్రధాన మంత్రులను ఎన్నుకోవచ్చు ,ఎంపీలు,ఎమ్మెల్యేలను ఎన్నుకోవచ్చు గానీ పెళ్లిళ్లు చేసుకోకూడదా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు అబ్బాయిల వివాహ వయసు 21 ఏళ్ల వయోపరిమితిని 18కి తగ్గించాలంటూ తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అంతేకాదు మహిళల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఏఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
భారతదేశంలో బాల్య వివాహాలు తగ్గింది క్రిమినల్ చట్టాల వల్ల కాదని విద్య, ఆర్థిక ప్రగతి కారణంగానే తగ్గుముఖం పట్టాయాని అన్నారు. అయినా దాదాపు 12 మిలియన్ల మంది పిల్లలకు 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు అవుతున్నట్లు ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయని దుయ్యబట్టారు. 2005లో శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం 26 శాతంగా ఉందని అది కాస్త 2020 నాటికి 16 శాతానికి తగ్గిందని అన్నారు.
అంతేకాదు తన దృష్టిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయసు 21 ఏళ్లు ఉండాలని నొక్కి చెప్పారు. ఈ క్రమంలో అమెరికాలో 14 ఏళ్లకు, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో 16 ఏళ్లకే వివాహం చేసుకునే హక్కు ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పైగా మహిళలు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడూ బిడ్డని కనాలనేది ఆమె గోప్యతకు సంబంధిన ప్రాథమిక హక్కు అని, ఆ విషయాన్ని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసిందని అన్నారు.
(చదవండి: ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ తుపాను బీభత్సం.. 21 మంది మృతి)
Comments
Please login to add a commentAdd a comment