ఆ వీడియోలపై ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు సుప్రీం ఆదేశాలు
ఆ వీడియోలపై ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు సుప్రీం ఆదేశాలు
Published Mon, Sep 4 2017 8:10 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM
న్యూఢిల్లీః లైంగిక దాడులు, సామూహిక అత్యాచారాలు, చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన అభ్యంతరకర వీడియోలు, ఫోటోల అప్‌లోడింగ్‌పై వచ్చిన ఫిర్యాదుల వివరాలు ఇవ్వాలని ఫేస్‌బుక్, గూగుల్, వాట్సాప్, యాహూలను సుప్రీం కోర్ట్ ఆదేశించింది. ఈ ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కోరింది. ఈ తరహా నేరాలపై పోక్సో చట్టం కింద ఎన్ని కేసులు నమోదు చేశారో తెలపాలని జస్టిస్ మదన్ బీ లోకూర్, యూయూ లలిత్‌తో కూడిన బెంచ్ హోంమంత్రిత్వ శాఖను ఆదేశించింది. అభ్యంతరకర వీడియోలు, కంటెంట్‌పై ఈ ఏడాది ఆగస్ట్ 31 వరకూ భారత్‌లో వచ్చిన ఫిర్యాదులు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను తెలుపుతూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆయా కంపెనీలను ఆదేశిస్తున్నట్టు సుప్రీం బెంచ్ పేర్కొంది. అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తుకు హైదరాబాద్‌కు చెందిన ఎన్‌జీఓ ప్రజ్వల పంపిన లేఖపై కోర్టు విచారణ చేపట్టింది. ప్రజ్వల సంస్థ లేఖతో పాటు లైంగికదాడులకు సంబంధించిన రెండు వీడియోలనూ పెన్‌డ్రైవ్‌లో పంపింది.
లేఖను సుమోటోగా స్వీకరించిన కోర్టు వాట్సాప్‌లో పోస్ట్ చేసిన వీడియోలపై తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణ చేపట్టి దోషులను పట్టుకోవాలని సీబీఐని కోరింది. ఇక సోమవారం జరిగిన విచారణ సందర్భఃగా అభ్యంతరకర దృశ్యాలను సోషల్ మీడియాలో బ్లాక్ చేసేలా చర్యలు చేపట్టడంపై ఇంటర్‌నెట్ కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీ చేస్తున్న ప్రయత్నాలను కంపెనీల ప్రతినిధులు కోర్టుకు వివరించారు.
Advertisement
Advertisement