వివాహం చేసుకున్న ప్రేమజంటకు కౌన్సెలింగ్
మదనపల్లె : ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్న ప్రేమజంటకు సోమవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ చాంద్‌బాషా బంధువుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. రామసముద్రం మండలం పెద్దకురప్పల్లెకు చెందిన సీతారామప్ప, శంకరమ్మల కుమార్తె సి.మౌనిక(19) మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం డిగ్రీ చదువుతోంది. సెప్టెంబర్ 29న తండ్రి సీతారామప్పతో కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు చిత్తూరు బస్టాండులో బస్సు ఎక్కే సమయంలో మౌనిక అక్కడి నుంచి అదృశ్యమైంది. ఈ విషయమై అక్టోబర్ 3న మౌనిక తల్లి శంకరమ్మ, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన సీఐ రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ దిన్నెమీద హరిజనవాడకు చెందిన వెంకటప్ప, శ్యామల కుమారుడు జి.శ్రీనివాసులు(23)తో మౌనిక వివాహం చేసుకున్నట్లుగా గుర్తించారు. ప్రేమజంటను సోమవారం వన్‌టౌన్ స్టేషన్‌కు తీసుకువచ్చి, అనంతరం తహసీల్దార్ ఖాజాబీ ఎదుట హాజరు పరిచారు. స్టేషన్‌లో ప్రేమ జంటకు పూలదండలు మార్పించి, బంధువుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. వివాహానికి అర్హులైన యువతీ, యువకులు పెద్దలను ఒప్పించి లేదా చట్టబద్ధంగా పోలీసులను, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆశ్రయించి పెళ్లి చేసుకోవాలే కానీ పారిపోయి తల్లిదండ్రులను, పోలీసులను ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment