![300 Km Long Traffic In Maha Kumbh Mela Road](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/traffic2.jpg.webp?itok=zIpdVQvf)
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న ప్రపంచంలోని అతిపెద్ద అథ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటైన మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) వెళుతున్నారా? అయితే జాగ్రత్త. కుంభమేళా ముగింపు తేదీ గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఫలితంగా కుంభమేళా జరిగే ప్రయాగ్ రాజ్ వెళ్లే మార్గంలో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫ్రిక్ జామ్ (world's biggest traffic jam) ఏర్పడింది. సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
శనివారం నుంచి లక్షల వాహనాలు ప్రయాగరాజ్ వైపు మళ్లాయి. దీంతో భక్తులు త్రివేణి సంగమ్ (గంగ, యమునా, సరస్వతి నదుల సంగమం) వద్ద పవిత్ర స్నానమాచరించేందుకు సమయానికి చేరుకోలేకపోతున్నారు. రోజుల సమయం పట్టనున్నడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ప్రయాగరాజ్ సంగమ్ రైల్వే స్టేషన్‌ను అధికారులు శుక్రవారం వరకు మూసివేశారు.
प्रयागराज महाकुंभ में फँसे करोड़ों श्रद्धालुओं के लिए तुरंत आपातकालीन व्यवस्था की जाए। हर तरफ़ से जाम में भूखे, प्यासे, बेहाल और थके तीर्थयात्रियों को मानवीय दृष्टि से देखा जाए। आम श्रद्धालु क्या इंसान नहीं है?
प्रयागराज में प्रवेश के लिए लखनऊ की तरफ़ 30 किमी पहले से ही नवाबगंज… pic.twitter.com/1JXmzgDEGI— Akhilesh Yadav (@yadavakhilesh) February 9, 2025
ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యనాథ్ సర్కార్‌పై సమాజవాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆకలి,దాహంతో ఇబ్బంది పడుతున్న భక్తులను మనవత్వంతో చూడాలి. సామాన్య భక్తులు మనుషులే కదా? వారికి కనీస సదుపాయాలు కల్పించారా? అని ప్రశ్నలు సంధించారు.
అంతకుముందు కుంభమేళా ఏర్పాట్లపై అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ప్రయాగరాజ్‌లో ట్రాఫిక్ పరిస్థితి గురించి హైలైట్ చేస్తూ.. భక్తుల కోసం అత్యవసర ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రయాగరాజ్ ప్రవేశం సమీపంలో నవాబగంజ్‌లో 30 కిలోమీటర్లు, గౌహానియాలో 16 కిలోమీటర్లు,వారణాసి మార్గంలో 12 నుండి 15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉంది. ట్రాఫిక్ జామ్ వల్ల జనజీవనం స్తంభించింది.
అందుకే ఉత్తర ప్రదేశ్‌లో వాహనాలకు టోల్ ఛార్జీల నుంచి విముక్తి కల్పించాలి. తద్వారా ప్రయాణ సమస్యలు, ట్రాఫిక్ జామ్‌ను తగ్గించవచ్చు. సినిమాల్లా వినోదానికి కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్‌ను వసూలు చేయనప్పుడు, వాహనాలకు టోల్ ఫ్రీ ఎందుకు చేయలేరు? అని పునరుద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment