BSP chief Mayawati
-
తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య
చెన్నై: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ ( 47) గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురుయ్యారు. చెన్నై పెరంబూర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బైకుల మీద వచ్చిన కొందరు దుండగులు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేశారు. ఆ టైంలో ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా గాయపరిచారు. వెంటనే ఆయన్ను స్థానిక రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది.దాడి ఆయన ఇంటికి సమీపంలోనే చోటు చేసుకుందని సెంబియమ్ పోలీసులు తెలిపారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ గెటప్‌లు వేసుకొచ్చారని, పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతుండగానే కత్తులతో దాడి చేశారని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. ఆర్మ్‌స్టాంగ్ హత్యకేసులో శనివారం వేకువజామున పోలీసులు 8 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. హత్యకు రాజకీయ వైరమా? వ్యక్తిగత కక్షలా? అన్నది తేలాల్సి ఉంది. ఈ హత్యను రాజకీయ వర్గాలు ఖండిస్తున్నాయి. ఆయన మృతిపై పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను ఖండించిన బీఎస్పీ చీఫ్ మాయావతికె ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. ‘ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన్ను గుర్తుతెలియని దుండగులు హత్య చేయటం విచారకరం. ఆయన వృత్తిరీత్యా అడ్వకేట్‌గా పనిచేశారు. తమిళనాడులో బలమైన దళిత నాయకుడిగా తన గళాన్ని వినిపించేవారు. నిందితులను ప్రభుత్వం శిక్షించాలి’ అని ‘ఎక్స్’వేదికగా స్పందించారు. మరోవైపు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.The gruesome killing of Mr. K. Armstrong, Tamil Nadu state Bahujan Samaj Party (BSP) president, outside his Chennai house is highly deplorable and condemnable. An advocate by profession, he was known as a strong Dalit voice in the state. The state Govt. must punish the guilty.— Mayawati (@Mayawati) July 5, 2024 -
దేశానికి ప్రధాని కావాలన్నదే నా డ్రీమ్..
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు దేశ ప్రధాని కావాలని ఉందన్నారు. రాష్ట్రపతి కావాలనే కాంక్ష తనకు అసలులేదని మాయావతి స్పష్టం చేశారు. అయితే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తనపై ప్రతిరోజు పుకార్లు పుట్టిస్తున్నారని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లను మాయావతి.. బీజేపీకి ఇచ్చేసిందని అఖిలేష్ ఆరోపించారు. అనంతరం మాయావతి రాష్ట్రపతి అవుతుందేమో అంటూ( బీజేపీ ఆమెను క్విడ్ ప్రోకోగా దేశానికి రాష్ట్రపతిని చేస్తుందో లేదో చూడాలి) అఖిలేష్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీంతో తాజాగా అఖిలేష్‌కు మాయావతి ఇలా కౌంటర్ ఇచ్చారు. కాగా, గురువారం మాయావతి మాట్లాడుతూ.. తాను అంబేద్కర్, కాన్షీరాం బాటలోనే నడవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. దళితులు, అణగారిన వర్గాలు, ముస్లింలు తిరిగి బీఎస్పీకి ప్రాణం పోస్తే, యూపీ సీఎం, ప్రధాని అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవడం లేదంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఆమె సన్నిహితురాలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా, ఆ పార్టీ ఏకైక యూపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్‌లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిసిన తర్వాత మాయావతి ఇలా ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కూడా చదవండి: హిందీ జాతీయ భాష కాదు.. బడాయి వద్దు! -
ఎమ్మెల్యే రమాభాయ్పై మాయావతి వేటు
భోపాల్ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే వివాదాస్పద చట్టాన్ని సమర్ధించిన పార్టీ ఎమ్మెల్యేను బీఎస్పీ అధినేత్రి మాయావతి సస్పెండ్ చేశారు. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడితే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై తక్షణ చర్యలు తప్పవని మాయావతి ట్వీట్ చేశారు. బీఎస్పీ ఎమ్మెల్యే రమాభాయ్ పరిహార్ శనివారం తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పౌర చట్టాన్ని సమర్ధించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ సమక్షంలో ఆమె పార్టీ వైఖరికి విరుద్ధంగా పౌర చట్టానికి మద్దతు ప్రకటించడం బీఎస్పీ హైకమాండ్‌కు ఆగ్రహం కలిగించింది. పౌర చట్టాన్ని ఆమోదం పొందేలా చాకచక్యంగా వ్యవహరించిన నరేంద్ర మోదీ, ప్రహ్లాద్ పటేల్, అమిత్ షాలను తాను అభినందిస్తున్నాని, ఈ గొప్ప నిర్ణయం చాలా కాలం కిందటే తీసుకోవాల్సి ఉందని రమాభాయ్ వ్యాఖ్యానించారు. గత పాలకులు ఇలాంటి నిర్ణయం తీసుకునే సాహసం చేయలేదని అనిపిస్తోందని, తాను తన కుటుంబం ఈ చట్టాన్ని సమర్ధిస్తుందని ఆమె అన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ అధినేత్రి ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. -
వాళ్లలో భయాన్ని పోగొట్టండి : మాయావతి
లక్నో : పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలపై ముస్లిం సమాజంలో నెలకొన్న భయాన్ని, ఆందోళనను తొలగించాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ చట్టాలపై వారికి అవగాహన కల్పించి పూర్తిగా సంతృప్తిపరచాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ట్విటర్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆందోళనల ముసుగులో రాజకీయ స్వలాభం కోసం ప్రయత్నిస్తున్న పార్టీల పట్ల ముస్లింలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముస్లింలు అణచివేతకు, రాజకీయ దోపిడీకి గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో నెలకొన్న హింసపై స్పందిస్తూ.. శాంతియుత ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం దురదృష్టకరమని మాయావతి వ్యాఖ్యానించారు. చదవండి : వాళ్ల దోస్తీ ఎలాంటిదో చెప్పాలి : మాయావతి -
భీం ఆర్మీది ఓట్ల రాజకీయం : మాయావతి
సాక్షి, న్యూఢిల్లీ : భీం ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాడని బీఎస్పీ అధినేత మాయావతి మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా చంద్రశేఖర్ ఆజాద్ శనివారం ఢిల్లీలోని జామా మసీదు నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ముందస్తు అనుమతిని పోలీసులు నిరాకరించినా ర్యాలీ నిర్వహించడంతో శనివారం ఉదయం జామా మసీదు వెలుపల చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు ఆరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆయన్ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. తర్వాత ఆజాద్‌ను తీహార్ జైలుకు తరలించారు. ఈ పరిణామాలపై మాయావతి ఆదివారం ట్విటర్లో స్పందించారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ ఢిల్లీలో నిరసన తెలపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందునే ఓటర్లను ప్రభావితం చేయడానికి అనుమతి లేకున్నా ర్యాలీ నిర్వహించి కావాలని అరెస్ట్ అయ్యారని మాయావతి విమర్శించారు. ఇలాంటి స్వార్థపూరిత వ్యక్తులు, సంస్థలు, పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను, బీఎస్పీ పార్టీ కార్యకర్తలను మాయావతి హెచ్చరించారు. చదవండి : భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ అరెస్ట్ -
‘వారిని ఎస్సీల్లో చేర్చడం రాజ్యాంగవిరుద్ధం’
లక్నో : యూపీ ప్రభుత్వం 17 ఓబీసీ కులాలను ఎస్సీల్లో చేర్చుతూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. ఎస్సీ క్యాటగిరీలో ఏ ప్రభుత్వమైనా మార్పుచేర్పులను రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ నిరోధిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆ 17 ఓబీసీ వర్గాలు ప్రస్తుతం అటు ఓబీసీలు..ఇటు ఎస్సీలు కాకుండా పోయారని, వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరవని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆమె యూపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం 341 ఆర్టికల్‌కు అనుగుణంగా చర్యలు చేపట్టి రాజ్యాంగ ప్రక్రియకు అనుగుణంగా ఈ కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆమె కోరారు. ఎస్సీ కోటాను సైతం అదే నిష్పత్తిలో పెంచాలని మాయావతి సూచించారు. గతంలో ఎస్పీ ప్రభుత్వం ఇదే తరహా ఉత్తర్వులు ఇచ్చిన సమయంలోనూ దాన్ని వ్యతిరేకించానని ఆమె గుర్తుచేశారు. కాగా యూపీ ప్రభుత్వం రాజ్‌భర్, మల్లా, ప్రజాపతి, కుమ్హర్ వంటి 17 ఓబీసీ కులాలను ఎస్సీ కేటగిరీలో చేర్చుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘అందుకే నా విగ్రహాలు ప్రతిష్టించా’
సాక్షి, న్యూఢిల్లీ : దళిత మహిళ పోరాట పటిమకు సంకేతంగానే ఉత్తర్ ప్రదేశ్ అంతటా తన విగ్రహాలతో పాటు, బీఎస్పీ నేతల విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. మాయావతి సహా బీఎస్పీ నేతల విగ్రహాలను ప్రభుత్వ నిధులు రూ 2000 కోట్లు వెచ్చించి యూపీ అంతటా ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ 2009లో దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా మాయావతి అఫిడవిట్ దాఖలు చేశారు. ఏ రాజకీయ పార్టీల అజెండాలను ముందుకు తీసుకువెళ్లే కార్యకలాపాల కోసం రాష్ట్ర బడ్జెట్ల నిధులను వాడరాదని పిటిషనర్ వ్యాఖ్యానించారు. కాగా, తన విగ్రహాలపై వెచ్చించిన ఖర్చును తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్ధానం మాయావతిని కోరిన నేపథ్యంలో ఆమె అఫిడవిట్‌ను దాఖలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో విస్తృతంగా చర్చించిన మీదట, అన్ని నిబంధనలు, బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగానే విగ్రహాలను ఏర్పాటు చేశామని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇతర రాజకీయ పార్టీలు సైతం ఆయా పార్టీల నేతల విగ్రహాలను ఏర్పాటు చేశాయని చెప్పుకొచ్చారు. పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది రాజకీయ దురుద్దేశంతోనే ఈ పనిచేశారని విగ్రహాల అంశం లేవనెత్తడంలో ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. -
మాయా వ్యూహం.. మహా తంత్రం
సాక్షి, సెంట్రల్‌డెస్క్ : ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పి బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత మాయావతి రాజకీయ వర్గాలను సందిగ్ధంలో పడేశారు. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వ్యతిరేక కూటమిలో ప్రధాన పార్టీ అయిన బీఎస్పీ అధినేత ఎన్నికలకు దూరంగా ఉండటం వ్యూహాత్మకమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన మంత్రి అభ్యర్థి రేసులో ఉన్నా.. ఎన్నికల్లో పోటీ చేయరాదని మాయావతి నిర్ణయించుకోవడం వెనక రాష్ట్రంలో పార్టీని పూర్వ వైభవం తేవాలన్న పట్టుదల ఉందని వారంటున్నారు. ఈ ఎన్నికల్లో కనుక మాయావతి పోటీ చేస్తే బీజేపీ తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఆమెను నియోజకవర్గానికే పరిమితం చేస్తుందని, దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశం ఉండదని, మిత్రపక్షాలైన సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) తరఫున కూడా ప్రచారం చేయడానికి వీలుండదని అది కూటమి అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మాయావతి పోటీలో లేకపోవడం అంటే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేకపోవడమేనని బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలను చేసినా ఆమె పోటీకి దూరంగా ఉండటం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. కింగ్ మేకర్ కావాలనే.. ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీఎస్పీ 38 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. వీటిలో వీలైనన్ని సీట్లను గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాలని మాయావతి ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలి ఎన్నికల్లో ఆమె పార్టీ దారుణంగా దెబ్బతింది. 2012లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ ఓడిపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 80 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 300కుపైగా సీట్లలో పోటీ చేస్తే 19 సీట్లు మాత్రమే వచ్చాయి. తాడోపేడో తేల్చుకోవాల్సిన వేళ.. గత ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన నేపథ్యంలో పార్టీ బతికి బట్ట కట్టాలంటే ఈ ఎన్నికల్లో వీలైనన్ని సీట్లు గెలవాలి. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవలసిన పరిస్థితి. అందుకే దృష్టంతా పార్టీ అభ్యర్థుల గెలుపుపై పెట్టాల్సిన పరిస్థితి. 2018లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకుని బీజేపీని దెబ్బకొట్టారు మాయావతి. ఆ విజయాన్ని పునరావృతం చేయాలన్న లక్ష్యంతో ఈసారీ ఎస్పీ, ఆర్ఎల్డీతో పొత్తు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బీఎస్పీ ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. సంకీర్ణ ధర్మంలో భాగంగా ఆమె మిత్రపక్షాల తరఫున కూడా ప్రచారం చేయాల్సి ఉంది. ఈ కారణాలన్నీ మాయావతిని ఎన్నికల బరికి దూరం చేశాయి. అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి 2022లో జరిగే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాయావతి ఇప్పుడు పోరుకు దూరంగా ఉన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని బీఎస్పీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎస్పీ, ఆర్ఎల్డీ, కాంగ్రెస్ సహకారంతో బెహన్జీ కచ్చితంగా గెలుస్తారు. దాంతో ఐదేళ్లు ఢిల్లీలోనే ఉండాల్సి వస్తుంది. ఆమె పోటీ చేయకపోవడం వల్ల పార్టీకి ఒక సీటు పోవడం తప్ప పెద్దగా నష్టమేమీ ఉండదు. మాయావతి ఇక్కడే ఉండటం వల్ల 2022 అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టవచ్చు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పదవి కోసం అఖిలేశ్‌తో బేరాలాడే అవకాశం ఉంటుంది’ అని ఆయన వివరించారు. ‘ఈ ఎన్నికల్లో పోటీ చేసి మాయావతి లోక్‌సభకు వెళ్లిపోతే, ఇక్కడే ఉన్న అఖిలేశ్ వచ్చే శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేసులో ముందుంటారు. ఆ అవకాశం దక్కించుకోవడానికే మాయావతి పోటీ చేయడం లేదు’ అని ఆయన అన్నారు. మాకే లాభమంటున్న బీజేపీ మాయావతి ఎన్నికలకు దూరంగా ఉండటాన్ని బీజేపీ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ద్వారా తాను ప్రధానమంత్రి రేసులో లేనని మాయావతి చెప్పకనే చెప్పినట్టయింది. దీనివల్ల జాతీయ స్థాయిలో బీజేపీకి పోటీగా నిలిచేది కాంగ్రెస్ ఒక్కటే. కాంగ్రెస్‌పై మాయావతి గుర్రుగా ఉన్నారు. ప్రధానమంత్రి రేసులో కాంగ్రెస్ నేతలు ఉండటాన్ని మాయావతి సమ్మతించరు. కాబట్టి ఎటు చూసినా ఓటర్లకు ప్రధాని పదవికి మోదీ మినహా మరొకరు కానరారు. అందువల్ల మాయావతి నిర్ణయం తమకే లాభిస్తుందని బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదట ఓటమి.. ఆపై అన్నీ గెలుపే మాయావతి 1985లో తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో మీరా కుమార్ (కాంగ్రెస్)తో పోటీచేసి ఓడిపోయారు. నాలుగేళ్ల తర్వాత అదే స్థానంలో కాంగ్రెస్‌ను ఓడించి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆమె ఇంత వరకు లోక్‌సభకు నాలుగు సార్లు (1989, 1998, 1999, 2004) ఎన్నికయ్యారు. రాజ్యసభకు మూడు సార్లు (1994, 2004, 2012) ఎన్నికయ్యారు. అయితే, మూడుసార్లూ రాజ్యసభ సభ్యత్వ కాలం పూర్తి కాకుండానే రాజీనామా చేశారు. -
ఇది మా నాన్న వద్దనుకున్న శాలువా..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ పొత్తుపై చిందులు తొక్కుతున్న బీజేపీ నేతలు బీఎస్పీ అధ్యక్షురాలు, యూపీ మాజీ సీఎం మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా.. యూపీ బీజేపీ చీఫ్ ఎంఎన్ పాండే ఆ జాబితాలో చేరారు. మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. ఎస్పీ-బీఎస్పీ పొత్తు సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాయావతికి శాలువా కప్పుతున్న వీడియో అది. ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఉన్నప్పుడు ఇది మా నాన్న కప్పుకునేవారు. కానీ, 1995 గెస్ట్‌హౌజ్ ఘటన తర్వాత ఆయన తన ఒంటి మీది నుంచి ఈ శాలువా తీసేశారు. మళ్లీ మీకు కప్పుతున్నా.. అని అఖిలేష్ మనసులో అనుకుంటున్నట్టుగా వీడియో కింద రాసుకొచ్చాడు’ అని పాండే ఉటంకించారు. కాగా, పాండే వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమిగా రాజకీయాలు చేస్తే వీళ్లదేం పోయిందంటూ బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. యూపీలో ఎస్పీ–బీఎస్పీ పొత్తుపై ఆమె ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..‘అధికారం కోసం గౌరవాన్ని వదులుకున్న మాయావతి తనపై దాడిచేసిన వారితోనే చేతులు కలిపారు. ఆమె ఆడజాతికే కళంకం లాంటిది. అసలు మాయావతి ఆడో, మగో చెప్పలేం. ఆమె హిజ్రా కంటే అధ్వానమైన వ్యక్తి’ అని దుర్భాషలాడారు. కాగా, 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో 38-38 చొప్పున పోటీ చేస్తామని ఎస్పీ-బీఎస్పీ ప్రకటించాయి. -
ఓటింగ్ యంత్రాలను రద్దు చేయాలని మాయవతి డిమాండ్
-
మాయావతి హిజ్రా కన్నా అధ్వానం
చందౌలి(యూపీ): బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా యూపీలో ఎస్పీ–బీఎస్పీ పొత్తుపై ఆమె ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..‘అధికారం కోసం గౌరవాన్ని వదులుకున్న మాయావతి తనపై దాడిచేసిన వారితోనే చేతులు కలిపారు. ఆమె ఆడజాతికే కళంకం లాంటిది. అసలు మాయావతి ఆడో, మగో చెప్పలేం. ఆమె హిజ్రా కంటే అధ్వానమైన వ్యక్తి’ అని దుర్భాషలాడారు. దీంతో ఈ వ్యాఖ్యలను సుమోటోగా విచారణను స్వీకరిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖ శర్మ తెలిపారు. సోమవారం నోటీసులు జారీచేస్తామన్నారు. మరోవైపు సాధనా సింగ్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావలే, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా, కాంగ్రెస్ నేత ప్రియాంకా చతుర్వేది ఖండించారు. 1995లో లక్నోలోని ఓ గెస్ట్‌హౌస్‌లో బీఎస్పీ నేతలతో సమావేశమైన మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు. -
‘ఆ ఎమ్మెల్యేకి మతిభ్రమించింది’
లక్నో : బీఎస్పీ అధినేత్రి మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్‌కు మతిభ్రమించిందని బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా అన్నారు. మాయావతి నపుసంకురాలి కంటే హీనమని యూపీలోని మొఘల్సరాయ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల మిశ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధనా సింగ్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. లక్నో గెస్ట్ హౌస్‌లో మాయావతి సహా బీఎస్పీ కార్యకర్తలపై గతంలో ఎస్పీ కార్యకర్తలు చేసిన దాడిని పరోక్షంగా ప్రస్తావించిన సాధనా సింగ్ ప్రస్తుతం ఎస్పీ, బీఎస్పీల కలయికను తప్పుపడుతూ మాయావతిపై ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఎస్పీ, బీఎస్పీ చేతులు కలపడంతో బీజేపీ నేతలు బెంబేలెత్తుతున్నారని మిశ్రా వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో బీజేపీ నేతలు మానసిక స్థైర్యం కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు మాయావతిపై బీజేపీ నేత సాధనా సింగ్ వాడిన భాషే బీజేపీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. యూపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. -
అఖిలేష్‌కు బెహన్ బాసట
లక్నో : మైనింగ్ స్కామ్‌లో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను సీబీఐ ప్రశ్నించనుందనే వార్తల నేపథ్యంలో బీఎస్పీ చీఫ్ మాయావతి సోమవారం అఖిలేష్‌కు బాసటగా నిలిచారు. దాడుల పేరుతో రాజకీయ ప్రత్యర్ధులను భయపెట్టే బీజేపీ వ్యూహాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటారని మాయావతి పేర్కొన్నారు. కేంద్రం వేధింపులను ధైర్యంగా ఎదుర్కొని, కుట్రలను నీరుగార్చాలని అఖిలేష్‌తో భేటీ సందర్భంగా మాయావతి స్పష్టం చేశారని బీఎస్పీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2012-13లో మైనింగ్ గనుల కేటాయింపు ప్రక్రియలో ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించిన అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదైతే దానికి అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్ బాధ్యులు ఎలా అవుతారని సోమవారం ఎస్పీ, బీఎస్పీ నేతల సంయుక్త సమావేశంలో బీఎస్పీ ఎంపీ సతీష్ మిశ్రా ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమి నుంచి భాగస్వామ్య పక్షాలు వైదొలుగుతుంటే వారు కొత్తగా సీబీఐతో దోస్తీకి దిగారని ఎద్దేవా చేశారు. కాగా అఖిలేష్‌పై సీబీఐని ప్రయోగించడం పట్ల మోదీ సర్కార్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న నియంత సర్కార్‌ను సాగనంపాల్సిన తరుణం ఆసన్నమైందని మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. -
మాయావతి డిమాండ్‌కు తలొగ్గిన ఎంపీ సర్కార్
భోపాల్ : బీఎస్పీ అధినేత్రి మాయావతి హెచ్చరికలతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సర్కార్ దిగివచ్చింది. గతంలో దళిత సంఘాలు పిలుపుతో జరిగిన భారత్ బంద్ సందర్భంగా నమోదైన రాజకీయ కేసులను ఉపసంహరించకుంటే మధ్యప్రదేశ్, రాజస్ధాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలకు మద్దతుపై పునరాలోచిస్తామని మాయావతి హెచ్చరించిన సంగతి తెలిసిందే. దళితుల ఆందోళనల సందర్భంగా నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరిస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. యూపీ, రాజస్ధాన్, మధ్యప్రదేశ్ సహా అప్పటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భారత్ బంద్ నేపథ్యంలో అమాయక దళితులపై కేసులు నమోదు చేశారని, వీటిని మధ్యప్రదేవ్, రాజస్ధాన్‌లో నూతనంగా ఎన్నికైన ప్రభుత్వాలు తక్షణమే ఉపసంహరించాలని మాయావతి సోమవారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేశారు. మాయావతి డిమాండ్‌ను మధ్యప్రదేశ్ సర్కార్ అంగీకరించింది. భారత్ బంద్ నేపథ్యంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం మోపిన రాజకీయ కేసులన్నింటినీ ఉపసంహరించాలని నిర్ణయించామని న్యాయ, శాసనసభా వ్యవహారాల మంత్రి పీసీ శర్మ పేర్కొన్నారు. -
‘బీసీలను వేధిస్తున్న బీజేపీ’
సాక్షి, ఛండీగర్ : యూపీ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో విపక్షాల విజయంతో పాలక బీజేపీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శల దాడి పెంచారు. దళితులు, బీసీలపై బీజేపీ దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. ఛండీగర్‌లో గురువారం జరిగిన ర్యాలీలో 2019 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారాస్త్రాలకు పదునుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె రోహిత్ వేముల విషాదాంతం, సహరన్పూర్ హింసాకాండ వంటి పలు అంశాలను ప్రస్తావించారు. రాజ్యసభలో సహరన్పూర్ అంశాన్ని లేవనెత్తేందుకు బీజేపీ తనను అనుమతించలేదని ఆరోపించారు. పార్లమెంట్లో దళిత సమస్యలను లేవనెత్తనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం తాను ముందుండి పోరాడతానని స్పష్టం చేశారు. తాను ఓబీసీల రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపైనా మాయావతి విరుచుకుపడ్డారు. అగ్రవర్ణ భావజాలంతోనే కాంగ్రెస్ మండల్ కమిషన్ నివేదికను అమలు చేయలేదని ఆరోపించారు. -
అది మోదీ దర్శన్
సాక్షి,లక్నో: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు బాకా ఊదేలా దూరదర్శన్, ఆకాశవాణిల స్ధాయిని మోదీ ప్రభుత్వం దిగజార్చిందని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. ప్రతిష్టాత్మక ప్రసార సంస్థలుగా పేరొందిన వీటి ప్రాధాన్యతను తగ్గించారని దుయ్యబట్టారు. వీటిపై ప్రైవేట్ మీడియా సంస్థలు పరోక్షంగా పెత్తనం చెలాయిస్తున్నాయని అన్నారు. దూరదర్శన్, ఆకాశవాణిల స్వయం ప్రతిపత్తికి కేంద్రం విఘాతం కలిగిస్తోందన్నారు. మరోవైపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే రచయితలు, జర్నలిస్టులనూ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పోకడలు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని మాయావతి హెచ్చరించారు. -
'300 స్థానాల్లో మాదే విజయం'
లక్నో: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల మూడో దశ ఓటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లక్నోలోని పోలింగ్ బూత్ నెం.251కి వచ్చిన ఆమె ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మొదటి రెండు దశల ఓటింగ్ తరహాలోనే ఈ మూడో దశ పోలింగ్ లోనూ బీఎస్పీదే హవా కొనసాగుతుందన్నారు. పూర్తి మెజార్టీతో తాము అధికారం చేపట్టడం ఖాయమని మాయావతి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ తక్కువలో తక్కువ అంటే కనీసం 300 పైగా స్థానాల్లో నెగ్గి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందని చెప్పారు. నేడు (ఆదివారం) 69 స్థానాలకు మూడో దశ పోలింగ్ ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైంది. ఈ దశ పోలింగ్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభ స్థానం లక్నో, ఎస్పీకి పట్టున్న కన్నౌజ్, మైన్ పురి, ఇటావా ప్రాంతాల నియోజకవర్గాలు ఉండటంతో అందరిదృష్టి ఈ పోలింగ్ పై ఉంది. ములాయంసింగ్ యాదవ్ సొంత జిల్లా ఇటావా, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్‌యాదవ్ కన్నౌజ్ ఎంపీ.. ఎస్పీ మరో కీలక ఎంపీ తేజ్‌ప్రతాప్æ యాదవ్‌ది మైన్ పురి జిల్లా కావడంతో ఈ దశ అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఫరూకాబాద్, హర్దోయ్, అవురైయా, కాన్పూర్ దేహత్, కాన్పూర్, ఉన్నావో, బరాబంకి, సీతాపూర్ తదితర 12 జిల్లాల్లో నేడు పోలింగ్ జరుతున్న విషయం తెలిసిందే. -
బీఎస్పీ ఖాతాలో రూ.కోట్లలో డిపాజిట్లు
-
బీఎస్పీ బ్యాంక్ ఖాతాలో రూ.కోట్లలో డిపాజిట్లు
న్యూఢిల్లీ : పాత నోట్ల మార్పిడికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో దేశ వ్యాప్తంగా భారీగా నల్లధనం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు ఇంట్లో ఐటీ అధికారుల దాడులు మరవక ముందే మరో రాజకీయ పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాలో భారీగా నల్లధనాన్ని అధికారులు గుర్తించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి చెందిన పార్టీ ఖాతాలో పాటు ఆమె సోదరుడు ఆనంద్ బ్యాంక్ ఖాతాలో రూ.కోట్లలో డబ్బు డిపాజిట్ అయ్యింది. దీంతో ఎన్నికలకు ముందు బీఎస్పీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లైంది. బహుజన సమాజ్ పార్టీ బ్యాంక్ ఖాతాలో రూ. నూట నాలుగు కోట్లు, మాయావతి సోదరుడు బ్యాంక్ ఖాతాలో రూ.కోటి నలభై మూడు లక్షల నగదు దశల వారీగా డిపాజిట్ అయినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోమవారం గుర్తించారు. ఢిల్లీలోని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోల్ బాగ్ బ్రాంచిలో ఈ నగదు జమ అయ్యింది. ఈడీ అధికారుల బ్యాంక్ తనిఖీల్లో భాగంగా భారీగా నగదు డిపాజిట్లు అయిన ఖాతాలపై విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బీఎస్పీ ఖాతాలో 102 కోట్ల నగదుకు వెయ్యినోట్లు, మిగతా మూడు కోట్లకు పాత 500 నోట్లు డిపాజిట్ చేసినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. దీనిపై ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. మాయావతి సోదరుడు ఆనంద్‌కు నోటీసులు జారీ చేశారు. బీఎస్పీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజా ఘటనతో రాజకీయ దుమారం చెలరేగనుంది. -
ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు..
ఉడీ దాడిపై ప్రతీకారానికి పూనుకున్న భారత జవాన్లకు బీఎస్పీ చీఫ్ మాయావతి అభినందనలు తెలియజేశారు. సర్జికల్ స్ల్రైక్స్ చేయడం మంచిపనేనంటూ ప్రభుత్వానికి తన మద్దతు తెలిపిన ఆమె.. ఇటువంటి దాడులకు ప్రభుత్వం జనవరిలో జరిగిన పఠాన్ కోట్ దాడి తర్వాతే అనుమతి ఇచ్చి ఉండాల్సిందన్నారు. ప్రజారక్షణకు ఆర్మీ ఇచ్చిన వాగ్దానాన్ని ఎల్వోసీ దాటిమరీ విజయవంతంగా పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందని మాయావతి అన్నారు. భారత ఆర్మీ జవాన్లకు ఈ సందర్భంలో ఆమె అభివందనాలు తెలియజేశారు. అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం చాలా ఆలస్యం చేసిందన్న ఆమె... ఇటువంటి ప్రయత్నానికి మోదీ.. జనవరిలో జరిగిన పఠాన్ కోట్ దాడి తర్వాతే అనుమతి ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. ఉడీలో ఆర్మీ స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి 19 మంది జవాన్ల మరణానికి కారణమయ్యారని, ఇప్పటికైనా భారత ప్రభుత్వం తగిన విధంగా స్పందించడాన్ని ఆమె సమర్థించారు. ఉగ్రదాడిపై కీలెరిగి వాత పెట్టిన భారత ఆర్మీకి హాట్సాఫ్ చెప్పారు. ఎల్వోసీ దాటి మరీ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులతో ఆర్మీ భారత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని మాయావతి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదేకానీ కాస్త ఆలస్యంగా స్పందించారంటూ మాయావతి ఆరోపించారు. పఠాన్ కోట్ దాడి తర్వాతే ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉంటే.. ఉడీ దాడిలో 19 మంది భారత జవాన్ల జీవితాలు సేవ్ అయ్యుండేవని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. -
డ్రామాలాడి తమ్ముడిని బలిపశువును చేశారు
శహరాన్‌పూర్: సమాజ్‌వాది పార్టీ కుటుంబ కుంపట్లో అగ్గి చల్లారేలా లేదు. ఎలాగో సర్దుమణిగిందనుకున్న వ్యవహారాన్ని సొంతపార్టీ నేతలే కాకుండా ప్రతి పక్ష పార్టీలు సైతం రెచ్చగొట్టి మరోసారి వారి కుటుంబంలో అగ్గి రాజేస్తున్నాయి. పార్టీ పగ్గాలు అఖిలేశ్ కే ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేసి శివపాల్ కు ఆగ్రహం తెప్పించగా తాజాగా మాయావతి వ్యాఖ్యలు కూడా ఆయనను మరోసారి ఆలోచనలో దించేలా ఉన్నాయి. ఆదివారం పార్టీ నేతలతో ఏర్పాటుచేసిన సమావేశంలో సమాజ్ వాది పార్టీపై బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎస్పీ పగ్గాలు శివ్ పాల్ యాదవ్ చేతికి ఇచ్చి ఆయనను బలిపశువును చేశారని ఆరోపించారు. కావాలనే ఎస్పీ అధినేత ములాయం ఈ డ్రామాలు ఆడారని, తన కుమారుడి ప్రతిష్టను కాపాడుకునేందుకు సోదరుడు శివపాల్ ను బలిపశువును చేశారని అన్నారు. 2017 ఎన్నికల్లో ఎలాగో ఎస్పీ ఓడిపోతుందని ముందే ఊహించిన ములాయం తెలివిగా పార్టీ పగ్గాలు శివపాల్ చేతిలో పెట్టాడని ఘాటుగా ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్పీ హయాంలో శాంతి భద్రతల పరిస్థితులు చాలా దారుణంగా దిగజారిపోయాయని, ప్రజలంతా ఆ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని ఆమె అన్నారు. -
'మోదీజీ.. మౌనం వీడి బదులివ్వండి'
న్యూఢిల్లీ: దళితులపై దేశ వ్యాప్తంగా దాడులు జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశ్నించారు. ఆయన వెంటనే ఈ అంశంపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు పెరగుతున్నాయని, వీటిపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్ లోని వూనాలో దళిత యువకులపై దాడులను ఆమె ప్రస్తావిస్తూ 'గోవుల సంరక్షణ పేరుతో దళిత యువకులను చిత్ర హింసలు పెడుతున్నారు' అని ఆమె అన్నారు. మహారాష్ట్రలో బైక్ పై వెళుతున్న ఇద్దరు దళిత యువకులను తమ వెహికల్ ను ఓవర్ టేక్ చేశారని దారుణంగా ఆపేసి కొట్టారని, బైక్ పై అంబేద్కర్ బొమ్మను చూశాక మరింతగా కొట్టారని గుర్తు చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ లో దళితుల పరిస్థితి మరింత భయానకంగా మారిందని అన్నారు. ప్రధాని మోదీ కచ్చితంగా గుజరాత్ సంఘటనల విషయంలో ఏదో ఒక ప్రకటన చేయాల్సిందేనని, ఆయన మౌనం వీడాల్సిందేనని డిమాండ్ చేశారు. -
అగ్ర కులస్తుడితో ‘రోహిత్’ దర్యాప్తా?
♦ ప్రభుత్వంపై మండిపడిన మాయావతి ♦ కమిషన్‌లో దళితుడిని సభ్యుడిగా చేర్చాలని డిమాండ్ న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీపై రాజ్యసభలో బీఎస్పీ అధినేత్రి మాయావతి శుక్రవారం కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ఇరానీ ప్రకటనతో తాను సంతృప్తి చెందడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీలో దళితుడికి కూడా స్థానం కల్పించాలని ఫిబ్రవరి 24న తాను కేంద్రాన్ని కోరానని, దానిపై ఇప్పటివరకు స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రోహిత్ ఆత్మహత్యపై అగ్రకులస్తుడైన అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్‌కుమార్ రూపన్వాలాతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ దురుద్దేశం దీంతో తేటతెల్లమవుతోంది’ అని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం కమిషన్‌లో మరో సభ్యుడిని నియమించే అవకాశముందని, అయితే, ఆ ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. రోహిత్‌కు ఫెలోషిప్‌ను నిలిపివేయడంపై మాయావతి ప్రశ్నించగా.. కొన్ని పత్రాలు రోహిత్ వర్సిటీ అధికారులకు ఇవ్వాల్సి ఉన్నందున ఫెలోషిప్‌ను నిలిపివేశారని ఇరానీ బదులిచ్చారు. హెచ్‌సీయూ క్రమశిక్షణ కమిటీలో దళితులెవరూ లేరన్నది నిరాధార ఆరోపణ అని స్పష్టం చేశారు. కాగా, ఫేస్బుక్లో రోహిత్ తనపై చేశాడంటూ ఇరానీ పేర్కొన్న కామెంట్ల ప్రామాణికతను సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఆ ఫేస్బుక్ అకౌంట్ రోహిత్‌దేనని రుజువేమైనా ఉందా? అని అడిగారు. ప్రామాణికతను నిర్దేశించకుండా ఆ కామెంట్లను సభలో ప్రస్తావించడాన్ని ఏచూరి తప్పుబట్టారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ జోక్యం చేసుకుంటూ.. స్మృతి చదివిన ఆ కామెంట్లను వర్సిటీ రిజిస్ట్రార్ ధ్రువీకరించారన్నారు. సభలో దుర్గామాతపై దూషణలా? హిందువుల దేవతైన దుర్గామాతపై అసభ్యంగా, దూషణపూర్వకంగా రాసిన రాతలను గురువారం సభలో చదివి వినిపించిన ఇరానీపై శుక్రవారం రాజ్యసభలో విపక్షాలు మండిపడ్డాయి. సభకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. జేఎన్‌యూ విద్యార్థుల తీరుపై తాను చేసిన వ్యాఖ్యలకు రుజువులు చూపాలని ప్రశ్నించినందువల్లనే ఆ కరపత్రాలను చదివి వినిపించానని ఇరానీ సమర్థించుకున్నారు. తాను దుర్గామాత భక్తురాలినని చెప్పారు. ‘ఆ కరపత్రాలను సమర్థిస్తుంది.. కానీ వాటిని సభలో చదవడాన్ని మాత్రం తప్పంటుంది’ అని కాంగ్రెస్‌కు చురకలేశారు. అయితే, దైవదూషణకు సంబంధించిన వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లవని డిప్యూటీ స్పీకర్ స్పష్టం చేశారు. అంతకుముందు, దైవాన్ని నిందించే వ్యాఖ్యలేవీ సభలో మాట్లాడరాదని రాజ్యాంగం, నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఎస్సీ జాబితాలో మరిన్ని కులాలను చేర్చాలన్న ప్రతిపాదనతో సభముందుకు వచ్చిన ప్రైవేటు మెంబర్ బిల్లు రాజ్యసభలో ఓడిపోయింది. మోదీకి కూడా ‘మౌనీబాబా సిండ్రోమ్’ లోక్‌సభలో తృణమూల్ సభ్యుడి విమర్శ న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌లాగా ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ‘మౌనీ బాబా సిండ్రోమ్’తో బాధపడుతున్నారని టీఎంసీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ వ్యాఖ్యానించారు. రెండు అధికార కేంద్రాలు ఉండటంతో మౌనంగా ఉండే వ్యాధి వస్తుందని, ప్రస్తుతం నాగపూర్‌లో మరో అధికార కేంద్రం ఉండటం వల్ల మోదీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం నాగపూర్‌లో ఉంటుందన్న విషయం తెలిసిందే. తీర్మానంపై చర్చలో కేంద్రమంత్రి వెంకయ్య మాట్లాడిన 70 నిమిషాలు ప్రధానిని పొగడడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ‘ఈ ప్రభుత్వం యూపీఏ 3నా లేక ఎన్డీయే 2నా’? అని జోకులు పేలుతున్నాయన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రాల పర్యటనలకు వెళ్లినప్పుడు కరెన్సీ నోట్ల కట్టలతో వెళ్తున్నారని సుల్తాన్ అహ్మద్ చేసిన ఆరోపణలను హోంమంత్రి రాజ్‌నాథ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యంతో మోదీలో నిస్పృహ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ఎన్జీవోలు, బ్లాక్‌మార్కెటీర్లు కుట్రలు చేస్తున్నారంటూ మోదీ చేసిన ఆరోపణలపై సీపీఎం స్పందించింది. ప్రధానిగా రెండేళ్లు గడవకముందే మోదీలో నిరాశానిస్పృహలు తలెత్తాయని పార్టీ పత్రిక ‘పీపుల్స్ డెమొక్రసీ’లో రాసిన సంపాదకీయంలో కారత్ పేర్కొన్నారు.రోహిత్ ఆత్మహత్యపై అగ్రకులస్తుడైన అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్‌కుమార్ రూపన్వాలాతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ దురుద్దేశం దీంతో తేటతెల్లమవుతోంది. కొన్ని పత్రాలు వర్సిటీ అధికారులకు రోహిత్ ఇవ్వాల్సి ఉన్నందున ఫెలోషిప్‌ను నిలిపివేశారు. హెచ్‌సీయూ క్రమశిక్షణ కమిటీలో దళితులెవరూ లేరన్నది నిరాధార ఆరోపణ. -
సీబీఐని కేంద్రం దుర్వినియోగం చేస్తోంది
బీఎస్పీ చీఫ్ మాయావతి ధ్వజం * ఎన్ఆర్హెచ్ఎం స్కామ్‌లో తనను విచారించాలన్న నిర్ణయంపై ఫైర్ న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో దాదాపు నాలుగేళ్ల కిందట వెలుగు చూసిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కుంభకోణంలో ప్రమేయంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీఎస్పీ చీఫ్ మాయావతిని విచారించాలని సీబీఐ నిర్ణయించడం రాజకీయ దుమారం రేపింది. తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోందని మాయావతి మంగళవారం ఢిల్లీలో ఆరోపించారు. ఈ స్కాంతో తనకు సంబంధం లేదని, అయినా సీబీఐ తనను ప్రశ్నించుకోవచ్చని..ఒత్తిళ్లకు తానెప్పుడు తలొగ్గబోనన్నారు. ఈ స్కామ్‌లో తననుప్రశ్నించాలన్న నిర్ణయం వెనక దళితు లు, వెనకబడిన వర్గాలను చులకనగా చూసే కొందరు కులపిచ్చిగల సీబీఐ అధికారుల ప్రమే యం ఉండొచ్చని ఆమె అన్నారు. ఆధారాల ప్రాతిపదికనే దర్యాప్తు: కేంద్రం మాయావతి ఆరోపణలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. సీబీఐ కేవలం ఆధారాల ప్రాతిపదికనే దర్యాప్తు చేస్తుం దని...దర్యాప్తు సంస్థ చర్యలపై ఇతర నిర్ధారణలకు రావాల్సిన అవసరం లేదన్నారు. కాగా, ఈ స్కామ్‌లో అవసరం మేరకు దర్యాప్తు సాగిస్తామని సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హా తెలి పారు. ఈ స్కామ్‌కు సంబంధించిన రెండు అంశాలపై విచారించేందుకు హాజరుకావాలని సీబీఐ సోమవారమే మాయావతికి తెలిపింది.