సీబీఐని కేంద్రం దుర్వినియోగం చేస్తోంది
బీఎస్పీ చీఫ్ మాయావతి ధ్వజం
* ఎన్‌ఆర్‌హెచ్‌ఎం స్కామ్‌లో తనను విచారించాలన్న నిర్ణయంపై ఫైర్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో దాదాపు నాలుగేళ్ల కిందట వెలుగు చూసిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కుంభకోణంలో ప్రమేయంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీఎస్పీ చీఫ్ మాయావతిని విచారించాలని సీబీఐ నిర్ణయించడం రాజకీయ దుమారం రేపింది. తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోందని మాయావతి మంగళవారం ఢిల్లీలో ఆరోపించారు.
ఈ స్కాంతో తనకు సంబంధం లేదని, అయినా సీబీఐ తనను ప్రశ్నించుకోవచ్చని..ఒత్తిళ్లకు తానెప్పుడు తలొగ్గబోనన్నారు. ఈ స్కామ్‌లో తననుప్రశ్నించాలన్న నిర్ణయం వెనక దళితు లు, వెనకబడిన వర్గాలను చులకనగా చూసే కొందరు కులపిచ్చిగల సీబీఐ అధికారుల ప్రమే యం ఉండొచ్చని ఆమె అన్నారు.
ఆధారాల ప్రాతిపదికనే దర్యాప్తు: కేంద్రం
మాయావతి ఆరోపణలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. సీబీఐ కేవలం ఆధారాల ప్రాతిపదికనే దర్యాప్తు చేస్తుం దని...దర్యాప్తు సంస్థ చర్యలపై ఇతర నిర్ధారణలకు రావాల్సిన అవసరం లేదన్నారు. కాగా, ఈ స్కామ్‌లో అవసరం మేరకు దర్యాప్తు సాగిస్తామని సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హా తెలి పారు. ఈ స్కామ్‌కు సంబంధించిన రెండు అంశాలపై విచారించేందుకు హాజరుకావాలని సీబీఐ సోమవారమే మాయావతికి తెలిపింది.