
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : మీటూ ఉద్యమంపై మరో మధ్యప్రదేశ్ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాలు, ఎదుగుదల కోసం కొందరు మహిళలు తమ విలువలు, సిద్ధాంతాలతో రాజీపడతారని ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ అన్నారు. దీంతోనే మహిళలు ఇబ్బందుల పాలవుతారని, మీటూ క్యాంపెయిన్‌ను దుర్వినియోగపరుస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
ఉషా ఠాకూర్ వివాదాస్పద ప్రకటనలు చేయడం ఇదే తొలిసారి కాదు. నవరాత్రి ఉత్సవ వేదికల వద్దకు ముస్లిం యువకులను అనుమతించరాదని 2014 సెప్టెంబర్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హిందూ యువతులను వారు లోబరుచుకుని తర్వాత వారిని ఇస్లాంలోకి మారుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గర్భా వేడుకల్లో పాల్గొనే యువతులు సంప్రదాయక దుస్తులు వేసుకునేలా చూడాలని ఆమె నిర్వాహకులను కోరారు. గత రెండు వారాలుగా పలు రంగాలకు చెందిన మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వెల్లడిస్తూ బాహాటంగా ముందుకు రావడంతో మీటూ ఉద్యమం ఊపందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment