
అక్కినేని హీరో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నారు.
ఇదిలా ఉండగా.. నాగచైతన్య మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన పర్సనల్ అసిస్టెంట్ వెంకటేశ్ బర్త్ డేను సెట్‌లోనే సెలబ్రేట్ చేసుకున్నారు. తండేల్ మూవీ సెట్‌లో కేక్ కట్ చేసి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్ సాయి పల్లవి, డైరెక్టర్ చందు కూడా అతనికి విషెస్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. తన వ్యక్తిగత సిబ్బందిని కూడా సొంతవాళ్లలా చూసుకునే చైతూపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. తండేల్ మూవీ ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Our Queen @Sai_Pallavi92 🥹🤍 from the sets of #Thandel movie celebrating @chay_akkineni 's assistant Venki Bday ❤️#SaiPallavi @chandoomondeti pic.twitter.com/YwbFzksCSG
— SaiPallavi.Fangirl07™ (@SaiPallavi_FG07) March 10, 2024
Comments
Please login to add a commentAdd a comment