Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Muslim Personal Law Board Decides To Boycott Ap Govt Iftar Dinner1
ఏపీ సర్కార్‌ ఇఫ్తార్‌ విందు మాకొద్దు!

సాక్షి, విజయవాడ: వక్ఫ్ సవరణ బిల్లును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రేపు(గురువారం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును బహిష్కరించాలని చేయాలని నిర్ణయించింది. వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్‌ను బాయ్ కాట్ చేస్తున్నామని.. రాష్ట్రంలోని అన్ని ముస్లిం సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్‌ను బాయ్ కాట్ చేయాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. ‘‘సనాతనధర్మం బోర్డులో ఇతర మతాలను కలపాలని చూస్తే మొదటగా పోరాడేది మేమే. ముస్లింల హక్కులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం...వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల మతపరమైన అంశాల్లో జోక్యంగా భావిస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘన ఇది. మతపరమైన నిర్వహణ ఆయా మతాలే చూసుకుంటాయి. బిల్లులో పారదర్శకత లేదు. ముస్లింలపై జరుగుతున్న కుట్ర ఇది’’ అని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు పేర్కొంది.‘‘వక్ఫ్ సవరణ బిల్లు కుట్రపూరితంగా చేస్తున్నారు. ప్రతీ మతానికి వారికి సంబంధించిన భూములను రక్షించుకునేందుకు బోర్డులు ఉన్నాయి. ముస్లింలకు మాత్రమే బోర్డు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదు. భవిష్యత్తులో అన్నిమతాలకు ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతాయి. ఈ నెల 29న విజయవాడ ధర్నాచౌక్‌లో భారీ నిరసన చేపడతాం’’ అని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు సభ్యులు తెలిపారు.

Saroor Nagar Apsara Case Judgement: What happend on that Night2
అప్సర కేసు: ఒక్క రాత్రిలో తలకిందులైన జీవితాలు

వివాహితుడైనప్పటికీ ఆమె అతన్ని గాఢంగా ఇష్టపడింది. శారీరక సుఖం కోసం అతనూ ఆమెను ఇష్టపడినట్లు నటించాడు. ఇద్దరూ బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగారు. పైపెచ్చు వాళ్ల తిరుగుళ్లకు ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. అలా నాలుగేళ్లు గిర్రుమన్నాయి. తీరా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేసరికి భరించలేకపోయాడు. ప్రేమ మత్తులో ఉండగానే ఆమెను అనంతలోకాలకు పంపించేశాడు. అప్సర-వెంకటసాయికృష్ణ జీవితాలు ఆ ఒక్కరాత్రిలో తలకిందులయ్యాయి. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగిందంటే.. అప్సర-సాయికృష్ణ.. ఏడాది కాలంలోనే వాళ్ల మధ్య బంధం బలపడింది!. చెన్నై నుంచి హైదరాబాద్‌కు తల్లితో సహా వచ్చిన అప్సర.. సరూర్‌ నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు దిగి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించసాగింది. దైవభక్తి కారణంగా ఆలయాలకు క్రమం తప్పకుండా వెళ్తుండేది. అలా.. 2022లో సరూర్‌ నగర్‌ బంగారు మైసమ్మ గుడి పెద్ద పూజారి వెంకటసాయికృష్ణతో పరిచమైంది. తరచూ అప్సరకు వాట్సాప్‌ ద్వారా సాయి కృష్ణ మెసేజ్‌లు పంపేవాడు. శంషాబాద్‌లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు సాయి. అలా స్నేహం బలపడింది. ఈలోపు.. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. అదే టైంలో.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. వాట్సాప్‌ ద్వారా ఇద్దరూ వాళ్ల ప్రేమ వ్యక్తం చేసుకున్నారు. 👉అప్పటికే అప్సరకు వివాహమై భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. మరోవైపు సాయికృష్ణకు వివాహమైంది కూడా. కానీ, ఇద్దరూ చనువుగా ఉంటూ వచ్చారు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు. అప్సర తల్లి(Apsara Mother)ని అక్కా.. అని పిలుస్తూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. సాయి-అప్సరల స్నేహ బంధం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్‌ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఆమె బ్లాక్‌మెయిల్‌కు దిగడాన్ని భరించలేకపోయాడు. అలా చేయకపోతే రోడ్డుకు ఈడుస్తానని హెచ్చరించడంతో రగిలిపోయాడు. చివరకు.. .. ఆమెను చంపడం ఒక్కటే మార్గమని భావించాడు. ఈ క్రమంలో ఎలా చంపాలనేది గూగుల్‌లో వెతికి మరీ స్కెచ్‌ వేసుకున్నాడు. సరూర్‌ నగర్‌లో తాను పూజారిగా ఉన్న గుడి వెనుక ఉన్న ఆస్పత్రి వద్ద ఖాళీ జాగా ఉంది. అప్సరను చంపేశాక.. ఆ స్థలంలో ఆమెను పాతిపెట్టాలని సాయి భావించాడట. అందుకోసం 20 అడుగుల పెద్ద గొయ్యి తవ్వించాడు. అయితే, ఆస్పత్రి సిబ్బంది అడ్డుకోవడంతో ఆ గుంతను పూడ్చేయించాడు. దీంతో సాయికృష్ణ.. ఎమ్మార్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌ వద్ద స్థలం ఉందని గురించి తన ప్లాన్‌ను అమలు చేశాడు.👉హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో సాయి కృష్ణ నేరాలు ఎలా చేయాలనే వివరాలను సెర్చ్‌ చేశాడు. "How to Kil human being" అని గూగుల్‌లో వెతికి చూసినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని అప్సర పలుమార్లు సాయి కృష్ణను కోరింది. ఇదే అదనుగా భావించి ఆమె అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ డిసైడ్‌ అయ్యాడు. జూన్‌ 3.. అప్సర పాలిట కాళరాత్రిఓ ఫిల్మ్‌మేకర్‌తో సినిమా అవకాశాల కోసం మాట్లాడదామని.. అందుకోసం కోయంబత్తూరు వెళ్దామని అప్సరను సాయికృష్ణ నమ్మించాడు. విమాన టికెట్లు కొనుగోలు చేశానని చెప్పాడు. నిజమేననుకున్న ఆమె లగేజీ సహా ప్రయాణానికి సిద్ధమైంది. 2023 జూన్‌ 3న.. అప్సర వ్యక్తిగత పనిపై కోయంబత్తూరు వెళ్తోందని, ఆమెను శంషాబాద్‌ వద్ద దింపివస్తానంటూ ఆమె తల్లికి వెంకటసాయికృష్ణ చెప్పాడు.ఆరోజు రాత్రి 8.15 గంటలకు సాయికృష్ణ, అప్సర కారులో సరూర్‌నగర్‌ నుంచి బయల్దేరారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్‌ అంబేద్కర్‌ సర్కిల్‌ దగ్గరకు చేరుకున్నాక.. టికెట్‌ బుక్‌ చేయలేదని చెప్పాడు. ఆపై గోశాలకు వెళ్దామని చెప్పి.. రాళ్లగూడ వైపు తీసుకెళ్లాడు. రాత్రి 10 గంటలకు శంషాబాద్‌ మండలం రాళ్లగూడలో డిన్నర్ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక అప్సర ఒకసారి వాంతి చేసుకుంది. సాయికృష్ణ ఒక్కడే భోజనం చేసి.. 12 గంటల ప్రాంతంలో సుల్తాన్ పల్లి గోశాల వద్దకు చేరుకున్నారు.అప్సరకు ఎంతో ఇష్టమైన గోశాలలో కొంతసేపు గడిపారు. అయితే గోశాలలో బెల్లం దంచే రాయిని ఆమె కంటబడకుండా అతడు కారులోకి చేర్చాడు. 4న తెల్లవారుజామున 3.50 సమయంలో గోశాల సమీపంలోని నర్కుడలో ఓ ఖాళీ వెంచర్‌ వద్దకు చేరారు. ఫ్రంట్‌ సీటులో తన పక్కనే గాఢ నిద్రలోకి జారుకున్న అప్సరను.. కారు సీటు కవర్‌ను ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. ఆపై బెల్లం దంచే రాయితో తల వెనుక భాగంలో పదిసార్లు బలంగా బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.మృతదేహంపై కారు కవర్‌ కప్పి అక్కడి నుంచి సరూర్‌నగర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడే మృతదేహం ఉన్న కారును పార్కు చేశాడు. ఏమీ తెలియనట్టుగా తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు.రెండ్రోజుల పాటు కారులో ఉన్న అప్సర మృతదేహాన్ని.. కవర్‌లో చుట్టి సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్‌హోల్‌లో పడేశాడు. ఆపై దుర్వాసన వస్తోందంటూ ఎల్బీనగర్‌ నుంచి అడ్డా కూలీలను పిలిపించాడు. రెండు ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్‌హోల్‌ను కప్పి సిమెంట్‌తో పూడ్పించాడు. అప్సర నుంచి ఎలాంటి స్పందన లేకపోయే సరికి ఆమె తల్లి కంగారుపడి సాయికృష్ణకు ఫోన్‌ చేసింది. ఏమీ తెలియనట్లు ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి.. తాను వెతుకుతున్నట్లు నటించాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో సాయికృష్ణే హంతకుడని తేలింది. దర్యాప్తు జరుగుతున్న టైంలో సాయికృష్ణ అమాయకుడని.. తప్పంతా అప్సరదేనని అతని తల్లిదండ్రులు, భార్య వాదించారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన మృగానికి తగిన శిక్ష పడాలని అప్సర తల్లి డిమాండ్‌ చేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు విస్తృతంగా జరిగింది. విచారణలోనూ సాయికృష్ణ తన నేరాన్ని అంగీకరించాడు. అలా.. 2023 జూన్‌లో సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషి సాయికృష్ణకు బుధవారం(మార్చి 26, 2025)న శిక్ష పడింది. జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకుగానూ అదనంగా మరో ఏడేళ్ల శిక్ష వేసింది. అప్సర కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Under Construction Building Collapses In Bhadradri3
భద్రాచలంలో విషాదం.. బిల్డింగ్‌ కూలి పలువురి మృతి

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌ కూలి ఆరుగురు మృతిచెందారు. ఆరంతస్తుల భవనం కూప్పకూలింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. క్రేన్లు, పొక్లెయిన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు. పాత భవనంపైనే మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. నిర్మాణంలో లోపాల వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ట్రస్ట్‌ పేరుతో విరాళాలు సేకరించి.. భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది.పట్టణంలోని రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్‌లో ఈ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ ఈ భవనాన్ని నాసిరకమైన పిల్లర్లతో నిర్మాణం చేపట్టారని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఐటీడీపీవో రాహుల్ ఈ భవనాన్ని కూల్చివేయమని పంచాయతీ శాఖకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి ఆదేశాలను నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ప్రమాదం జరిగి పలువురు మరణానికి కారణమైందని పలువురు చెబుతున్నారు.సామాజిక కార్యకర్తలపై ఇంటి యజమాని బెదిరింపులకు దిగారనే ఆరోపణలున్నాయి. పట్టణంలోని పలు భవన నిర్మాణాలు ఇలాగే నిబంధన విరుద్ధంగా జరుగుతున్నాయని ఎవరు ఫిర్యాదు చేసిన సంబంధించిన శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి పూర్తిగా పంచాయతీ శాఖ బాధ్యత వహించాలని పలువురు అంటున్నారు.

Telangana Government Forms Sit On Online Betting Apps4
బెట్టింగ్‌ యాప్‌లపై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: బెట్టింగ్‌ యాప్‌లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్స్‌పై సిట్‌ ఏర్పాటుకు ఆదేశించింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సిట్‌ విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించామని సీఎం తెలిపారు.‘‘ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిషేధిస్తూ గత ప్రభుత్వం చట్టం చేసింది.. కానీ అమలు జరగడం లేదు. దర్యాప్తు కోసం స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీంను వేస్తున్నాం. ప్రకటనలు చేసినా.. నిర్వహణలో భాగస్వామ్యం ఉన్నా కఠిన చర్యలు ఉంటాయి. నేరాలు చెప్పి జరగవు. నేరాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. గతంలో న్యాయవాదులు, వెటర్నరీ డాక్టర్‌ హత్యలు జరిగాయి’’ అని రేవంత్‌ అన్నారు.ఎంఎంటీఎస్‌ రైలులో అత్యాచారయత్నం ఘటనపై సీఎం రేవంత్‌ స్పందిస్తూ.. శాంతిభద్రతలపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ‘‘పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దిశ ఘటన జరిగింది. వామనరావు దంపతులను నడిరోడ్డుపై చంపేశారు. జూబ్లీహిల్స్‌ అత్యాచారం కేసులో బీఆర్‌ఎస్‌ నేత కుమారుడిపై చర్యలు తీసుకోలేదు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. కుట్రలు మాని, విజ్ఞతతో మెలగాలి’’ అని రేవంత్‌రెడ్డి హితవు పలికారు.

Iran Reveals A New Underground Missile Base Amid Rising Us Tensions5
‘నీ ఇష్టమొచ్చింది చేసుకో’.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్‌ వీడియో

తెహ్రాన్‌ : 85 సెకన్ల నిడివిగల వీడియోతో ఇరాన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను రెచ్చగొట్టింది. అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లో అణు ఒప్పందం చేసుకోబోమని పరోక్షంగా ట్రంప్‌కు సంకేతాలిచ్చింది.ఇటీవల,డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీకి,ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌కు లేఖ రాశారు. ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇరాన్‌ను చర్చలకు ఆహ్వానించారు. అందుకు సుమారు రెండు నెలల డెడ్‌లైన్‌ విధించారు. ఆ లేఖపై మసౌద్‌ స్పందిస్తూ ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధం లేమని,ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు.ట్రంప్‌ విధించిన అణు ఒప్పందం డెడ్‌ లైన్‌ గడువు సమీపిస్తున్న తరుణంలో తన సైనిక విభాగం బలంగా ఉందని చెబుతూ ఇరాన్‌ 85 సెకన్ల వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మిస్సైల్‌ సిటీ పేరుతో తన మూడవ అండర్‌గ్రౌండ్ క్షిపణులను ఏర్పాటు చేసిన ప్రదేశాల్ని క్యాప్చర్‌ చేసింది. అండర్‌గ్రౌండ్ టన్నెల్స్‌లో ఏర్పాటు చేసిన మిస్సైల్‌ సిటీలో భారీ అణుఆయుధాల్ని మనం చూడొచ్చు. Iran is responding to external threats by releasing a new video showcasing one of its underground missile tunnel systems, packed with missile engines, mobile launchers, and a range of advanced weaponry. The footage prominently features the Paveh cruise missile, the Ghadr-380… pic.twitter.com/ILsdlrPtQy— Basha باشا (@BashaReport) March 25, 2025ఇక ఇరానియన్ రాష్ట్రీయ మీడియా ప్రసారం చేసిన 85 సెకన్ల వీడియోలో ఇరాన్ సైనిక సారథి మేజర్ జనరల్ మొహమ్మద్ హోసేన్ బాగెరీ, ఐఆర్‌సీజీ ఏరోస్పేస్ ఫోర్స్ చీఫ్ అమీర్ అలీ హాజిజాదెహోలు ఓపెన్‌ టాప్‌ జీపులో ప్రయాణిస్తూ ఆ క్షిపణుల్ని చూపిస్తున్నారు. ఇరాన్‌ మిస్సైల్‌ సిటీలో ఖైబర్ షెకాన్, ఘదర్-హెచ్‌,సెజిల్, పావే ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి. ఈ అణు ఆయుధాల్ని ఇరాన్ ఇటీవల ఇజ్రాయిల్‌పై దాడి చేసేందుకు ఉపయోగించినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.

Gavaskar Questions Gambhir CT 2025 Reward: Dravid Not A Good Role Model6
ద్రవిడ్‌ గొప్పోడు.. గంభీర్‌ మాత్రం స్పందించడం లేదు: టీమిండియా దిగ్గజం

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) గురించి భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీ.. రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) బాటలో నడుస్తున్నాడా? లేదా? అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నాడు. ద్రవిడ్‌ మాదిరి గౌతీకి పెద్ద మనసు ఉందో లేదో తెలియడం లేదంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే....భారత జట్టు ఇటీవలే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)గెలుచుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా వన్డే టోర్నీలో రోహిత్‌ సేన.. తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది. రూ. 58 కోట్ల క్యాష్‌ రికార్డుగ్రూప్‌ దశలో మూడింటికి మూడు గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా.. కీలక పోరులో ఆస్ట్రేలియాను ఓడించింది. అనంతరం టైటిల్‌ పోరులో న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది.తద్వారా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్‌ చేరగా.. భారత్‌కు పుష్కర కాలం తర్వాత చాంపియన్స్‌ ట్రోఫీ దక్కింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. 58 కోట్ల క్యాష్‌ రికార్డు ఇవ్వనున్నట్లు మార్చి 20న పత్రికా ప్రకటన విడుదల చేసింది.గంభీర్‌కు రూ. 3 కోట్లుఈ మొత్తంలో చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 3 కోట్ల చొప్పున.. అదే విధంగా హెడ్‌కోచ్‌ గంభీర్‌కు రూ. 3 కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా వెల్లడించారు. సహాయక కోచ్‌లు, మిగతా సిబ్బందికి రూ. 50 లక్షల నగదు బహుమానం అందజేయనున్నట్లు తెలిపారు.ఈ విషయంపై సునిల్‌ గావస్కర్‌ తాజాగా తనదైన శైలిలో స్పందించాడు. ద్రవిడ్‌తో గంభీర్‌ను పోలుస్తూ స్పోర్ట్స్‌స్టార్‌కు రాసిన కాలమ్‌లో వింత వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌-2024 గెలిచిన తర్వాత బీసీసీఐ భారీ స్థాయిలో ప్రైజ్‌మనీ ప్రకటించింది. అప్పటి హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు ఆటగాళ్లతో సమానంగా బహుమతి ఇవ్వాలని భావించింది.ద్రవిడ్‌ గొప్పోడు.. గంభీర్‌ మాత్రం స్పందించడం లేదుకానీ అతడు అందుకు అంగీకరించలేదు. సహాయక కోచ్‌లతో పాటూ తానూ సమానమేనని.. వారికి ఇచ్చినంతే తనకూ ఇవ్వాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. లేదంటే.. తనకు దక్కిన మొత్తాన్ని సహచర కోచ్‌లతో పంచుకుంటానని చెప్పాడు. చెప్పిందే చేశాడు కూడా!ఇక చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ గెలిచిన నేపథ్యంలో బీసీసీఐ క్యాష్‌ రివార్డు ప్రకటించి.. రోజులు గడుస్తున్నాయి. అయినా.. ఇప్పటి వరకు ప్రస్తుత హెడ్‌కోచ్‌ నుంచి ప్రైజ్‌మనీ తీసుకునే విషయంలో ఎలాంటి ప్రకటనా రాలేదు.అతడు ద్రవిడ్‌ మాదిరి కోచ్‌లందరితో సమానంగా నగదు తీసుకుంటాడా? లేదా? లేదంటే.. ద్రవిడ్‌ ఓ మంచి రోల్‌ మోడల్‌ కాదంటారా?!’’ అని గావస్కర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.శుభపరిణామంఅదే విధంగా.. బీసీసీఐ జట్టుకు ఈ మేర భారీ ప్రోత్సాహకాలు అందించడం గొప్ప విషమమని గావస్కర్‌ బోర్డును ప్రశంసించాడు. ‘‘ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గెలిచినప్పుడు బీసీసీఐ రూ. 125 కోట్ల మేర భారీ రివార్డు ప్రకటించింది. సెలక్టర్లు, సహాయక సిబ్బందికి కూడా తగిన రీతిలో బహుమానం అందజేసింది.ఇక ఇప్పుడు చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచినందుకు రూ. 58 కోట్లు ఇవ్వడం శుభపరిణామం. ఈసారి కూడా సెలక్షన్‌ కమిటీ, సహాయక సిబ్బందిని దృష్టిలో పెట్టుకుంది. నిజంగా ఇది గొప్ప విషయం. అంతేకాదు.. ఐసీసీ ప్రకటించిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని కూడా ఆటగాళ్లకే పంచడం.. వారికి తగిన రీతిలో ప్రోత్సాహకాలు అందించడం సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది’’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్‌ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్‌

Clash Between Tdp And Janasena Leader In Pithapuram Over Nagababu Comments7
పిఠాపురంలో మళ్లీ దబ్బిడి దిబ్బిడి

సాక్షి,కాకినాడ జిల్లా: పిఠాపురంలో జనసేన వర్సెస్‌ టీడీపీల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తమ నాయకుడు ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ చెప్పబట్టే పవన్‌కు ఓటేశామంటూ జనసేన ఇన్‌ ఛార్జ్‌ మర్రెడ్డి శ్రీనివాస్‌పై వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మర్రెడ్డి శ్రీనివాస్‌పై వాగ్వాదానికి దిగారు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.బుధవారం పిఠాపురంలో జనసేన శ్రేణుల్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. గొల్లప్రోలు మండలం చెందూర్తిలో ఆర్వో ప్లాంట్ ఆవిష్కరణకు జనసేన ఇన్‌ఛార్జ్‌ మర్రెడ్డి శ్రీనివాస్ వచ్చారు. అయితే, ఈ కార్యక్రమానికి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు ఆహ్వానం అందలేదు. ఇదే అంశంపై వర్మ అనుచరులు మర్రెడ్డి శ్రీనివాస్‌ను నిలదీశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని మర్రెడ్డి కార్యక్రమం మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయారు. వెళ్లే సమయంలో టీడీపీ,జనసేన శ్రేణులు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. వర్మ చెప్పబట్టే పవన్‌కు ఓటు వేశామని వర్మ అనుచరులు,టీడీపీ కార్యకర్తలు తన మనసులో మాటను భయటపెట్టారు. వారికి పోటీగా జనసేన శ్రేణులు రావడంతో వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు నెట్టుకున్నారు. నాగబాబు ఏమన్నారంటే?మార్చి 14న పిఠాపురం చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించింది. ఆ సభలో నాగబాబు ..పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్‌వీ­ఎస్‌ఎన్‌ వర్మను ఉద్దేశిస్తూ పరోక్షంగా మాట్లాడారు. ‘పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ గెలుపులో ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్‌ పని చేశాయి. ఒకటి జనసేన ప్రెసిడెంట్‌ పవన్‌ కల్యాణ్‌. రెండు జనసైనికులు, పిఠాపురం ఓటర్లు’ మరెవరైనా పవన్‌ గెలుపులో తమ పాత్ర ఉందని అనుకుంటే అది వారి ఖర్మ’ అని నాగబాబు నొక్కి మరీ చెప్పారు. నాగబాబుకు వర్మ కౌంటర్‌గా ఆ వ్యాఖ్యలపై వర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సభ జరిగిన తర్వాత వర్మ సైతం సోషల్‌ మీడియా వేదికగా జనసేనకు కౌంటర్‌ వేస్తూ పోస్టులు పెడుతూ వచ్చారు. ఈ తరుణంలో వర్మ అభిమానులు పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జ్‌ మర్రెడ్డి శ్రీనివాస్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చాంశనీయంగా మారింది.

Interesting Facts About L2: Empuraan Movie8
‘లూసిఫర్‌’ కథేంటి? ఎంపురాన్‌ అంటే అర్థం ఏంటో తెలుసా?

‘లూసిఫర్‌’.. 2019లో రిలీజైన ఈ మలయాళ మూవీ ఎంత ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. రూ.30 కోట్లతో తీస్తే, రూ.125 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన ఎనిమిదో చిత్రంగా నిలిచింది. హీరో మోహన్‌లాల్‌కి, దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమార్‌కి కెరీర్‌లోనే బెస్ట్‌ చిత్రంగా ‘లూసిఫర్‌’ నిలిచిపోయింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘L2: ఎంపురాన్‌’ (L2: Empuraan Movie) వస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు(మార్చి 27)న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో లూసిఫర్‌ కథేంటి? ఎంపురాన్‌ లో ఏం చెప్పబోతున్నారు? అసలు ఎంపురాన్‌ అంటే ఏంటి? తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.లూసిఫర్‌ కథేంటి?ముఖ్యమంత్రి పి.కె రామదాసు అలియాస్‌ పీకేఆర్‌(సచిన్‌ ఖేడ్కర్‌) అకాల మరణంతో ఐయూఎఫ్‌ (ఇండియన్‌ యూనియన్‌ ఫ్రంట్‌) పెద్దల కన్ను సీఎం సీటుపై పడుతుంది. తదుపరి సీఎం కావాలని అతని అల్లుడు బిమల్‌ నాయుడు అలియాస్‌ బాబీ(వివేక్‌ ఒబెరాయ్‌) భావిస్తాడు. అందుకోసం పార్టీలోని కొంతమంది అవినీతిపరులతో చేతులు కలుపుతాడు. అయితే పీకేఆర్‌ సన్నిహితుడు, పార్టీ కీలక నేత స్టీఫెన్‌ గట్టుపల్లి (మోహన్‌లాల్‌) మాత్రం బాబీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ సీఎం కాకుండా చేస్తాడు. దీంతో స్టీఫెన్‌ని హత్య చేయించేందుకు బాబీ కుట్ర చేస్తాడు. ఆ కుట్రను బాబీ ఎలా తిప్పి కొట్టాడు? బాబీ తీసుకురావాలనుకున్న డ్రగ్స్‌ను రాష్ట్రానికి రాకుండా ఎలా అడ్డుకున్నాడు? పీకేఆర్‌ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించింది? అసలు స్టీఫెన్‌ గతం ఏంటి? అన్నదే లూసీఫర్‌ కథ. స్టోరీ పరంగా చూస్తే ఇది రొటీన్‌ పొలిటికల్‌ డ్రామా. కానీ దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమార్‌ ఒక్కో సీన్‌ని తీర్చి దిద్దిన విధానం, మోహన్‌లాల్‌ సెటిల్డ్‌ యాక్టింగ్‌ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. వివేక్‌ ఒబెరాయ్‌, మోహన్‌ లాల్‌ పాత్రల మధ్య నువ్వా నేనా అన్నట్లు సన్నివేశాలు సాగుతాయి. మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో స్టీఫెన్‌ నేపథ్యం చెబుతూ సినిమాను ముగించారు. ఇప్పుడదే ‘ఎల్‌2: ఎంపురాన్‌’పై ఆసక్తిని పెంచేసింది. అసలు ఎంపురాన్‌ అంటే ఏంటి?లూసిఫర్‌ అనే టైటిల్‌ వినగానే అసలు ఈ పేరు ఎందుకు పెట్టారని అంతా అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఆ టైటిల్‌ ఎందుకు పెట్టారో తెలిసింది. క్రైస్తవంలో లూసిఫర్‌ అంటే దైవదూత అని అర్థం. భగవంతుని ఆజ్ఞను వ్యతిరేకించి కిందకు వచ్చి దుష్టుడిగా మారి, మానవాళి పాపాలు చేసేందుకు ప్రేరేపించేవాడినే లూసీఫర్‌ అంటారు. అందుకే ఈ సినిమాలో ‘దుర్మార్గులకు, మహాదుర్మార్గులకు జరిగే యుద్ధం’ అని హీరో పాత్రలో చెప్పించారు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన మూవీకి ‘ఎంపురాన్‌’ అని టైటిల్‌ పెట్టారు. దీని అర్థం ఏంటంటే.. ‘రాజు కంటే ఎక్కువ.. దేవుడి కంటే తక్కువ’ అని అర్థం. హీరో పాత్రను దృష్టిలో పెట్టుకొని ఈ టైటిల్‌ని పెట్టారు. దాదాపు రూ. 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

India May Cut Duties on Harley Bikes Bourbon Whiskey 9
ఇదే జరిగితే.. ఆ బైకులు, మద్యం ధరలు తగ్గుతాయి

సుంకాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా.. భారత్ మీద ఆ ప్రభావాన్ని కొంత తగ్గిస్తోంది. ఇందులో భాగంగానే హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళు, బోర్బన్ విస్కీ అండ్ కాలిఫోర్నియా వైన్స్ మీద దిగుమతి సుంకాలను తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం రెండు దేశాలు కొన్ని ఉత్పత్తులపై సుంకాలను మరింత తగ్గించి.. వాణిజ్య సంబంధాలను పెంచుకునే దిశగా చర్చలు జరుపుతున్నాయి.ప్రభుత్వం గతంలో హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై దిగుమతి సుంకాలను 50 శాతం నుంచి 40 శాతానికి తగ్గించింది. ఇప్పుడు దీనిని మరింత తగ్గించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే.. ఈ ప్రీమియం బైకులోను దేశంలో సరసమైన బైకుల జాబితాలోకి చేరుతాయి.బోర్బన్ విస్కీపై దిగుమతి సుంకాన్ని గతంలో 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించారు. రెండు దేశాల మధ్య సజావుగా వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి అధికారులు ఇప్పుడు మరి కొంత ట్యాక్స్ తగ్గించనున్నారు. ఈ వాణిజ్య చర్చలు మోటార్ సైకిళ్ళు, ఆల్కహాలిక్ పానీయాలకే పరిమితం కాలేదు. ఎందుకంటే ఇందులో ఔషధ ఉత్పత్తులు, రసాయనాల ఎగుమతుల విస్తరణలు కూడా ఉన్నాయి. వీటి గురించి కూడా అధికారులు చర్చిస్తున్నారు.భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఔషధ రంగంలో తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని అమెరికా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే భారతదేశం అమెరికాకు తన ఎగుమతులకు అనుకూలమైన నిబంధనలను పొందాలని చూస్తోంది.

why person Got Fired Because he scrolls messages10
మెసేజ్‌ స్క్రోల్‌ చేస్తే జాబ్‌ పోయింది!

ఉద్యోగాల కోసం రోజూ పదుల సంఖ్యలో కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు.. అలా ఏడాది గడిపిన ఓ వ్యక్తి చివరకు ఓ పెద్ద కంపెనీలో అధిక వేతనంతో రిమోట్ ఉద్యోగం(వర్క్‌ఫ్రం హోం) సంపాదించాడు. కానీ కొన్ని నెలల్లోనే తనకున్న ఓ అలవాటు ద్వారా ఉద్యోగం ఊడింది. తన అలవాటుపై స్పందించిన సదరు ఉద్యోగి తానో మూర్ఖుడినంటూ అందుకే ఉద్యోగం పోయిందని వాపోయాడు. దీనికి సంబంధించిన వివరాలను ‘కెరియర్‌ అడ్వైజ్‌’ అనే రెడ్డిట్‌ హ్యాండిల్‌ పోస్ట్‌ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.‘చదవు పూర్తయింది. రోజూ పదుల సంఖ్యలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవాడిని. నాకు రిమోట్‌ ఉద్యోగం(వర్క్‌ఫ్రం హోం) చేయాలని చాలా ఇష్టంగా ఉండేది. అనుకున్నట్టుగానే మంచి కంపెనీలో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం వచ్చింది. రిమోట్‌ జాబ్‌ కావడంతో కొన్నిసార్లు ఆలస్యంగా మెసేజ్‌లు చేస్తూ, మూర్ఖుడిలా పర్సనల్‌ మెసేజ్‌లు స్క్రోల్‌ చేసేవాడిని. ఈ క్రమంలో ల్యాప్‌టాప్‌ 10-15 నిమిషాలపాటు స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లేది. ఇలా చాలాసార్లు జరిగింది. దీని గుర్తించి మేనేజర్‌ అడిగినప్పుడు ఏదో టెక్నికల్‌ సమస్య అని అబద్ధం చెప్పాను. అది గమనించిన మా బాస్‌ నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఎంతో నిరాశ చెందాను. కాలేజ్‌ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం సంపాదించిన మూడు నెలల్లో రెండు ఉద్యోగాలు మారాను. ఇది నా రెజ్యూమెలో ప్రతికూలంగా మారింది. నేను మళ్లీ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నాను. కానీ నా డ్రీమ్ జాబ్ కోల్పోయిన భావన నిజంగా నన్ను బాధిస్తుంది’ అని తెలిపాడు.‘నేను తప్పు చేశానని 100 శాతం అర్థం చేసుకున్నాను. దానిని సరిచేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను డబ్బును ప్రేమించాను. కానీ ఉద్యోగంలో ఉత్సాహంగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాల్సింది. ఇకపై తప్పు చేయను. నాకు ఆసక్తిగా ఉన్న విమానయానం, ఆటోమోటివ్ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను’ అని పోస్ట్‌ చేశాడు.ఇదీ చదవండి: రోల్స్‌ రాయిస్‌.. 2,500 మందికి లేఆఫ్స్‌ఈ పోస్ట్‌ రెడ్డిట్‌లో వైరల్‌గా మారింది. చాలా మంది అతని చర్యలు, వాటి వల్ల వచ్చిన ఫలితం రెండింటినీ పరిగణించి కామెంట్‌ చేశారు. ‘మీ నుంచి చాలా మంది ఖరీదైన పాఠం నేర్చుకుంటారు. మీరు కెరియర్‌లో ముందుకు సాగండి. మరింత మెరుగైన అవకాశాలు మీ సొంతం అవుతాయి’ అని ఒక యూజర్‌ కామెంట్‌ చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement