
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు దేశ ప్రధాని కావాలని ఉందన్నారు. రాష్ట్రపతి కావాలనే కాంక్ష తనకు అసలులేదని మాయావతి స్పష్టం చేశారు.
అయితే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తనపై ప్రతిరోజు పుకార్లు పుట్టిస్తున్నారని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లను మాయావతి.. బీజేపీకి ఇచ్చేసిందని అఖిలేష్ ఆరోపించారు. అనంతరం మాయావతి రాష్ట్రపతి అవుతుందేమో అంటూ( బీజేపీ ఆమెను క్విడ్ ప్రోకోగా దేశానికి రాష్ట్రపతిని చేస్తుందో లేదో చూడాలి) అఖిలేష్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీంతో తాజాగా అఖిలేష్‌కు మాయావతి ఇలా కౌంటర్ ఇచ్చారు.
కాగా, గురువారం మాయావతి మాట్లాడుతూ.. తాను అంబేద్కర్, కాన్షీరాం బాటలోనే నడవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. దళితులు, అణగారిన వర్గాలు, ముస్లింలు తిరిగి బీఎస్పీకి ప్రాణం పోస్తే, యూపీ సీఎం, ప్రధాని అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవడం లేదంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఆమె సన్నిహితురాలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా, ఆ పార్టీ ఏకైక యూపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్‌లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిసిన తర్వాత మాయావతి ఇలా ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: హిందీ జాతీయ భాష కాదు.. బడాయి వద్దు!
Comments
Please login to add a commentAdd a comment