SP chief
-
దేశానికి ప్రధాని కావాలన్నదే నా డ్రీమ్..
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు దేశ ప్రధాని కావాలని ఉందన్నారు. రాష్ట్రపతి కావాలనే కాంక్ష తనకు అసలులేదని మాయావతి స్పష్టం చేశారు. అయితే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తనపై ప్రతిరోజు పుకార్లు పుట్టిస్తున్నారని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లను మాయావతి.. బీజేపీకి ఇచ్చేసిందని అఖిలేష్ ఆరోపించారు. అనంతరం మాయావతి రాష్ట్రపతి అవుతుందేమో అంటూ( బీజేపీ ఆమెను క్విడ్ ప్రోకోగా దేశానికి రాష్ట్రపతిని చేస్తుందో లేదో చూడాలి) అఖిలేష్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీంతో తాజాగా అఖిలేష్‌కు మాయావతి ఇలా కౌంటర్ ఇచ్చారు. కాగా, గురువారం మాయావతి మాట్లాడుతూ.. తాను అంబేద్కర్, కాన్షీరాం బాటలోనే నడవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. దళితులు, అణగారిన వర్గాలు, ముస్లింలు తిరిగి బీఎస్పీకి ప్రాణం పోస్తే, యూపీ సీఎం, ప్రధాని అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవడం లేదంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఆమె సన్నిహితురాలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా, ఆ పార్టీ ఏకైక యూపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్‌లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిసిన తర్వాత మాయావతి ఇలా ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కూడా చదవండి: హిందీ జాతీయ భాష కాదు.. బడాయి వద్దు! -
బీజేపీ మోసపూరిత హామీల పార్టీ : అఖిలేష్
లక్నో : బీజేపీని భారతీయ జుమ్లా పార్టీగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అభివర్ణించారు. మోసపూరిత హామీలతో బీజేపీ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. బీజేపీ వల్లే దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయన్న ఆపార్టీ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. దేశ భద్రతతో చెలగాటమాడుతున్న బీజేపీ అన్నింటినీ రాజకీయం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన సాహస జవాన్ల కారణంగానే దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయనేది వాస్తవమని అఖిలేష్ అన్నారు. ఎస్పీ, బీఎస్పీ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ లఖింపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ బీజేపీని దుయ్యబట్టారు. ఛాయ్‌వాలా అని చెప్పుకుంటూ 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడు కాపలాదారుగా మారారని ఎద్దేవా చేశారు. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి మాయాకూటమి అయితే మరి 38 పార్టీలతో కూడిన ఎన్డీఏను ఏ పేరుతో పిలవాలని అఖిలేష్ ప్రశ్నించారు. వాస్తవ అంశాల నుంచి బీజేపీ దేశం దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. -
అక్కడ కాంగ్రెస్‌ను అందుకే పక్కనపెట్టాం..
లక్నో : యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి నుంచి కాంగ్రెస్‌ను పక్కనపెట్టడంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వివరణ ఇచ్చారు. యూపీలో బీజేపీని ఓడించే ఉద్దేశంతోనే దీటైన ఎన్నికల ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్‌ను దూరం చేశామని అఖిలేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో తమకు స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. యూపీలో బీజేపీకి ప్రాబల్యం లేదని, కులాల సమతూకంపై బీజేపీ ముందుకుపోతుందని..తామూ ఎన్నికల లెక్కలను సరిదిద్దుకుని, ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో ముందుకువచ్చామని చెప్పారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్లామని, ఎన్నికల పొత్తులు సవ్యవగా లేకపోవడంతో తాము పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఓటమి పాలయ్యామని చెప్పుకొచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రత్యర్ధి బీఎస్పీతో చేతులు కలిపి ఎన్నికలకు వెళ్లడం వ్యూహాత్మక నిర్ణయమన్నారు. బీజేపీని ఓడించేందుకే తాము జట్టుకట్టామని, అయితే కాంగ్రెస్‌కు రెండు స్ధానాలు విడిచిపెట్టామని, ఆ పార్టీతో తమ సంబంధాలు మెరుగ్గానే ఉంటాయని అఖిలేష్ పేర్కొన్నారు. బీజేపీ ఓటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. -
నాన్న ప్రధాని పదవికి సమర్థుడు
లక్నో: తన తండ్రి, ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ రాజకీయ అనుభవం రీత్యా ప్రధాని పదవికి అత్యంత సమర్థుడని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఫిరోజాబాద్‌లో తన సోదరుడు అక్షయ్‌యాదవ్ తరఫున ఆయన మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ.. నేతాజీ(మలాయం) శాసనసభ్యుడిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎంతో అనుభవజ్ఞులని, ప్రధాని పదవికి తగిన వారని చెప్పారు. అలాగే, పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మద్దతుతో మూడో కూటమి కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. బీజేపీ తగినన్ని స్థానాలు రావని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు.