సిద్దవటం : కడప– చైన్నె జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి పొగలు వచ్చాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం పులివెందుల నుంచి చైన్నెకి వెళతుండగా సిద్దవటం మండలం భాకరాపేట మూడు రోడ్ల కూడలిలోకి వచ్చే సరికి.. ఒక్కసారిగా రేడియేటర్ వద్ద పొగతో కూడిన మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను దింపేశారు. స్థానికులు హుటాహుటిన బస్సులోని మంటలపై బిందెలతో నీళ్లు పోయడంతో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. దీంతో వాహనాలు దాదాపు 20 నిమిషాలు ఆగిపోయాయి. బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిని సురక్షితంగా వేరే బస్సులో ఎక్కించి వారి ప్రాంతాలకు తరలించామని ఏఎస్‌ఐ సుబ్బరామచంద్ర తెలిపారు.
● తప్పిన ప్రమాదం ● ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
Comments
Please login to add a commentAdd a comment