ట్రంప్‌ నెత్తిన మరో బాంబు | Michael Cohen confirms Trump Deal with Adult Star | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 15 2018 10:02 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Michael Cohen confirms Trump Deal with Adult Star - Sakshi

స్టోర్మీ డేనియల్స్-డొనాల్డ్‌ ట్రంప్‌ (పాత చిత్రాలు)

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఓ పోర్న్‌ స్టార్‌తో లైంగిక సంబంధం ఉన్నట్లు అప్పట్లో ఓ కథనం అప్పట్లో అగ్రరాజ్యాన్ని కుదిపేసింది. అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయం బయటకు పొక్కుకుండా ఉండేందుకు భారీ మొత్తాన్ని చెల్లించి ఆ నటితో ట్రంప్‌ ఒప్పందం కూడా చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వైట్‌ హౌజ్‌ ఈ వార్తలను ఖండించగా.. తాజాగా అది నిజమేనంటూ ట్రంప్‌ వ్యక్తిగత న్యాయసలహాదారు బాంబు పేల్చారు.

ట్రంప్‌ వ్యక్తిగత అటార్నీ మైకేల్‌ కోహెన్‌ న్యూయార్క్‌ టైమ్స్‌ ఇంటర్వ్యూలో స్పందిస్తూ... ‘పోర్న్‌స్టార్‌ స్టోర్మీ డేనియల్స్ తో ట్రంప్‌ లక్షా,30,000 డాలర్లతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమేనని తెలిపారు. ‘స్టోర్మీతో చేసుకున్న ట్రంప్‌ చేసుకున్న ఒప్పందం ప్రలోభానికి గురి చేసేందుకు ఉద్దేశించింది కాదు. రాజకీయ విమర్శలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చేసుకుంది. పైగా న్యాయబద్ధమైంది’ అని కోహెన్‌ వివరించారు. ఇంతకాలం గోప్యంగా ఉన్న ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాబట్టి, ఆమె నిరభ్యరంతరంగా ఈ విషయాన్ని ప్రపంచానికి ఆమె వెల్లడించవచ్చు అని కోహెన్‌ చెప్పారు.

కాగా, ఇన్‌ టచ్‌ అనే మాగ్జైన్‌ లో అడల్ట్‌ సినీతార స్టోర్మీ డేనియల్స్‌(అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్‌) ఇంటర్వ్యూను ప్రచురించగా.. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ దానిని యథాతథంగా ప్రచురించింది. అందులో మెలానియా(ట్రంప్‌ భార్య) బిడ్డను ప్రసవించడానికి నాలుగు నెలల ముందే ట్రంప్‌తో తాను ఎఫైర్‌ పెట్టుకున్నట్టు ధృవీకరించింది. కొంతకాలమే కొనసాగిన తమ బం‍ధం సరదాగా సాగిపోయిందని, పైగా తన కూతురు ఇవాంక తరహాలో అందంగా, స్మార్ట్‌గా ఉంటానంటూ ట్రంప్‌ తరచూ తనతో చెబుతుండేవాడని స్టెఫానీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే వైట్‌హౌజ్‌ మాత్రం ఆ ఇంటర్వ్యూను ‘ఫేక్‌‌’ అంటూ కొట్టి పడేయగా.. ఇప్పుడు మైకేల్‌ ధృవీకరించిన వార్తపై స్పందించేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది.

                     ట్రంప్‌ వ్యక్తిగత న్యాయసలహాదారు మైకేల్‌ కోహెన్‌ (పాత చిత్రం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement