న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర పోటీ ఉందని ‘జీ మీడియా- సీ ఫోర్’ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని పేర్కొన్న గత సర్వేలకు విరుద్ధంగా ఈ సర్వే ఫలితాలు ఉండటం విశేషం. మధ్యప్రదేశ్‌లో ద్విముఖ పోరు ఉందని, మొత్తం 230 స్థానాల్లో బీజేపీకి 100 -110 సీట్లు, కాంగ్రెస్‌కు 99 -109 సీట్లు రావచ్చని సర్వే వెల్లడించింది. బీఎస్పీకి 5-12 సీట్లు రావచ్చంది. ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను 51 శాతం, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాను 31 శాతం ఓటర్లు కోరుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ ద్విముఖ పోరే నెలకొందని, మొత్తం 90 స్థానాలకు గానూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు రెండూ 41 నుంచి 46 సీట్లు గెలుచుకునే అవకాశముందని సర్వేలో తేలింది.
భర్త కంటే ధనవంతురాలు: విధిశ స్థానం నుంచి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ శుక్రవారం నామినేషన్ వేశారు. ఆయన సెహోర్ జిల్లాలోని బుధ్ని స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. తన ఆస్తుల కన్నా తన భార్య సాధన సింగ్ ఆస్తులు ఎక్కువని ఆయ న ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో వెల్లడించారు. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.3.8 కోట్లు కాగా చౌహాన్‌కు 2.4 కోట్ల విలువైన ఆస్తులున్నాయి.
ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌లలో పోటాపోటీ
Published Sat, Nov 9 2013 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement