ఉత్కంఠ భరితంగా హాకీ పోటీలు
మదనపల్లె సిటీ : మదనపల్లె పట్టణం బీటీ కాలేజీ హాకీ మైదానంలో 14వ ఏపీ సబ్ జూనియర్స్ రాష్ట్ర స్థాయి బాలుర హాకీ పోటీలు ఉత్కంఠ భరితంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 22 జట్లు పాల్గొన్నాయి. మొదటి సెమీ ఫైనల్స్‌లో తిరుపతి–కడప జిల్లా జట్లు పోటీ పడ్డాయి. ఇందులో 5–1 స్కోరుతో కడప జిల్లా జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. కడప జట్టు నుంచి జాకీర్‌హుస్సేన్ రెండు గోల్స్, సాయిమోహన్ ఒక గోల్, బాలాజీ ఒక గోల్, మిథుల్‌కౌశిక్ ఒక గోల్ చేశారు. తిరుపతికి చెందిన నవీన్‌కుమార్ ఒక గోల్ చేశారు. రెండవ సెమీఫైనల్స్ మ్యాచ్‌లో అన్నమయ్య– అనకాపల్లి జట్లు పోటీ పడ్డాయి. 6–0 స్కోరుతో అనకాపల్లి జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్స్ మ్యాచ్ ఆదివారం కడప–అనకాపల్లి జట్ల మధ్య జరగనున్నట్లు హాకీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, కోశాధికారి పి.ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఉదయం లీగ్, క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ పోటీలు జరిగాయి. ఉదయం నుంచి హాకీ మైదానంలో క్రీడాకారులతో సందడి నెలకొంది. పోటీలను హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణిక్యరాజు, కోశాధికారి థామస్, కోచ్ నౌషాద్, కన్వీనర్ హితేష్‌రావు, పీడీలు శివప్రసాద్, జలజ తదితరులు పర్యవేక్షించారు.
ఫైనల్స్‌కు చేరిన కడప, అనకాపల్లి జట్లు
Comments
Please login to add a commentAdd a comment