షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో సామగ్రి దగ్ధం
తంబళ్లపల్లె : ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదంలో వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. సంఘటన శనివారం వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని సాలివీధికి చెందిన కిషోర్ తహసీల్దార్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. గత సోమవారం తల్లి సరస్వతితో కలిసి సంక్రాంతి పండుగకు రాయచోటిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. వారు తిరిగి శనివారం ఉదయం ఇంటికి వచ్చి తలుపులు తెరవగా వస్తువులన్నీ కాలిబూడిదయినట్లు గుర్తించారు. ఇంటిలోని ఫ్రిడ్జ్, ఫ్యాన్లు, బట్టలు, ఫర్నీచర్ కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగివుండవచ్చునని బాధితులు తెలిపారు. సుమారు రూ.6 లక్షల నష్టం వాటిలినట్లు వారు వాపోయారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ హరికుమార్, వీఆర్‌ఓ నాగరాజు పరిశీలించారు. బాఽధితులను పరామర్శించారు. ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని స్థానికులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment