
రాజ్‌కుమార్ (ఫైల్)
గాంధీఆస్పత్రి (హైదరాబాద్): గవర్నర్ తమిళిసైకి వ్యక్తిగత సహాయకుడు మొలుగురి రాజ్‌కుమార్ (47) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సికింద్రాబాద్ పద్మారావునగర్ స్కందగిరి ఆలయంలో నిర్వహించిన స్వర్ణబంధన మహా కుంభాభిషేకంలో గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె వెంట వెళ్లిన రాజ్‌కుమార్.. ఆలయసిబ్బంది గవర్నర్‌కు బహూకరించిన జ్ఞాపికలు, శాలువాలను తీసుకుని ఎస్కార్ట్ వాహనం వద్దకు వచ్చారు.
అక్కడ తోటి ఉద్యోగులతో మాట్లాడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గవర్నర్ కాన్వాయ్‌వాహన సిబ్బంది వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు ధ్రువీకరించారు. ఆయన భార్య శ్రీలత ఆస్పత్రికి చేరుకుని ‘మధ్యాహ్నం భోజనానికి వస్తానని చెప్పి వెళ్లిన మనిషి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయావా’ అంటూ భోరున విలపించింది.
కాగా, రాజ్‌కుమార్‌కు కుమారుడు ఉదయ్, కుమార్తె కీర్తి ఉన్నారు. పూజా కార్యక్రమాలను ముగించుకుని గవర్నర్ తమిళిసై కాన్వాయ్ వద్దకు వచ్చిన అనంతరం.. రాజ్‌కుమార్ మృతి సమాచారాన్ని ఆమెకు సిబ్బంది తెలిపారు.
చదవండి👉🏾 Warangal Premonmadi: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి..