సాక్షి,లక్నో: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు బాకా ఊదేలా దూరదర్శన్, ఆకాశవాణిల స్ధాయిని మోదీ ప్రభుత్వం దిగజార్చిందని బీఎస్‌పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. ప్రతిష్టాత్మక ప్రసార సంస్థలుగా పేరొందిన వీటి ప్రాధాన్యతను తగ్గించారని దుయ్యబట్టారు. వీటిపై ప్రైవేట్ మీడియా సంస్థలు పరోక్షంగా పెత్తనం చెలాయిస్తున్నాయని అన్నారు.
దూరదర్శన్, ఆకాశవాణిల స్వయం ప్రతిపత్తికి కేంద్రం విఘాతం కలిగిస్తోందన్నారు. మరోవైపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే రచయితలు, జర్నలిస్టులనూ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పోకడలు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని మాయావతి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment