AP CM YS Jagan PA Ravi Sekhar Father Passed Away, Details Inside - Sakshi
Sakshi News home page

సీఎం వ్యక్తిగత కార్యదర్శికి పితృ వియోగం.. పరామర్శించిన వైఎస్‌ జగన్

Feb 27 2022 9:15 AM | Updated on Feb 27 2022 3:55 PM

CM YS Jagan PA Ravi Sekhar father Passed Away - Sakshi

సూర్యుడు మృతదేహానికి నివాళులర్పిస్తున్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, తదితరులు 

సాక్షి, పులివెందుల: సీఎం వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత కార్యదర్శి దిద్దేకుంట రవిశేఖర్‌ తండ్రి దిద్దేకుంట సూర్యుడు(72) శనివారం ఉదయం మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన రుక్మిణీదేవి పులివెందుల మున్సిపల్‌ చైర్మన్‌గా  గతంలో పనిచేశారు.

ఫోన్‌ ద్వారా సానుభూతి తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌
తన వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్‌ తండ్రి సూర్యుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రవిశేఖర్‌కు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని.. ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజద్‌బాషా, మంత్రులు కన్నబాబు, పేర్ని నాని, అనిల్‌కుమార్‌ యాదవ్, శంకరనారాయణ, విశ్వరూప్, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, గంగుల నాని, రోశయ్య, ఉషాచరణ్‌లతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ హరికిరణ్, సీఎంఓ ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, టీటీడీ హెల్త్‌ అడ్వయిజర్‌ శ్వేత తదితరులు ఫోన్‌ చేసి తమ ప్రగాఢ సానుభూతిని రవిశేఖర్‌కు తెలియజేశారు.  

పులివెందులకు వచ్చిన ప్రముఖులు
తిరుపతి ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి, వైఎస్సార్‌ జిల్లా జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిలు పులివెందుకుల చేరుకని సూర్యుడి భౌతిక కాయానికి ఘన నివాళులర్పించారు. వీరితో పాటు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ డైరెక్టర్‌ సాంబశివారెడ్డి, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ హరీష్‌ యాదవ్, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ ఇన్‌చార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ నాయకులు దంతులూరు కృష్ణ, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చిన్నప్ప, రాష్ట్ర డైరెక్టర్లు వీరప్రతాప్‌రెడ్డి, మరకా శివకృష్ణారెడ్డి, సీఎం వైఎస్‌ జగన్‌ కార్యాలయ ఇన్‌ఛార్జిలు జనార్దన్‌రెడ్డి, రఘునాథరెడ్డి, సీనియర్‌ ఆడిటర్‌ కుడుముల వెంకటరెడ్డి, ఏపీ జర్నలిస్ట్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి అల్లం రంగనాయకులు, జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి తదితరులు కూడా నివాళులర్పించారు.

బలపనూరు కొత్తపల్లెలో అంత్యక్రియలు
సింహాద్రిపురం మండలం బలపనూరు కొత్తపల్లె గ్రామంలోని వారి వ్యవసాయ పొలంలో సూర్యుడు అంత్యక్రియలు శనివారం సాయంత్రం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement