బాలకృష్ణ మాజీ పీఏ శేఖర్
సాక్షి, అనంతపురం : సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పర్సనల్ అసిస్టెంట్ శేఖర్‌కు జైలు శిక్ష ఖరారైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శేఖర్‌కు మూడేళ్ల జైలు, మూడు లక్షల జరిమానా విధిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శేఖర్, ఎమ్మెల్యే బాలకృష్ణ వద్ద పీఏగా పనిచేశారు. బాలకృష్ణ పేరుతో హిందూపురంలో ఆయన అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలన్నాయి. పీఏ దందాలను చాలాకాలం కిందటే బాలకృష్ణ, టీడీపీ నేతలు వ్యతిరేకించారు. ఇక పార్టీ నేతల మధ్య కూడా విభేదాలకు కారణమయ్యాడనే ఆరోపణల నేపథ్యంలో బాలకృష్ణ తన పీఏ శేఖర్‌కు ఫిబ్రవరిలోనే ఉద్వాసన పలికారు. శేఖర్‌పై 2008లో కేసు నమోదుకాగా, మూడు రోజుల కిందట నెల్లూరు ఏసీబీ కోర్టు శిక్ష ఖరారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment