నిందితుడి అరెస్టు చూపుతున్న సీఐ సురేష్
అన్నమయ్య : చైల్డ్ పోర్నొగ్రఫీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వాల్మీకిపురం సీఐ బీఎన్ సురేష్ కథనం మేరకు... 18 సంవత్సరాల లోపు వయస్సు గల అమ్మాయిలు, అబ్బాయిలు కొన్ని అశ్లీల వీడియాలను చూసిన, ఇతరులకు పంపిన సమాచారంపై నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎంక్సాప్లెయిటెడ్ చిల్డ్రన్(ఎన్‌సీఎంసీ) వారి నుంచి అందిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఆదేశాలతో మే నెల 2న కలికిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కలికిరి పట్టణ పరిధిలోని గిరిజన కాలనికి చెందిన బండి బాలాజీ(27)ని నిందితుడుగా గుర్తించిన పోలీసులు శుక్రవారం సాయంత్రం మండలంలోని మేడికుర్తి క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.
నిందితున్ని జుడీషియల్ కస్టిడీకి తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసులో చురుగ్గా వ్యవహరించిన సీఐ, ఏఎస్‌ఐ మధుసూదనాచారి, హెడ్‌కానిస్టేబుల్ మనోహర్, పీసీలు మునిరత్నం, రామాంజులు, సతీష్, అమరనాథ్, హోంగార్డు నిజాముద్దీన్‌లను ఎస్సీ, డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రహీముల్లా, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment