న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేయడం, చూడటం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు దుర్మార్గంగా అభివర్ణించింది. ఆ తీర్పుపై విచారణ జరిపేందుకు అంగీకరించింది. చెన్నైకి చెందిన ఎస్.హరీశ్(28) పిల్లలతో కూడిన పోర్నోగ్రఫీ కంటెంట్‌ను తన సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నాడంటూ పోలీసులు కేసు పెట్టారు. దీనిపై హరీశ్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లాడు.
విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం పోక్సో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం, చూడటం నేరం కాదని పేర్కొంటూ జనవరి 11వ తేదీన తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ ఫరీబాద్‌కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయెన్, ఢిల్లీకి చెందిన బచ్‌పన్ బచావో ఆందోళన్ అనే ఎన్‌జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పు చట్టాలకు వ్యతిరేకం, దుర్మార్గమని పేర్కొంది. ఏకసభ్య ధర్మాసనం ఇలాంటి తీర్పు ఎలా ఇవ్వగలదని ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment