Sadhana singh
-
ఆమెను స్త్రీ అనాలో, పురుషుడిగా భావించాలో?
లక్నో : బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్‌కు.. మరో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ అండగా నిలిచారు. ‘1995 నాటి గెస్ట్‌హౌజ్ ఘటన తర్వాత కూడా మాయావతి సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారంటే ఆమెకు ఆత్మగౌరవం లేనట్టే కదా. సాధనా సింగ్ అన్న మాటల్లో తప్పేం ఉంది’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బీఎస్పీ- ఎస్పీ పొత్తు పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. బీఎస్పీ- ఎస్పీ పొత్తుపై మొఘల్సరాయ్ ఎమ్మెల్యే సాధనా సింగ్ శనివారం ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. ‘అధికారం చేపట్టాలనే ఆశతో యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తనను అవమానించిన వారితో చేతులు కలిపారు. ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారు. స్త్రీ గౌరవానికి కళంకం అంటించారు. ఆమెను స్త్రీ అనాలో లేదా పురుషుడిగా భావించాలో.. ఈ ఇద్దరితో కాకుండా వేరెవరితో పోల్చాలో అర్థం కావడం లేదు. ట్రాన్స్జెండర్ల కంటే కూడా ఆమె అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని సాధనా సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఇక బీజేపీ నేతల తీరును తప్పుబట్టిన బీఎస్పీ నాయకుడు ఎస్సీ మిశ్రా.. ‘ బీఎస్పీ-ఎస్పీ పొత్తుతో బీజేపీ నేతలకు పిచ్చి పట్టింది. వారి పడవ మునిగిపోతుందనే బాధలో ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు’ అని విమర్శించారు. సాధనా సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కాగా కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే కూడా సాధనా సింగ్ వ్యాఖ్యలను ఖండించారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం గౌరవప్రదం కాదని హితవు పలికారు. 1995 నాటి ఘటన 1993లో బీజేపీని నిలువరించేందుకు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం చేతులు కలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి 167 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. ఈ క్రమంలో నేతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 1995లో ఓ సమావేశంలో పాల్గొన్న బీఎస్పీ నేత మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు. ఆమె కార్యాలయాన్ని ధ్వంసం చేసి, అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో బీజేపీ నేత ఒకరు ఆమెను కాపాడారు. అనంతర పరిణామాలతో బీజేపీతో చేతులు కలిపి బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఎస్పీతో మాయావతి సంబంధాలు తెంచుకున్నారు. రెండు దశాబ్దాల అనంతరం మళ్లీ ఎస్పీకి మాయావతి స్నేహ హస్తం అందించారు.. -
మాయావతి హిజ్రా కన్నా అధ్వానం
చందౌలి(యూపీ): బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా యూపీలో ఎస్పీ–బీఎస్పీ పొత్తుపై ఆమె ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..‘అధికారం కోసం గౌరవాన్ని వదులుకున్న మాయావతి తనపై దాడిచేసిన వారితోనే చేతులు కలిపారు. ఆమె ఆడజాతికే కళంకం లాంటిది. అసలు మాయావతి ఆడో, మగో చెప్పలేం. ఆమె హిజ్రా కంటే అధ్వానమైన వ్యక్తి’ అని దుర్భాషలాడారు. దీంతో ఈ వ్యాఖ్యలను సుమోటోగా విచారణను స్వీకరిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖ శర్మ తెలిపారు. సోమవారం నోటీసులు జారీచేస్తామన్నారు. మరోవైపు సాధనా సింగ్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావలే, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా, కాంగ్రెస్ నేత ప్రియాంకా చతుర్వేది ఖండించారు. 1995లో లక్నోలోని ఓ గెస్ట్‌హౌస్‌లో బీఎస్పీ నేతలతో సమావేశమైన మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు. -
‘ఆ ఎమ్మెల్యేకి మతిభ్రమించింది’
లక్నో : బీఎస్పీ అధినేత్రి మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్‌కు మతిభ్రమించిందని బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా అన్నారు. మాయావతి నపుసంకురాలి కంటే హీనమని యూపీలోని మొఘల్సరాయ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల మిశ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధనా సింగ్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. లక్నో గెస్ట్ హౌస్‌లో మాయావతి సహా బీఎస్పీ కార్యకర్తలపై గతంలో ఎస్పీ కార్యకర్తలు చేసిన దాడిని పరోక్షంగా ప్రస్తావించిన సాధనా సింగ్ ప్రస్తుతం ఎస్పీ, బీఎస్పీల కలయికను తప్పుపడుతూ మాయావతిపై ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఎస్పీ, బీఎస్పీ చేతులు కలపడంతో బీజేపీ నేతలు బెంబేలెత్తుతున్నారని మిశ్రా వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో బీజేపీ నేతలు మానసిక స్థైర్యం కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు మాయావతిపై బీజేపీ నేత సాధనా సింగ్ వాడిన భాషే బీజేపీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. యూపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. -
ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌లలో పోటాపోటీ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర పోటీ ఉందని ‘జీ మీడియా- సీ ఫోర్’ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని పేర్కొన్న గత సర్వేలకు విరుద్ధంగా ఈ సర్వే ఫలితాలు ఉండటం విశేషం. మధ్యప్రదేశ్‌లో ద్విముఖ పోరు ఉందని, మొత్తం 230 స్థానాల్లో బీజేపీకి 100 -110 సీట్లు, కాంగ్రెస్‌కు 99 -109 సీట్లు రావచ్చని సర్వే వెల్లడించింది. బీఎస్పీకి 5-12 సీట్లు రావచ్చంది. ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను 51 శాతం, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాను 31 శాతం ఓటర్లు కోరుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ ద్విముఖ పోరే నెలకొందని, మొత్తం 90 స్థానాలకు గానూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు రెండూ 41 నుంచి 46 సీట్లు గెలుచుకునే అవకాశముందని సర్వేలో తేలింది. భర్త కంటే ధనవంతురాలు: విధిశ స్థానం నుంచి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ శుక్రవారం నామినేషన్ వేశారు. ఆయన సెహోర్ జిల్లాలోని బుధ్ని స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. తన ఆస్తుల కన్నా తన భార్య సాధన సింగ్ ఆస్తులు ఎక్కువని ఆయ న ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించారు. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.3.8 కోట్లు కాగా చౌహాన్‌కు 2.4 కోట్ల విలువైన ఆస్తులున్నాయి.