సాక్షి, హైదరాబాద్ : సీసీ కెమెరాలను పెట్టింది ఘటన జరిగిన తర్వాత ఉపయోగించడానికి కాదని, వాటి ఆధారంగా నిరంతరం పర్యవేక్షించాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల స్పష్టం చేశారు. ప్రియాంక రెడ్డి ఘటనపై శనివారం బేగంపేట హరిత ప్లాజాలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పరిధిలతో సంబంధం లేకుండా పోలీసులు మానవతా దృక్పథంతో సహాయం చేయాలని సూచించారు. సీసీ కెమెరాలు నాణ్యత లేకుండా పెట్టారని, పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రియాంక కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించామని తెలిపారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ లేదు కాబట్టి, ఘటనను సెక్షన్ 10 ప్రకారం సుమోటోగా స్వీకరించి విచారిస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment