నాన్న ప్రధాని పదవికి సమర్థుడు | I showed the prime minister | Sakshi
Sakshi News home page

నాన్న ప్రధాని పదవికి సమర్థుడు

Published Wed, Apr 16 2014 4:44 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM

నాన్న ప్రధాని పదవికి సమర్థుడు

నాన్న ప్రధాని పదవికి సమర్థుడు

లక్నో: తన తండ్రి, ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ రాజకీయ అనుభవం రీత్యా ప్రధాని పదవికి అత్యంత సమర్థుడని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఫిరోజాబాద్‌లో తన సోదరుడు అక్షయ్‌యాదవ్ తరఫున ఆయన మంగళవారం ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ.. నేతాజీ(మలాయం) శాసనసభ్యుడిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎంతో అనుభవజ్ఞులని, ప్రధాని పదవికి తగిన వారని చెప్పారు. అలాగే, పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మద్దతుతో మూడో కూటమి కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. బీజేపీ తగినన్ని స్థానాలు రావని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement