సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కొందరు గుర్తు తెలియని దుండగులు వ్యాపారులను టార్గెట్ చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వ్యాపారులు హనుమంతు, రమణకు గాయాలయ్యాయి.
వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మండలం మాధవరం గ్రామం మద్దెలకుంట దగ్గర గుర్తు తెలియని దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. పాత సామాగ్రి వ్యాపారులపై నాటు తుపాకితో కాల్పులు జరిపారు. వీరి కాల్పుల్లో హనుమంతు (50), రమణ (30) తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని కడపలోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హనుమంతు మృతిచెందగా.. రమణి ప్రాణాల కోసం పోరాడుతున్నట్టు వైద్యులు వెల్లడించారు.
ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి రాయచోటి డీఎస్పీ కృష్ణ మోహన్ సహా సీఐలు చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరికాసేపట్లో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా చేరుకుంటుందని తెలిపారు. ఘటన నేపథ్యంలో అక్కడ పోలీసు బలగాలు మోహరించాయి.
Comments
Please login to add a commentAdd a comment