
సాక్షి, శ్రీసత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ, టీడీపీ లీడర్ శ్రీనివాస్ రావు ఓవరాక్షన్‌కు దిగాడు. శనివారం నియోజకవర్గంలోని చలివెందుల పోలింగ్ కేంద్రం వద్ద తన అనుచరులతో హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తతంగా మారింది.
చలివెందుల పంచాయతీ ఉప ఎన్నికల సందర్భంగా.. పోలింగ్ కేంద్రం వద్ద శ్రీనివాసరావు, తన అనుచరులతో దౌర్జన్యానికి దిగాడు. పోలింగ్ సరళిని తాను పరిశీలించాలంటూ కేంద్రంలోకి వెళ్లబోయే ప్రయత్నం చేశాడు. అయితే..
అది రూల్స్‌కు విరుద్ధమంటూ పోలీసులు అడ్డుకోగా.. దూసుకెళ్లే యత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగాడు. దీంతో దౌర్జన్యకారుల్ని పోలీసులు చెదరగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment