Personal assistant
-
స్వాతి మాలీవాల్ ఎపిసోడ్: బిభవ్ కుమార్‌కు ఎన్డబ్ల్యూసీ సమన్లు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆమె చేసిన ఆరోపణలను ఆ పార్టీ సీనియర్ ఎంపీ సంజయ్ సింగ్ నిజమేనని ధృవీకరించారు. దీంతో ఈ వ్యవహారంపై గురువారం జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్కుమార్కు సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరై.. స్వాతి మాలీవాల్‌పై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సమన్లలో ర్కొంది. ఈ నోటీసులను జాతీయ మహిళా కమిషన్.. సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి పంపించటం గమనార్హం.సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ తనపై తీవ్రంగా దాడి చేశారని ఎంపీ స్వాతిమాలీవాల్ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. అయితే ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా సుమోటోగా తీసుకున్నామని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. తనపై దాడి జరిగినట్లు ఎంపీ స్వాతి మాలీవాల్ సోమవారం బయటపెట్టారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. -
తండేల్ సెట్లో నాగ చైతన్య.. మరోసారి గొప్ప మనసు చాటుకున్న హీరో!
అక్కినేని హీరో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. నాగచైతన్య మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన పర్సనల్ అసిస్టెంట్ వెంకటేశ్ బర్త్ డేను సెట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు. తండేల్ మూవీ సెట్లో కేక్ కట్ చేసి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్ సాయి పల్లవి, డైరెక్టర్ చందు కూడా అతనికి విషెస్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. తన వ్యక్తిగత సిబ్బందిని కూడా సొంతవాళ్లలా చూసుకునే చైతూపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. తండేల్ మూవీ ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Our Queen @Sai_Pallavi92 🥹🤍 from the sets of #Thandel movie celebrating @chay_akkineni 's assistant Venki Bday ❤️#SaiPallavi @chandoomondeti pic.twitter.com/YwbFzksCSG — SaiPallavi.Fangirl07™ (@SaiPallavi_FG07) March 10, 2024 -
బాలకృష్ణ పీఏ ఓవరాక్షన్
సాక్షి, శ్రీసత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ, టీడీపీ లీడర్ శ్రీనివాస్ రావు ఓవరాక్షన్‌కు దిగాడు. శనివారం నియోజకవర్గంలోని చలివెందుల పోలింగ్ కేంద్రం వద్ద తన అనుచరులతో హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తతంగా మారింది. చలివెందుల పంచాయతీ ఉప ఎన్నికల సందర్భంగా.. పోలింగ్ కేంద్రం వద్ద శ్రీనివాసరావు, తన అనుచరులతో దౌర్జన్యానికి దిగాడు. పోలింగ్ సరళిని తాను పరిశీలించాలంటూ కేంద్రంలోకి వెళ్లబోయే ప్రయత్నం చేశాడు. అయితే.. అది రూల్స్‌కు విరుద్ధమంటూ పోలీసులు అడ్డుకోగా.. దూసుకెళ్లే యత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగాడు. దీంతో దౌర్జన్యకారుల్ని పోలీసులు చెదరగొట్టారు. -
బిగుస్తున్న ఉచ్చు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు ఈడీ గురువారం సమన్లు జారీ చేసింది. ఆయన ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల మేరకు పీఏను అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి చార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్‌ను పేరును ఈడీ ప్రస్తావించింది. తాజాగా ఆయన వ్యక్తిగత కార్యదర్శిని విచారించడం చర్చనీయంశంగామారింది. కాగా, సౌత్ గ్రూపు నుంచి రూ.100 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌నాయర్ తన మనిషి అని, విజయ్ను నమ్మొచ్చని ఫేస్‌టైం కాల్లో సమీర్ మహేంద్రుతో కేజ్రీవాల్ అన్నారని పేర్కొంది. కేజ్రీవాల్‌ను ఎవరెవరు కలిసిందీ, ఎవరెవరు ఫోన్లో మాట్లాడిందీ తెలిపింది. స్కామ్‌లో కీలక వ్యక్తులతో పాటు ఆయా సంస్థల్లో పనిచేస్తున్న వారి స్టేట్మెంట్లను చార్జిషీట్‌కు ఈడీ జత చేసింది. అరుణ్పిళ్లై కవిత తరఫు ప్రతినిధిగా ఇండో స్పిరిట్స్‌లో చేరారని తెలిపింది. సౌత్ గ్రూపునకు చెందిన కవిత, మాగుంట, అభిషేక్ బోయినపల్లి, శరత్‌చంద్రారెడ్డిలు ఎవరెవరితో మాట్లాడారు? ఎవరెవరితో ఎక్కడ సమావేశమయ్యారన్న అంశాలు పొందుపరిచింది. కిక్‌బ్యాక్‌ల రూపంలో ముందుగా పెట్టుబడి ఎలా తిరిగి రాబట్టాలనే అంశాన్ని పెట్టుబడిదారులు చర్చించారని పేర్కొంది. విజయ్‌నాయర్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించాడని పేర్కొంది. మనీలాండరింగ్ కేసు పెట్టడానికి తగిన కారణాలున్నాయని తెలిపింది. సౌత్ గ్రూపునుంచి ఆప్ నేతలకు సొమ్ములు ఎలా చేరాయో వివరించింది. ఎవరెవరిని ఏయే కారణాలతో అరెస్టు చేసిందీ తెలియజేసింది. సౌత్‌గ్రూపు నుంచి తీసుకున్న రూ.100 కోట్లలో రూ.30 కోట్లు గోవా ఎన్నికలకు ఆప్ ఖర్చు చేసినట్లు ఆరోపించింది. చదవండి: అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం -
క్యాసినో కేసు: ఈడీ విచారణకు మంత్రి తలసాని పీఏ హాజరు
సాక్షి, హైదరాబాద్: చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా.. మంత్రి తలసాని యాదవ్ పీఏ అశోక్.. ఇవాళ(సోమవారం) ఈడీ ఎదుట హాజరయ్యాడు. ఈ వ్యవహారానికి సంబంధించి.. అశోక్‌ను సుదీర్ఘంగా ఈడీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంతకు ముందు చీకోటితో లింకులున్నాయనే కోణంలో తలసాని సోదరులు మహేష్ యాదవ్, ధర్మేంధర్ యాదవ్‌లను సుదీర్ఘంగా ప్రశ్నించింది ఈడీ. అలాగే.. ఎమ్మెల్సీ రమణను సైతం విచారించింది. క్యాసినో కేసుకు సంబంధించి.. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా పలువురికి ఇదివరకే నోటీసులు జారీ చేసింది ఈడీ. ఆ లిస్ట్‌లో ఉన్న మరికొందరిని త్వరలో ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
Honey Trap: వలపు వలలో చిక్కిన సీఎం బొమ్మై పీఏ!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ కలకలం రేగింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యక్తిగత సిబ్బంది ఒకరు వలపు వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సీఎం బొమ్మై సంతకాలతో కూడిన కీలకమైన పత్రాలను అతను ఓ ముఠాకు అప్పగించినట్లు సమాచారం. ఈ మేరకు అందిన ఫిర్యాదు వివరాలను పోలీస్ వర్గాలు శుక్రవారం మీడియాకు వెల్లడించాయి. సీఎం బసవరాజ బొమ్మై పీఏ(పర్సనల్ అసిస్టెంట్) హరీష్.. హనీట్రాప్‌కు గురయ్యాడు!. ఈ మేరకు విధానసౌధ పోలీస్ స్టేషన్లో జన్మభూమి ఫౌండేషన్ అధ్యక్షుడు నటరాజ్ శర్మ ఫిర్యాదు చేశారు. శాసన సభ నుంచే ఈ వలపు వల వ్యవహారం జరిగినట్లు ఫిర్యాదులో నటరాజ్ పేర్కొన్నారు. విధానసౌధ డీ-గ్రూపు మహిళా ఉద్యోగి ద్వారా ఓ ముఠా ఈ హనీట్రాప్‌కు పాల్పడినట్లు సమాచారం. హరీష్‌ను ట్రాప్ చేసిన ఆమె.. అతనితో ఏకాంతంగా గడిపింది. ఆ వీడియోల ద్వారా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి.. హరీష్ నుంచి ప్రభుత్వానికి సంబంధించిన కీలక పత్రాలు ఆ ముఠా సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ పత్రాలు ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్లినట్లు ఫిర్యాదులో నటరాజ్ ప్రస్తావించారు. బెంగళూరు కనకపుర దగ్గర కోట్లు విలువ చేసే భూముల్ని సదరు మహిళా ఉద్యోగిణి పేరిట హరీష్ కొనుగోలు చేసినట్లు తేలిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. సీఎం పీఎం మాత్రమే కాదు.. చాలా మంది నేతలు, బ్యూరోక్రట్లపై కూడా హనీ ట్రాప్ జరిగిందని ఫిర్యాదులో నటరాజ్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై హరీష్‌ను పోలీసులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరీష్గానీ, సీఎం కార్యాలయంగానీ, రాజకీయ పార్టీలుగానీ ఈ హనీ ట్రాప్ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు. -
మంత్రి బొత్స పీఏ ఇంట్లో చోరీ
విజయనగరం క్రైమ్: రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పీఏ కమలాకర్ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. దీనికి సంబంధించి వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఉడాకాలనీ ఫేజ్ –3, ఇంటినంబర్ 177లో నివాసముంటున్న మంత్రి బొత్స సత్యనారాయణ పర్సనల్ అసిస్టెంట్ కమలాకర్ వృత్తిరీత్యా విజయవాడ వెళ్లారు. ఆయన సతీమణి అమెరికా పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం ఇంట్లో కమలాకర్ కుమార్తె, అల్లుడు మాత్రమే ఉంటున్నారు. ఆయన కుమార్తె డాక్టర్ మౌనిక విశాఖ రైల్వేఆస్పత్రిలో వైద్యురాలిగా, అల్లుడు గజపతినగరంలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం కమలాకర్ కుమార్తె విశాఖ, అల్లుడు గజపతినగరం వృత్తిరీత్యా వెళ్లారు. శుక్రవారం ఉదయం వారిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి ఇల్లంతా చిందరవందరగా ఉండడాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారమందించారు. దీంతో ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో క్లూస్ టీమ్, ఫింగర్ ఫ్రింట్స్ ఇన్చార్జ్ డీఎస్పీ టి.త్రినాథ్, సీసీఎస్, వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించారు. ఈ చోరీ సంఘటనలో లక్ష నగదు, రెండు తులాల బంగారం, సుమారు కిలో వెండి వస్తువులు పోయినట్లు గుర్తించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. (క్లిక్: జర్మనీ అమ్మాయి.. వైజాగ్ అబ్బాయి.. పెళ్లేమో అమెరికాలో) -
సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచార కేసు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి పి.పి. మాధవన్(71)పై ఢిల్లీ పోలీసులు అత్యాచార కేసు నమోదైంది. జాబ్ ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని మాధవన్ తనను బెదిరించి లోబర్చుకున్నారంటూ ఓ మహిళ (26) ఫిర్యాదు చేసిందని పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఆమె భర్త కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ హోర్డింగులు ఏర్పాటు చేసేవాడని, 2020లో చనిపోయాడని అన్నారు. భర్త చనిపోయాక ఆర్థిక పరిస్థితి బాగోలేక.. కాంగ్రెస్ ప్రతినిధులను కలిశానని, వాళ్లు మాధవన్ నెంబర్ ఇచ్చారని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబర్చుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు జూన్ 25వ తేదీన ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఒకరోజు నన్ను కలవడానికి పిలిచాడు. అతను నన్ను కారులో ఎక్కించుకోవడానికి వచ్చి.. తన డ్రైవర్‌ను కారు వదిలి వెళ్ళమన్నాడు. నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేను అభ్యంతరం చెప్పడంతో కోపం వచ్చి నన్ను ఒంటరిగా రోడ్డుపై వదిలేశాడు అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే కేవలం కాంగ్రెస్ పార్టీ పరువు తీసేందుకే ఇది నిరాధారమైన ఆరోపణ. అందులో వాస్తవం లేదు. ఇది పూర్తి కుట్ర అని పీపీ మాధవన్ చెప్తున్నారు. -
గవర్నర్ పీఏ హఠాన్మరణం
గాంధీఆస్పత్రి (హైదరాబాద్): గవర్నర్ తమిళిసైకి వ్యక్తిగత సహాయకుడు మొలుగురి రాజ్‌కుమార్ (47) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సికింద్రాబాద్ పద్మారావునగర్ స్కందగిరి ఆలయంలో నిర్వహించిన స్వర్ణబంధన మహా కుంభాభిషేకంలో గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె వెంట వెళ్లిన రాజ్‌కుమార్.. ఆలయసిబ్బంది గవర్నర్‌కు బహూకరించిన జ్ఞాపికలు, శాలువాలను తీసుకుని ఎస్కార్ట్ వాహనం వద్దకు వచ్చారు. అక్కడ తోటి ఉద్యోగులతో మాట్లాడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గవర్నర్ కాన్వాయ్వాహన సిబ్బంది వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు ధ్రువీకరించారు. ఆయన భార్య శ్రీలత ఆస్పత్రికి చేరుకుని ‘మధ్యాహ్నం భోజనానికి వస్తానని చెప్పి వెళ్లిన మనిషి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయావా’ అంటూ భోరున విలపించింది. కాగా, రాజ్‌కుమార్‌కు కుమారుడు ఉదయ్, కుమార్తె కీర్తి ఉన్నారు. పూజా కార్యక్రమాలను ముగించుకుని గవర్నర్ తమిళిసై కాన్వాయ్ వద్దకు వచ్చిన అనంతరం.. రాజ్‌కుమార్ మృతి సమాచారాన్ని ఆమెకు సిబ్బంది తెలిపారు. చదవండి👉🏾 Warangal Premonmadi: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి.. -
సీఎం వ్యక్తిగత కార్యదర్శికి పితృ వియోగం.. పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, పులివెందుల: సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత కార్యదర్శి దిద్దేకుంట రవిశేఖర్ తండ్రి దిద్దేకుంట సూర్యుడు(72) శనివారం ఉదయం మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన రుక్మిణీదేవి పులివెందుల మున్సిపల్ చైర్మన్‌గా గతంలో పనిచేశారు. ఫోన్ ద్వారా సానుభూతి తెలిపిన సీఎం వైఎస్ జగన్ తన వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ తండ్రి సూర్యుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రవిశేఖర్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని.. ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్‌బాషా, మంత్రులు కన్నబాబు, పేర్ని నాని, అనిల్‌కుమార్ యాదవ్, శంకరనారాయణ, విశ్వరూప్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, గంగుల నాని, రోశయ్య, ఉషాచరణ్లతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ హరికిరణ్, సీఎంఓ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, టీటీడీ హెల్త్ అడ్వయిజర్ శ్వేత తదితరులు ఫోన్ చేసి తమ ప్రగాఢ సానుభూతిని రవిశేఖర్‌కు తెలియజేశారు. పులివెందులకు వచ్చిన ప్రముఖులు తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, వైఎస్సార్ జిల్లా జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిలు పులివెందుకుల చేరుకని సూర్యుడి భౌతిక కాయానికి ఘన నివాళులర్పించారు. వీరితో పాటు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ డైరెక్టర్ సాంబశివారెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ యాదవ్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వైఎస్ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ నాయకులు దంతులూరు కృష్ణ, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, రాష్ట్ర డైరెక్టర్లు వీరప్రతాప్‌రెడ్డి, మరకా శివకృష్ణారెడ్డి, సీఎం వైఎస్ జగన్ కార్యాలయ ఇన్‌ఛార్జిలు జనార్దన్‌రెడ్డి, రఘునాథరెడ్డి, సీనియర్ ఆడిటర్ కుడుముల వెంకటరెడ్డి, ఏపీ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి అల్లం రంగనాయకులు, జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి తదితరులు కూడా నివాళులర్పించారు. బలపనూరు కొత్తపల్లెలో అంత్యక్రియలు సింహాద్రిపురం మండలం బలపనూరు కొత్తపల్లె గ్రామంలోని వారి వ్యవసాయ పొలంలో సూర్యుడు అంత్యక్రియలు శనివారం సాయంత్రం నిర్వహించారు. -
నారా లోకేష్ పీఏ సాంబశివరావుపై షాకింగ్ ఆరోపణలు
-
పీఏ బర్త్‌డేకు బెంజ్ గిఫ్ట్..
-
పీఏ బర్త్‌డేకు బెంజ్ గిఫ్ట్..
లండన్ : పీఏ బర్త్‌డే అంటే మహా అయితే కేక్ కట్ చేసి చిన్న పార్టీ ఇవ్వడమే గొప్ప అనుకునే రోజుల్లో పాటల సంచలనం మాడిసన్ బీర్ తన పీఏ 30వ బర్త్‌డే సందర్భంగా మరిచిపోలేని గిఫ్ట్‌ను ఆమెకు బహుకరించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. పీఏ జన్మదినం సందర్భంగా లంచ్ ఏర్పాటు చేసిన మాడిసన్ అనంతరం ఆమెకు న్యూ మెర్సిడెస్ బెంజ్ సీ 300ను కానుకగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. మెర్సిడస్ కారును సొంతం చేసుకోవాలన్న తన పీఏ కలను మాడిసన్ ఇలా నిజం చేశారు. 12 ఏళ్ల పాత కారుతో తన పీఏ ఇబ్బంది పడటాన్ని స్వయంగా వీక్షించిన మాడిసన్ రూ 30 లక్షల విలవైన గిఫ్ట్‌తో ఆమెను షాక్‌లో ముంచెత్తారు. 13 ఏళ్ల వయసులోనే మాడిసన్‌కు గాయనిగా గుర్తింపు లభించింది. యూట్యూబ్ వీడియోలు 20 ఏళ్ల యువ గాయనికి తిరుగులేని బ్రేక్ ఇచ్చాయి. చదవండి : బెంజ్ కంపెనీ నుంచి ‘అవతార్’ కారు -
సీఎం వ్యక్తిగత సహాయకుడు అనారోగ్యంతో మృతి
సాక్షి ప్రతినిధి, అనంతపురం/ధర్మవరం/సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత సహాయకుడు దంపెట్ల నారాయణ యాదవ్(53) అనారోగ్యంతో మృతిచెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ 15 రోజులక్రితం హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరారు. గత ఐదు రోజులుగా ఐసీయూలో ఉన్న ఆయన గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతిచెందారు. మృతదేహాన్ని నారాయణ స్వగ్రామమైన అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలోని దిగువపల్లికి శుక్రవారం మధ్యాహ్నం తీసుకొచ్చారు. తమ కుటుంబంతో మూడు దశాబ్దాలకుపైగా అనుబంధం కలిగిన నారాయణ హఠాన్మరణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తీవ్రంగా కలిచివేసింది. ఢిల్లీలో ఉన్న ఆయన నారాయణ మృతి వార్త తెలియగానే తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని తిరుగుపయనమయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడినుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి హెలికాప్టర్లో నారాయణ స్వగ్రామమైన దిగువపల్లెకు శుక్రవారం సాయంత్రం చేరుకున్నారు. జగన్ వెంట ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఉన్నారు. నారాయణ భౌతికకాయానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు నివాళులర్పించారు. నారాయణ కుటుంబసభ్యులను ఓదార్చారు. నారాయణ భార్య భవాని, కుమారుడు వెంకటసాయి కృష్ణ (22), కూతురు లిఖిత(20), తల్లి సాలమ్మ తదితరులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ఏ కష్టం రాకుండా చూసుకుంటామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ, ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, సిద్ధారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ గంధం చంద్రుడు తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట ఉన్నారు. నారాయణ మృతదేహానికి శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి వైఎస్ కుటుంబానికి నమ్మినబంటు దంపెట్ల నారాయణ యాదవ్ దాదాపు 36 ఏళ్ల క్రితం తన 17వ ఏటనే.. వైఎస్ జగన్ తాతగారైన వైఎస్ రాజారెడ్డి వద్ద సహాయకుడిగా, కారు డ్రైవర్‌గా చేరారు. తదనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వద్ద నమ్మినబంటుగా ఉండేవారు. ఆ తరువాత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కారు డ్రైవర్‌గా, వ్యక్తిగత సహాయకునిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు జగన్ వెన్నంటి ఉండేవారు. వైఎస్ జగన్ పాదయాత్రలో ఆద్యంతం నారాయణ ఉన్నారు. ఈ సందర్భంగా రెండుసార్లు నారాయణ అస్వస్థతకు గురవగా ఆస్పత్రిలో చేర్పించారు. ఇందులో ఒకసారి హైదరాబాద్‌కు విమానంలో పంపినట్లు, ఆసుపత్రి వారికి జగనే ఫోన్‌చేసి ‘నారాయణ నాకు కావాల్సిన వ్యక్తి.. ఆయనకు ఏ ఇబ్బంది రాకూడదు.. అన్నీ దగ్గరుండి చూసుకోండని చెప్పార’ని నారాయణే ఒక ఇంటర్వూలో గర్వంగా చెప్పారు. నారాయణ చికిత్స పొందుతున్న సమయంలో చాలా సార్లు వైఎస్ విజయమ్మ, భారతి పరామర్శించారు. వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకబు చేయడమేగాక వైద్యులతోనూ మాట్లాడేవారంటూ దంపెట్ల కుటుంబసభ్యులు గుర్తు చేసుకున్నారు. -
నారాయణకు సీఎం వైఎస్ జగన్ నివాళి
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. దిగువపల్లిలో నారాయణ మృతదేహానికి వైఎస్ జగన్ పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నారాయణ మృతి చెందడంతో వైఎస్ జగన్ తన ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లెకు చేరుకుని నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం జగన్ వెంట ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఉన్నారు. పలువురి నివాళి: అనార్యోగంతో మృతి చెందిన సీఎం జగన్ వ్యక్తిగత సహాయ కార్యదర్శి దంపెట్ల నారాయణ మృతదేహానికి మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బి.గుర్నాథ్ రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళర్పించారు. (సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు అనారోగ్యంతో మృతి) -
మాజీ ఉప ముఖ్యమంత్రి పీఏ ఆత్మహత్య
సాక్షి బెంగళూరు: ఐటీ దాడుల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి పరమేశ్వర్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రమేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐటీ శాఖ అధికారులు గత మూడు రోజులుగా పరమేశ్వర్ ఇళ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పరమేశ్వర్ సన్నిహితుడు, పీఏ రమేశ్ ఇంటిలో కూడా సోదాలు చేపట్టారు. ఈ సోదాల నేపథ్యంలో ఆయన శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. బెంగళూరులోని జ్ఞాన భారతి విశ్వవిద్యాలయం ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. అంతకుముందు తన ఇద్దరు స్నేహితులకు రమేశ్ ఫోన్ చేసి ‘నేను పేదవాడిని, నాపై ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టింది. ఎంతో నిజాయితీగా బతికాను. ఐటీ అధికారుల విచారణను ఎదుర్కొనే శక్తి నాకు లేదు. వారి ప్రశ్నలను ఎదుర్కోలేను’ అని చెప్పినట్లు తెలిసింది. -
బాలకృష్ణ మాజీ పీఏకు మూడేళ్ల జైలు..!
సాక్షి, అనంతపురం : సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పర్సనల్ అసిస్టెంట్ శేఖర్‌కు జైలు శిక్ష ఖరారైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శేఖర్‌కు మూడేళ్ల జైలు, మూడు లక్షల జరిమానా విధిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శేఖర్, ఎమ్మెల్యే బాలకృష్ణ వద్ద పీఏగా పనిచేశారు. బాలకృష్ణ పేరుతో హిందూపురంలో ఆయన అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలన్నాయి. పీఏ దందాలను చాలాకాలం కిందటే బాలకృష్ణ, టీడీపీ నేతలు వ్యతిరేకించారు. ఇక పార్టీ నేతల మధ్య కూడా విభేదాలకు కారణమయ్యాడనే ఆరోపణల నేపథ్యంలో బాలకృష్ణ తన పీఏ శేఖర్‌కు ఫిబ్రవరిలోనే ఉద్వాసన పలికారు. శేఖర్‌పై 2008లో కేసు నమోదుకాగా, మూడు రోజుల కిందట నెల్లూరు ఏసీబీ కోర్టు శిక్ష ఖరారు చేసింది. -
ట్రంప్‌కు బిగ్ షాక్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆయన వ్యక్తిగత కార్యదర్శి, వైట్ హౌజ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ హోప్ హిక్స్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2016 లో అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై హౌస్ ప్యానెల్ విచారించిన మరుసటి రోజే ఆమె రాజీనామా చేయడం గమనార్హం. విచారణ నేపథ్యంతోపాటు, వ్యక్తిగత కారణా వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోప్ వెల్లడించారు. గత మూడేళ్లుగా ట్రంప్ అంతరంగికురాలుగా ఆయన వెన్నంటే ఉన్న హోప్.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఇమేజ్ను పెంపొందించేందుకు విరివిగా ప్రచారం నిర్వహించారు. అంతేకాదు మానసికంగా కూడా పలు సందర్భాల్లో ఆమె ట్రంప్‌ను నియంత్రించారని.. ఆ చొరవతో ట్రంప్ ఆమెను కూతురిలా భావించేవారని ట్రంప్ సన్నిహితులు చెబుతుంటారు. మాజీ మోడల్ అయిన హౌప్ గతంలో ట్రంప్ కుమార్తె ఇవాంక కోసం పని చేశారు. ట్రంప్‌తో ఆమె దగ్గరి సంబంధాల మూలంగానే రాబర్ట్ ముల్లర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక కౌన్సిల్ కూడా ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈ పరిణామాలతో కలత చెందిన ఆమె రాజీనామా చేసినట్లు స్పష్టమౌతోంది. మరోవైపు అప్పుడప్పుడు ఆమె ట్రంప్‌కు రష్యా దర్యాప్తు విషయంలో అబద్ధాలు చెప్పేదని హౌస్ ఇంటలిజెన్స్ ప్యానెల్ ఆరోపించింది. అయితే తాను ఎలాంటి అబద్ధాలు చెప్పలేదని హోప్ పేర్కొన్నారు. ఆమె రాజీనామాపై స్పందించిన ట్రంప్ కార్యాలయం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భవిష్యత్తులో మళ్లీ ఆమెను కొనసాగించే అవకాశాలను పరిశీలిస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది. -
ట్రంప్ నెత్తిన మరో బాంబు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓ పోర్న్ స్టార్‌తో లైంగిక సంబంధం ఉన్నట్లు అప్పట్లో ఓ కథనం అప్పట్లో అగ్రరాజ్యాన్ని కుదిపేసింది. అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయం బయటకు పొక్కుకుండా ఉండేందుకు భారీ మొత్తాన్ని చెల్లించి ఆ నటితో ట్రంప్ ఒప్పందం కూడా చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వైట్ హౌజ్ ఈ వార్తలను ఖండించగా.. తాజాగా అది నిజమేనంటూ ట్రంప్ వ్యక్తిగత న్యాయసలహాదారు బాంబు పేల్చారు. ట్రంప్ వ్యక్తిగత అటార్నీ మైకేల్ కోహెన్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ... ‘పోర్న్‌స్టార్ స్టోర్మీ డేనియల్స్ తో ట్రంప్ లక్షా,30,000 డాలర్లతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమేనని తెలిపారు. ‘స్టోర్మీతో చేసుకున్న ట్రంప్ చేసుకున్న ఒప్పందం ప్రలోభానికి గురి చేసేందుకు ఉద్దేశించింది కాదు. రాజకీయ విమర్శలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చేసుకుంది. పైగా న్యాయబద్ధమైంది’ అని కోహెన్ వివరించారు. ఇంతకాలం గోప్యంగా ఉన్న ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాబట్టి, ఆమె నిరభ్యరంతరంగా ఈ విషయాన్ని ప్రపంచానికి ఆమె వెల్లడించవచ్చు అని కోహెన్ చెప్పారు. కాగా, ఇన్ టచ్ అనే మాగ్జైన్ లో అడల్ట్ సినీతార స్టోర్మీ డేనియల్స్(అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్) ఇంటర్వ్యూను ప్రచురించగా.. వాల్‌స్ట్రీట్ జర్నల్ దానిని యథాతథంగా ప్రచురించింది. అందులో మెలానియా(ట్రంప్ భార్య) బిడ్డను ప్రసవించడానికి నాలుగు నెలల ముందే ట్రంప్‌తో తాను ఎఫైర్ పెట్టుకున్నట్టు ధృవీకరించింది. కొంతకాలమే కొనసాగిన తమ బంధం సరదాగా సాగిపోయిందని, పైగా తన కూతురు ఇవాంక తరహాలో అందంగా, స్మార్ట్‌గా ఉంటానంటూ ట్రంప్ తరచూ తనతో చెబుతుండేవాడని స్టెఫానీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే వైట్‌హౌజ్ మాత్రం ఆ ఇంటర్వ్యూను ‘ఫేక్’ అంటూ కొట్టి పడేయగా.. ఇప్పుడు మైకేల్ ధృవీకరించిన వార్తపై స్పందించేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది. ట్రంప్ వ్యక్తిగత న్యాయసలహాదారు మైకేల్ కోహెన్ (పాత చిత్రం) -
హవ్వా.. పబ్లిక్ లో సీఎం ఏం చేశారో తెలుసా?
-
రూ. 30 కోట్లు లంచమడిగి.. దొరికిన మంత్రిగారి పీఏ
ముంబై: భూమి కేటాయింపులకు సంబంధించి రూ. 30 కోట్ల లంచం డిమాండ్ చేసిన మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే పీఏను ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ ఆర్థికవేత్త రమేశ్ జాదవ్.. తన భూమికి సంబంధించిన ఎన్ఓసీ ఇవ్వాలంటూ మంత్రి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా.. ఖడ్సే పీఏగా చెప్పుకొంటున్న గగన్ జన్ పాటిల్ లంచం డిమాండ్ చేశారు. థానే జిల్లాలోని కళ్యాణ్ తాలుకాలో ఉన్న నిల్జే గ్రామంలో భూముల వివరాల కోసం జాదవ్ ను పాటిల్ 30 కోట్ల రూపాయలు కోరినట్లు తెలిపారు. 2004 లో నిల్జే తాను నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ కోసం 37 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. స్థలానికి సంబంధించిన కాగితాలు అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో ఎన్ఓసీ కోసం గత కొద్ది రోజులుగా జాదవ్ పాటిల్ తో సంప్రదింపులు చేస్తున్నట్లు వివరించారు. మొదట్లో కోటి రూపాయల నగదుతో పాటు ఫ్లాట్ ఇవ్వాలని కోరిన పాటిల్ తర్వాత రేటు పెంచేశాడని తెలిపారు. దీంతో జాదవ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ను ఆశ్రయించగా.. పోలీసులు పాటిల్ ను పట్టుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఖడ్సే ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పాటిల్ తన నియోజకవర్గంలో చికిత్సల కోసం వచ్చే వారిని ముంబైకి తీసుకువచ్చే ఒక కార్యకర్తగా మాత్రమే తనకు తెలుసునని అన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు పరంగా పాటిల్ ను తన కార్యాలయంలో నియమించుకోలేదని వివరించారు. -
పనే దైవం అనేవారు
గాంధీజీ వ్యక్తిగత సహాయకుడు వెంకట్రావ్ కళ్యాణం బాపూజీ అంటే శాంతి కపోతం. ఆ స్వాతంత్య్రమూర్తికి ప్రత్యక్ష సేవలందించారు వెంకట్రావ్ కళ్యాణం. 1944 నుండి గాంధీజీ అమరుడైన 1948 వరకు ఆయనకు కళ్యాణం వ్యక్తిగత సహాయకుడు. నాలుగేళ్లపాటు గాంధీజీ జీవిత గమనానికి సాక్షిగా నిలిచిన కళ్యాణం ఆయన గురించి ఏమంటున్నారు? గాంధీమార్గానికి, ఆయన ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లకు ప్రత్యక్ష సాక్షి అయిన కళ్యాణం... నేడు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ‘ఫ్యామిలీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. గాంధీజీ దగ్గరికి ఎలా చేరానంటే..? మహాత్మాగాంధీకి సేవలు అందించటం నా పూర్వజన్మసుకృతం. అటువంటి అపూర్వవ్యక్తిని సమీపాన్నుంచి చూశాననే తృప్తి నా మరణం వరకు ఉంటుంది. మహాత్ముడి వ్యక్తిగత సహాయకుడిగా చివరి నాలుగేళ్లూ ఆయన్ని అంటిపెట్టుకునే ఉన్నాను. మా తల్లితండ్రులు తంజావూరుకు చెందిన వెంకట్రావు అయ్యర్, మీనాంబాళ్లకు 22 ఆగస్టు 1920 సిమ్లాలో నేను జన్మించాను. 21 ఏళ్ల వయస్సులో గాంధీ సేవాగ్రామ్ ఆశ్రమంలో చేరాను. ఆశ్రమంలో చేరకముందు ఆంగ్లేయుల దగ్గర పనిచేసేవాడిని. ఓ ఇంగ్లీషు అధికారి దగ్గర పనిచేస్తున్నప్పుడు గాంధీ అనే వ్యక్తి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నాడని తెలిసింది. నాకు అర్థంకాలేదు. ఎందుకు... ఎవరు పాలిస్తేనేముంది. మొఘల్స్, రాజులు, ఆంగ్లేయులు బాగానే ఉంది కదా అనిపించింది. ఎందుకంటే మేము సంతోషంగానే ఉన్నాం. స్వాతంత్య్రం వస్తే ఏమవుతుంది? మాకు తెలిసేదికాదు. అప్పుడు నేనింకా స్కూల్ పిల్లాడిని. అర్థమయ్యేదికాదు. పక్కనే ఉన్న అధికారిని అడిగాను. ఆయన ‘గాంధీ ఈజ్ రైట్’ అన్నాడు. ‘ఎందుకు?’ అన్నాను. ‘వీయార్ ఫారినర్స్, దిస్ ఈజ్ యువర్ కంట్రీ’ అన్నారు. అప్పటికీ నాకు అర్థంకాలేదు. ఆశ్రమంలో చేరిన రెండేళ్ల తర్వాత గాంధీ జైలు నుండి విడుదలవుతున్నారని తెలిసింది. ఎప్పుడూ నేరుగా చూడలేదు కాబట్టి మొదటిసారి ఆశ్రమం నుండి అందరితోపాటే నేనూ వెళ్లాను. అక్కడ ఓ గదిలో గాంధీజీ ఓ పెద్దాయనతో మాట్లాడుతున్నారు. అప్పుడు గాంధీ కోవలం (గోచీ, పంచె) కట్టుకుని ఉన్నారు. పక్కనే వ్యక్తి లాల్చీ పైజామాలో ఉన్నారు. అప్పుడు గాంధీజీని చూసి ఆయన పనిమనిషేమో అనుకున్నాను. ఆ వ్యక్తి వెళ్లిపోయాక ఆశ్రమం వారిని పిలిచారు. అప్పుడు ఆశ్రమం వాళ్లు నన్ను పరిచయం చేశారు - ‘ఇతను తమిళుడు. ఢిల్లీ నుండి వచ్చాడు. మీకు సహాయకుడిగా ఉండేందుకు’ అని! అప్పుడు అనుకున్నాను ఈయనే గాంధీజీ అని! గాంధీజీ తెల్లవారుజామున మూడున్నరకే నిద్రలేస్తారు. ప్రార్థన చేస్తారు. ఉదయం, అదేవిధంగా నిద్ర పోయేముందు మరోసారి ప్రార్థన తప్పనిసరి. ఆశ్రమంలో అందరూ రావాల్సిందే. ఎవరైనా రాకపోతే కోపం రాదు, కానీ ఇష్టం ఉండదు. కోపం అంటే హింస. అందుకే ఆయనకు కోపం రాదు. నాకు ఉదయం ఐదుగంటలకు రోజువారి కార్యక్రమాల గురించి డిక్టేట్ చేసేవారు. ఎప్పుడైనా తప్పు టైపు చేసినా కోప్పడరు. సోమవారం నిశ్శబ్దం... ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు ఎవరితోనూ మాట్లాడరు. అప్పుడు నాకు డిక్టేషన్ రాసి ఇచ్చేవారు. ఆయన రాత ఎవరికీ అర్థమయ్యేదికాదు. మా సీనియర్లు భూతద్దంపెట్టి చూసేవారు. గాంధీజీ నుండి నేర్చుకున్నది క్రమశిక్షణ, శాంతి, సహనం, సుహృద్భావం, నిజాయితీ, స్వయంసేవ, దేశసేవ. తెల్లవారుజామున 3 నుండి మధ్యాహ్నం 12 వరకు ఆయనతో కలసి పనిలో గడిపేవాణ్ణి. కూరగాయలు కొన్న సందర్భమే లేదు. గార్డెనింగ్ గాంధీ నుండి నేర్చుకున్నదే. ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలి. పనే దైవం అనేవారు గాంధీజీ. శుభ్రత మాత్రం ఆంగ్లేయుల నుండి నేర్చుకున్నా. రాజకీయాల గురించి గాంధీజీ ఏమనేవారు... సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ వాదనలు గాంధీజీకి తలనొప్పులు తెచ్చేవి. పటేల్, నెహ్రూ ఇద్దరి వాదనలు వేర్వేరుగా ఉండేవి. నెహ్రూ ముస్లిం పక్షపాతి. పటేల్ హిందూ పక్షపాతి. ఇదే వారిద్దరి మధ్య విభేదాలకు కారణమయ్యేవి. కానీ గాంధీజీకి ఇద్దరూ సమానమే. ఈ విభేదాలతో ఇద్దరూ గాంధీజీకి రాజీనామా ఇచ్చారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. మీరిద్దరూ సీనియర్లు... టాప్ లీడర్లు ఇలా చేయకూడదు. దేశం అభివృద్ధి చెందాలంటే ఇద్దరూ కలిసి ముందుకు సాగాలని హితవు చెప్పేవారు. అలా వారు కొనసాగారు. గాంధీజీ హత్యకు కారణం... గాంధీజీపై పలుమార్లు గాడ్సే హత్యాయత్నం చేశారు. ఈ విషయం తెలిసి హోంమంత్రిగా ఉన్న పటేల్ గాంధీజీ దగ్గరకు వచ్చేవారందరినీ తనిఖీచేసి పంపాలని భద్రత కల్పించారు. కానీ గాంధీజీ అందుకు నిరాకరించారు. తనిఖీలు లేకపోవటంతో గాడ్సే తుపాకీతో వచ్చాడు. జేబులో నుండి తుపాకి తీసి కాల్చాడు. నేను గాంధీజీ పక్కనే ఉన్నాను. తూటా తగలగానే గాంధీజీ కుప్పకూలిపోయారు. ప్రస్తుతం కళ్యాణం ఏం చేస్తున్నారు? గాంధీజీ మరణానంతరం నాకు పనిలేకుండా పోయింది. అందుకే గాంధీజీ నాకేమి నేర్పాడో అది ఆచరిస్తున్నా. మోడి స్వచ్ఛ భారత్ ప్రారంభించారు. మంచిదే. కానీ, నేను 1948 నుండి పాటిస్తున్నా. ప్రార్థన తప్పనిసరి. ఆశ్రమంలో అందరూ రావాల్సిందే. ఎవరైనా రాకపోతే గాంధీజీకి కోపం రాదు, కానీ ఇష్టం ఉండదు. కోపం అంటే హింస. అందుకే ఆయనకు కోపం రాదు.