మీరు నా కెరీర్‌ రైలు దిగనందుకు కృతజ్ఞతలు | Sakshi
Sakshi News home page

మీరు నా కెరీర్‌ రైలు దిగనందుకు కృతజ్ఞతలు

Published Thu, May 16 2024 6:30 AM

Cannes 2024: Meryl Streep talks about her nearly misplaced Oscar Award at Cannes Film Festival 2024

కాన్స్‌ చిత్రోత్సవాల్లో నటి మెరిల్‌ స్ట్రీప్‌

ఫ్రాన్స్‌ నగరంలోని కాన్స్‌లో 77వ కాన్స్‌ చలన చిత్రోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈ ఏడాది కాన్స్‌ జ్యూరీ ప్రెసిడెంట్‌గా నటి–దర్శకురాలు గ్రెటా గెర్విగ్‌ వ్యవహ రిస్తున్నారు. ఆమె నేతృత్వంలో జ్యూరీ ఈ సంవత్సరం పోటీ పడుతున్న 22 చిత్రాల నుండి విజేతను ఎంపిక చేస్తుంది. వేడుక చివరి రోజు విజేతకు అవార్డు ప్రదానం చేస్తారు. ఇక వేడుకలు ్రపారంభం అయ్యే ముందు విలేకరులతో ‘మీ టూ’ మూమెంట్‌ గురించి, సమాజంలో సానుకూల మార్పు తెచ్చే శక్తి బలమైన కథలకు ఉంటుందని గ్రెటా గెర్విగ్‌ పేర్కొన్నారు. 

ఈ నెల 14 నుంచి 25 వరకూ జరిగే ఈ ఫెస్టివల్‌లో తొలి రోజు ్రపారంభ చిత్రంగా క్వెంటిన్‌ డ్యూపియక్స్‌ దర్శకత్వంలో రూ΄పొందిన ‘ది సెకండ్‌ యాక్ట్‌’ ప్రదర్శితమైంది. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘పామ్‌ డి ఓర్‌’ పురస్కారాన్ని నటి మెరిల్‌ స్ట్రీప్‌కి ప్రదానం చేశారు. సినీ రంగానికి మెరిల్‌ చేసిన సేవలకు గాను ఆమెను ఈ పురస్కారంతో గౌరవించారు. 1989లో కాన్స్‌ ఉత్సవాల్లో పాల్గొన్నారు మెరిల్‌. 

‘ఈవిల్‌ ఏంజెల్స్‌’లో కనబర్చిన నటనకుగాను ఆ ఏడాది ఆమె ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 40 ఏళ్ల వయసు అప్పుడు ఆ అవార్డు అందుకున్న మెరిల్‌ ఇప్పుడు 74 ఏళ్ల వయసులో ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. దాదాపు 35 ఏళ్లకు మళ్లీ కాన్స్‌లో పాల్గొనడం, ప్రతిష్టాత్మక పామ్‌ డి ఓర్‌ పురస్కారం అందుకోవడం, అవార్డు అందుకుంటున్న సమయంలో వీక్షకులు ఓ 2 నిమిషాల పాటు నిలబడి చప్పట్లతో అభినందించడంతో మెరిల్‌ స్ట్రీప్‌ ఒకింత ఉద్వేగానికి గురై, ఈ విధంగా స్పందించారు. 

‘‘గతంలో నేను కాన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొన్నప్పుడు నా వయసు 40. అప్పటికి ముగ్గురు పిల్లల తల్లిని. నా కెరీర్‌ ముగిసిపోయిందనుకున్నాను. కానీ ఈ రాత్రి (కాన్స్‌ వేదికను ఉద్దేశించి) నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మేడమ్‌ ప్రెసిడెంట్‌ (గ్రెటా గెర్విగ్‌ని ఉద్దేశించి... 2019లో గ్రెటా దర్శకత్వం వహించిన ‘లిటిల్‌ ఉమెన్‌’ చిత్రంలో నటించారు మెరిల్‌)తో సహా నేను పని చేసిన ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులు. 

ఇక్కడ నా సినిమాల క్లిప్పింగ్స్‌ని చూస్తుంటే నా కెరీర్‌ని బుల్లెట్‌ ట్రైన్‌ కిటికీలోంచి చూస్తున్నట్లుగా ఉంది. ఆ కిటికీలోంచి నా యవ్వనం మధ్యవయసుకి ఎగరడం నుంచి ఇదిగో ఇప్పుడు ఈ వేదిక వరకూ రావడం.. అంతా కనిపిస్తోంది. ఈ ప్రయాణంలో ఎన్నో ప్రదేశాలు... ఎన్నో ముఖాలు గుర్తొస్తున్నాయి. అన్నింటికీ మించి ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న మీకు (ప్రేక్షకులు) చాలా కృతజ్ఞతలు. నా ముఖం పట్ల మీరు విముఖత చూపనందుకు నా కెరీర్‌ ట్రైన్‌ని మీరు దిగనందుకు ధన్యవాదాలు’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు మెరిల్‌ స్ట్రీప్‌.  

మెరిసిన దేశీ తారలు 
ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు ΄పొడవాటి గౌనుల్లో ఎర్ర తివాచీపై క్యూట్‌గా క్యాట్‌వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. బాలీవుడ్‌ తారలు దీప్తీ సద్వానీ, ఊర్వశీ రౌతేలా తదితరులు పాల్గొన్నారు. టీవీ సిరీస్‌ ‘తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా’ ఫేమ్, పలు హిందీ చిత్రాల్లో నటించిన దీప్తీ సద్వానీ రెడ్‌ కార్పెట్‌ పై మెరిశారు. ్రపారంభ వేడుకలో పాల్గొన్న ఈ బ్యూటీ మొత్తం మూడు రోజుల పాటు ఈ చిత్రోత్సవాల్లో పాల్గొననున్నారు. 

కాన్స్‌ ఉత్సవాల్లో ΄పొడవాటి గౌను ధరించిన తొలి తారగా రికార్డ్‌ సాధించారు దీప్తి. ‘‘ఈ రెడ్‌ కార్పెట్‌పై నడవడం గౌరవంగా భావిస్తున్నాను. అది కూడా రికార్డు బద్దలు కొట్టే ΄పొడవాటి ట్రైల్‌ ఉన్న గౌను ధరించడం  హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు దీప్తీ సద్వాని. ఇక గత ఏడాది కాన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొన్న బాలీవుడ్‌ తార ఊర్వశీ రౌతేలా ఈసారీ హాజరయ్యారు. పింక్‌ కలర్‌ ఫ్రాక్‌లో ఆకట్టుకున్నారామె. కాగా 2018లో ఈ వేడుకల్లో పాల్గొన్న దీపికా పదుకోన్‌ పింక్‌ రంగు గౌను ధరించారు. ఇప్పుడు ఊర్వశీ ధరించిన గౌనుని అప్పటి దీపికా గౌనుతో పోల్చుతున్నారు. 
ఇలా తారల తళుకులు, పురస్కారగ్రహీత భావోద్వేగాలతో కాన్స్‌ చిత్రోత్సవాలు ఆకట్టుకునేలా సాగుతున్నాయి. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement