చందౌలి(యూపీ): బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా యూపీలో ఎస్పీ–బీఎస్పీ పొత్తుపై ఆమె ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..‘అధికారం కోసం గౌరవాన్ని వదులుకున్న మాయావతి తనపై దాడిచేసిన వారితోనే చేతులు కలిపారు. ఆమె ఆడజాతికే కళంకం లాంటిది. అసలు మాయావతి ఆడో, మగో చెప్పలేం. ఆమె హిజ్రా కంటే అధ్వానమైన వ్యక్తి’ అని దుర్భాషలాడారు.
దీంతో ఈ వ్యాఖ్యలను సుమోటోగా విచారణను స్వీకరిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖ శర్మ తెలిపారు. సోమవారం నోటీసులు జారీచేస్తామన్నారు. మరోవైపు సాధనా సింగ్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావలే, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా, కాంగ్రెస్ నేత ప్రియాంకా చతుర్వేది ఖండించారు. 1995లో లక్నోలోని ఓ గెస్ట్‌హౌస్‌లో బీఎస్పీ నేతలతో సమావేశమైన మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment