
సాక్షి, అమరావతి: ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా రాసలీలలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రంలో పేద మహిళలే టార్గెట్‌గా ఖాదర్ బాషా అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్ బాషా అసలు స్వరూపం బట్టబయలైంది. పేద మహిళలను టార్గెట్ చేస్తూ ఖాదర్.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఖాదర్ బాషా లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకు వచ్చింది. పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి ఖాదర్.. ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలే బహిర్గతం చేసింది. దీంతో, అసలు విషయం బయటకు వచ్చింది.
ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పచ్చ నేతలు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల సత్యవేడు, ఇప్పుడు రాయచోటిలో వెలుగు చూసిన ఘటనలే ఇందుకు నిదర్శనం. ఈ రెండు ఘటనల్లో బాధితులు ఎంతో ధైర్యం చేసి బయటకు రావడంతో పచ్చ నేతల బాగోతం బయటకు వచ్చింది.