Information Technology (IT)
-
టెక్ హైరింగ్‌లో బ్యాం‘కింగ్’!
ఆన్లైన్ మోసగాళ్లు.. డేటా హ్యాకర్ల రిస్కును మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసుకోవాలని ఒకపక్క ఆర్బీఐ పదేపదే హెచ్చరికలు. మరోపక్క తీవ్ర పోటీ నేపథ్యంలో సరికొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. దీంతో బ్యాంకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వ్యయాలతో పాటు టెక్ సిబ్బంది సంఖ్యను కూడా భారీగా పెంచుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసులు– ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో కూడా మరిన్ని ఐటీ కొలువులు సృష్టించనుంది. దేశ ఐటీ రంగంలో హైరింగ్ ఇంకా మందకొడిగానే ఉన్నప్పటికీ... దీనికి భిన్నంగా బ్యాంకులు మాత్రం రారమ్మంటూ టెకీలకు స్వాగతం పలుకుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో బీఎఫ్ఎస్ఐ రంగంలో టెక్నాలజీ నిపుణులకు ఫుల్ డిమాండ్ నడుస్తోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ సంస్థలు తమ ఐటీ వ్యయాలను 12% పెంచుకోనున్నట్లు అంచనా. ఎనలిటిక్స్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత సొల్యూషన్లతో పాటు ఆటోమేషన్ టెక్నాలజీలపై ఆయా సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే హైరింగ్ కూడా జోరందుకుందని హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. ‘బీఎఫ్ఎస్ఐలో ప్రత్యేకమైన విభాగాల్లో హైరింగ్ డిమాండ్ ఉంది. క్లౌడ్‌కు మారుతున్న సంస్థలు అత్యవసరంగా టెక్నాలజీ నిపుణులు కావాలని కోరుతున్నాయి. సైబర్ సెక్యూరిటీలో కూడా భారీగానే నియామకాలు కొనసాగనున్నాయి’ అని క్వెస్ ఐటీ స్టాఫింగ్ డిప్యూటీ సీఈఓ కపిల్ జోషి పేర్కొన్నారు. ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ రంగం టెక్ హైరింగ్ 6–8% వృద్ధి చెందనుందని, ఫ్రెషర్లతో పాటు టెక్నాలజీపై పట్టున్న ప్రొఫెషనల్స్‌కు కూడా అవకాశాలు లభిస్తాయని టీమ్‌లీజ్ తెలిపింది. తయారీ తర్వాత అత్యధిక జాబ్స్... టెక్నాలజీయేతర కంపెనీల్లో అత్యధికంగా టెక్ ఉద్యోగులను నియమించుకుంటున్న రంగంగా త్వరలో బీఎఫ్ఎస్ఐ అగ్రస్థానానికి ఎగబాకనుంది. ప్రస్తుతం టాప్‌లో తయారీ రంగం ఉంది. 2023 నాటికి బీఎఫ్ఎస్ఐ సంస్థల మొత్తం టెక్ సిబ్బంది సంఖ్య 4 లక్షల స్థాయిలో ఉండగా.. 2026 కల్లా 4.9 లక్షలకు ఎగబాకుతుందనేది టీమ్‌లీజ్ అంచనా. అంటే 22.5 శాతం వృద్ధి చెందనుంది. మరోపక్క, బీఎఫ్ఎస్ఐలో మొత్తం సిబ్బంది సంఖ్య ఇప్పుడున్న 71 లక్షల నుంచి 2026 నాటికి 12 శాతం వృద్ధితో 80 లక్షలకు చేరుకుంటుందని లెక్కగట్టింది. కాగా, ఈ ఏడాది జూన్‌లో బీఎఫ్ఎస్ఐ రంగంలో జరిగిన మొత్తం నియామకాల్లో 8% పైగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగానికి చెందినవే. 15% ప్రోడక్ట్ మేనేజ్మెంట్, 11% సైబర్ సెక్యూరిటీలో నమోదయ్యాయి. ఇక డేటా సైన్స్– ఎనలిటిక్స్ జాబ్స్‌లో హైరింగ్ 7% వృద్ధి చెందగా, ఏఐ/ఎంఎల్ ఇంజనీర్లకు 10% అధికంగా జాబ్స్ లభించాయి. ఈ రెండు విభాగాల్లో బీఎఫ్ఎస్ఐ కంటే ఎక్కువగా ఉద్యోగాలిచి్చన రంగాల్లో సాఫ్ట్వేర్ సేవలు, ఇంటర్నెట్–ఈకామర్స్, అడ్వర్టయిజింగ్–పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి.టెక్నాలజీకి పెద్దపీట... నెట్ బ్యాంకింగ్‌కు తోడు యాప్స్, యూపీఏ పేమెంట్స్ ఇలా బ్యాంకింగ్ లావాదేవీలకు ఇప్పుడు ఆన్లైన్ కీలకంగా మారింది. దీంతో బ్యాంకులు సిబ్బంది నియామకాల్లో టెకీలకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ ఆరి్థక సంవత్సరంలో ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్లు (పీఓ)గా సుమారు 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే సన్నాహాల్లో ఉంది. ఇందులో 85 శాతం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అవకాశాలు లభించనున్నాయని అంచనా. గడిచిన మూడేళ్లలో యస్ బ్యాంక్ ఏటా 200 మంది టెక్ నిపుణులను నియమించుకోవడం గమనార్హం. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలదించేందుకు, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్–ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ సంస్థలన్నీ జెనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీపై పెద్దమొత్తంలో పెట్టుబడి పెడుతున్నాయి. ఈ రంగంలో ప్రతిభ గల ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పుంజుకోవడానికి ఇదే ప్రధాన కారణం. – కపిల్ జోషి, డిప్యూటీ సీఈఓ, క్వెస్ ఐటీ స్టాఫింగ్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
స్తంభించిన ప్రపంచం!
మైక్రోసాఫ్ట్ విండోస్ మొండికేయటంతో శుక్రవారం ఒక్కసారిగా అంతా అస్తవ్యస్తమైన తీరు ఐటీపై ప్రపంచం ఎంతగా ఆధారపడిందో కళ్లకు కట్టింది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలతోపాటు మన దేశంలోనూ అనేక సేవలకు అంతరాయం ఏర్పడింది. మ్యాక్, లైనెక్స్ ఆధారిత సేవలు యథావిధిగా పనిచేశాయి. 1872లో ఆంగ్ల రచయిత శామ్యూల్ బట్లర్ యంత్రాలకు సొంతంగా ఆలోచించే, తిరిగి తమంత తాము చేయగలిగే సామర్థ్యం వస్తే ఎలావుంటుందో చూపుతూ ఎరెవాన్ అనే వ్యంగ్య నవల రాశాడు. అది మరీ అతిగావుందని సమకాలికుల నుంచి విమర్శలొచ్చాయి. బహుశా ప్రపంచంలో అదే తొలి సైన్స్ ఫిక్షన్. ఆ కోవలో తర్వాత చాలా వచ్చాయి. సైబర్ దాడులు జరిగితే ప్రపంచం ఏమవుతుందన్న ఇతివృత్తాలతో చలనచిత్రాలు, టీవీ సీరియళ్లు వచ్చాయి. కానీ మైక్రోసాఫ్ట్ విండో స్కు సైబర్ నేరగాళ్లనుంచి కాకుండా అలాంటివారినుంచి రక్షిస్తామని చెప్పే ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌వల్ల సమస్యలు తలెత్తి ఇంత పని జరగటం ఒక వైచిత్రి. మైక్రోసాఫ్ట్‌కు సైబర్ సెక్యూరిటీ సేవలందించే క్రౌడ్‌స్ట్రయిక్ అనే అమెరికా సంస్థ తాను రూపొందించిన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను నవీకరించి కొత్తది విడుదల చేయగానే సమస్య తలెత్తిందంటున్నారు. దీంతో మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఇన్‌ట్యూన్, వన్‌నోట్, షేర్‌పాయింట్, మైక్రోసాఫ్ట్ డిఫెండర్ వంటి అనేక యాప్‌లు నిరర్థకమయ్యాయి. ఒక్కొక్కటే మళ్లీ పునరుద్ధరిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. అయితే ఈలోగా అనేక దేశాల్లో కంప్యూటర్లు ఆగిపోయాయి. రైళ్లు, విమానయాన సేవలు నిలిచి పోవటం మొదలుకొని దుకాణాల్లో చెల్లింపుల ప్రక్రియ వరకూ అన్నిటికన్నీ స్తంభించిపోయాయి. చాలాచోట్ల వాణిజ్య, వ్యాపార లావాదేవీలూ, బ్యాంకింగ్, ఆరోగ్య సేవలూ, వార్తా ప్రసారాలూ, పోలీసు వ్యవస్థలూ, మెట్రో సర్వీసులూ, స్టాక్ ఎక్స్ఛేంజ్లూ నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది సంస్థల్లో వినియోగించే టీమ్స్ సాఫ్ట్వేర్ సైతం ఆగిపోయింది. విమానాల్లో బోర్డింగ్ పాస్‌లు చేతితో రాసి ఇవ్వటం అందరూ మరిచి దాదాపు మూడు దశాబ్దాలవుతోంది. తాజా సమస్య అదెలా వుంటుందో ఈ తరానికి రుచి చూపింది.సమాచార సాంకేతికతలు వర్తమాన యుగంలో జీవితాన్ని వేగవంతం చేశాయి. కొన్ని శతాబ్దాలు ఇలాంటివేమీ లేకుండానే ప్రపంచం మనుగడ సాగించిందన్న సంగతినే మరిచేలా చేశాయి. అర చేతిలో ప్రపంచం మొత్తం ఇమిడిపోయింది. ఖండాంతరాల్లోని మారుమూల దేశాల్లోనివారితో సైతం ఎక్కడున్నవారైనా మాట్లాడగలిగే వెసులుబాటు అందుబాటులోకొచ్చింది. మనుష్య సంచారం అసాధ్యమనుకున్న చోటకు సైతం డ్రోన్లు వెళ్తున్నాయి. సాధారణ పనులు మొదలుకొని ప్రమాదం పొంచివుండే కార్యాలవరకూ రోబోలు చేస్తున్నాయి. సంక్లిష్ట సమస్యలకు చిటికెలో పరిష్కారం లభిస్తోంది. అందువల్ల ఉత్పాదకత పెరిగింది. చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ పని చేయగలిగే సామర్థ్యం మనుషుల సొంతమైంది. కావలసిన సమాచారం కోసం గూగుల్‌ని ఆశ్రయించేవారే నిమి షానికి 63 లక్షలమంది ఉన్నారంటే పరిస్థితేమిటో అర్థమవుతుంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుఃప్రమాణం 52.5 సంవత్సరాలైతే ఆరోగ్యరంగ సాంకేతికతలవల్ల అది ప్రస్తుతం 72 సంవత్సరాలని ఐక్యరాజ్యసమితి నిరుడు ప్రకటించింది. సమాచార సాంకేతికతలు అనేకచోట్ల మనిషి అవసరాన్ని తగ్గించాయి. అందువల్ల కొందరి ఉద్యోగావకాశాలకు ముప్పు వచ్చిన మాట కూడా వాస్తవం. కానీ ఇదివరకెన్నడూ వినని అనేక రకాల కొత్త అవకాశాలు లభించాయి. వచ్చే ఏడాదికల్లా ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతికతల్లో 9 కోట్ల 70 లక్షల ఉద్యోగావకాశాలుంటాయని ఒక అంచనా. అయితే ఈ సాంకేతికతల వల్ల సాంఘిక జీవనం అస్తవ్యస్తమవుతున్నదని, మనిషి ఏకాకి అవుతున్నాడని, పర్యవసానంగా సమాజంలో అమానవీయత విస్తరించిందని, వ్యక్తి గోప్యతకు ముప్పు ఏర్పడిందని, పౌరుల జీవితాల్లోకి రాజ్యం చొరబాటు ఊహకందనంత పెరిగిందని కనబడు తూనేవుంది. తప్పుడు సమాచారం వ్యాప్తిచేసి లాభపడే శక్తులున్నట్టే, దానివల్ల నష్టపోతున్నవారూ అధికంగానే ఉన్నారు. ఈ సాంకేతికతల అభివృద్ధి పరుగులో పర్యావరణానికి కలుగుతున్న హాని గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. పారిశ్రామికీకరణ తర్వాత భవిష్యత్తు స్పృహ కొరవడి అడవుల, ఇతరేతర సహజ సంపదల విధ్వంసం, పర్యవసానంగా ప్రకృతి వైపరీత్యాలు క్రమేపీ పెరిగాయనుకుంటే ఐటీ అభివృద్ధి దీన్ని మరింత వేగవంతం చేసింది. పర్యావరణ అనుకూల సుస్థిరాభివృద్ధి వైపు దృష్టి సారించాలన్న వినతులు అరణ్యరోదనే అవుతున్నాయి. పాతికేళ్ల క్రితం వై2కె సమస్యతో ప్రపంచం తలకిందులవుతుందన్న ప్రచారం జరిగింది. ఈ సమస్య పరిష్కారానికి వేల కోట్లు ఖర్చుచేయటం తప్పనిసరన్న అంచనాలు వచ్చాయి. తీరా చాలా సులభంగానే దానికి పరిష్కారం దొరికింది. నిజానికి ఆ రోజుల్లో కంప్యూటర్ల వాడకం, వాటిపై ఆధారపడటం ఇప్పటితో పోలిస్తే తక్కువనే చెప్పాలి. కానీ తరచు సైబర్ దాడులతో తల్లడిల్లే సమా చార సాంకేతిక ప్రపంచంలో తాజా ఉదంతం ఒక పెద్ద కుదుపు. అప్రమత్తంగా లేకపోతే, విడుదల చేసేముందు ఒకటికి పదిసార్లు పరీక్షించి చూసుకోనట్టయితే ఒక సాఫ్ట్వేర్ ఎంతటి ఉత్పాతం సృష్టించగలదో తాజా ఉదంతం ఒక హెచ్చరిక. ఇంతవరకైతే ఫర్యాలేదు. కానీ దాదాపు అన్ని దేశాల రక్షణ వ్యవస్థలూ ఐటీతో ముడిపడివున్న వర్తమానంలో పొరపాటున సాఫ్ట్వేర్ లోపంతో కంప్యూటర్లు తప్పుగా అర్థం చేసుకుంటే పెనుముప్పు ఏర్పడుతుంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే మారణా యుధాలు భూగోళాన్ని వల్లకాడు చేస్తాయి. ఆ విషయంలో అప్రమత్తత అవసరం. -
ఐటీ ఆదాయాల్లో 3–5 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3–5 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్ తెలిపింది. ‘వృద్ధి వేగం పుంజుకునే వరకు ఈ రంగంలో నియామకాలు సమీప కాలంలో స్తబ్ధుగా ఉంటాయి. ఆదాయ వృద్ధిపై ఆందోళనల మధ్య కంపెనీల లాభదాయకత స్థితిస్థాపకంగా ఉంటుంది. 250 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ రంగానికి 2024–25లో నిర్వహణ లాభాల మార్జిన్లు 21–22 శాతానికి వస్తాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో పరిశ్రమ కేవలం 2 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. వాస్తవానికి 3–5 శాతం ఆదాయ వృద్ధి ఉంటుందని పరిశ్రమ గతంలో అంచనా వేసింది. 2022–23 ఏప్రిల్–డిసెంబర్లో ఇది 9.2 శాతం సాధించింది. యూఎస్, యూరప్‌లోని కీలక మార్కెట్లలో స్థిర, స్థూల ఆర్థికపర ఎదురుగాలుల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు ఐటీపై తక్కువ వ్యయం చేయడంతో 2024–25లో కూడా స్వల్ప ఆదాయ వృద్ధి అంచనాలకు దారితీసింది’ అని తెలిపింది. సగటు అట్రిషన్ 12–13 శాతం.. ‘క్లిష్ట వ్యయాలు, వ్యయ నియంత్రణ ఒప్పందాలు కొనసాగనున్నాయి. ఇది భారతీయ ఐటీ సేవల కంపెనీల వృద్ధి అవకాశాలకు కొంతవరకు మద్దతునిస్తుంది. బలమైన ఆర్డర్ బుక్స్, వివిధ దశల్లో ఉన్న డీల్స్.. స్థూల ఆర్థికపర ఎదురుగాలులు తగ్గిన తర్వాత ఊపందుకుంటాయి. కార్పొరేట్ సంస్థలకు మహమ్మారి తర్వాత మొత్తం మూలధన కేటాయింపులకు టెక్ ఖర్చులు మరింత సమగ్రంగా మారాయి. నియామక కార్యకలాపాలు స్తబ్ధుగా ఉంటాయని అంచనా వేస్తున్నప్పటికీ అట్రిషన్ స్థాయిలు సమీప కాలంలో స్థిరపడతాయి. -
చైల్డ్ పోర్నోగ్రఫీపై ఆ తీర్పు దుర్మార్గం: సుప్రీం
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేయడం, చూడటం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు దుర్మార్గంగా అభివర్ణించింది. ఆ తీర్పుపై విచారణ జరిపేందుకు అంగీకరించింది. చెన్నైకి చెందిన ఎస్.హరీశ్(28) పిల్లలతో కూడిన పోర్నోగ్రఫీ కంటెంట్‌ను తన సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాడంటూ పోలీసులు కేసు పెట్టారు. దీనిపై హరీశ్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లాడు. విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం పోక్సో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను డౌన్లోడ్ చేయడం, చూడటం నేరం కాదని పేర్కొంటూ జనవరి 11వ తేదీన తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ ఫరీబాద్కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయెన్, ఢిల్లీకి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఎన్జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పు చట్టాలకు వ్యతిరేకం, దుర్మార్గమని పేర్కొంది. ఏకసభ్య ధర్మాసనం ఇలాంటి తీర్పు ఎలా ఇవ్వగలదని ప్రశ్నించింది. -
మరో నిఘా నేత్రం?
నిత్యం ఏవో కళ్ళు మనల్ని గమనిస్తున్నాయంటే ఎలా ఉంటుంది? చేతిలోని మన చరవాణి సైతం చటుక్కున ప్రత్యర్థిగా మారిపోయే ప్రమాదం ఉందని తెలిస్తే ఏమనిపిస్తుంది? ఫోన్లలోని కీలక సమాచారాన్ని చేజిక్కించుకొనేందుకు ‘పాలకవర్గ ప్రాయోజిత ఎటాకర్లు’ ప్రయత్నిస్తున్నారంటూ ఆపిల్ సంస్థ అక్టోబర్ 31న పంపిన అప్రమత్తపు ఈ–మెయిల్స్‌తో అదే జరిగింది. ఐ–ఫోన్లు వాడుతున్న పలువురు ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులే కాదు... ప్రపంచమంతా ఉలిక్కిపడింది. వ్యక్తిగత డేటా, గోప్యతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేశవ్యాప్తంగా ఆపిల్ ఐ–ఫోన్ వినియోగదారులు పలువురికి ఇలా పారాహుషార్ సందేశాలు అందడం తేలికైన విషయమేమీ కాదు. సహజంగానే కేంద్ర ఐటీ శాఖ మంత్రి ప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడుతోందనే ఆరోపణల్ని కొట్టిపారేశారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామన్నారు. ఈ అప్రమత్తత నోటిఫికేషన్లు పంపిన టెక్ దిగ్గజం ఆపిల్‌కు నోటీసులిచ్చి, సహకరించాల్సిందిగా కోరారు. ఫోన్లు – కంప్యూటర్ల హ్యాకింగ్, పాలకపక్షాల గూఢచర్యం ఆధునిక సాంకేతిక యుగం తెచ్చిన అతి పెద్ద తలనొప్పి. ఇది అనేక దేశాల్లో గుట్టుగా సాగుతూనే ఉంది. పులు కడిగిన ముత్యాలమని చెప్పుకొనే పాలకవర్గాలు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా యన్నది కీలకం. డేటా లీకేజీలు, గూఢచర్య సాఫ్ట్వేర్ వినియోగాలు మనకూ కొత్త కావు. దేశంలో ఇజ్రాయెలీ గూఢచర్య సాఫ్ట్వేర్ ‘పెగసస్’ వినియోగం సహా పలు ఆరోపణలపై గతంలో విచారణలు జరిగాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగబోవని హామీలూ వచ్చాయి. అన్నీ నీటిమూటలే. పెగసస్ సాఫ్ట్వేర్ కొనలేదని ప్రభుత్వం తోసిపుచ్చినా, కొత్త గూఢచర్య సాఫ్ట్వేర్ల కొనుగోలుకు భారత్ ఉత్సుకత చూపుతుందని విదేశీ పత్రికల్లో విశ్వసనీయ కథనాలు వచ్చాయి. సుప్రీం కోర్ట్ నియమించిన కమిటీ కొన్ని ఫోన్లను పరిశీలించి, పెగసస్ వినియోగంపై కచ్చితమైన సాక్ష్యాధారాలు లభించలేదని చెబుతూనే, ఈ దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని కుండబద్దలు కొట్టింది. అందుకే, తాజా విచారణపైనా అపనమ్మకం వ్యక్తమైతే తప్పుపట్టలేం. తాజా అప్రమత్త సందేశాలు పంపడానికి కారణాలను ఆపిల్ వివరించిన తీరూ అస్పష్టంగా ఉంది. అది సమగ్రంగా కారణాలను వివరించాల్సింది. అసలు ‘పాలకవర్గ ప్రాయోజిత’ ఎటాకర్లు అనే పదానికి ఆ సంస్థ చెబుతున్న వ్యాఖ్యానం, జనానికి అర్థమవుతున్న టీకా తాత్పర్యం వేర్వేరు. పుష్కలంగా నిధులు, వ్యవస్థీకృత సామర్థ్యం, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలున్నవన్నీ ఆ వర్గం కిందకు వస్తాయన్నది ఆపిల్ మాట. ప్రభుత్వ జోక్యం లేనిదే అది అసాధ్యమనేది అందరికీ తెలుసు. అందుకే, తాజా రగడపై అటు భారత అటు ప్రభుత్వం, ఇటు ఆపిల్ క్రియాశీలంగా వ్యవహరించాలి. వినియోగదారుల్ని అప్రమత్తం చేయడమే నేరమన్నట్టు ప్రభుత్వం, ఆపిల్ చెవులు మెలేస్తే దేశంలో పెట్టుబడులకు ప్రతికూల వాతావరణమే మిగులుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 శాతం మంది ఆపిల్ ఐ–ఫోన్లు వాడుతుంటే, వారిలో 7 శాతం మన దేశంలోనే ఉన్నారు. తమ ఉత్పత్తులు పూర్తి సురక్షితమనీ, హ్యాకింగ్ అవకాశం అత్యల్పమనీ, ఆ యా దేశాల ప్రభుత్వాల పక్షాన తాము గూఢచర్యానికి ఎన్నడూ పాల్పడబోమనీ ఆపిల్ కూడా నమ్మకం కలిగించాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటైన పార్లమెంటరీ సంఘం తక్షణం సమావేశమై, ఆపిల్ సందేశాలపై విచారణ జరపాలంటూ ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. అయితే, ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఫోన్ల హ్యాకింగ్ వాదనను ‘యాక్సెస్ నౌ’ సంస్థ సమర్థిస్తోందనీ, కోటీశ్వరుడైన అమెరికన్ ఫైనాన్షియర్ జార్జ్ సోరోస్‌కు ఆ సంస్థలో పెట్టుబడులున్నాయి గనక ఆయనకు ఈ హ్యాకింగ్ వివాదంతో సంబంధం ఉందనీ అధికార బీజేపీ ఐటీ విభాగాధిపతి ఆరోపించారు. పాలక వర్గాలపై ఆరోపణలు వచ్చినప్పుడు అవి నిరాధారమని నిరూపించి, నిజాయతీని నిరూపించు కోవాలి. అది వదిలేసి బోడిగుండుకూ, మోకాలుకూ ముడిపెడితే ప్రయోజనం శూన్యం. అదే సమ యంలో ఇచ్చిన సమాచారంపై దృష్టిపెట్టకుండా, తెచ్చిన వార్తాహరుడిపై కత్తులు నూరితే కష్టం. ఆపిల్ అప్రమత్తతకు సరిగ్గా ఒక రోజు ముందరే మన ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్’ నుంచి దాదాపు 80 కోట్ల మంది పౌరుల ఆధార్ వివరాలు లీకయ్యాయి. దీనిపైనా లోతైన విచారణ జరపాల్సి ఉంది. ఆధార్ వివరాలు నమోదు చేసే ‘యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ సర్వర్ కట్టుదిట్టమైనదే. కానీ, ఇతర మార్గాల్లో వివరాలు బయటకు పొక్కుతున్నాక ఇక గోప్యతకు అర్థమేముంది! వ్యక్తిగత డిజిటల్ డేటా రక్షణపై ఇటీవలే చట్టం చేసిన ప్రభుత్వం సమాచార సేకరణ, నిల్వ, వినియోగంపై కట్టుదిట్టమైన నియమావళి సత్వరం తీసుకురావాలి. ప్రజాస్వామ్యానికి కీలకమైన ప్రతిపక్షాలు, పాత్రికేయులపై నిఘా పెట్టి, పౌరుల ప్రాథమిక హక్కయిన గోప్యతను తుంగలో తొక్కాలనుకుంటే అది ఘోరం. ఈ వ్యవహారంపై ప్రజల్లో చైతన్యం పెంచి, ఇలాంటి ఉల్లంఘనల్ని ప్రతిఘటించేలా సంసిద్ధం చేయాలి. పాలకపక్షాలు ఈ ఆరోపణల్లోని నిజానిజాల నిగ్గు తేల్చాలి. పదేపదే ఆరోపణలు వస్తున్నందున వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం వాటిల్లకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిష్కార మార్గాల అన్వేషణే కాదు... ఆచరణలోనూ ప్రజలందరికీ నమ్మకం కలిగించాలి. గోప్యత ఉల్లంఘన జరిగినట్టు తేలితే, కఠిన చర్యలు చేపట్టాలి. అలాకాక, రెండేళ్ళ క్రితం నాటి ‘పెగసస్’ లానే దీన్ని కూడా చాప కిందకు నెట్టేయాలని పాలకులు ప్రయత్నిస్తేనే చిక్కు. రాజకీయ రచ్చగా మారుతున్న తాజా వ్యవహారంలో అసలు సంగతి వదిలేసి, కొసరు విషయాలు మాట్లాడుకుంటే ఎన్నటికీ ఉపయోగం లేదు. -
పార్లమెంటరీ ‘చర్చ’ జరగాల్సిందే
న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల ఐఫోన్లపైకి ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు దాడికి తెగబడ్డారన్న ఆరోపణలను విపక్షాలు తీవ్రతరం చేశాయి. ఈ అంశంపై పార్లమెంటరీ స్థాయి సంఘంలో చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంశంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘానికి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టస్‌లు లేఖ రాశారు. స్టాండింగ్ కమిటీని అత్యవసరంగా సమావేశపరిచి హెచ్చరిక అలర్ట్‌లు అందుకున్న ఎంపీలతోపాటు ఐఫోన్ తయారీదారు యాపిల్ సంస్థ ప్రతినిధులనూ చర్చకు పిలవాలని లేఖలో డిమాండ్‌చేశారు. స్థాయి సంఘంలో చర్చకు అధికార బీజేపీ ససేమిరా అంటోంది. ‘ యాపిల్ సబ్స్రైబర్లకు సంబంధించిన ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. హ్యాకింగ్ దాడిని ఎదుర్కొన్నాయంటున్న ఐఫోన్లను చెక్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులది. ఈ అంశాన్ని స్థాయీ సంఘంలో చర్చించాల్సిన అవసరమే లేదు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రాన్ని వేలెత్తిచూపుతున్నారు: చిదంబరం గతంలో పెగసస్ సాఫ్ట్వేర్ సాయంతో దేశంలో పలు రంగాల వ్యక్తులపై కేంద్రప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణల నడుమ ఐఫోన్ల హ్యాకింగ్ వెలుగుచూడటంతో అందరూ సహజంగానే కేంద్రప్రభుత్వం వైపే వేలెత్తిచూపుతారని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ‘2019లో పలువురు సామాజిక కార్యకర్తలు, విపక్ష సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, జడ్జీల ఫోన్లపై పెగసస్ సాఫ్ట్‌వేర్‌తో కేంద్రం నిఘా పెట్టిందని దేశమంతటా కలకలం రేగడం తెల్సిందే. ఇప్పుడు వందలాది విపక్ష నేతలకు యాపిల్ ఐఫోన్ హ్యాకింగ్ అలర్ట్‌లు వచ్చాయనేది వాస్తవం. కేవలం విపక్ష నేతలకు మాత్రమే ఎందుకొచ్చాయి? హ్యాకింగ్ వల్ల భారీ ప్రయోజనం ఒనగూరేది ఎవరికి ?. ఈ ప్రశ్నలు తలెత్తినపుడు అందరూ అనుమానంతో కేంద్ర నిఘా సంస్థలవైపే వేలు చూపిస్తారు. ఎందుకంటే అనుమానించదగ్గ సంస్థలు అవి మాత్రమే’ అని చిదంబరం ఆరోపించారు. రక్షణ కలి్పంచండి: లోక్‌సభ స్పీకర్‌కు మొయిత్రా లేఖ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్ల దాడుల నుంచి విపక్ష ఎంపీలను రక్షించాలని లోక్‌సభ స్పీకర్ బిర్లాను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కోరారు. ఈ మేరకు బిర్లాకు ఆమె లేఖ రాశారు. నిఘాకు రూ.1,000 కోట్లు! ‘అంతర్జాతీయ సంస్థలైన యాక్సెస్ నౌ, సిటిజెన్ ల్యాబ్ వంటి సంస్థలు సెపె్టంబర్‌లోనే ఇలాంటి యాపిల్ సంస్థ జారీచేసే హెచ్చరిక నోటిఫికేషన్ల విశ్వసనీయతను నిర్ధారించాయి. ఇంటెలెక్సా అలయెన్స్ వంటి సంస్థలతో కలిసి నిఘా కాంట్రాక్ట్‌లను కుదుర్చుకునేందుకు భారత ప్రభుత్వం తన బడ్జెట్ కేటాయింపులను పెంచుకుంటోందని ఇటీవలే ‘ది ప్రెడేటర్ ఫైల్స్’ పేరిట ఫైనాన్షియల్ టైమ్స్ ఒక పరిశోధనాత్మక సమగ్ర కథనాన్ని వెలువరిచింది. ఈ నిఘా ఒప్పందాల విలువ దాదాపు 1,000 కోట్లు ఉంటుందని అంచనావేసింది’ అని మొయిత్రా తన లేఖలో పేర్కొన్నారు. 2014 తర్వాత ఏదైనా నిఘా సాఫ్ట్‌వేర్‌ను కొన్నదీ లేనిదీ కేంద్రం బయటపెట్టాల్సిందేనని స్వతంత్ర రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ డిమాండ్‌చేశారు. కాగా, అలర్ట్ ఘటనపై వివరణ కోరుతూ యాపిల్ సంస్థకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టం
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ‘నల్సార్’న్యాయ విశ్వవిద్యాలయంతో కలిసి దేశంలోనే మొదటిసారిగా సైబర్ క్రైమ్ చట్టాన్ని తెస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తామని తెలిపారు. తెలంగాణ చేయబోయే సైబర్‌క్రైమ్ చట్టంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు. సోమవారం టీ–హబ్ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ‘రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం 2022–23’వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఐటీ రంగ వృద్ధికి సంబంధించిన అన్ని సూచీల్లో రాష్ట్రం జాతీయ సగటును దాటుకొని వేగంగా ముందుకు పోతోందని చెప్పారు. బెంగళూరుకు దీటుగా హైదరాబాద్‌ను నిలబెడతామని రాష్ట్ర అవతరణ సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టామన్నారు. కేంద్రం నుంచి సాయం అందకున్నా.. కరోనా సమయంలోనూ, ఆ తర్వాత కూడా అనేక అనుమానాలు ఎదురైనా, కేంద్రం నుంచి సహాయ నిరాకరణ జరిగినా తెలంగాణ తన సొంత ప్రణాళికలతో ఐటీ రంగంలో అభివృద్ధి సాధిస్తూ వస్తోందని కేటీఆర్ చెప్పారు. పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే 9 ఏళ్లుగా ఐటీ శాఖ వార్షిక నివేదికలను విడుదల చేస్తున్నామని వివరించారు. అమెరికా, యూకే పర్యటనలో తాను సాధించిన పెట్టుబడి ప్రకటనలను, గత ఏడాది కాలంలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు, కొత్త ఉద్యోగాల కల్పన వివరాలను కేటీఆర్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో కొత్త శిఖరాలకు చేరుకుంటామని.. ప్రాథమిక మౌలిక వసతుల నుంచి అంతరిక్షం దాకా తెలంగాణ శరవేగంగా పురోగమిస్తోందని చెప్పారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని, కేసీఆర్ మరోమారు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టి పోషిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. ఫార్మా, బయోటెక్నాలజీలోనూ అద్భుత ప్రగతి ఫార్మా, బయో టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని కేటీఆర్ చెప్పారు. 2012లో కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రకటించినప్పుడు తెలంగాణలో ఐటీ ఎగుమతులు 2032 నాటికి రూ.2.5లక్షల కోట్లకు చేరుతాయని ప్రకటించిందని.. ఐటీఐఆర్ అమలు చేయకున్నా ఆ గడువుకు 9 ఏళ్ల ముందే లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పారు. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ రంగం మెరుగ్గా రాణిస్తోందని వివరించారు. లైఫ్ సైన్సెస్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాస్‌రావు, వీ హబ్ సీఈఓ దీప్తిరావు, పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వాట్సాప్‌లో అసలేం జరుగుతోంది.. మండిపడ్డ యూజర్ - సంస్థ రిప్లై ఇలా!
సాక్షి, న్యూఢిల్లీ: వాట్సాప్ వినియోగదారుల వ్యక్తిగత గోప్యతపై కొద్ది రోజులుగా సందేహాలు తలెత్తుతున్నాయి. వాట్సాప్ యాప్ వాడకంలో లేనప్పుడు కూడా వినియోగదారుల అనుమతి లేకుండా ఫోన్లో మైక్రోఫోన్‌ను సంస్థ యాక్సెస్ చేస్తోందన్న ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అసలేం జరిగింది? ‘నేను ఫోన్ వాడకున్నా సరే వాట్సాప్ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో నా మొబైల్ మైక్రోఫోన్‌ను వాడుతోంది. నిద్రపోయి ఉదయం ఆరింటికి లేచా. అప్పుడూ మైక్రోఫోన్ దుర్వినియోగం అవుతోంది. అసలేం జరుగుతోంది?’ అంటూ ఇంజనీరింగ్ డైరెక్టర్ ఫోడ్ డబిరి శనివారం ట్వీట్‌చేశారు. దీనికి 6.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీనిపై ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు. ‘నథింగ్ ట్రస్ట్.. నాట్ ఈవెన్ నథింగ్’ (దేన్నీ నమ్మొద్దని, ఏం కాదని) అంటూ ఆయన ట్విట్ చేశారు. మరోవైపు ఈ ట్వీట్‌పై.. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ‘‘ఇది గోప్యతపై దాడి. దీనిపై వెంటనే విచారణ జరిపిస్తాం. గోప్యతకు భంగం వాటిల్లినట్లు తేలితే చర్యలు తప్పవు’ అంటూ ట్వీట్ చేశారు. కొన్ని నివేదికల ప్రకారం వాట్సాప్ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేస్తోంది. ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోఫోన్, కెమెరా వంటి ప్రైవసీ సూచికలను ఏదైనా యాప్ యాక్సెస్ చేసినప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో గ్రీన్ నోటిఫికేషన్ వినియోగదారుడికి హెచ్చరికగా పనిచేస్తుంది. ఖండించిన వాట్సాప్: ఈ ఆరోపణలను వాట్సాప్ ఖండించిది. డబిరి పిక్సల్ ఫోన్లోని బగ్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు చేసి పరిష్కరించాలని గూగుల్‌ను అభ్యర్థించినట్టు ట్వీట్లో చేసింది. -
AP: ‘మరో రెండు నెలల్లో పరిపాలన రాజధానిగా విశాఖ’
సాక్షి, విశాఖపట్నం: ఏపీకి కాబోయే పరిపాలన రాజధాని విశాఖపట్నం గురించి ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల్లో విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కాబోతోందని, ఏదేమైనా ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఉద్ఘాటించారు. విశాఖలో శనివారం రెండో రోజు ఇన్ఫినిటి వైజాగ్ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ‘‘దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదవ స్థానంలో ఉంది. త్వరలో అదాని డేటా సెంటర్‌ను ప్రారంభిస్తాం. విశాఖను ఐటీ హబ్ చేయడమే మా లక్ష్యం’’ అని ఆయన ప్రకటించారు. ఈ సదస్సులో మంత్రి అమర్నాథ్తో పాటు పలువురు ఐటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నవంబర్‌లో 37 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ నవంబర్‌లో దేశీయంగా 37.16 లక్షల ఖాతాలను నిషేధించింది. అంతక్రితం నెలతో పోలిస్తే ఇది 60 శాతం అధికం. అక్టోబర్‌లో 23.24 లక్షల ఖాతాలను నిషేధించింది. తాజాగా నవంబర్‌లో మిగతావారి నుంచి ఫిర్యాదులు రావడానికి ముందే క్రియాశీలకంగా వ్యవహరించి బ్యాన్ చేసిన ఖాతాల సంఖ్య 9.9 లక్షలుగా ఉందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం తమ నెలవారీ నివేదికలో వాట్సాప్ తెలిపింది. విద్వేషపూరిత, తప్పుడు సమాచార వ్యాప్తికి వేదికలుగా మారుతున్నాయంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై ఆరోపణలు వస్తుండటంతో కేంద్రం గతేడాది కఠినతర ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం 50 లక్షల పైగా యూజర్లు ఉన్న బడా డిజిటల్ ప్లాట్‌ఫాంలు తాము నిబంధనలను పాటిస్తున్నట్లు తెలిపేలా ప్రతి నెలా నివేదికను ప్రచురించాల్సి ఉంటుంది. తమకు వచ్చిన ఫిర్యాదులు, తాము తీసుకున్న చర్యల గురించి వెల్లడించాలి. దీనికి అనుగుణంగానే వాట్సాప్ తాజా నివేదికను రూపొందించింది. -
విశాఖలో ఐటీ సమ్మిట్
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్ ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నంలో వచ్చే ఏడాది జనవరిలో ఐటీ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ ఐటీ అసోసియేషన్ (ఐటాప్), ఏపీఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఏపీఐఎస్, ఎస్టీపీఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్ఫినిటీ వైజాగ్–2023 ఐటీ సమ్మిట్ పోస్టర్, వెబ్‌సైట్‌ని మంత్రి అమర్నాథ్ శుక్రవారం నగరంలో ఆవిష్కరించారు. జనవరి 20, 21 తేదీల్లో స్థానిక మారియట్ హోటల్లో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తొలి రోజున ఎస్టీపీఐ ద్వారా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, స్టార్టప్‌లతో పాటు ఐటీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని, రెండో రోజున బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం)తో పాటు ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలపై ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు, ఐటీ రంగ నిపుణులు చర్చిస్తారని వివరించారు. ఐటాప్ అధ్యక్షుడు శ్రీధర్ కొసరాజు పాల్గొన్నారు. -
ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. అక్కడ జీతంతో పాటు బెనిఫిట్స్ వింటే షాక్ అవుతారు!
దుబాయ్ అంటే అధికంగా క్రూడ్ ఆయిల్‌పై ఆధారపడే దేశంగా ఉండేది ఒకప్పుడు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచంతో పోటీ పడాలంటే ఇతర రంగాలలోనూ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. అందుకే గత కొనేళ్లుగా ఆయిల్‌తో పాటు ఇతర వ్యాపార రంగాలలోనూ పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈ జాబితాలో యూఏఈ కాస్త ముందు వరుసలో ఉందనే చెప్పాలి. ఇప్పటికే ఫార్మా నుంచి ఇన్వెస్ట్మెంట్ కంపెనీల వరకు వివిధ రంగాల కంపెనీలను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సారి కన్ను ఐటీ రంగంపై కూడా పడింది. ఐటీ రంగంపై కన్న పడింది! ఇందుకోసం సరికొత్త ప్లాన్‌తో ఐటీ కంపెనీలకు ఆఫర్లను ప్రకటించింది. యూఏఈ తెలిపిన ప్రకారం.. తమ దేశంలో అడుగుపెట్టే కంపెనీలకు వేగంగా వ్యాపార లైసెన్స్‌లతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్‌కు సంబంధించి కూడా సులభమైన రీతిలో పనులు పూర్తి కానున్నాయి. అంతేకాకుండా అందులో పని చేసే ఉద్యోగులకు దీర్ఘకాలిక పౌరసత్వాన్ని కూడా అందించనుంది. దీని ద్వారా ఆసియా, యూరప్‌లోని టెక్ కంపెనీలను ఆకర్షించాలని యోచిస్తోంది. ఆ కంపెనీలోని ఉద్యోగులకు 10 ఏళ్ల పాటు గోల్డెన్ వీసా, ఉండటానికి స్థలం, పిల్లలకు పాఠశాల వంటి సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. దీనిపై యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి థానీ అల్ జెయోడీ మాట్లాడుతూ.. జూలైలో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా గల్ఫ్ దేశం 300 కంటే ఎక్కువ డిజిటల్ సంస్థలను లక్ష్యంగా పెట్టుకుందని, దాదాపు 40 కంపెనీలు తరలింపు ప్రక్రియలో ఉన్నాయన్నారు. ఇప్పటికే బ్యాంకర్లు, హెడ్జ్ ఫండ్ మేనేజర్లు, కమోడిటీ వ్యాపారులకు అనువైన ప్రదేశంగా యూఏఈ పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. చదవండి: మైండ్‌బ్లోయింగ్ ఐడియా.. మట్టి లేకుండా వ్యవసాయం, ఏడాదికి 70 లక్షల ఆదాయం! -
తెలంగాణ ఐటి వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్
-
పల్లె వెలుగులు.. ఐటీ పరుగులు
ఇటు గ్రామాల అభివృద్ధితోపాటు.... అటు పరిశ్రమలు, ఐటీ అభివృద్ధికి ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రులు కీలకంగా వ్యవహరించనున్నారు. పంచాయతీలకు మరింత పవర్ వచ్చేలా కృషి చేస్తానని.... ఇందుకోసం వార్డు సభ్యుడి నుంచి అంచలంచెలుగా ఎదిగిన తనకు ఆ అనుభవం పనికొస్తుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అంటున్నారు. పరిశ్రమలు, ఐటీ అభివృద్ధికి రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తానని మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ హామీనిస్తున్నారు. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు దక్కేలా కృషి చేయడంతోపాటు స్థానికంగా ఉన్న వనరుల ఆధారంగా ప్రతీ నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వారు పేర్కొన్న అంశాలు ఇవే..! – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం రాబోయే రెండేళ్ల కాలంలో సాధ్యమైనంత వరకూ గ్రామాల్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతల్ని అప్పగించారనీ, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేసి రుణం తీర్చుకుంటానని బూడి ముత్యాలనాయుడు తెలిపారు. ఇంకా ఏమన్నారంటే... వార్డు సభ్యుడి స్థాయి నుంచి ఎదిగా... 1988లో వార్డు మెంబర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశాను. బహుశా నా ఈ బ్యాక్‌గ్రౌండ్ పరిశీలించే పంచాయతీరాజ్‌శాఖను నాకు ముఖ్యమంత్రి కేటాయించారని భావిస్తున్నాను. గ్రామాల్లో సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు ఏం చెయ్యాలనే అంశాలపై నాకు అవగాహన ఉంది. ఆ అనుభవం ద్వారా పంచాయతీల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. గత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహాలు, సూచనలు తీసుకొని ప్రస్తుతం చేపడుతున్న పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాను. రాబోయే రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోని అన్ని పల్లెలు ప్రకాశవంతంగా మారేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకొని దానిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తాను. ప్రస్తుతం జల్‌జీవన్ మిషన్ పథకం ద్వారా చేపడుతున్న పనుల్ని సాధ్యమైనంత వరకూ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాను. రహదారుల నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యం గ్రామీణ ప్రాంతాలకు రహదారులు అనుసంధానం చేసే అంశానికి ప్రథమ ప్రాధాన్యమిస్తాను. ప్రస్తుతం ఉన్న రోడ్ల మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణం మొదలైన పనులపై దృష్టి సారిస్తాను. మార్కెట్ సెస్ ద్వారా రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఆచరణలోకి తీసుకొచ్చి... వీలైనంత త్వరగా రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాను. ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించేందుకు కృషి ఇప్పటి వరకూ ఉపాధి హామీ నిధులతో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, వలంటీర్ల వ్యవస్థపై దృష్టి సారించాం. ఇకపై పల్లెల్లో పారిశుధ్యం మెరుగుపడేందుకు అవసరమైన చర్యలు చేపడతాం. సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు మురుగునీటి వ్యవస్థ అభివృద్ధి చేసి.. గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచి.. ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాల్ని పల్లె ప్రజలకు అందించేందుకు కృషి చేస్తాను. ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్కు స్థానికంగా ఉన్న వనరులు, వసతుల ఆధారంగా ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్లో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాననీ.. ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఇంకా ఏమన్నారంటే... పారిశ్రామిక పార్కులు...! రాష్ట్రంలో ఉన్న 26 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పారిశ్రామిక పార్కులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. స్థానికంగా ఉన్న వనరుల్ని రాబోయే పరిశ్రమలు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం. ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి ఆధారంగా చిన్న లేదా భారీ ఇండస్ట్రియల్ పార్కుల్ని ఏర్పాటు చేస్తాం. ఈ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా ఉన్న వనరులు వినియోగించుకోవడంతో పాటు అక్కడ యువతకు ప్రత్యక్షంగా ప్రజలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా కృషి చేస్తాను. విశాఖలో ఐటీ అభివృద్ధి... విశాఖపట్నంలో ప్రస్తుతం ఐటీ పరిశ్రమలు ఉన్నాయంటే అప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలవే. ఆయన మరణం తర్వాత చంద్రబాబు హయాంలో పూర్తిగా అథఃపాతాళానికి పడేశారు. మళ్లీ ఇప్పుడు కొత్త ఐటీ పాలసీతో పరిశ్రమలకు రాయితీలు అందిస్తూ... ఇప్పుడిప్పుడే సీఎం వైఎస్ జగన్ ఊపిరిపోస్తున్నారు. విశాఖను ఐటీ హబ్‌గా చెయ్యాలన్నది ముఖ్యమంత్రి సంకల్పం. దానికనుగుణంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు నిరంతరం శ్రమిస్తాను. ఇక రాష్ట్రంలో ఫార్మా రంగం అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తాను. ప్రస్తుతం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలతో పాటు ఫార్మాస్యుటికల్ పరిశ్రమలు కూడా ఉన్నాయి. వీటిని మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటాను. స్థానిక ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ పర్యావరణ హితంగా ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేస్తాను. దుబాయ్ ఎక్స్పో ఒప్పందంలోని పరిశ్రమల రాకకు కృషి... గౌతమ్‌రెడ్డి నిర్వర్తించిన శాఖ బాధ్యతను నాకు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన హయాంలో పైప్‌లైన్‌లో ఉన్న పరిశ్రమలు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం. దుబాయ్ ఎక్స్‌పోలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వీలైనంత త్వరగా గ్రౌండింగ్ అయ్యేందుకు పాటుపడతాను. అదే ఆయనకు అర్పించే నివాళి. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తే విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని తీరప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి. పోర్టులు, ఎయిర్‌పోర్టుల్ని పూర్తి చేస్తాం... గతంలో ఏ ప్రభుత్వం అభివృద్ధి చేయని విధంగా రాష్ట్రంలో ఉన్న తీరప్రాంత అనుకూలతను ఉపయోగించుకునేలా పోర్టులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా విమానాశ్రయాల అభివృద్ధి జరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులతోపాటు ఎయిర్‌పోర్టుల్ని వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాను. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు త్వరితగతిన ప్రారంభించేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై దృష్టి సారిస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన అనుమతుల్ని త్వరగా తీసుకొచ్చి ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను. -
డిమాండ్‌లో ఉన్న టెక్ స్కిల్స్!! అత్యధిక జీతం అందించే 'సాఫ్ట్వేర్ ఉద్యోగాలు' ఇవే!
సాఫ్ట్వేర్ జాబ్ చేయడం మీ కలనా? అయితే మీకో శుభవార్త. సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంటుంది. కానీ ఏ కోర్స్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఏ కోర్స్ చేస్తే ఎంత శాలరీ వస్తుంది. ఈ కోర్స్ చేయడం మంచిదేనా అంటూ ఇలా రకరకాల అనుమానాలతో సందిగ్ధతకు గురవుతుంటారు. అలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ ఇటీవల జరిగి ఓ సర్వే రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే ఎలాంటి కోర్స్‌లు నేర్చుకుంటే భవిష్యత్ బాగుంటుందనే విషయాల్ని వెల్లడించింది. '2022 టెక్ స్కిల్స్ అండ్ ట్రెండ్స్ రిపోర్ట్' పేరుతో ఇటీవల వెలుగులోకి వచ్చిన సర్వే ప్రకారం.. 2019-2021 మధ్య 2లక్షలకు పైగా అసెస్మెంట్ల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా, సాంకేతిక నైపుణ్యాలు నిరంతరం అభివృద్ధి చెందుతూ, డిజిటలైజేషన్ ప్రక్రియ వ్యాపార కోణాన్ని మారుస్తోందని నివేదిక గుర్తించింది. అందువల్ల, జావా, జావాస్క్రిప్ట్, ఎస్‌క్యూఎల్ డెవలపర్లు ఈ సంవత్సరంలో అన్ని టెక్ విభాగాల్లో డిమాండ్ ఉన్న స్కిల్‌గా భావిస్తున్నారు. ఫ్రంటెండ్, బ్యాకెండ్ ఫుల్ స్టాక్ డెవలపర్లకు బీభత్సమైన డిమాండ్ ఉంది. అయితే డేటా సైన్స్, ఏడబ్ల్యూఎస్, ఎజెడ్యూఆర్ఈAzure, ఎస్‌క్యూఎల్, డేటా విశ్లేషణ, క్లౌడ్ సిస్టమ్, ఆటోమేషన్, డేటా సైన్స్, వెబ్ ప్రోగ్రామింగ్ తో పాటు డేటా విజువలైజేషన్లో ఉపయోగించడం వల్ల పైథాన్ అత్యంత ప్రజాదరణ పొందిన కోడింగ్‌గా ఉద్భవించిందని సర్వేలో తేలింది. -
సామాజిక సమస్యలకు టెక్నాలజీతో పరిష్కారాలు
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు టెక్నాలజీ ఆధారంగా పరిష్కారం చూపేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలోని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ముందుకు రావడం అభినందనీయమని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. టీ–హబ్‌లో నిర్వహించిన టీటా గ్లోబల్ సింపోజియంను ఆదివారం ప్రారంభించిన అనంతరం నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. 50 దేశాల నుంచి పలువురు టెక్కీలు, టీటా సభ్యులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్న ఈ జనరల్ బాడీని మంత్రి ప్రారంభించారు. అగ్రికల్చర్లో టెక్నాలజీ అనుసంధానం ఎలా అనే అంశంపై టీటాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కృషి చేయడం అభినందనీయమని ప్రశంసించారు. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తల సారథ్యంలోని యువ ఇంజినీర్లకు తమ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీఇచ్చారు. కేసీఆర్ వంటి విజన్ గల నేత, కేటీఆర్‌లాంటి మంత్రి ఉండటం అదృష్టమన్నారు. అహంకారం లేని సంస్కారంతో కూడిన జ్ఞానాన్ని పంచకలిగే వ్యక్తులను తయారుచేయాలని టీటాకు సూచించారు. అప్లికేషన్ వాడుకునే పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఐటీలో తన మనవడు బెటర్ టీచర్ అని చమత్కరించారు. ఐహబ్ చైర్మన్ కల్పన మాట్లాడుతూ అన్నదాతలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు ఉత్తమమార్గంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సందీప్ మఖ్తల మాట్లాడుతూ, 12 ఏళ్లుగా 50 దేశాలకు పైగా టెక్కీలతో టీటా సింపోజియంను ఏటా నిర్వహిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, లెఫ్టినెంట్ కల్నల్ బిక్షపతి, ప్రత్యూష, రమేశ్ తదితరులు మాట్లాడారు. -
ఐటీయే మేటి; టాప్ కంపెనీల్లో ప్లేస్మెంట్ కోసం 2.41 లక్షల మంది పోటీ
సాక్షి, అమరావతి: ప్రధాన ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు ఏపీ రాష్ట్ర విద్యార్థులు గురి పెట్టారు. వీరికి ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ(అపిట) కూడా తగిన శిక్షణ, సహకారం అందజేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. ఇప్పటికే క్యాప్ జెమిని కోసం 50,000 మంది, డెలాయిట్‌లో ఉద్యోగాల కోసం 18,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ కంపెనీలకు సంబంధించిన నమోదు ప్రక్రియ జరుగుతున్నట్లు రాష్ట్రంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ వ్యవహారాలను పర్యవేక్షించే అపిట సీఈవో అనిల్ తెంటు తెలిపారు. అత్యధికంగా ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగాల కోసం 75,000 మంది నమోదు చేసుకుంటారని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. టీసీఎస్ కోసం 50,000, హెచ్‌సీఎల్ కోసం 48,000 మంది దరఖాస్తులు దాఖలు చేసుకునే అవకాశం ఉందన్నారు. మొత్తంగా టాప్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఈ ఏడాది 2.41 లక్షల మంది పోటీ పడే అవకాశముందని తెలిపారు. కాగా, గతేడాది ఐటీ హై ఎండ్ రంగంలో అపిట ద్వారా 4,507 మందికి ఉద్యోగాలు లభించాయి.. అందులో ఒక్క ఇన్ఫోసిస్ సంస్థే 4,209 మందిని తీసుకుందని పేర్కొన్నారు. అపిట.. ‘హైఎండ్’ శిక్షణ అధిక జీతాలను అందించే హైఎండ్ టెక్నాలజీ కోర్సుల శిక్షణపై అపిట ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం వివిధ సంస్థలతో ఒప్పందం చేసుకొని.. నూతన టెక్నాలజీలపై విద్యార్థులకు శిక్షణ అందజేస్తోంది. ఈ ఏడాది బ్లాక్ చైన్, ఫుల్ స్టాక్ జావా, ఐవోటీ, 3డీ టెక్నాలజీ, డీకోడ్ హ్యాకథాన్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. బ్లాక్ చైన్ టెక్నాలజీలో కనీసం 3,000 మందికి శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం ఢిల్లీలోని కామన్ వెల్త్ ఆఫ్ మీడియా అండ్ లెర్నింగ్ స్టడీస్ అనే సంస్థతో అపిట ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కోర్సులకు శిక్షణ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. అలాగే నాంది ఫౌండేషన్ సహకారంతో ఐవోటీ, 3డీ టెక్నాలజీ.. డీకోడ్ హ్యాకథాన్‌పై శిక్షణ ఇచ్చేందుకు డీకోడ్ గ్లోబల్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐటాప్) సహకారంతో ఫుల్‌స్టాక్ జావాపై 1,500 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. గతేడాది ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ కోసం 29,222 మంది శిక్షణ తీసుకోగా.. టీసీఎస్ కోసం 260 మంది శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా.. విద్యార్థులు ప్రారంభంలోనే అధిక వేతనాలు అందుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు అనిల్ తెలిపారు. -
లక్ష కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను 1 లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ. 75 లక్షల కోట్లు) ఎకానమీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 2 డిజిటల్ దేశాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని నిర్దేశించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వచ్చే 25 ఏళ్ల ప్రణాళికలను మంత్రి వివరించారు. ప్రభుత్వ సర్వీసులను మరింతగా డిజిటలీకరించడం, సమ్మిళిత వృద్ధికి తోడ్పడేలా అస్పష్టతకు తావు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చట్టాలను రూపొందించడం వంటి అంశాలపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెడుతోందని ఆయన చెప్పారు. ఇంటర్నెట్, టెక్నాలజీలు సురక్షితంగా, విశ్వసనీయంగా. అందరికీ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ‘‘కొంగొత్త టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, క్వాంటమ్ కంప్యూటింగ్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, సైబర్ సైక్యూరిటీ లాంటి అనేక విభాగాల్లో మనం లీడర్లుగా ఎదగాలి’’ అని మంత్రి ఆకాంక్ష వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రభుత్వ సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చే అంశంలో మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్ని చెప్పారు. ప్రస్తుతం సర్వీసులు వివిధ మాధ్యమాల ద్వారా లభిస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఎక్కడైనా ఏ సర్వీస్ అయినా, ఏ మాధ్యమంలోనైనా లభించే పరిస్థితి రావాలని ఆయన పేర్కొన్నారు. అటు సైబర్ సెక్యూరిటీపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అదనపు కార్యదర్శి రాజేంద్ర కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంలో భారత్.. ప్రపంచంలోనే 10వ స్థానం లో ఉందని ఆయన తెలిపారు. గడిచిన మూడేళ్లుగా సైబర్ సెక్యూరిటీ అంశంలో భారత్ గణనీయంగా పురోగతి సాధించిందని వివరించారు. -
నిపుణుల వేటలో టాప్ 5 కంపెనీలు.. మొదటి 9 నెలల కాలంలో..
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల్లో కొలువుల సందడి నెలకొంది. కంపెనీలు భారీగా నియామకాలను చేపడుతున్నాయి. కరోనా తర్వాత ఐటీ, డీజిటల్ సేవలకు డిమాండ్ అధికమైంది. భారీగా కాంట్రాక్టులు వస్తుండడంతో వాటిని సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా కంపెనీలు నిపుణుల వేటలో పడ్డాయి. అగ్రగామి ఐదు ఐటీ కంపెనీలు.. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా 2021 మొదటి తొమ్మిది నెలల్లో (జనవరి–సెప్టెంబర్) 1.7 లక్షల మంది ఉద్యోగులను కొత్తగా తీసుకున్నాయి. ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) ఎక్కువగా ఉండడం కూడా కంపెనీలకు సౌకర్యంగా లేదు. అదే సమయంలో సేవలకు డిమాండ్ అద్భుతంగా ఉండడం .. ఈ రంగంలో ఉపాధి కల్పనకు దారితీస్తోంది. 2020 మొదటి తొమ్మిది నెలల కాలంలో టాప్–5 ఐటీ కంపెనీల ఉద్యోగుల సంఖ్య 1,125 మేర తగ్గడం గమనార్హం. గతేడాది మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున లాక్డౌన్లు అమలు కావడం తెలిసిందే. దీంతో కంపెనీలు కొత్త ఉద్యోగులను తీసుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. కానీ, గతేడాదికి పూర్తి భిన్నమైన వాతావారణం ఐటీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవచ్చు. కరోనాకు ముందు సంవత్సరం 2019 మొదటి తొమ్మిది నెలల్లో అగ్రగామి ఐదు ఐటీ కంపెనీలు 77,000 మందిని నియమించుకోగా.. వీటితో పోల్చి చూసినా ఈ ఏడాది నియామకాలు రెట్టింపునకుపైగా పెరిగినట్టు స్పష్టమవుతోంది. డిమాండ్ ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకోగా.. అదే సమయంలో సరఫరా పరమైన సవాళ్లను కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. అట్టిపెట్టుకోవడం సవాలే పరిశ్రమ వ్యాప్తంగా ఉద్యోగుల వలసలు పెరిగిపోయాయి. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అట్రిషన్ రేటు 20 శాతానికి పైనే ఉన్నట్టు ప్రకటించాయి. ఇదే స్థాయిలో వలసలు మరికొన్ని త్రైమాసికాల పాటు కొనసాగొచ్చని విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్గోవిల్ ఫలితాల సందర్భంగా ప్రకటించడం గమనార్హం. మధ్యస్థాయి ఐటీ కంపెనీలు సైతం ఇదే సమస్యతో సతమతం అవుతున్నాయి. సరిపడా నిపుణులు అందుబాటులో లేకపోవడం కూడా అధిక వలసలకు కారణంగా ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ సీఈవో సంజయ్ జలోనా పేర్కొన్నారు. ‘‘మా క్లయింట్లు రెండంకెల అట్రిషన్‌ను ఎదుర్కొంటున్నారు. సరిపడా ఉద్యో గులు లభించని పరిస్థితుల్లో ఎన్నో కార్యకలాపాలను ఆటోమేషన్ చేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు. ఈ సంస్థ 19.6% అట్రిషన్ రేటును ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికంలోనూ.. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలోనే టాప్–5 ఐటీ కంపెనీలు 70,000 మందికి నూతనంగా ఉపాధి కల్పించాయి. 2020 ఇదే కాలంలో 18,000 మందిని తీసుకోగా, 2019లో నియామకాలు 37,000గా ఉన్నాయి. కనీసం మరో రెండు త్రైమాసికాల పాటు అయినా ఈ స్థాయిలో డిమాండ్ కొనసాగుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 2021–22 సంవత్సరానికి కొత్తగా 40,000 మందిని తీసుకుంటామన్న టీసీఎస్.. దీన్ని కాస్తా 78,000కు పెంచింది. ఇన్ఫోసిస్ సైతం 26,000 మందికి తీసుకుంటామని, ఈ సంఖ్య ను 45,000కు సవరించింది. విప్రో కూడా 12,000 అంచనాను 26,000కు సవరించింది. -
ఐటీ శాఖ బ్రాండింగ్‌పై ప్రత్యేక దృష్టి: మంత్రి గౌతమ్ రెడ్డి
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ బ్రాండింగ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 24 కల్లా వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ల పైలట్ ప్రాజెక్టు పూర్తి చేయాలని, ఐటీ బ్రాండింగ్ కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆశించారు. ఆయన బుధవారం ‘వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల’ ఏర్పాటులో పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పైలట్ ప్రాజెక్టును 29 ప్రాంతాల్లో ప్రారంభించే దిశగా ఐటీ శాఖ కసరత్తు చేస్తుందని అన్నారు. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల విషయంలో భారీ ఎంఎన్సీ కంపెనీల నుంచి ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు.త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఐటీ శాఖ మంత్రికి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల కాన్సెప్ట్ వివరిస్తానని పేర్కొన్నారు. ఐటీకి ఏపీ చిరునామా అనేలా బ్రాండింగ్ అవసరమని, ఐటీ బ్రాండింగ్‌పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఐటీ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, ఏపీఎన్ఆర్టీ ఛైర్మన్ మేడపాటి వెంకట్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
ఐటీఐఆర్.. లేదంటే అదనపు ప్రోత్సాహకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మంత్రిత్వ శాఖ మరింత సాయం అందించాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. ఐటీఐఆర్ వంటి సమాంతర ప్రాజెక్టు లేదా అదనపు ప్రోత్సాహకాన్ని వెంటనే ప్రకటించే అంశంలో తమకు సహకరించాలన్నారు. రాష్ట్రంలో రెండురోజులుగా పర్యటిస్తున్న పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ నేతృత్వంలోని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో కేటీఆర్ బుధవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను కమిటీకి మంత్రి వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూ త్న కార్యక్రమాలు కొనసాగితే హైదరాబాద్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని పార్లమెంటరీ కమిటీ ప్రశంసించింది. తెలంగాణలో అమలవుతున్న విధానాలను ఆయా రాష్ట్రాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అంశంపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామని కమిటీ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ గవర్నెన్స్ సేవలు, ఇన్నోవేషన్ రంగంలో ఇంక్యుబేటర్ల ఏర్పాటు, టీ ఫైబర్ ప్రాజెక్టులను కమిటీ ప్రశంసించింది. ఐటీ రంగం అభివృద్ధితో పాటు ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేయడంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికి ఉపయుక్తంగా ఉంటాయని కమిటీ పేర్కొంది. విధానపర నిర్ణయాల వల్లే పెట్టుబడులు: కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ఐపాస్తో పాటు ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వచ్చా యని కేటీఆర్ పార్లమెంటరీ కమిటీకి వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేశాయన్నారు. ఐటీ రంగం అభివృద్ధి ద్వారా ఉద్యోగ కల్పనతో పాటు ఐటీ ఎగుమతులు కూడా భారీగా పెరిగాయన్నారు. ఆవిష్కరణల వాతావరణం ప్రోత్సహించేందుకు టీ హబ్, వీ హబ్, అగ్రి హబ్, బీ హబ్, రిచ్, టీ వర్క్స్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. మీ సేవ ద్వారా ప్రభుత్వ సేవలు, టి వాలెట్ ద్వారా సాధించిన మైలు రాళ్లను వివరించడంతో పాటు, ఇంటింటికీ ఇంటర్నెట్ లక్ష్యంతో చేపట్టిన టీ ఫైబర్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డ్రోన్ టెక్నాలజీ వినియోగాన్ని వివరిస్తూ సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామన్నారు. భూ పరిపాలన కోసం రూపొందించిన ధరణి ప్రత్యేకతలను వివరించారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు ఐటీ శాఖ ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్‌తో పాటు కమిటీ సభ్యులకు మంత్రి కేటీఆర్ జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. -
ఇన్ఫీకి సెప్టెంబర్ 15 డెడ్‌లైన్
న్యూఢిల్లీ: కొత్త ఐటీ (ఆదాయ పన్ను) పోర్టల్‌లో లోపాలన్నింటినీ సెప్టెంబర్ 15లోగా సరిదిద్దాలంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డెడ్‌లైన్ విధించారు. పోర్టల్ సమస్యలపై ఇన్ఫీ సీఈవో సలిల్ పరేఖ్, ఆయన బృందంతో మంత్రి సోమవారం భేటీ అయ్యారు. వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి రెండున్నర నెలలు అవుతున్నా సాంకేతిక సమస్యలు వెన్నాడుతుండటంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోపాలను పరిష్కరించలేకపోతుండటంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆదాయ పన్ను శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘పోర్టల్ విషయంలో పన్ను చెల్లింపుదారులు, నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలను సెప్టెంబర్ 15లోగా పరిష్కరించాలంటూ మంత్రి ఆదేశించారు‘ అని పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై 750 మంది పైగా సిబ్బంది పనిచేస్తున్నారని, సీవోవో ప్రవీణ్ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని నిర్మలా సీతారామన్‌కు పరేఖ్ వివరించారు. ఈ అంశంపై ఇన్ఫీ అధికారులతో నిర్మలా సీతారామన్ సమావేశం కావడం ఇది రెండోసారి. గతంలో జూన్ 22న పరేఖ్, ఇన్ఫీ సీవోవో ప్రవీణ్ రావులతో ఆమె భేటీ అయ్యారు. రిటర్నుల ప్రాసెసింగ్ వ్యవధిని 63 రోజుల నుంచి ఒక్క రోజుకి తగ్గించేందుకు, రిఫండ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొత్త పోర్టల్ రూపొందించే కాంట్రాక్టును 2019లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ దక్కించుకుంది. ఈ పోర్టల్ జూన్ 7న అందుబాటులోకి వచ్చింది. అయితే, అప్పట్నుంచీ సాంకేతిక సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. తాజాగా రెండు రోజులపాటు నిర్వహణ పనుల కోసమంటూ సైట్‌ను ఇన్ఫీ నిలిపివేసింది. -
AP: మెగా ఐటీ హబ్‌గా విశాఖ!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న పలు ఐటీ కంపెనీలు తమ యూనిట్లను విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖను ఐటీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రధానంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, ప్రస్తుత సాంకేతిక అవసరాలతోపాటు విద్యార్థులకు అవసరమైన ఐటీ పరిజ్ఞానం, నైపుణ్యాలు అందుతాయి. అంతేకాకుండా వివిధ అంతర్జాతీయ, దేశీయ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఐటీ రంగంలో వస్తున్న కొత్త కోర్సులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందిస్తారు. ఈ వర్సిటీలో రెగ్యులర్, పార్ట్‌టైమ్ ఐటీ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెడతారు. మొత్తంగా రాష్ట్ర చిత్రపటంలో విశాఖ మెగా ఐటీ హబ్‌గా అవతరించనుంది. టీడీపీ పాలనలో అటకెక్కిన ఐటీ విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తామని గత టీడీపీ ప్రభుత్వం 2014–20కి ఐటీ పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా ఏకంగా 5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తామంది. అంతేకాకుండా ఒక మిలియన్ చ.అ విస్తీర్ణంలో ఐటీ సిగ్నేచర్ టవర్‌ను నెలకొల్పుతామని ఆర్భాటంగా ప్రకటించింది. మధురవాడలోని 21 ఎకరాల స్థలంలో ఈ సిగ్నేచర్ టవర్‌ను ఏర్పాటు చేసేందుకు ఒక కన్సల్టెన్సీని కూడా నియమించింది. అయితే.. చిన్న చిన్న భవనాలను నిర్మించి ఐటీ కంపెనీలకు కేటాయిస్తామంటూ ఈ సిగ్నేచర్ టవర్ ప్రాజెక్టును మధ్యలోనే అటకెక్కించింది. తీరా భవనాలు కూడా కార్యరూపం దాల్చలేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కువగా ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల టర్నోవర్ సుమారు రూ. 2 వేల కోట్ల మేర విశాఖ జిల్లా నుంచే ఉంది. అయినప్పటికీ టీడీపీ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతోపాటు ఐటీ అభివృద్ధికి కూడా విశాఖనే కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏకంగా ఐటీ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. వైఎస్సార్ హయాంలోనే విశాఖకు 14 కంపెనీలు విశాఖలో ఐటీ అభివృద్ధికి గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విశేషకృషి చేశారు. ఆయన హయాంలోనే విశాఖపట్నానికి టెక్ మహీంద్రా, విప్రో, మెరాకిల్ సాఫ్ట్వేర్ వంటి 14 కంపెనీలు వచ్చాయి. ఇక టీడీపీ హయాంలో చిన్న చిన్న కంపెనీలను తీసుకొచ్చి రాయితీల పేరుతో దోపిడీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖను ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీ ద్వారా ఐటీ కంపెనీలకు అవసరమైన మానవవనరులు అందుబాటులోకి వస్తాయి. మన విద్యార్థులకు కూడా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వెంటనే అందించవచ్చు. – శ్రీధర్‌రెడ్డి, మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, సీఈవో, ఎండీ ప్రత్యేకంగా ఐటీ యూనివర్సిటీ ఎందుకంటే.. ► సాంకేతిక రంగంలో ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ► ప్రస్తుతం విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్నాక.. మళ్లీ ఆయా కంపెనీల అవసరాలకనుగుణంగా బయట ప్రైవేటుగా ఐటీ కోర్సులను నేర్చుకోవాల్సి వస్తోంది. ఇది వారికి ఆర్థికంగా భారంగా మారుతోంది. ► అంతేకాకుండా కాలేజీ నుంచి వచ్చిన వెంటనే అనేక మందికి ఉద్యోగాలు రావడం లేదు. ► ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయడం, మారుతున్న అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను రూపొందించడం, విద్యార్థులు మంచి ఉద్యోగాలు పొందేలా తర్ఫీదు ఇవ్వడమే లక్ష్యంగా ఐటీ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ► ఈ ప్రత్యేక యూనివర్సిటీ ద్వారా దేశ, విదేశాల్లో మన విద్యార్థులకు అపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ► అదేవిధంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి కూడా విశాఖలో ఏర్పాటు చేయబోయే రీసెర్చ్ యూనివర్సిటీ ద్వారా సహకారం అందించనున్నారు. -
ట్విట్టర్ ఆర్‌జీఓగా వినయ్ ప్రకాశ్
న్యూఢిల్లీ: భారత్‌లో కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) నిబంధనలు తాము పాటిస్తామని ట్విట్టర్ యాజ మాన్యం తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వంతో కొన్నాళ్లుగా సాగుతున్న ఘర్షణకు ముగింపు పలుకుతూ తాజాగా తన మొదటి ‘ఇండియా ట్రాన్స్పరెన్సీ రిపోర్టు’ను విడుదల చేసింది. అంతేకాకుండా నిబంధనల మేరకు రెసిడెంట్ ఫిర్యాదు అధికారిని(ఆర్జీఓ) నియమించింది. ట్విట్టర్ యాజమాన్యం ఇటీవలే చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. భారత్‌లో ట్విట్టర్ నూతన రెసిడెంట్ ఫిర్యాదు అధికారిగా వినయ్ ప్రకాశ్ నియమితులయ్యారు. దేశంలో కొత్త ఐటీ రూల్స్ మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మధ్యంతర ఫిర్యాదు అధికారిగా ధర్మేంద్ర చతుర్‌ను ట్విట్టర్ నియమించింది. కొన్ని వారాల్లోనే ఆయన తప్పుకున్నారు. వాస్తవానికి అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జెర్మీ కెస్సెల్‌ను ఇండియాలో ఫిర్యాదుల పరిష్కార అధికారిగా నియమించాలని ట్విట్టర్ తొలుత నిర్ణయించింది. అయితే, కొత్త ఐటీ నిబంధనల ప్రకారం సామాజిక వేదికల కీలక అధి కారులు భారత్‌లోనే నివసిస్తూ ఉండాలి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ యాజమాన్యం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ‘‘నాలుగో అంతస్తు, ద ఎస్టేట్, 121 డికెన్సన్ రోడ్, బెంగళూరు–560042’’ అనే చిరునామాలో తమను సంప్రదించవచ్చని ట్విట్టర్ తమ వెబ్సైట్లో పేర్కొంది. మే 26 నుంచి జూన్ 25 వరకూ 94 ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. ఐటీ రూల్స్‌తో యూజర్ల రక్షణ నూతన ఐటీ నిబంధనలతో సోషల్ మీడియా వేదికల యూజర్లకు మరింత రక్షణ లభిస్తుందని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం చెప్పారు. మరింత బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వ్యవస్థ కోసమే ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు. -
దిగొచ్చిన ట్విటర్.. ఢిల్లీ హైకోర్టు వార్నింగ్‌కు రిప్లై
కొత్త ఐటీ చట్టాల ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, నెటిజన్ల పోస్టుల విషయంలో మరింత బాధ్యతయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉన్నతాధికారులను సైతం నియమించుకోవాల్సి ఉంటుందని కొత్త రూల్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే గ్రీవెన్స్ రెడ్రెస్సల్ ఆఫీసర్(తాత్కాలిక ఫిర్యాదుల స్వీకరణ అధికారి)ను ట్విటర్ నియమించుకోకపోవడంపై ఢిల్లీ హైకోర్టు గరం అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం ట్విటర్ కోర్టుకి బదులిచ్చింది. న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు వార్నింగ్‌తో ఎట్టకేలకు ట్విటర్ దిగొచ్చింది. ఎనిమిది వారాల గడువు ఇస్తే.. గ్రీవెన్స్ రెడ్రస్సల్ ఆఫీసర్‌ను నియమిస్తామని విన్నవించింది. అంతేకాదు ఇంటీరియమ్ చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్‌ను ఇదివరకే(రెండు రోజుల క్రితమే) నియమించామని, మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్‌ను కూడా నిర్ణీత కాలవ్యవధిలో.. అది కూడా కొత్త ఐటీ రూల్స్‌కు లోబడే నియమిస్తామని కోర్టుకు వెల్లడిస్తూ.. ఎనిమిది వారాల గడువు కోరింది. కాగా, ‘మీ ఇష్టం ఉన్నప్పుడు గ్రీవెన్స్ అధికారిని నియమిస్తామంటే ఊరుకునేది లేదు’ అంటూ హైకోర్టు రెండు రోజుల క్రితం జరిగిన వాదనల్లో ట్విటర్‌పై మండిపడింది. ఈ నేపథ్యంలో ట్విటర్ సమాధానం ఇచ్చింది. ఇక ఈ మూడు పొజిషన్లకు కోసం జాబ్ ఓపెనింగ్స్ ప్రకటనలు ఇచ్చినట్లు ట్విటర్ వెల్లడించింది. ఇదిలా ఉంటే ట్విటర్ ఆ మధ్య నియమించిన తాత్కాలిక గ్రీవెన్స్ ఆఫీసర్ ధర్మేంద్ర చాతుర్.. అనూహ్యంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ పొజిషన్లో భారత్‌కు చెందిన వాళ్లనే నియమించాలనే నిబంధన కూడా ఉంది. ఇదిలా ఉంటే ట్విటర్‌కు ప్రభుత్వానికి, పోలీసులకు మధ్య నోటీసులు, కేసులతో ఘర్షణ వాతావరణం కనిపిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నివారాల్లో ట్విటర్ మీద కేసులు కూడా నమోదు అవుతున్నాయి. అందులో చైల్డ్ పోర్నోగ్రఫీతో పాటు మ్యాప్‌లు తప్పుగా చూపించడం కూడా ఉన్నాయి. -
ఏపీలో ఐటీ కాన్సెప్ట్ సిటీలు, ఇంకా మరెన్నో... ఎక్కడంటే ?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళిక రచిస్తోంది. గత ప్రభుత్వం తన ఐదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క ఐటీ పార్కు నిర్మించకపోవడంతో ఇప్పుడు రాష్ట్రంలో తమ కార్యాలయాలను ప్రారంభించడానికి ముందుకు వస్తున్న సంస్థలు స్పేస్ కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా.. విశాఖ, తిరుపతిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి అనంతపురం, తిరుపతి, విశాఖలో ఒక్కోచోట 1,000 నుంచి 2,000 ఎకరాల్లో ఐటీ కాన్సెప్ట్ సిటీలను నిర్మించాలని సంకల్పించింది. కానీ, ఇవి అందుబాటులోకి రావడానికి కనీసం రెండేళ్లు పట్టే అవకాశం ఉండడంతో తక్షణం ఐటీ స్పేస్ అందుబాటులోకి తీసుకురావాలని ఐటీ శాఖ భావిస్తోంది. ఇందుకోసం ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ (అపిటా) ఒక పటిష్ట ప్రణాళికను సిద్ధంచేస్తోంది. ఇందులో భాగంగా బిల్డర్లు, రియల్టీ అసోసియేషన్ల సహకారం తీసుకోనుంది. ఐటీ స్పేస్ వివరాలతో ప్రత్యేక పోర్టల్ రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అనువైనవి ఎక్కడెక్కడ ఎంత స్థలం అందుబాటులో ఉందన్న వివరాలతో ఒక ప్రత్యేక పోర్టల్‌ను ‘అపిటా’ అందుబాటులోకి తీసుకురానుంది. ఐటీ పార్కుల అభివృద్ధికి అందుబాటులో ఉన్న స్థలాల వివరాలతో పాటు నిర్మాణం పూర్తిచేసుకున్నవి, నిర్మాణం పూర్తికావస్తున్న భవనాల్లో ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉందన్న వివరాలను ఈ పోర్టల్‌లో పొందుపరుస్తారు. ఇందుకోసం స్థానిక బిల్డర్లు, రియల్టీ అసోసియేషన్లతో కలిసి అందుబాటులో ఉన్న భవనాలను ఎంపిక చేస్తారు. తిరుపతి, విశాఖపట్నం, అనంతపురం వద్ద ప్రైవేటు బిల్డర్లు నిర్మిస్తున్న బిల్డింగ్‌ల వివరాలను ఈ పోర్టల్‌లో ఉంచనున్నారు. అంతేకాక.. ఈ బిల్డింగ్‌ల చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులు, స్కూళ్లు, రెస్టారెంట్లు వంటి వాటి వివరాలను కూడా అందులో పేర్కొంటారు. మరో రెండు వారాల్లో బిల్డర్లతో సమావేశం కావడానికి ‘అపిటా’ అధికారులు రంగం సిద్ధంచేస్తున్నారు. కాగా, ఐటీ కంపెనీలు, బిల్డర్లకు మధ్యలో అపిటా కేవలం అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరిస్తుందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి ‘సాక్షి’కి వివరించారు. శాటిలైట్ ఆఫీసులు కోవిడ్ తర్వాత వర్క్‌ఫ్రమ్ హోమ్ విధానం అమలులోకి రావడంతో ఇంటి నుంచి పనిచేసే వారికి అవసరమైన సేవలను అందించడానికి ఐటీ కంపెనీలు చిన్నచిన్న పట్టణాల్లో 30 సీట్ల సామర్థ్యంతో శాటిలైట్ ఆఫీసులు ఏర్పాటుచేసే యోచనలో ఉన్నాయి. నోయిడా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో పనిచేసే ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారు ఇక్కడ నుంచే పనిచేసే విధంగా వారికి బ్యాకెండ్ సపోర్ట్ ఇవ్వడానికి ఈ శాటిలైట్ ఆఫీసులను ఏర్పాటుచేయనున్నాయి. జోహో కార్ప్, ఫ్రెష్ వర్క్స్, సాప్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి సంస్థలు ఈ శాటిలైట్ కార్యాలయాలు ఏర్పాటుచేయడానికి ఆసక్తి చూపిస్తుండడంతో ఈ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా బిల్డర్లతో ‘అపిటా’ చర్చలు జరుపుతోంది. అలాగే, టెస్కో, వాల్‌మార్ట్, టార్గెట్ వంటి రిటైల్ సంస్థలతో పాటు పలు బ్యాంకింగ్ సంస్థలకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లు గ్లోబల్ కాంపిటెన్సీ సెంటర్స్‌గా మారాయి. కానీ, అక్కడ భూమి ధరలు, కాస్ట్ ఆఫ్ లివింగ్ భారీగా పెరిగిపోతుండటంతో తిరుపతి, అనంతపురం వంటి పట్టణాల్లో మినీ గ్లోబల్ కాపింటెన్సీ సెంటర్లను ఏర్పాటుచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ అవకాశాలనూ అందిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఐటీశాఖ 2020-21 7వ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. '' విపక్ష , స్వపక్ష అనే తేడా లేకుండా అందరినీ సమ దృష్టితో చూడాలి. రాష్ట్రాలను కలుపుకుని పోతేనే అభివృద్ధి సాధ్యం. కరోనా వల్ల పారిశ్రామిక రంగం దెబ్బతింది. ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఇక 2020-21కి సంబంధించిన ఐటీశాఖ వార్షిక నివేదికను పారదర్శకత కోసం విడుదల చేశాం. క్లిష్ట పరిస్థితుల్లో అభివృద్ధి సాధించాం.అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోంది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించాం. జాతీయ వృద్ధిరేటుతో పోల్చితే తెలంగాణ వృద్ధిరేటు రెండింతలు అధికం. ప్రస్తుత ఏడాది రూ.1,45,500 కోట్ల ఎగుమతులు చేశాం'' అని తెలిపారు. చదవండి: భాష వివాదంపై మంత్రి కేటీఆర్ స్పందన ప్రజల జీవితాలతో చెలగాటమాడతారా? -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నూతనోత్సాహం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నూతనోత్సహం నెలకొంది. ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరు రియల్టీ గృహాలు, ఆఫీస్ స్పేస్ రెండింట్లోనూ తిరోగమనంలో పయనిస్తుంటే.. హైదరాబాద్‌లో మాత్రం జోరుమీదుంది. 2021 జనవరి–మార్చి మధ్య కాలంలో నగరంలో 38 శాతం వృద్ధి రేటుతో 7,721 గృహాలు విక్రయమయ్యాయని రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ ప్రాప్‌టైగర్ తెలిపింది. గతేడాది ఇదే 3 నెలల్లో 5,554 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక దేశంలోని 8 ప్రధాన నగరాల్లో గృహాల విక్రయాలు చూస్తే.. 5 శాతం క్షీణించి 66,176 యూనిట్లకు చేరాయి. గతేడాది తొలి మూడు నెలల కాలంలో 69,555 గృహాలు విక్రయాలు జరిగాయి. ఆర్ధిక వ్యవస్థ క్రమంగా రికవరీ వైపు పయనిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్బీఐ తీసుకుంటున్న వివిధ చర్యల సానుకూల ప్రభావం రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ విభాగం మీద కూడా ఉంటుందని కంపెనీ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. ద్రవ్య లభ్యత, కొనుగోలుదారుల నుంచి సానుకూల స్పందనలు డెవలపర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయని తెలిపారు. ఇతర నగరాల్లో.. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో అహ్మదాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 4% పెరిగి 4,687 యూనిట్లకు చేరాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో 14 శాతం వృద్ధి చెంది 6,188 యూనిట్లకు, చెన్నైలో 23% పెరిగి 4,468కి, కోల్‌కతాలో 23% పెరిగి 3,382 ఇళ్లకు, బెంగళూరు, ముంబై, పుణే నగరాల్లో మాత్రం గృహాలు విక్రయాలు క్షీణించాయి. గతేడాది తొలి మూడు నెలల్లో బెంగళూరులో 8,197 ఇళ్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది 9 శాతం క్షీణించి 7,431 యూనిట్లకు పరిమితయ్యాయి. అలాగే ముంబైలో 23,969 యూనిట్ల నుంచి 18,574 (23 శాతం) క్షీణించాయి. 11 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్.. ఈ ఏడాది తొలి క్వార్టర్లో హైదరాబాద్, కోల్‌కతా, పుణే నగరాల్లో మాత్రమే ఆఫీస్ స్పేస్ నికర లావాదేవీలు పెరిగాయి. ఈ ఏడాది జనవరి–మార్చిలో హైదరాబాద్‌లో 11 లక్షల చ.అ. లీజింగ్స్ జరిగాయి. గతేడాది ఇదే కాలంలో 9 లక్షల చ.అ.లుగా ఉంది. -
ఐటీ హబ్‌గా విశాఖ
సాక్షి, అమరావతి : గ్రేటర్ విశాఖ నగరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) హబ్‌గా మారనుంది. వచ్చే మూడేళ్లలో కనీసం 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు విశాఖను ఐటీ హబ్‌గా మార్చడానికి ఐటీ శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రూ.200 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న విశాఖ మిలీనియం టవర్ ‘ఏ’లో 2.04 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉండగా, టవర్ ‘బీ’లో మరో 1.3 లక్షల చదరపు అడుగుల స్థలం త్వరలోనే అందుబాటులోకి రానుంది. టవర్ ‘ఏ’లో ఇప్పటికే 1.04 లక్షల చదరపు అడుగుల్లో వివిధ కంపెనీలు ఉండగా, మరో లక్ష చదరపు అడుగులు అందుబాటులో ఉన్నాయి. దీనికి అదనంగా విశాఖలో భారీ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్కులో ఐకానిక్ టవర్ల నిర్మాణం ద్వారా 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి తీసుకురావడానికి ఐటీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం విశాఖ సమీపంలో అందుబాటులో ఉన్న భూములను వినియోగించుకోనున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్కులో స్థానిక యువతకు ఉపాధి లభించే విధంగా ఐటీ స్కిల్ యూనివర్సిటీ, ఇంకుబేషన్ సెంటర్లు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలు, కో–వర్కింగ్ ప్లేస్‌లతో పాటు ప్లగ్ అండ్ ప్లే విధానంలో పని చేసుకునే విధంగా ఈ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. డిసెంబర్ నాటికి 10,000 ఉద్యోగాలే లక్ష్యం ►ఈ ఏడాది ఐటీ రంగంలో 30,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా ఈ డిసెంబర్ నాటికి 10,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ►ఇందుకోసం వివిధ కంపెనీలతో చర్చలు జరపడంతో పాటు ప్రతీ నెలా రోడ్‌షోలు నిర్వహించనున్నారు. త్వరలోనే ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే విధంగా భారీ ఇన్వెస్ట్మెంట్ సదస్సును నిర్వహించనున్నారు. ►ఇప్పటికే అదానీ గ్రూపు విశాఖలో 200 మెగా వాట్ల డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు సిŠక్ల్ యూనివర్సిటీ, ఐటీ పార్కుల నిర్మాణం ద్వారా కనీసం 25,000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ►విశాఖతో పాటు కాకినాడ, మంగళగిరి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో ఐటీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సుమారు 1,000 నుంచి 2,000 ఎకరాల్లో విశాఖ, తిరుపతి, అనంతపురంలో ఐటీ కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం: సీఎం జగన్
సాక్షి, అమరావతి : వచ్చే మూడేళ్లలో ఇంటర్నెట్ సదుపాయాన్ని అన్ని గ్రామాలకూ కల్పించడమన్నది చాలా ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఐటీ రంగం అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీలో అంశాలపైనా సమగ్రంగా చర్చించిన సీఎం వైఎస్ జగన్ ఇంటర్నెట్ నెట్వర్క్ బలంగా లేకపోతే.. అనుకున్న లక్ష్యాలు సాధించలేమని తెలిపారు. ఐటీ-ఎలక్ట్రానిక్ పాలసీపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ నెట్వర్క్ విస్తృతి, ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్, గ్రామాల్లో ఇంటర్నెట్ లైబ్రరీ, కొత్తగా వస్తున్న ఐటీ, ఇతర టెక్నాలజీ అంశాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీ యూనివర్శిటీపైనా సమావేశంలో చర్చించ్చిన సీఎం జగన్ పాలసీలో పెట్టాల్సిన అంశాలపై అధికారులకు సూచనలు అందించారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఇంటర్నెట్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని, గ్రామంలో ఎవరైనా సరే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా ఉండాలని అన్నారు. వర్క్ ఫ్రం హోం చేసుకునే సదుపాయం ఉంటుందని, ఇందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ- లైబ్రరీ కోసం భవనం కూడా కట్టాలని, దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. గ్రామంలోని సచివాలయాలు, ఆర్బీకేలు అన్నీ కూడా ఇంటర్నెట్తో అనుసంధానం కావాలన్నారు. దీంతోటు అవసరమైన గృహాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్కు ఏర్పాటు చేసి ఇందులో హై ఎండ్ స్కిల్స్ యూనివర్శిటీ, ఇన్క్యుబేషన్ సెంటర్, ల్యాబ్స్, సీఓఈఎస్, ఐటీ, ఈసీ డిపార్ట్మెంట్ ఆఫీసు, స్టేట్ డేటా సెంటర్, ఐటీ టవర్స్ ఇవన్నీకూడా ఉండాలని సీఎం ఆదేశించారు. చదవండి: తొలి దెబ్బ అదిరింది ఎమర్జింగ్ టెక్నాలజీస్ యూనివర్శిటీ విశాఖలో ఏర్పాటు కాబోతున్న యూనివర్శిటీలో రోబోటిక్స్, ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్ సైన్సెస్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటివనరులు తదితర రంగాల్లో ఐటీ అప్లికేషన్లపై బోధన, పరిశోధన లక్క్ష్యంగా ఉండాలన్నారు. దేశంలోని ప్రఖ్యాత ఐఐటీ సహా వివిధ సాంకేతిక సంస్థల్లోని నిపుణులు దీనిపై త్వరలోనే నివేదిక సమర్పిస్తారని అధికారులు వెల్లడించారు. ఇంజినీరింగ్ సహా.. ఇతరత్రా సాంకేతిక విద్యను అభ్యసించిన వారికి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకూ ఈ యూనివర్శిటీ ఉపయోగపడాలని సీఎం అన్నారు. యూనివర్శిటీ సహా ఐటీ సంబంధిత విభాగాలన్నీ ఒకే చోట ఉండాలని తెలిపారు మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీలు విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు సమీపంలో.. మూడుచోట్ల కనీసం 2 వేల ఎకరాల విస్తరణలో ఐటీ కాన్సెప్ట్‌సిటీలను ఏర్పాటు చేసేదిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ కాన్సెప్ట్ సిటీల్లో మౌలిక సదుపాయాలు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలన్నారు. నిర్మాణంలో ఆర్కిటెక్చర్ యునిక్‌గా ఉండాలని, ప్రతి కాన్సెప్ట్ సిటీకి సంబంధించిఒక ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ ఉండాలని పేర్కొన్నారు. పాలసీలో ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలన్నారు. ఐటీ ప్రగతికి దోహదపడాలని, రాష్ట్రాభివృద్ధికి సహాయపడాలని సూచించారు. అన్ని అంశాలపై ఆలోచనలు చేసి మంచి పాలసీని తీసుకురావాలన్నారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం పెరిగిందన్న సీఎం వర్క్ ఫ్రం హోంను ప్రమోట్ చేయాలని సూచించారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఏ రకంగా ఐటీ రంగానికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందిస్తామో పరిశీలన చేసి, దాన్ని పాలసీలో పెట్టాలని తెలిపారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ పార్క్‌పై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీలైనన్ని పరిశ్రమలను తీసుకురావాలని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాలని తెలిపారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని,ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జీజయలక్ష్మి, ఐటీ శాఖ స్పెషల్ సెక్రటరీ బీ సుందర్, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎమ్ఎమ్ నాయక్, ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ ఎమ్ మధుసూదన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ‘ఎన్నిసార్లు మంత్రిగా ఉన్నామనేది ముఖ్యం కాదు’ -
ఆగమాగమైన అమీర్‌పేట ఐటీ!
అమీర్‌పేట.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచానికి తెలిసిన పేరు.. కుప్పలుతెప్పలుగా ఉండే కోచింగ్ సెంటర్లలో గుంపులుగా యువత.. ఉదయం, సాయంత్రం ఆ ప్రాంతం కరపత్రాలతో నిండిపోతుంది. ఆకాశాన్ని మూసేలా పోటాపోటీ బ్యానర్లు.. ఎటు చూసినా ఆఫర్లమయం.. కాస్త ఆలోచించి శిక్షణ తీసుకొని కష్టపడితే చాలు ఫ్లైట్‌లో విదేశాలకు ఎగిరిపోవచ్చు.. పల్లెల్లో సైకిళ్లు ఎరుగని యువకులు సైతం పెద్ద కంపెనీల్లో కొలువులు చేస్తున్నారంటే అమీర్‌పేట పుణ్యమే.. ఎర్రబస్సు ఎరుగని పల్లె టు అమెరికా వయా అమీర్‌పేట అన్నా అతిశయోక్తి కాదేమో.. దిగ్గజ ఐటీ కంపెనీల్లో కొలువులకు బాటలు ఇక్కడి నుంచే మొదలయ్యేవి. ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను విద్యార్థులకు పండొలచినట్లు చెప్పి సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దే సెంటర్లు కోకొల్లలు. ఏడాదికి ఐదు లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్‌కు పునాది అమీర్‌పేట. కరోనా కాటుకు ఇక్కడి ఐటీ శిక్షణ కేంద్రాలు ప్రస్తుతం మూతపడ్డాయి. -సనత్‌నగర్ ఆ తొమ్మిది నెలల్లో ఏం జరిగిందంటే.. ► కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు విధించిన లాక్‌డౌన్‌కు ముందు ఐటీ విద్యార్థులతో అమీర్‌పేట అలరారింది. కరోనా మహమ్మారి కారణంగా ఇంకా కోచింగ్ సెంటర్లు తెరుచుకోలేదు. ► ఐటీ శిక్షణ కేంద్రాలకు మే, జూన్, జూలై నెలలు అత్యంత కీలకం. అకాడమీ ఇయర్ పూర్తి చేసుకుని కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు సాఫ్ట్వేర్ కొలువు కోసం ఇక్కడి శిక్షణ కేంద్రాల వైపే అడుగులు వేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దాదాపు 18 రాష్ట్రాల నుంచి ఇక్కడ శిక్షణ తీసుకునేందుకు వస్తారు. ► ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కావడంతో పాటు ఐటీ కోర్సుల ఫీజులు చాలా తక్కువ. ఆ ప్రకారంగా ఏడాదికి దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు తమ కలల జాబ్‌ను సంపాదించేందుకు ఇక్కడి కేంద్రాల్లో వాలిపోతుంటారు. ► ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. 9 నెలలుగా విద్యార్థులు లేక శిక్షణ కేంద్రాలు బోసిపోయాయి. అప్పట్లో ఒక్క విద్యార్థి అమీర్‌పేట గడప తొక్కాడంటే.. అతడిని ఏదో రకంగా తమ కేంద్రంలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసేవారు. అలాంటిది తొమ్మిది నెలలు పాటు విద్యార్థులు దూరమైతే పరిస్థితి ఊహించుకోవచ్చు. ► అమీర్‌పేట కేంద్రంగా 400–450 వరకు శిక్షణ కేంద్రాలు ఉంటే కరోనా దెబ్బకు అందులో 80 శాతం మేర దివాళా తీసి పెట్టేబేడా సర్దుకున్నాయి. కరోనా వ్యాక్సిన్ వచ్చాక చూద్దాంలే అన్నట్లుగా ఉన్నారు. మిగతా 20 శాతం సంస్థలు ‘ఆన్లైన్’ క్లాసులతో నెట్టుకొస్తున్నాయి. 50వేల మంది ఉపాధిపై వేటు.. ► అది మైత్రీవనం భవనంలో కొనసాగుతున్న ఐటీ శిక్షణ కేంద్రం. కరోనాకు ముందు 80 మంది పనిచేసేవారు. ఆన్లైన్ శిక్షణ కొనసాగిస్తుండటంతో ఇప్పుడు కేవలం నలుగురితో నడిపిస్తున్నారు. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాల్లో ఉద్యోగులను భారీగా కుదించుకోగా.. ఇక మూతపడ్డ శిక్షణ కేంద్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ► టిఫిన్ సెంటర్లు, చాట్ భండార్లు, టీ స్టాల్స్.. ఇలా పదుల సంఖ్యలో చిరువ్యాపారులు ఇక్కడ ఐటీ విద్యార్థులను నమ్ముకుని బతికేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలామంది ఊళ్లకు వెళ్లిపోయారు. అలాగే శిక్షణ కేంద్రాలకు ప్రచారం కల్పించేందుకు ఒక పెద్ద టీమ్ ఉంటుంది. ఇప్పుడు వారంతా అడ్రస్ లేకుండాపోయింది. ఇక హాస్టల్స్ పరిస్థితి అగమ్యగోచరం. టాలెంట్‌కే పెద్దపీట.. కరోనాకు ముందు ప్రతి 100 మందిలో 10 మందికి ఉద్యోగాలు ఉండేవి. కానీ ఇప్పుడు 100 మందిలో ఒకరిద్దరికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా మోస్ట్ టాలెంటెడ్ వారికే అవకాశం కల్పిస్తున్నారు. లాక్డౌన్ ప్రారంభ సమయంలో చాలా ఐటీ కంపెనీలు కరోనా సాకుతో చాలామందిని ఇంటికి సాగనంపినట్లు తెలిసింది. ఈ క్రమంలో టాలెంట్ కలిగిన ఫ్రెషర్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫ్రెషర్స్‌కు తక్కువ వేతనాలు ఇచ్చినా తమకు అనుకూలంగా ఉంటారన్న భావనతో ఉన్నట్లు సమాచారం. ‘ఆన్లైన్’.. ఒక సవాలే.. పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్లో బోధించినట్లు ఇక్కడ కుదరదు. ఐటీ శిక్షణ అంటే విద్యార్థిని ఉద్యోగ జీవితంలోకి ఆహ్వానించే ఓ ఫ్లాట్‌ఫాం. అందుకు తగ్గట్టుగా విద్యార్థులకు ఐటీ విజ్ఞానాన్ని నూరిపోయాలి. ఫిజికల్ తరగతులతోనే ఇది సాధ్యమయ్యే ప్రక్రియ. అలాంటిది ఆన్లైన్లో ఆ తతంగాన్ని పూర్తి చేయాలంటే పెద్ద సవాలే.. అందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వర్స్, ఆన్లైన్ సిమిలేటర్స్ సమకూర్చుకోవాలి. ఐటీ శిక్షణ కేంద్రాలకు ఇది మరింత భారం. కీలక సమయం కోల్పోయాం.. ఐటీ శిక్షణ కేంద్రాలకు మే, జూన్, జూలై మాసాలు అత్యంత కీలకం. కరోనా కారణంగా ఆ సమయాన్ని కోల్పోయాం. ఆన్లైన్ తరగతులను సీరియస్‌గా ఫాలో అయితే జాబ్ కొట్టొచ్చు. కరోనాతో కొంతమేర ఐటీ కంపెనీలు డీలా పడిన మాట వాస్తవమే. ఆ సమయంలో కొంతమంది ఉద్యోగులను పక్కకు తప్పించారు. ఇప్పుడు టాలెంట్ ఉన్న వారి కోసం వెతుకుతున్నాయి. – నరేష్, ఎండీ, నరేష్ టెక్నాలజీ 400 మందికి ఉద్యోగాలు.. సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలపై కోవిడ్–19 కోలుకోని దెబ్బకొట్టింది. అమీర్‌పేట, కేపీహెచ్‌కాలనీ ప్రాంతాల్లో 80 శాతం వరకు శిక్షణ కేంద్రాలు మూతపడ్డాయి. విద్యార్థులకు స్కిల్స్ ఉంటే ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఎలా శిక్షణ పొందినా ఉద్యోగం గ్యారంటీ. తాము కోవిడ్‌లోనూ 400 మందికి ప్లేస్మెంట్ అందించాం. స్కిల్స్ ఉంటే ఇంటికే ల్యాప్‌టాప్ పంపించి పని చేయించుకుంటారు. – దండు విశ్వనాథరాజు, సీఈఓ, వెక్టార్ ఇండియా -
భారత్‌లో పెరిగిన ఐటీ అవకాశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు దేశాల్లోని పరిశ్రమలన్నీ ఏదో మేరకు నష్టపోగా, ఐటీ పరిశ్రమ మాత్రం నిలదొక్కుకొని నిలబడడం ‘గుడ్డిలో మెల్ల మేలు’ చందంగా ఉందనడంలో సందేహం లేదు. ఐటీ పరిశ్రమ యథావిధిగా కొనసాగుతూ ఐటీ సర్వీసులకు డిమాండ్ కూడా పెరగుతుండడంతో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగావకాశాలు కూడా పెరగతూ వస్తున్నాయి. సెప్టెంబర్ నెల నాటికి హార్డ్‌వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు 63 శాతం పెరగ్గా, సాఫ్ట్వేర్ రంగంలో 20 శాతం పెరిగాయని ‘నౌకరీ డాట్ కామ్’ తాజాగా విడుదల చేసిన నివేదిక తెలియజేస్తోంది. (వాట్సప్ ఓటీపీతో జర జాగ్రత్త!) వాస్తవానికి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు కరోనా మహమ్మారికి ముందున్నంతగా లేవు. తక్కువగా ఉన్నాయి. అయితే హార్డ్‌వేర్ రంగంలో ఎక్కువగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా ఉద్యోగావకాశాలు లేదా నియామకాలు కేవలం మూడు శాతంతో గత 15 ఏళ్లలో ఎన్నడు లేనంత తక్కువ స్థాయిలో ఉంది. ఐటీ పరిశ్రమ అంతగా దెబ్బ తినకపోయినప్పటికీ దేశంలో ఇతర పరిశ్రమలు ఎక్కువగా దెబ్బతిన్న కారణంగా దేశంలో నిరుద్యోగుల శాతం సెప్టెంబర్ నెలలో 6.67 శాతం ఉండగా, అక్టోబర్ నెల నాటికి 6.98 శాతానికి చేరుకుంది. ఐటీ రంగంలో ఐబీఎం, కోగ్నిజెంట్, అక్సెంచర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, డెల్, టెక్‌మహీంద్ర, మైండ్ ట్రీ, గ్జిరాక్స్, అడోబ్ లాంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పెరగతున్నాయి. భారత సిలీకాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు నగరంలోనే కొత్త ఉద్యోగావకాశాలు ఎక్కువగా పెరిగాయి. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, హైదరాబాద్, పుణె నగరాలు ఉన్నాయి. -
ఐటీ ఉద్యోగులకు షాక్..
ముంబై: కరోనా వైరస్ నేపథ్యంలో మెజారిటీ ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్(ఇంటి నుంచే పని) వెసలుబాటు కల్పిస్తున్నాయి. అయితే కంపెనీ ప్రాంతాలలో అద్దెలు విపరీతంగా ఉండడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ బెటర్ అని చాలా ఉద్యోగులు భావించారు. కానీ ఉద్యోగుల ఆశలకు కంపెనీలు షాక్ ఇచ్చే యోచన చేస్తున్నాయి. తాజాగా వీఎమ్‌వేర్ ఇన్ అనే ఐటీ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకునే వారికి ఉద్యోగుల వేతనాలలో కోత( 18శాతం) విధించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఐటీ దిగ్గజం డెల్ టెక్నాలజీస్(వీఎమ్‌వేర్‌లో 81శాతం వాటా) ప్రతినిధులు స్పందిస్తూ కరోనా తగ్గాక ఉద్యోగుల వేతనాలపై ఆలోచిస్తామని తెలిపారు. అయితే సోషల్ మీడియం దిగ్గజం ఫేస్బుక్ ప్రాంతాలను బట్టి వేతనాలలో కోతలు ఉంటాయని తెలిపింది. ఉదా: అమెరికాలోని ఖరీదైన మహా నగరాలు(శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్) వదిలి సొంత ప్రాంతాలకు వెళ్లె వారికి వేతనాల కోత ఉంటుందని ఫేస్బుక్ పేర్కొంది. (చదవండి: కోవిడ్-19 : పని సంస్కృతిలో సమూల మార్పులు) -
ఐటీ నియామకాలలో సరికొత్త వ్యూహ్యాలు
ముంబై: కరోనా ఉదృతి నేపథ్యంలో మెజారిటీ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ పూర్తయిన ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలపై సందిగ్ధత నెలకొంది. అయితే కంపెనీలు మాత్రం ఫ్రేషర్స్ బయపడాల్సిన అవసరం లేదని, నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం కంపెనీలు నిర్వహించనున్న క్యాంపస్ ప్లేస్మెంట్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ) సాంకేతికతను ఉపయోగించనున్నారు. కాగా ప్రస్తుతం ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించే సందర్భంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా విద్యార్థి వ్యక్తిత్వాన్ని పసిగట్టనున్నారు. టీమ్‌తో కలిసి పనిచేసే నైపుణ్యాన్ని పరీక్షించనున్నారు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అక్టోబర్‌లో నియామకాలు చేపట్టాలని మెజారిటీ ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీలైన ఐబీఎమ్, క్యాప్‌జెమినీలు ఎంపిక విధానంలో మార్పులు చేయనున్నట్లు ప్రకటించాయి. అయితే ఇప్పటి వరకు 60,000 మంది విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించినట్లు క్యాప్‌జెమినీ ఉన్నతాధికారి అనిల్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. -
వైజాగ్ ది ఐటీ హబ్
-
హైదరాబాద్ నలువైపులా ఐటీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలు ఒకేచోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఐటీ పరిశ్రమల కారిడార్‌గా పేరొందిన పశ్చిమ ప్రాంతంలో మినహా ఇతర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు పెట్టేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రతిపాదిత హైదరాబాద్ గ్రిడ్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. ఉత్తరాన కొంపల్లి, పరిసర ప్రాంతాలు, తూర్పున ఉప్పల్, పోచారం, దక్షిణాన విమానాశ్రయం, శంషాబాద్, ఆదిభట్ల, వాయవ్యంలో(నార్త్‌వెస్ట్), కొల్లూరు, ఉస్మాన్‌నగర్‌తో పాటు పశ్చిమ కారిడార్ వెలుపలి ఇతర ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి ఈ పాలసీని ప్రభుత్వం తెచ్చింది. 2019–20లో హైదరాబాద్ 18 శాతం వృద్ధి రేటుతో రూ.1,18,000 కోట్ల ఐటీ ఎగుమతులను సాధించగా, ఇందులో 90 శాతం పశ్చిమ కారిడార్ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, వీటి పరిసర ప్రాంతాల నుంచే వచ్చాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. ►పారిశ్రామిక కేటగిరీ నుంచి ఐటీ పార్కు కేటగిరీకి భూ వినియోగ మార్పిడిని డెవలపర్లు ఎంపిక చేసుకోవచ్చు. డెవలపర్లకు 50:50 నిష్పత్తిలో వాటా లభించనుంది. పారిశ్రామిక కేటగిరీ నుంచి ఐటీ పార్కుగా భూ వినియోగ మార్పిడి చేయడానికి మొ త్తం స్థలంపై ఐడీఏలోని ప్రాథమిక రిజిస్ట్రేషన్ విలువలో 30% చార్జీలు చెల్లించాలి. ►ఐటీ, ఐటీఈఎస్ సంస్థలకు యూనిట్ విద్యుత్‌పై రూ.2 సబ్సిడీని ఏడాదికి రూ.5 లక్షలకు మించకుండా చెల్లించనున్నారు. ►ఐటీ/ఐటీఈఎస్ సంస్థలకు లీజు అద్దెపై 30 శాతం సబ్సిడీని గరిష్టంగా ఏడాదికి రూ.10 లక్షలు దాటకుండా ఇవ్వనున్నారు. ►500 మంది కంటే ఎక్కువ మందికి ఉపాధినిచ్చే కంపెనీల కోసం ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వనున్నారు. కాగా వచ్చే ఐదేళ్లలో సుమా రు 100 ఎకరాల పారిశ్రామిక పార్కులు ఐటీ పార్కులుగా మారుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే ఈ ఐదేళ్ల లో వచ్చే ఐటీ కంపెనీల ద్వారా లక్ష కొత్త ఉద్యోగాలు వస్తాయని భావిస్తోంది. -
‘ఎమర్జింగ్’పై దృష్టి
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్తగా వస్తున్న సాంకేతికత (ఎమర్జింగ్ టెక్నాలజీ)ను అందిపుచ్చు కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎమర్జింగ్ టెక్నాలజీ రంగానికి రాష్ట్రాన్ని చిరునామాగా మార్చడంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల కార్యక లాపాల్లో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించు కోవాలని నిర్ణయించింది. ఎమర్జింగ్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు 2016లో విడుదల చేసిన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీలో పలు ప్రతిపాదనలు చేసింది. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్ చెయిన్, డ్రోన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల వినియోగానికి ఉన్న అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విభిన్న రంగాల్లో కృత్రిమ మేధస్సు... 2020ని కృత్రిమ మేథో సంవత్సరంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం... ఏఐ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన పలు ప్రాజెక్టులను పాలన, పౌర సేవల్లో వినియోగిస్తోంది. మేడారం జాతరలో క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, రిజిస్ట్రేషన్ కార్యాలయం చిరునామా పౌరులు తెలుసుకునేందుకు ‘మేధ’ చాట్‌బోట్ వంటివి ఏఐ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తున్నాయి. ఏఐ టెక్నాలజీని చేనేత, వస్త్ర పరిశ్రమలోనూ ఉపయోగించి నేత కార్మికులు, వినియోగదారులకు మేలు చేసే దిశగా ఓ ప్రాజెక్టు రూపొందుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత నిర్ధారణ, ట్రాఫిక్ నిర్వహణ వంటి రంగాల్లోనూ ఏఐ ఆధారంగా పలు ఆవిష్కరణల దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ప్రయత్నాలు చేస్తోంది. బ్లాక్ చెయిన్‌తో పౌర సేవల్లో పారదర్శకత ప్రభుత్వ, పౌర సేవల్లో పారదర్శకత, రక్షణ పెంపు లక్ష్యంగా బ్లాక్ చెయిన్ ఆధారిత ప్రాజెక్టులు సుమారు పది వరకు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఆధారంగా భూ రికార్డులు తారుమారు చేయకుండా ‘సీడాక్’ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టు మంచి ఫలితాలు సాధించింది. చిట్‌ఫండ్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు రూపొందించిన ‘టీ చిట్స్’ జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధించింది. విద్యార్హత సర్టిఫికెట్లు, ఔషధాల్లో నకిలీల నివారణ, ప్రజాపంపిణీ వ్యవస్థ, న్యాయ వ్యవహారాలు, రవాణా, భూ రికార్డుల్లో పారదర్శకత వంటి రంగాల్లోనూ బ్లాక్ చెయిన్ ఆధారిత ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. మరిన్ని రంగాలకు డ్రోన్ టెక్నాలజీ విస్తరణ డ్రోన్ల దిగుమతిలో భారత్ అగ్రస్థానంలో ఉండగా ప్రస్తుతం నిర్మాణ, వ్యవసాయ, ఆరోగ్య, బీమా, సినిమాటోగ్రఫీ, పోలీసు తదితర రంగాల్లో డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో అటవీ సంరక్షణ, మైనింగ్, వ్యవసాయ రంగాల్లో డ్రోన్ టెక్నాలజీ వినియోగాన్ని విస్తృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ పేరిట దేశంలోనే తొలి డ్రోన్ టెక్నాలజీ ప్రాజెక్టును చేపట్టింది. సైబర్ సెక్యూరిటీ.. ఈ–వేస్ట్ మేనేజ్మెంట్ సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక, బ్యాంకింగ్, రక్షణ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులతోపాటు నేర పరిశోధనలో సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీపై రాష్ట్రంలో ఇప్పటికే పలు ఆవిష్కరణలు జరుగుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీఐ) భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో రూ. 22 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటైంది. మరోవైపు ఈ–వేస్ట్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ ఐదో స్థానంలో ఉండటంతో ఈ రంగంలో ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్, ఈ–వేస్ట్ నిర్వహణ తదితరాలకు సంబంధించి రూ. 36 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఎమర్జింగ్ టెక్నాలజీకి తెలంగాణ కేంద్ర బిందువుగా మారుతుండటంతో భవిష్యత్తులో ఉద్యోగాలు అవకాశాలు పెరుగుతాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు. -
ఇకపై ఉద్యోగ వివరాలకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్..
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' శాఖ పాత్ర మరింత కీలకం కానుందని పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రోజున మంత్రి మేకపాటి అధ్యక్షతన ఐటీ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ఇండస్ట్రియల్ పాలసీతో పాటుగా, ఐటీ పాలసీనీ ప్రకటించేలా సమాయత్తమవ్వాలి. సైబర్ సెక్యూరిటీకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఐటీలో భారీ పెట్టుబడుల ఆకర్షణపైనే దృష్టి పెట్టాలి. చౌకగా సంస్థలను ఏర్పాటు చేయడంలో ఏపీ అత్యంత అనుకూలం. ఐటీకి గమ్యస్థానంగా నిలిచే అన్ని వనరులు గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. (ఆ ఒప్పందంతో కీలక మలుపు..) ఐటీ పాలసీపై తుది కసరత్తు పూర్తిచేయడంలో వేగం పెంచాలి. పరిపాలన విభాగం కిందకి ఈ -ప్రగతి, రియల్ టైమ్ గవర్నెన్స్, తద్వారా వేగంగా మరిన్ని సేవలందించే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. నైపుణ్యంలో భాగంగా హై-ఎండ్ స్కిల్ యూనివర్శిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ (ఐఐడీటీ), ఐటీ ప్రమోషన్స్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ (ఏపీఈఐటీఏ), ఆంధ్రప్రదేశ్ ఇన్నొవేషన్ సొసైటీ (ఏపీఐఎస్) అన్ని రంగాల ఉద్యోగావకాశాలకు సంబంధించిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్పై చర్చించారు. (చౌకగా ఇంటర్నెట్ అందించడమే లక్ష్యం) ఉపాధి వివరాలకు ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్ విద్య, అర్హతలు, అవకాశాలను బట్టి నేరుగా ఉపాధి వివరాలు తెలుసుకునే విధంగా ఒక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రొక్యూర్మెంట్, ఇన్ఫ్రా & కమ్యునికేషన్స్ కింద ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సెర్వీసెస్ (ఏపీటీఎస్) 'మీ-సేవ' టెక్నికల్‌గా గ్రామసచివాలయాల (పంచాయతీరాజ్ శాఖ) పరిధిలోకి తీసుకువెళ్లడంపైనా చర్చించారు. దీనిపై జీవో ఇచ్చినా ఇంకా సాంకేతిక కారణాల దృష్ట్యా ఐటీ పరిధిలోనే ఉందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సుందర్ మంత్రికి వివరించారు. జీఏడీ దృష్టికి తీసుకువెళ్లి ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి మేకపాటి అధికారులకు సూచించారు. పరిపాలన సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ(ఏపీఐటీఏ), ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఏపీఎస్ఏసీ), సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్ వర్క్స్ (ఎస్ఏపీనెట్)లను ఒక తాటిపైకి తీసుకురావడంపైనా కార్యదర్శి భాను ప్రకాశ్, సలహాదారులతో మంత్రి చర్చించారు. (ఫ్యాబ్రిక్ హబ్‌గా ఏపీ) వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఎటువంటి సమస్యలు ఉండకూడదు కరోనా ఉధృతి నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్'కు అనుగుణంగా అన్ని విధాల సన్నద్ధానికి మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ఐటీ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్'లో ఎటువంటి సమస్య రాకుండా చూడాలి. ఇంటర్నెట్ కనెక్టిటవిటీ సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీ బడ్జెట్, వినియోగంపై తదితర శాఖాపరమైన ఆర్థిక అంశాలపై మంత్రి ఆరా తీశారు. కోవిడ్-19 నేపథ్యంలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు, టెక్నాలజీ వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. ఐటీ శాఖలో ఐఎస్బీ భాగస్వామ్యంపై శిక్షణ, సంస్థాగత నిర్మాణాలపై అధ్యయనం, ఆర్థిక సర్దుబాటు, పెట్టుబడుల ఆకర్షణ అంశాలలో ఐఎస్బీ సౌజన్యం, వినియోగించుకునే పద్ధతిపైనా చర్చించారు. ఐటీ శాఖపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షకు హాజరైన వారిలో ఐటీ శాఖ కార్యదర్శి యేటూరు భాను ప్రకాశ్, ప్రత్యేక కార్యదర్శి బి సుందర్, ఐటీ సలహాదారులు లోకేశ్వర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి (టెక్నికల్), దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి (టెక్నికల్), ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు. (టెక్స్టైల్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్) -
హైదరాబాద్ నలుమూలలా ఐటీ కంపెనీలు
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని హైదరాబాద్‌లోని అన్ని మూలలకూ విస్తరించేందుకు త్వరలో గ్రిడ్ విధానాన్ని తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. హైదరాబాద్‌కు తూర్పున ఉప్పల్ వైపు ప్రస్తుతమున్న ఐటీ కంపెనీలకు తోడు మరిన్ని ఐటీ, అనుబంధ కంపెనీల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ గ్రోత్ ఇన్ డిస్పెర్షన్ (గ్రిడ్) కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ బుధవారం ఉప్పల్ ఎన్ఎస్ఎల్ ఎరెనాలో ఐటీ కంపెనీల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈస్ట్ హైదరాబాద్‌లో ఐటీ రంగం స్థితిగతులు, భవిష్యత్తు పెట్టుబడులపై మంత్రి ఈ సమావేశంలో చర్చించారు. గ్రిడ్ ద్వారా ఐటీ రంగం విస్తరణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే గ్రిడ్ వి«ధానం ద్వారా ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు తరలివస్తాయనే ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. ఈస్ట్ హైదరాబాద్‌లో ఇప్పటికే మెట్రో, శిల్పారామం, మూసీ నది అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మౌలిక వసతులు మెరుగవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వైపు, అంబర్ పేట్ రామాంతాపూర్ ఫ్లై ఓవర్ల ద్వారా రోడ్లు, మౌలిక వసతులు మరింత మెరుగవుతాయన్నారు. హైదరాబాద్ నలువైపులా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, మెడికల్ డివైజెస్ వంటి పరిశ్రమలు విస్తరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు కాలుష్య కారక పరిశ్రమలు తరలివెళ్తే, వాటి స్థలాలను ఐటీ రంగ కార్యాలయాల అభివృద్ధికి అనుమతినిచ్చే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఐదు కంపెనీలకు కన్వర్షన్ పత్రాలు పారిశ్రామిక స్థలాలను ఐటీ పార్కులుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన కన్వర్షన్ పత్రాలను ఐదు ఐటీ కంపెనీల ప్రతినిధులకు కేటీఆర్ బుధవారం అందజేశారు. ఐదు కంపెనీల ద్వారా సుమారు 25 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అభివృద్ధి చేస్తామన్నారు. తద్వారా ఉప్పల్ ప్రాంతంలో మరో 30వేల మంది ఐటీ ఉద్యోగులకు అవకాశాలు లభిస్తున్నాయన్నారు. రాచకొండ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ రూపొందించిన సమాచార సంచికను మంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, రాచకొండ కమీషనర్ మహేశ్ భగవత్, వివిధ ప్రభుత్వ శాఖల అ«ధికారులతో పాటు ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఐటీ శాఖ కార్యదర్శిగా భాను ప్రకాష్
సాక్షి, విజయవాడ: ఐటీ శాఖ కార్యదర్శిగా వై భాను ప్రకాష్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు కరోనా ఆస్పత్రులను పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్‌గా రాజమౌళిని ప్రభుత్వం నియమించింది. కరోనా ఆస్పత్రుల సామర్థ్యం, సన్నద్ధత పర్యవేక్షణ తదితర బాధ్యతలను రాజమౌళి పర్యవేక్షించనున్నారు. దేశంలో కరోనా టెస్ట్‌లను అత్యధికంగా నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రపదేశ్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. శుక్రవారం రాష్ట్రంలో కొత్తగా 1608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 21,020 శాంపిల్స్‌ను పరిక్షించగా అందులో 1576 కేసులు ఏపీలో నమోదవ్వగా, మిగతా 32 కరోనా కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివి ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 25,422కి చేరింది. -
టెకీల్లో లేఆఫ్స్ గుబులు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న క్రమంలో లక్షలాది మందికి ఉపాథి కల్పించే ఐటీ పరిశ్రమ భారీ కుదుపులకు లోనవుతుంది. మహమ్మారి వ్యాప్తితో డిమాండ్ కొరవడిన కారణంగా పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను మూకుమ్మడిగా తొలగించడం ఆందోళన రేకెత్తిస్తోంది. రాబోయే రోజుల్లో డిమాండ్ మెరుగుపడనిపక్షంలో భారత్‌లో సైతం ఇదే పరిస్థితి నెలకొంటుందని టెకీల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే ఐటీ కంపెనీలు సామర్థ్యం కనబరచని ఉద్యోగులను ఇంటికి పంపుతున్నామని చెబుతుండగా, మరికొన్ని కంపెనీలు ప్రాజెక్టులు లేవంటూ సిబ్బందిని వదిలించుకుంటున్నాయి. ప్రస్తుత వ్యాపార పరిస్థితుల్లో అనిశ్చితి కారణంగా ఐటీ కంపెనీలు లేఆఫ్స్‌కు దిగాయని ఇటీవల పలు కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్న ధోరణి ఆధారంగా ఓ జాతీయ వెబ్సైట్ కథనం పేర్కొంది. తాజా ప్రాజెక్టులు కొనసాగడంపైనా స్పష్టత లేకపోవడంతో కొలువుల కోతకు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఆటోమేషన్తో పలు కంపెనీలు ఉద్యోగులను తగ్గించే పనిలో పడగా తాజాగా కోవిడ్-19తో ఈ పనిని మరింత వేగంగా ఐటీ కంపెనీలు ముందుకు తీసుకువెళుతున్నాయి. ఐబీఎం కార్పొరేషన్ ప్రపంచవ్యాప్తంగా 2000 మంది ఉద్యోగులపై వేటు వేయనుందని వార్తలు వచ్చాయి. ఈ జాబితాలో భారత్‌లో పనిచేసే ఉద్యోగులూ ఉండే అవకాశం ఉంది. ఉద్యోగుల తొలగింపుపై ఐబీఎం ఇంకా నోరుమెదపలేదు. మరో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఇటీవలే భారత్‌లో పలువురు ఉద్యోగులను తొలగించడాన్ని గుర్తుచేస్తూ ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితికి ఈ పరిణామాలు సంకేతమని చెబుతున్నారు. కోవిడ్-19తో లేఆఫ్స్ ఉండవని ఐటీ కంపెనీలు చెబుతున్నా ఐటీ సేవల డిమాండ్ ఇలాగే కొనసాగితే సామర్థ్యం ఆధారంగా ఉద్యోగులను కుదించే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. చదవండి : లేఆఫ్స్‌పై ముఖ్యమంత్రికి టెకీల లేఖ -
భారత్‌పై సైబర్ దాడులకు పాల్పడ్డ చైనా
ముంబై : చైనాకు చెందిన హ్యాకర్లు గత ఐదు రోజుల్లో ఐటీ, బ్యాంకింగ్ రంగాలపై నలభై వేలకు పైగానే సైబర్ దాడులకు ప్రయత్నించారని మహారాష్ట్ర పోలీసు సైబర్ వింగ్ అధికారి యశస్వి యాదవ్ మంగళవారం తెలిపారు. తూర్పులద్ధాఖ్‌లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఆన్లైన్ దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ను హైజాక్ చేయడం, ఫిషింగ్ వంటి సమస్యలను సృష్టించే లక్ష్యంతో ప్రధానంగా ఈ దాడులు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. గత ఐదు రోజుల్లోనే భారత సైబర్‌స్పేస్‌లోని వివిధ వనరులపై దాదాపు 40,300 సైబర్ దాడులు జరిగినట్లు యశస్వి యాదవ్ వెల్లడించారు. చైనాలోని చెంగ్డు ప్రాంతం నుంచే ఎక్కువగా సైబర్ దాడులకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. (వాస్తవాధీన రేఖ నిర్థారణ అసాథ్యమేమీ కాదు.. ) భవిష్యత్తులో మరిన్ని ఆన్లైన్ నేరాలు జరగడానికి అవకాశం ఉందని ఇంటర్నెట్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక వాస్తవాదీన రేఖ వద్ద ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్, చైనా దేశాలు కీలకమైన ముందడుగు వేశాయి. తూర్పు లద్ధాఖ్లోని అన్ని వివాదాస్పద, ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి వెనుదిరగాలని ఏకాభిప్రాయానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శాంతియుత వాతావరణం నెలకొల్పేలా ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. (రష్యాలో వారిద్దరు భేటీ కావడం లేదు: భారత్ ) -
‘ఐటీలో ఉద్యోగానికి ఈ కోర్సులు నేర్చుకోండి’
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా ఐటీ ప్రాజెక్టులు అధికంగా లభించే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో వైరస్ విజృంభణ పతాక స్థాయికి చేరడంతో కొత్త ప్రాజెక్టులు లేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రస్తుతం క్లౌడ్ కంప్యూటింగ్, డైటా సైన్స్ లాంటి కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ తదితర కోర్సులను జాబ్ కన్సెల్టెన్సీలు ఆఫర్ చేస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీలకు శిక్షణ ఇచ్చే జిగ్సా అకాడమీ సీఈఓ వోహ్రా స్పందిస్తూ.. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కూడా వైవిధ్యమైన కోర్సుల్లో నైపుణ్యం పొందిన వారికి ఉద్యోగాలలో డోకా ఉండదని తెలిపారు. మరోవైపు టెక్నాలజీలకు పేరు పొందిన యుడెమీ సీఈఓ ఇర్విన్ ఆనంద్ స్పందిస్తూ.. వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్ కోర్సులలో 60శాతంనుంచి 58శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. కాగా లాక్డౌన్ వల్ల వీడియా లెర్నింగ్‌కు అధిక ప్రాధాన్యత పెరిగిందని స్ప్రింగ్ సీఈఓ రవి కాక్లసరి తెలిపారు. మరోవైపు సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్) తదితర కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉందని సీనియర్ రీసెర్చ్ డైరెక్టర్ డీ.డీ మిశ్రా అభిప్రాయపడ్డారు.(చదవండి: కంపెనీ పెట్టండి..రాయితీ పట్టండి) -
‘వృద్ధి కోసం ఐటీ కంపెనీల వ్యూహాలు’
ముంబై: కరోనా వైరస్‌ను ఎదుర్కొని వృద్ధి పథంలో దూసుకెళ్లెందుకు ఐటీ కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ అంశంపై ఇన్ఫోసిస్ ఉన్నతాధికారి రిచర్డ్ లోబో స్పందిస్తూ.. లాక్డౌన్ సమయంలో ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు కొంత ఇబ్బంది పడ్డామని, కానీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో అత్యుత్తమ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే కంపెనీకి చెందిన షేర్ హోల్డర్లతో చర్చించి సంస్థకు ఉపయోగపడే మెరుగైన విధానాలను రూపొందిస్తామని పేర్కొన్నారు. బీవైఎల్‌డీ కన్సెల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ సోన్స్ స్పందిస్తూ.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని, కంపెనీ వృద్ధికి దోహదపడే ఉద్యోగులకే సంస్థలు ప్రాధాన్యత ఇస్తాయని అన్నారు. ప్రస్తుతం కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇన్పోసిస్ సంస్థ ఉద్యోగుల శ్రేయస్సు కొరకు ప్రత్యేకమైన టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఉద్యోగుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు లోబో తెలిపారు. (చదవండి: ఉద్యోగాలు, బోనస్ ఇస్తున్నాం: యాక్సెంచర్) -
స్వయం ప్రకటిత లాక్డౌన్లో ఐటీ
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ ఆంక్షల నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి పూర్తిస్థాయి మినహాయింపులిచ్చి మూడు వారాలైనా ఉద్యోగుల హా జరు శాతం పెరగట్లేదు. వంద శాతం సిబ్బందితో పని చేసుకునే వెసులుబాటు కల్పించినా ఐటీ సంస్థ లు మాత్రం ఆ దిశగా మొగ్గు చూపడం లేదు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని మరికొం త కాలం స్వయం ప్రకటిత లాక్డౌన్ అవలంబించాలని భావిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ ఐటీ రం గానికి చిరునామాగా ఉన్న గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో సందడి కరువైంది. గత నెల మూడో వా రంలో లాక్డౌన్ ఆంక్షలను సడలించడంతో పాటు వారానికి 8 నుంచి పది శాతం హాజరు శాతం పెరుగుతుందని ఐటీ వర్గాలు అంచనా వేశాయి. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడం తో మరికొంత కాలం ఇంటి నుంచే పని చేసే విధానం (వర్క్ ఫ్రమ్ హోం) కొనసాగించాలని ఐటీ కం పెనీలు నిర్ణయించారు. హాజరు 20%లోపే..: మార్చి 22న లాక్డౌన్ ఆంక్ష లు విధించడానికి ముందే ఐటీ సంస్థలు వర్క్‌ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేయాలని ఉద్యోగులను ఆదేశించాయి. రాష్ట్రంలో సుమారు 5.50 లక్షల మం ది ఐటీ ఉద్యోగులు ఉండగా, లాక్డౌన్ వేళ 5% లోపు మంది మాత్రమే కార్యాలయాల నుంచి పని చేశారు. ఆంక్ష లు సడలించినా ప్రభుత్వం సూచిం చిన విధంగా భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వర్తించడం అటు ఉద్యోగులు, ఇటు సంస్థలకు ఎంతమాత్రం ఆచరణీయం కాదని ఐటీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యమైన ప్రాజెక్టులకు సంబంధించి వర్క్‌ఫ్రమ్ హోం విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటంతో కీలకమైన సిబ్బందిని మాత్రమే పెద్ద ఐటీ కంపెనీలు కార్యాలయాల నుం చి పనిచేయాలని చెబుతున్నాయి. జూలైలో ఐటీ కంపెనీల్లో హాజరు శాతం కొంతమేర మెరుగై ఆగస్టు నాటికి 50 నుంచి 70% మేర నమోదయ్యే అవకాశం ఉందని ఐటీ వర్గాలు చెప్తున్నా యి. కాగా, ఉద్యోగులను కార్యాలయాల నుంచే పని చేయాలని ఆదేశించడం పై ఐటీ సంస్థలు ఆచి తూచి వ్యవహరిస్తున్నాయని హైసియా అధ్యక్షుడు భరణికుమార్ అరోల్ తెలిపారు. సంస్థ కార్యకలాపాలకు ఇబ్బంది లేనంతవరకు ఇంటి నుంచి పనిచేసే విధానానికి అనుమతి ఇవ్వడమే సరైనదన్నారు. -
సీనియర్ లెవల్ పదోన్నతులకు టెకీల ఆసక్తి..
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత వారం నుంచి సీనియర్ లెవల్ ఐటీ(టెకీలు) ఉద్యోగులు పదోన్నత్తుల కోసం కంపెనీలకు రెజ్యూమ్స్ పంపిస్తున్నట్లు సాంకేతిక విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఎక్కువగా నైపుణ్యాలు, కొత్త టెక్నాలజీని నేర్చుకోలేని వారికి ఉద్వాసన తప్పదని ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం డిజిటల్ నిపుణులకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని.. వాటిలో నైపుణ్యం పెంచుకోవడానికి ఉద్యోగులు కృషి చేయాలని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా తెలిపారు. ఉద్యోగుల డిజిటల్ నైపుణ్యాలకు కంపెనీలు అధిక ప్రాధాన్యత ఇస్తాయని గుప్తా అభిప్రాయపడ్డారు. దాదాపు 40 శాతం మంది సీనియర్ ఐటీ ఉద్యోగులు కంపెనీలకు రిజ్యూమ్స్ పంపిస్తున్నట్లు ఫీనో అనే కన్సెల్టెంట్ సంస్థ తెలిపింది. కరోనా ప్రభావం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు ఉండకపోవచ్చని ఫీనో సహ వ్యవస్థాపకుడు కమల్ కరన్త్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఐటీ దిగ్గజ కంపెనీలు ఐబీఎమ్, కాగ్నిజెంట్ తదితర సంస్థలు ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. -
కరోనా ఎఫెక్ట్: ఐటీ ఉద్యోగులకు వరం
కర్ణాటక: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవంతో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో కొత్త ప్రాజెక్టులు లేక యాజమాన్యాలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇంతటి సంక్షోభ పరిస్థితుల్లో కూడా ఐటీ ఉద్యోగులకు కొన్ని సానుకూలతలు ఉన్నాయి. కరోనా వైరస్ వల్ల కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. కంపెనీలు తీసుకున్న నిర్ణయాలే ఉద్యోగులకు వరంగా మారాయి. ఐటీ కంపెనీలకు వేదికయిన బెంగుళూరు లాంటి పట్టణాల్లో ఇంటి అద్దె ధరలు ఎక్కువగా ఉంటాయి.. కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంటి అద్దె టెన్షన్ తీరిందని ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెంగుళూరులో ఎక్కువ ఐటీ కంపెనీలు ఉండే మహాదేవపుర, వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్స్ సిటీ, బెల్లాండూర్, సర్జాపురలో ఇంటి అద్దెలు అధికంగా వసూలు చేస్తున్నారు. బెంగుళూరులో దాదాపు 85శాతం ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పిస్తున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ 2025సంవత్సరం లోపు మూడో వంతు ఉద్యోగులను ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పిస్తామని పేర్కొంది. చదవండి: ఐటీ ఉద్యోగులకు అండ..! -
ఆఫీసులకు రావద్దు.. ఐటీ కంపెనీల సూచన
ముంబై: కరోనా వైరస్ విలయతాండవంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను సంరక్షించుకోవడానికి పలు చర్యలు చేపట్టాయి. గత మూడు నెలలుగా ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్(ఇంటి నుంచి పనిచేయడం) ద్వారా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కరోనా విజృంభిస్తుండడంతో ఉద్యోగులు కార్యాలయాలకు రాకుండా ఇంట్లోనే విధులు నిర్వహించాలని ఉద్యోగులకు ఐటీ కంపెనీలు సూచిస్తున్నాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కార్యాలయంలో కేవలం 15శాతం ఉద్యోగులే విధులు నిర్వహిస్తుండగా, మిగతా వారు ఇంట్లోనే తమ సేవలను అందిస్తున్నారు. ఉద్యోగులు ఇంట్లో పనిచేయడం ద్వారా నాణ్యత విషయంలో ఏ మాత్రం మార్పులేదని ఇన్ఫోసిస్ సీనీయర్ హెర్ రిచర్డ్ లోబో తెలిపారు. మిడ్ టైర్ ఐటీ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా కార్యాలయానికి రావడం లేదని సంస్థ అధికారులు తెలిపారు. అయినా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ద్వారా అత్యుత్తమ సేవలందిస్తున్నారని మిడ్ టైర్ కంపెనీ పేర్కొంది. మరోవైపు వర్క్ ప్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నట్లు విప్రో ఓ ప్రకటనలో తెలిపింది. అయితే స్థానిక పరిస్థితుల ఆధారంగానే తమ నిర్ణయాలుంటాయని టెక్ మహీంద్రా పేర్కొంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగులు మెరుగైన సేవలందిస్తున్నారని హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఉన్నతాధికారులు తెలిపారు. చదవండి: ఐటీ ఉద్యోగులకు అండ..! -
కాంట్రాక్ట్ జాబ్స్‌పై ఐటీ రంగం దృష్టి
ముంబై: కరోనా వైరస్‌తో ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించేందుకు ఐటీ కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం జూన్‌లో నియామకాలు చేపట్టే ఐటీ కంపెనీలు కరోనా కారణంగా వాయిదా వేశాయి. తాజా పరిస్థితుల దృష్యా ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు రెగ్యులర్ ఉద్యోగులకు బదులు కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించాయి. ఇండియా స్టాఫింగ్ ఫైడరేషన్ ప్రకారం కంపెనీలు 100మంది ఉద్యోగ సిబ్బందిని నియమించుకునే క్రమంలో కాంట్రాక్ట్ బేస్ మీద 12 మందితో సరిపెడుతున్నాయి. కంపెనీలు కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకోవడానికి ప్రాజెక్ట్ ఆధారిత నైపుణ్యత కలిగి ఉంటే సరిపోతుందని సాంకేతిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ కంపెనీలకు కేంద్ర బిందువైన అమెరికా, యూరప్ దేశాలలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దేశీయ ఐటీ కంపెనీలకు ఈ దేశాల నుంచి అధిక ప్రాజెక్టులు లభిస్తున్నాయి. ప్రస్తుతం యూరప్‌లో కరోనా కేసులు తగ్గడంతో ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరో వైపు జర్మనీ, ఇటలీ, స్పేయిన్ దేశాలలో చివరి దశ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. త్వరలో ఈ దేశాలలో లాక్డౌన్ ఎత్తేస్తే దేశీయ ఐటీ కంపెనీల వృద్ధి మరింత వేగంగా పుంజుకుంటుంది. చదవండి: సోషల్ మీడియాకు కొత్త ఐటీ నిబంధనలు.. -
ఐటీ వృద్ధికి కంపెనీల వ్యూహాలు..
ముంబై: కరోనా ఉదృతి నేపథ్యంలో దేశీయ ఐటీ కంపనీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించి నాణ్యమైన సేవలు అందించాలని భావిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడానికి అంతర్జాతీయ కంపెనీల వ్యూహాలను అధ్యయనం చేస్తున్నాయి. ఐటీ ప్రాజెక్ట్స్‌కు కేంద్ర బిందువైన అమెరికా, యూకే దేశాలలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దేశానికి ఎక్కువ ప్రాజెక్టులు అందించే ఈ దేశాలు సంక్షోభంలో ఉండడం తీవ్ర నష్టమని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. గత మూడెళ్లగా దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీలు డిజిటల్ వ్యవస్థను పటిష్టం చేస్తున్న తరుణంలో కరోనా సంక్షోభం రావడం ఐటీ వృద్ధికి తీవ్ర నష్టమని నిపుణులు అంచానా వేస్తున్నారు. -
భవిష్యత్తులోనూ ఐటీ వృద్ధి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులోనూ వృద్ధిరేటును కొనసాగిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. కరోనా సంక్షోభం అన్ని రంగాలపై కొంత మేర ప్రభావం చూపిందని, హైదరాబాద్‌కు అనుకూలతల నేపథ్యంలో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ తిరిగి పురోగమిస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) కొత్త కార్యవర్గం కొత్త అధ్యక్షుడు భరణి కుమార్ ఆరోల్ నేతృత్వంలో సోమవారం మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో భేటీ అయింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ‘హైసియా’ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తూ వారి సలహా సూచనల్ని సానుకూల దృక్పథంతో స్వీకరిస్తోంది. హైసియాతో రాబోయే రోజుల్లోనూ కలిసి పనిచేస్తాం, కొత్త అవకాశాలను సృష్టించే దిశగా ‘హైసియా’ కృషి చేయాలి. కరోనాతో పాటు ఇత ర సామాజిక సమస్యలను ఎదుర్కొనేందుకు టెక్నాలజీ సాయం తో ఐటీ కంపెనీలు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలు కొత్త పరిష్కారాలతో ముందుకు వస్తున్నాయి. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మద్దతు ఇస్తాం. ఇటీవల ‘విహజ్’ స్టార్టప్ రూపొందించి న ఆన్లైన్ మీటింగ్ సొల్యూషన్‌ను ఐటీ శాఖలో అంతర్గత సమావేశాలకు వాడుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మెడికల్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఐటీ సంస్థలకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఐటీ అభివృద్ధికి హైసియా తోడ్పడాలి’ అని కేటీఆర్ కోరారు. సహకారం అందిస్తాం : హైసియా జాతీయ సగటును మించి తెలంగాణ రాష్ట్రం ఐటీ ఎగుమతుల్లో వృద్ధిరేటును సాధించడంపై ‘హైసియా’ కొత్త కార్యవర్గం మంత్రి కేటీఆర్‌ను అభినందించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్లే ఆరేళ్లుగా తెలంగాణ ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతోందన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు పూర్తి సహకారం అందిస్తామని ‘హైసియా’ కార్యవర్గం హామీ ఇచ్చింది. ప్రస్తు త పరిస్థితుల్లో ఐటి ఉద్యోగులకు ఎదురవుతున్న పరిమితులు, ప్రభుత్వం మరియు ఇతర అధికార వర్గాల నుంచి కావాల్సిన సహాయ సహకారానికి సంబంధించి ‘హైసియా’ ప్రతినిధులు పలు సూచనలు చేశారు. -
భాగ్యనగరంలో 45 దవాఖానాలు ప్రారంభం
-
త్రీడీతో డిజిటల్ విప్లవం
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో డిజిటల్ అక్షరాస్యత, మౌలిక వసతులు, ఆవిష్కరణల (త్రీడీ) ద్వారానే భారత్‌లో డిజిటల్ విప్లవం సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సామాన్యులకు కూడా డిజిటల్ పరిజ్ఞానం అందినప్పుడే డిజిటల్ విప్లవం సాధ్యమవుతుందని అప్పుడే సమాజంపై సానుకూల ప్రభావం ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘కోవిడ్ తదనంతర కాలంలో డిజిటల్ విప్లవం’అనే అంశంపై భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) శుక్రవారం నిర్వహించిన డిజిటల్ సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆన్లైన్ వేదికగా ‘వర్చువల్ కాన్ఫరెన్స్’విధానంలో జరిగిన ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచేందుకు భారత్‌లో ఎంతో కృషి జరగాల్సి ఉందని, అందుకు అవసరమైన బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన, ఆవిష్కరణలు జరగాల్సి ఉందన్నారు. భారతీయ డిజిటల్ వ్యూహంలో భాగంగా ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ 18% వృద్ధి రేటును సాధించడాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్నీ అభినందించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అవకాశాలను తెలంగాణ అందిపుచ్చుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో రాష్ట్రంలోని వేయికి పైగా కిరాణా దుకాణాలను డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చిన తీరును రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ వివరించారు. భారతదేశం డిజిటల్ పరివర్తన చెందేందుకు కోవిడ్ మహమ్మారి ఊతమిచ్చిందన్నారు. ఐటీ రంగంలో నాణ్యతను పెంచేందుకు ఇప్పటికే 21 చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు (సీఓఈ) ఏర్పాటు చేయగా, మరో 12 సీఓఈల ఏర్పాటుకు ద్వితీయ శ్రేణి నగరాలను గుర్తించినట్లు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఓంకార్‌రాయ్ వెల్లడించారు. సదస్సులో సీఐఐ తెలంగాణ మాజీ చైర్మన్ వి.రాజన్న, ఎంపీఎల్ సీఈఓ సాయి శ్రీనివాస్ కిరణ్, సీఐఐ తెలంగాణ చైర్మన్ క్రిష్ణ బోదనపు పాల్గొన్నారు. -
ఐటీలో మనమే మేటి
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగుమతుల్లో 2019–20 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 17.93% వృద్ధిరేటుతో గణనీయమైన పురోగతి సాధించింది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి (2013–14) రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు కాగా, 2019–20లో రూ.1,28,807 కోట్లకు చేరాయి. జాతీయ స్థాయిలో ఎగుమతుల వృద్ధిరేటు 8.09 శాతమే కావడం గమనార్హం. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ఐటీ విభాగం సాధించిన ప్రగతి వివరాలను ఐటీ మంత్రి కేటీఆర్, ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్.. సీఎం కేసీఆర్‌కు గురువారం ప్రగతిభవన్‌లో అంద జేశారు. కరోనా నేపథ్యంలో 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఐటీ ఎగు మతులపై ప్రభావం పడినా తెలంగాణ ఐటీ మాత్రం రికార్డు స్థాయిలో వృద్ధిరేటు సాధించింది. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వృద్ధి రేటును మినహాయిస్తే జాతీయ ఐటీ వృద్ధి రేటు 6.92% మాత్రమే. కాగా ఎగు మతుల వృద్ధిరేటుతో పోలిస్తే జాతీయ సగటు రేటు కంటే రాష్ట్రం రెండింతలకుపైగా వృద్ధి సాధిం చింది. ఐటీ ఉద్యోగాల కల్పనలో జాతీయ వృద్ధిరేటు 4.93% కాగా తెలంగాణలో 7.2%గా నమోదైంది. తెలంగాణ వృద్ధిరేటు మినహాయిస్తే ఉద్యోగాల్లో జాతీయ వృద్ధిరేటు 4.59%. 2019–20లో ఐటీ ఉద్యోగాల్లో నమో దైన వృద్ధి రేటులో తెలంగాణ వాటా 50% కంటే ఎక్కువ ఉంది. 2019–20లో భారత ఐటీ ఎగుమతుల్లో మొత్తం తెలంగాణ వాటా 23.53శాతం కాగా, ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం వాటా 19.07శాతంగా ఉంది. హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు 2019–20 ఆర్థిక సంవత్సరంలో హైదరా బాద్ ఐటీ రంగంలో పేరెన్నికగన్న సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమెజాన్ తన కార్యా లయాన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద పరిశో ధన, అభివృద్ధి కేంద్రాన్ని మైక్రాన్ ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరం వరంగల్‌లో (టైర్ 2) టెక్ మహీంద్ర, సియాంట్ కంపెనీలు తమ సెంటర్లను తెర వగా, పలు బహుళజాతి కంపెనీలను హైద రాబాద్‌కు తూర్పువైపు తమ కార్యాల యాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2019–20 తొలి అర్ధ భాగంలో కమర్షియల్ స్పేస్ వినియోగంలో దేశంలోని ఇతర మెట్రో నగరాలకంటే హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఐటీ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ: సీఎం కేసీఆర్ రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతుల్లో గణనీయ మైన వృద్ధిరేటును సాధించిన ఐటీ విభాగాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు. దేశంలోని ఐటీ ఎగుమతుల్లో రాష్ట్ర వృద్ధిరేటు 10.6 నుంచి 11.6 శాతానికి చేరడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఐటీ రంగంలో పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందనే విషయాన్ని ఇది చెబుతోందని వ్యాఖ్యానించారు. కరోనా సమస్యను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ఐటీ రంగం సజావుగా కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు తీసు కోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతి నివేదికను జూన్ 1న ఐటీ విభాగం విడుదల చేస్తుందని కేటీఆర్ తెలి పారు. కరోనాను ఎదుర్కొనేందుకు హైదరా బాద్ ఐటీ పరిశ్రమ చేపట్టిన ‘ఐటీ4టీఎస్’ నినాదంతో రూ.70 కోట్ల మేర విరాళాలు సమకూరినట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. ఐదేళ్లలో తెలంగాణలో ఐటీ ఎగుమతులు (రూ.కోట్లలో) ఆర్థిక సంవత్సరం ఎగుమతులు 2013–14 57,258 2014–15 66,276 2015–16 75,070 2016–17 85,470 2017–18 93,442 ఎగుమతులు, ఉద్యోగాలు.. అన్నింటా ఐటీ వృద్ధి (ఎగుమతులు రూ.కోట్లలో) -
లక్ష మంది యువతకు శిక్షణలో విజనెట్ ఇండియా
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీపీఎం రంగాల్లో ఉద్యోగాలకు అనుగుణంగా 1 లక్ష మంది గ్రాడ్యుయేట్స్‌కు తగు శిక్షణ కల్పించాలని బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సంస్థ విజనెట్ ఇండియా నిర్దేశించుకుంది. 500 మంది యువ ప్రొఫెషనల్స్‌తో 45 రోజుల ప్రోగ్రాం తొలి బ్యాచ్‌ను ప్రారంభించిన సందర్భంగా సంస్థ ఎండీ అలోక్ బన్సల్ ఈ విషయం తెలిపారు. ’ఉన్నతి ఫర్ ఇండియా’ ప్రాజెక్టు కింద ఈ శిక్షణ ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు. ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేషన్ లభిస్తుందని తెలిపారు. ఫ్రెషర్లకు సాధారణంగా తమ సంస్థలో 3–4 దశల్లో వడపోత ఉంటుందని, ఈ శిక్షణ పొందినవారు ఒక్క రౌండును పూర్తి చేస్తే సరిపోతుందని బన్సల్ చెప్పారు. -
నైపుణ్య కేంద్రాలతో పారిశ్రామిక ప్రగతి
ఏడాదిలోగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఒకే నమూనాలో అందుబాటులోకి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఇందుకు అవసరమైన భూమిని గుర్తించడంతోపాటు, ఆర్థిక వనరుల సమీకరణను 45 రోజుల్లోగా పూర్తి చేయాలి. ప్రభుత్వం వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ ఈ విభాగం పరిధిలోకి తీసుకురావాలి. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో కోర్సులు, సిలబస్, శిక్షణా కార్యక్రమాలు, ఇతర ప్రణాళిక అంశాల కోసం పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో ఉన్నత విద్యా మండలి, ఐటీ విభాగాలకు చెందిన అధికారులను సభ్యులుగా చేర్చాలి. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడం కోసం విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖలు కలసి పని చేయాలి. సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచాలని, దేశంలోనే నైపుణ్య వికాస కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 30 నైపుణ్య కేంద్రాలతో పాటు, ఐటీ రంగం కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఐటీ పాలసీ, నైపుణ్యాభివృద్ధిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రంతో పాటు, నాలుగు ట్రిపుల్ ఐటీలకు అనుబంధంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వీటితోపాటు పులివెందుల జేఎన్టీయూలో కూడా మరో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పాలన్నారు. ఈ కేంద్రాల్లో పాఠ్య ప్రణాళిక, పర్యవేక్షణ, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కోర్సులను ఆధునికీకరించడం కోసం కేంద్రీకృత అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌ను ముందుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతిభావంతుల్లో నైపుణ్యం పెంచాలి ఐటీ రంగానికి అవసరమైన నిపుణులను అందించడం కోసం విశాఖలో హైఎండ్ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలతో పోటీ పరిస్థితి రావాలంటే నైపుణ్యాలకు అనుగుణంగా నగరాలను అభివృద్ధి చేయడమే మార్గమన్నారు. ఇంజనీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని ఎంపిక చేసి, ఈ హైఎండ్ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో శిక్షణ ఇప్పించడం ద్వారా వారిలో నైపుణ్యాన్ని మరింత పెంచాలని సూచించారు. విశాఖ కేంద్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత దీనికి అనుబంధంగా మధ్య ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో మరో రెండు సంస్థలను ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండని సూచించారు. క్యాంప్ కార్యాలయంలో ఐటీ పాలసీ, నైపుణ్యాభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్ డీ–శాలినేషన్ నీరు ఉపయోగించాలి కోస్తా ప్రాంతంలో సాధ్యమైనంత వరకు పరిశ్రమలకు మంచి నీటికి బదులు శుద్ధి చేసిన సముద్రపు నీరు (డీ–శాలినేషన్) అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఇజ్రాయిల్ వంటి దేశాల్లో డీశాలినేషన్ నీటిని లీటర్ నాలుగు పైసలకే విక్రయిస్తున్నారని, ఈ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా పరిశ్రమలకు మంచి నీటిని బదులు సముద్రపు నీటిని వినియోగించుకునేలా చూడాలన్నారు. ఇందుకోసం సంబంధిత కంపెనీలతో మాట్లాడి డీ–శాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం రూ.4,500 కోట్లకు పైగా పరిశ్రమలకు రాయితీలు చెల్లించకుండా బకాయిలు పెట్టిందని, రాష్ట్రంపై నమ్మకంతో ఇక్కడ పరిశ్రమలు పెడితే వారికి రాయితీలు కూడా చెల్లించకుండా మోసం చేసిందన్నారు. ఐటీ రంగంలో రాష్ట్రానికి ఉన్న అవకాశాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా పాలసీ రూపకల్పనపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి గౌతం రెడ్డి, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధు, స్కిల్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనంతరాము, ఐటీ, సివిల్ సప్లైయిస్ ప్రిన్సిపల్ కార్యదర్శి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి: ఐటీ, నైపుణ్యాభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్షించారు. నైపుణ్య వికాస కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా అత్యుత్తమ స్థాయిలో.. నైపుణ్యాభివృద్ధి కోసం కొత్తగా 30 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కేంద్రం చొప్పున 25 కేంద్రాలు, నాలుగు ట్రిపుల్ ఐటీలకు అనుబంధంగా ఒక్కొక్కటి, పులివెందుల జేఎన్టీయూకు అనుబంధంగా మరో కేంద్రం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటి పర్యవేక్షణకు ఒక కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేసి, దానిని భవిష్యత్‌లో విస్తరించాలని సీఎం చెప్పారు. విశాఖలో ఐటీ రంగానికి సంబంధించిన హై ఎండ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీనికి అనుబంధంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మరో 2 సంస్థల్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు వీటిల్లో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఆయన స్పష్టం చేశారు. వీటికి సంబంధించి 45 రోజుల్లోగా భూముల గుర్తింపు, ఆర్థిక వనరుల సమీకరణ పూర్తి కావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో.. పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పెట్టుబడులతో మరిన్ని కంపెనీలొస్తున్నాయి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతులు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఐటీ, పరిశ్రమల శాఖ కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. వివిధ రంగాల అవసరాల కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ద్వారా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కుల స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా పార్కుల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనుల పురోగతి, భూ సేకరణ తదితర అంశాలపైనా సమీక్ష నిర్వహించారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో పెట్టుబడులకు ఆసక్తి బుగ్గపాడు, బండమైలారం, బండ తిమ్మాపూర్ ఫుడ్‌పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీల వివరాలను అధికారులు మంత్రికి నివేదించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇప్పటికే హట్సన్ అగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ రూ.207 కోట్ల పెట్టుబడితో సంగారెడ్డి జిల్లా గోవింద్‌పూర్‌లో దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం తయారీ ప్లాంటును నిర్మిస్తోందన్నారు. వంద మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ ప్లాంటు ద్వారా సుమారు 4 వేల మంది పాడి రైతులకు మేలు కలగడంతో పాటు, ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సంబంధించి ఆయా కంపెనీలు త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. టెక్స్టైల్ రంగం అభివృద్ధికి అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉందని మంత్రి కేటీఆర్ వివరిస్తూ.. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. టెక్స్టైల్ పార్కులో అవసరమైన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. త్వరలో ‘టీ హబ్’ రెండో దశ పూర్తి వివిధ రంగాల్లో స్టార్టప్‌ల ద్వారా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న ‘టీ హబ్’ రెండోదశ భవన నిర్మాణం త్వరలో పూర్తవుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రెండో దశ ప్రారంభం తర్వాత టీ హబ్ దేశంలోనే అతిపెద్ద ఐటీ ఇంక్యుబేటర్‌గా అవతరిస్తుందన్నారు. దీంతో పాటు ఈ ఏడాది జూలైలో దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ‘టీ వర్క్స్’ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఐటీ పరిశ్రమలను నగరం నలుమూలలా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ పరిశ్రమ విస్తరణకు అవసరమైన పార్కుల అభివృద్ది, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఐటీ టవర్లలో తమ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. కరీంనగర్లో కొత్తగా నిర్మించిన ఐటీ టవర్‌ను ఈ నెల 18న ప్రారంభిస్తున్నామని, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం పట్టణాల్లోనూ ఐటీ టవర్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ద్వితీయశ్రేణి నగరాల్లోని ఐటీ టవర్లలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకొచ్చే కంపెనీలతో సంప్రదింపులు జరపాలని ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు మంత్రి సూచించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్కరాజకణ్ణన్, టెక్స్టైల్స్ డైరెక్టర్ శైలజా రామయ్యర్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహరెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
...మేధో మార్గదర్శకం
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్తగా వాడుకలోకి వస్తున్న నూతన సాంకేతికత కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ)కు సంబంధించి జాతీయ స్థాయిలో పరిశోధనలకు తెలంగాణ మార్గనిర్దేశనం చేయనుంది. ఏఐ పరిశోధనలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించే బాధ్యతను కేంద్రం 2017లో నీతి ఆయోగ్‌కు అప్పగించింది. ‘ఏఐ ఫర్ ఆల్’పేరిట నీతి ఆయోగ్ గతేడాది నివేదిక విడుదల చేసింది. వివిధ రంగాల్లో ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఐరావత్ అనే ఐటీ ప్లాట్‌ఫారంతో పాటు ఏఐ రంగంలో పరిశోధన, అభివృద్ధి కోసం రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దేశంలో 5 సెంటర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్సలెన్స్ (కోర్), 20 ఇంటర్నేషనల్ సెంటర్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఇక్టయ్) ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో కోర్, ఇక్టయ్ ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాల కోసం తెలంగాణ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ పలుసార్లు సంప్రదింపులు జరిపింది. ఏఐ సాంకేతికతకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి రంగాలకు హైదరాబాద్ చిరునామాగా మారుతున్న నేపథ్యంలో ఏఐ రీసెర్చ్ సెంటర్ల మార్గదర్శకాలు ఖరారు చేసే బాధ్యతను తెలంగాణకు అప్పగించింది. ఏఐ రీసెర్చ్ సెంటర్లు ఏ తరహాలో ఉండాలి.. వాటిలో ఏ రకమైన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనే అంశంపై మార్గదర్శకాలు రూపొందించి నీతి ఆయోగ్‌కు సమర్పిస్తామని ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఏఐ పరిశోధనలో కోర్, ఇక్టయ్ కీలకం దేశంలో ప్రస్తుతం ఏఐ సాంకేతికత తీరు తెన్నులను అర్థం చేసుకుని, మరింత పురోగతి సాధించడం లక్ష్యంగా కోర్ సెంటర్లలో పరిశోధన జరుగుతుంది. కోర్ పరిశోధనలో సాధించే ఫలితాల ఆధారంగా ప్రైవేటు రంగం సహకారంతో నూతన ఏఐ అప్లికేషన్ల రూపకల్పనపై ఇక్టయ్‌లు పనిచేస్తాయి. కోర్, ఇక్టయ్‌లలో ఏ రకమైన పరిశోధనలు జరగాలనే కోణంలో తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి నీతి ఆయోగ్‌కు అందిస్తుంది. దేశంలో ఏఐ సాంకేతికతకు రూపునిచ్చేందుకు ఐరావత్ ప్లాట్ఫారం రూపకల్పన, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు రూ.7,500 కోట్లు కేటాయించాలని కేంద్రానికి నీతి ఆయోగ్ ప్రతిపాదనలు సమర్పించింది. మూడేళ్ల పాటు ఈ నిధులను దశలవారీగా విడుదల చేసేందుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 2035 నాటికి భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఏఐ వాటా సుమారు రూ.69 లక్షల కోట్లు ఉంటుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. ఏఐ పరిశోధన, వినియోగంలో అగ్రస్థానంలో ఉన్న చైనా మాత్రం వచ్చే రెండు మూడేళ్లలోనే సుమారు రూ.10 లక్షల కోట్లకు ఏఐ వాటాను చేర్చాలని ప్రయత్నిస్తోంది. కృత్రిమ మేధో సంవత్సరంగా 2020 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వస్తున్న నూతన సాంకేతికతల పరిశోధన, అభివృద్ధి రంగాలకు తెలంగాణ చిరునామాగా మారుతోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్ వంటి కొత్త సాంకేతికతలపై జరిగే పరిశోధన, అభివృద్ధి రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రముఖ ఐటీ కంపెనీలు రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏఐ సాంకేతికత వినియోగంలో తెలంగాణ ముందంజలో ఉంది. వ్యవసాయం, పట్టణీకరణ, రవాణా, ఆరోగ్య రంగాల్లో కీలక సవాళ్ల పరిష్కారానికి ఏఐ ఐటీ సాంకేతికతను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారంగా భావిస్తోంది. ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020ని ‘ఇయర్ ఆఫ్ ఏఐ’(కృత్రిమ మేధో సంవత్సరం)గా ప్రకటించింది. ఏఐ అంటే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇటీవల విరివిగా వినియోగంలోకి వస్తున్న కొత్త సాంకేతికత పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భవిష్యత్తులో ఏఐ వినియోగం పెరుగుతుందని చెబుతున్న ఐటీ నిపుణులు.. ఇప్పటికే మన నిత్య జీవితంలో ఏఐ వినియోగం ప్రారంభమైందని చెబుతున్నారు. మనుషుల తరహాలో యంత్రాలు ఆలోచించి, సొంతంగా నిర్ణయాలు తీసుకుని, ఆచరించడమే కృత్రిమ మేధస్సు (ఏఐ)గా పేర్కొంటున్నారు. మనుషుల గొంతులు, ముఖాలను కంప్యూటర్లు, సెల్ఫోన్లు గుర్తు పట్టడం, మనం వాటికి ఇచ్చే సవాళ్లను పరిష్కరించడం, ఏదైనా పనిని అప్పగిస్తే ఏఐ సాంకేతికత పూర్తి చేస్తుందన్న మాట. -
సోషల్ మీడియాకు కొత్త ఐటీ నిబంధనలు..
సోషల్ మీడియాలో వదంతులకు చెక్ పెట్టే విధంగా కేంద్రం కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)నిబంధనలు రూపొందిస్తోంది. వీటి ప్రకారం సోషల్ మీడియా సంస్థలు వివాదాస్పద సమాచారం మూలాలు గుర్తించడంతో పాటు నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోగా సదరు సమాచారాన్ని తమ ప్లాట్‌ఫాంల నుంచి తొలగించాల్సి ఉంటుంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే రాజ్యసభకు ఈ విషయం తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు, మెసేజింగ్ యాప్స్ ద్వారా ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందకుండా తీసుకోతగిన చర్యల గురించి కేంద్రం గతేడాది డిసెంబర్లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీటిని విశ్లేషించిన మీదట తాజా నిబంధనలు రూపొందించింది. -
కంపెనీ పెట్టండి..రాయితీ పట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2016లో ‘ఎలక్ట్రానిక్స్ పాలసీ’ని రూపొందించింది.దీని అమలులో అనుసరించాల్సిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఎలక్ట్రానిక్స్ పాలసీ మార్గదర్శకాల ముసాయిదాను ఇటీవల సిద్ధం చేసిన ఐటీ శాఖ..త్వరలో ప్రభుత్వ ఆమోదానికి పంపనుంది. పాలసీ అమలు తేదీ.. ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ‘ఈ–పాలసీ’కి ప్రభుత్వం ఆమోదం తెలిపితే రాష్ట్రంలో ‘ఈ– పరిశ్రమల’స్థాపన వేగం కానుందని ఐటీ శాఖ అంచనా. ఇది అమల్లోకి వస్తే ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ రంగంలోని సూక్ష్మ, చిన్న, మధ్య, పెద్ద, భారీ పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపు, సరసమైన ధరల్లో భూ కేటాయింపు, నాలా నిబంధనల సడలింపు, గరిష్టంగా రూ.50 లక్షలకు మించకుండా పెట్టుబడి రాయితీ వంటి అంశాలు మార్గదర్శకాల్లో పొందుపరిచారు. కంపెనీ ఏర్పాటుకు భూమి కొంటే... ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటుకు భూమి కొనుగోలు చేసే సంస్థకు వంద శాతం స్టాంప్ డ్యూటీతో పాటు, బదలాయింపు పన్ను,, రిజిస్ట్రేషన్ ఫీజును ప్రభుత్వం రీయంబర్స్ చేస్తుంది. ఒక వేళ అది రెండో లావాదేవీ అయ్యే పక్షంలో పైన పేర్కొన్న వాటిలో 50శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే షెడ్లు, భవనాలు తదితరాలపైనా స్టాంప్ డ్యూటీని పూర్తిగా మినహాయిస్తారు.పరిశ్రమల స్థాపనకు వీలుగా భూములు అందుబాటు ధరల్లో లభించేలా చూడటంతో పాటు, లీజుకు తీసుకుని ఏర్పాటు చేసే సంస్థలకు పదేళ్ల పాటు 25% లీజ్ రెంటల్ సబ్సిడీ ఇస్తారు. మహేశ్వరంలోని ‘ఈ– సిటీ’లో ఏర్పాటయ్యే తొలి 30 పరిశ్రమలకు భూమి కొనుగోలుపై 60% సబ్సిడీ లభించనుంది. ఎలక్ట్రానిక్స్ కంపెనీలు స్థాపించే ప్రైవేటు సంస్థలకు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు అవసరమైన ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. పెట్టుబడిపై గరిష్టంగా రూ.50 లక్షల రాయితీ సూక్ష్మ, చిన్న తరహా కేటగిరీలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఏర్పాటు చేసే తొలి 50 సంస్థలకు 20శాతం పెట్టుబడి రాయితీ లేదా గరిష్టంగా 50లక్షల రాయితీ ఇవ్వాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 35%, మహిళా పారిశ్రామికవేత్తలకు 45% వరకు పెట్టుబడి రాయితీ కల్పిస్తారు. మధ్య, పెద్ద, భారీ తరహా పరిశ్రమల కేటగిరీలో అర్హత కలిగిన తొలి 25 పరిశ్రమలకు 20 % రాయితీ లేదా గరిష్టంగా రూ.2 కోట్ల మేర రాయితీ లభిస్తుంది. భవనం, యంత్రాలపై పెట్టుబడికి గాను ఆయా పరిశ్రమలు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది మొదలు ఐదు నుంచి ఏడేళ్ల వరకు కేటగిరీ ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీ ఇస్తారు. సూక్ష్మ పరిశ్రమలు యంత్రాలపై పెట్టే మొత్తంలో 10% సాయాన్ని ప్రభుత్వమే అందజేయనుంది. నాణ్యత సర్టిఫికెట్ల వ్యయంపైనా సబ్సిడీ ఉత్పత్తులకు గాను చైనా కంపల్సరీ సర్టిఫికెట్, కన్ఫర్మిటీ యూరోపియన్, యూఎల్ సర్టిఫికెషన్, ఐఎస్ఓ తదితర అంతర్జాతీయ నాణ్యత సర్టిఫికెట్ల కోసం ఈ పరిశ్రమలు పెట్టే ఖర్చులో 50శాతం లేదా గరిష్టంగా రూ.2లక్షలను ప్రభుత్వమే భరిస్తుంది. క్లీన్ ఎనర్జీ వినియోగించే పరిశ్రమలకు గరిష్టంగా రూ.2లక్షలు రాయితీ ఇవ్వడంతో పాటు, వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్ల పాటు వంద శాతం విద్యుత్ సుంకంపై మినహాయింపు ఇస్తారు. తెలంగాణ కేంద్రంగా ఉండే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు పేటెంట్ల సాధన కోసం ఖర్చులో 50% లేదా గరిష్టంగా రూ.2లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. విడి భాగాల రవాణాకు అయ్యే వ్యయంపైనా ఐదేళ్ల పాటు గరిష్టంగా 60% నుంచి 20% వరకు సబ్సిడీ కల్పిస్తారు. 50 మందికి ఉపాధి కల్పించే ‘ఈ పరిశ్రమలకు’రూ.5లక్షలను రిక్రూట్మెంట్ అసిస్టెన్స్‌గా ఐటీ శాఖ అందజేయనుంది -
ఐటీ సలహాదారులను నియమించిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారులుగా ముగ్గురు నిపుణుల్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జె. విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ దేవిరెడ్డిలను ఐటీ సాంకేతిక సలహాదారులుగా నియమించగా.. కె. రాజశేఖర్ రెడ్డిని ఐటీ పెట్టుబడులు, పాలసీదారులుగా నియమించారు. ఈ మేరకు ఐటీ ముఖ్య కార్యదర్శి అనూప్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ట్విటర్‌కు పది రోజులు గడువు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్ మీడియా సంస్థలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై నియమించిన పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. సోమవారం (ఫిబ్రవరి 25)న ట్విట్ర్ అధికారులతో చర్చించిన కమిటీ రాబోయే పార్లమెంటు ఎన్నికలు విదేశీ సంస్థల చేత ప్రభావితం కావు అనే హామీ ఇవ్వాలని, ఇదే అంశంపై భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)తో మరింత సన్నిహితంగా చర్చలు జరపాలని కమిటీ చైర్మన్, ఎంపీ అనురాగ్ ఠాకూర్ కోరారు. ఈ అంశాలపై రాత పూర్వకంగా స్పందించేందుకు ట్విటర్ సీఈవో జాక్ డోర్సేతోపాటు ఇతర సీనియర్ అధికారులకు 10రోజులు గడువును ఇచ్చారు. అవసరమైతే ఇదే విషయంపై మరోసారి సమన్లు జారీ చేసే అవకాశం ఉందని కూడా ఆయన సూచించారు. సోషల్ మీడియా వేదికలపై 'పౌరుల హక్కులను పరిరక్షించడం' అనే అంశంపై వారి అభిప్రాయాలను తెలిపేందుకు వాట్సాప్‌తోపాటు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లక ప్రతినిధులకు కూడా సమన్లు జారీ చేసింది. మార్చి 6వ తేదీన ఆయా సంస్థలకు చెందిన సీనియర్లు కమిటీ ముందు హాజరుకావాలని కోరారు. రాబోయే లోక్ సభఎన్నికల్లో సోషల్ మీడియా సంస్థలు ఎటువంటి ప్రభావాలు చూపించకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అనురాగ్ ఠాకూర్ కోరారు. సోషల్ మీడియా సంస్థలు.. ఎన్నికల సమస్యలపై ఎన్నికల సంఘంతో కలిసి పనిచేయాలన్నారు. అంతకుముందు ట్విటర్ వైస్ ప్రెసిడెంట్,పబ్లిక్ పాలసీ హెడ్ కోలిన్ క్రోవెల్‌తో కమిటీ దాదాపు మూడున్నర గంటలపాటు చర్చించింది. ఈ సమావేశంలో సీఈవో జాక్ డోర్సీ రాసిన లేఖను అనురాగ్ ఠాకూర్ చదివి వినిపించినట్టు తెలుస్తోంది. కాగా సోషల్ మీడియాలో పౌరుల హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో పార్లమెంటరీ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ నెల ఒకటవ తేదీన ట్విటర్ సంస్థకు ప్రభుత్వం సమన్లు కూడా జారీ చేసింది. సమయం తక్కువగా ఉందంటూ ట్విటర్ అధికారులు నిరాకరించడంతో, సమావేశం వాయిదా పడుతూ వచ్చింది. వాస్తవానికి ఈ మీటింగ్ తొలుత ఫిబ్రవరి7నుంచి 11వ తేదీకి వాయిదా పడింది. అనంతరం ట్విటర్ అధికారులు గైర్హాజరుకావడంతో పార్లమెంటరీ కమిటీ 15రోజుల్లో కమిటీ హాజరు కావాలంటూ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. Twitter will appear before the Parliamentary Commitee today 25th Feb. Facebook, WhatsApp, Instagram will appear on 6th March. https://t.co/0sIOhVZIdZ — Anurag Thakur (@ianuragthakur) February 25, 2019 -
ఐటీ, క్రీడలను విస్తరిస్తాం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇతర నగరాలతో పోల్చుకుంటే మౌలిక వసతులు బాగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య లేదని తెలిపారు. శనివారం జరిగిన స్పిరిట్ ఆఫ్ తెలంగాణ సమావేశంలో పాల్గొన కేటీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. నైపుణ్యమున్న ఐటీ నిపుణులు ఉండటంతో హైదరాబాద్ ఐటీకి అడ్వాంటేజ్ అని పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కశ్యప్‌లు తనను కలిసి వారి వివాహానికి ఆహ్వానించారని కేటీఆర్ తెలిపారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలోని ఇతర పట్టణాలతో పోల్చితే ఐటీ ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్. త్వరలో ఐటీ కారిడార్‌లో మొత్తం ఎలక్ట్రానిక్ వాహనాలను ఉపయోగిస్తాం. ఎలివేటెడ్ బస్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌ను తెస్తాం. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను పొడిగిస్తాం. పొల్యుషన్ లేని హైదరాబాద్‌గా తయారుచేస్తాం. క్రీడలతో పాటు ఐటీ కారిడార్లను విస్తరిస్తాం, యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. వివిధ రంగాల్లో యువతను ప్రోత్సహిస్తున్నాం. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా మా నిర్ణయాలు ఉంటాయి. టీఆర్ఎస్ తీసుకువచ్చిన విధానాలతోనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారింది. ఈ ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్నే ఎన్నుకుంటార’ని అన్నారు. -
హైదరాబాద్‌కు మరో 15 విదేశీ దిగ్గజాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఐఓటీ వంటి కొత్త టెక్నాలజీలు ఐటీ రంగం రూపాన్ని మార్చేస్తుండటంతో ఈ రంగంలో కొత్త పెట్టుబడులకు విదేశీ దిగ్గజాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఐటీ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హైదరాబాద్‌ను ఇందుకు వేదిక చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దాదాపు 10 విదేశీ దిగ్గజాలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. ‘‘ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఖరారు కాకుండా వెల్లడించకూడదన్న (నాన్ డిస్‌క్లోజన్) నిబంధనల కారణంగా వాటి పేర్లను వెల్లడించలేం. కాకపోతే వీటిద్వారా రూ.15వేల కోట్ల పెట్టుబడులు, 75వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి’’ అని ఐటీ విభాగం ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. గడిచిన నాలుగేళ్లలో తెలంగాణలో 150కిపైగా భారీ, మధ్య తరహా కంపెనీలు కార్యాలయాలను ఏర్పాటు చేశాయని, టీ హబ్ ఏర్పాటుతో భారీగా స్టార్టప్‌లు వచ్చాయని చెప్పారాయన. కాగా అమెరికాకు చెందిన రెండు ఫాస్ట్‌ఫుడ్ కంపెనీలు ఇక్కడ అతిపెద్ద టెక్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయటానికి చేస్తున్న ప్రయత్నాలు తుది దశలో ఉన్నట్లు కూడా విశ్వసనీయంగా తెలిసింది. వీటితో పాటు అంతర్జాతీయంగా పేరొందిన ఆటోమొబైల్ కంపెనీ తన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని త్వరలోనే ఇక్కడ ఏర్పాటు చేయనుంది. మరోవంక కొరియాకు చెందిన కార్ల విడిభాగాల తయారీ సంస్థ హ్యూందాయ్ మొబిస్ భారీ క్యాంపస్‌ను హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తున్నట్టు సెప్టెంబరులో ప్రకటించింది. 20 ఎకరాల్లో రానున్న ఈ ఫెసిలిటీ ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఐటీలో 4.75 లక్షల మంది... తెలంగాణలో ఐటీ, ఐటీఈఎస్ రంగంలో 2018 జూన్ నాటికి 4.75 లక్షల పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో గడిచిన ఏడాదిలో చేరినవారు 43,417 మంది. గత నాలుగేళ్లలో ఐటీలో దాదాపు 1.5 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలొచ్చాయనేది సంబంధిత వర్గాల మాట. ఇక ఐటీ ఎగుమతులు 2013–14లో రూ.52,258 కోట్లుంటే, నాలుగేళ్లలో రూ.93,442 కోట్లకు ఎగిశాయి. నాస్కాం గణాంకాల ప్రకారం ఐటీ ఎగుమతులు దేశంలో సగటు 7–9% నమోదైతే.. తెలంగాణలో ఇది 9.32 శాతం. 2020 నాటికి ఎగుమతులు రూ.1.20 లక్షల కోట్లు దాటుతాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. టీఎస్ ఐపాస్‌తోనే: కేటీఆర్ తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యంగా రాష్ట్రాన్ని మార్చామని కేటీఆర్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు భౌగోళిక సానుకూలతలున్నాయి. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో టీఎస్ ఐపాస్ వంటి వినూత్న పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను తీసుకురావడం దీనికి తోడయింది. దీంతో రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులొచ్చాయి. మున్ముందు కూడా ఈ అనుకూల వాతావరణాన్ని కొనసాగిస్తాం. మరిన్ని పెట్టుబడులను రప్పించి ఉద్యోగావకాశాలు పెంచుతాం. రానున్న సంవత్సరాల్లో తెలంగాణ మరింత వేగంగా పెట్టుబడులను ఆకర్షిస్తుందన్న నమ్మకం నాకుంది’ అని చెప్పారాయన. -
జీతాల్లో బెంగళూరే ముందు!
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాజధాని బెంగళూరులో ప్రొఫెషనల్స్ అత్యధిక జీతభత్యాలు అందుకుంటున్నారు. వీరి వేతనాలు సగటున వార్షికంగా రూ.10.8 లక్షల మేర ఉంటున్నాయి. రూ. 10.3 లక్షలతో పుణే, రూ. 9.9 లక్షలతో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) టాప్ 3 నగరాల్లో నిల్చాయి. కన్సల్టెన్సీ సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియాలో భాగమైన రాండ్‌స్టాడ్ ఇన్సైట్స్ రూపొందించిన శాలరీ ట్రెండ్స్ 2018 నివేదిక ఈ విషయాలు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... రూ.7.9 లక్షల సగటు వేతనంతో హైదరాబాద్ ఆరో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో ముంబై (రూ. 9.2 లక్షలు), అయిదో ర్యాంకులో చెన్నై (రూ. 8 లక్షలు) ఉన్నాయి. ఉద్యోగ విధుల రీత్యా చూస్తే కన్సల్టింగ్, అడ్వైజరీ ఉద్యోగులు అత్యధికంగా వేతనాలు అందుకుంటున్నారు. కొన్ని ఉద్యోగాల్లో 6–10 ఏళ్ల అనుభవం ఉన్న వారికి భారీ జీతభత్యాలు లభిస్తున్నాయి. 20 రంగాల్లో విభాగాలు, 15 రకాల ఉద్యోగ విధులు, 1,00,000 పైగా ఉద్యోగాల విశ్లేషణ ఆధారంగా రాండ్‌స్టాడ్ ఇండియా ఈ నివేదిక రూపొందించింది. ఫార్మా, హెల్త్‌కేర్‌లో భారీ జీతాలు.. రంగాలవారీగా చూస్తే ఫార్మా, హెల్త్‌కేర్ సంస్థలు అత్యధిక జీతభత్యాలు ఇస్తున్నాయి. ఈ రంగంలో సగటు వార్షిక సీటీసీ (కాస్ట్ టు కంపెనీ) రూ. 9.6 లక్షలుగా ఉంది. ఇక, వస్తు సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చినప్పట్నుంచి తత్సంబంధిత సర్వీసులు అందించే ప్రొఫెషనల్స్‌కి డిమాండ్ గణనీయంగా పెరిగింది. రూ. 9.4 లక్షల సగటు వేతనాలతో ప్రొఫెషనల్ సర్వీసుల విభాగం రెండో స్థానంలో ఉంది. ఇక రూ. 9.2 లక్షల సగటు సీటీసీతో ఎఫ్ఎంసీజీ మూడో స్థానంలో, రూ. 9.1 లక్షలతో ఐటీ రంగం నాలుగో ర్యాంకులో, రూ. 9.0 లక్షలతో ఇన్ఫ్రా.. రియల్ ఎస్టేట్.. నిర్మాణ రంగం అయిదో స్థానంలో ఉన్నాయి. వృత్తి విద్యా నిపుణులకు సంబంధించి.. స్పెషలిస్టు డాక్టర్ల సీటీసీ అత్యధికంగా సగటున వార్షికంగా రూ. 18.4 లక్షలుగా ఉంటుండగా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌ల సీటీసీ రూ. 15.1 లక్షలు, ప్రొడక్టు ఇంజనీరింగ్ స్పెషలిస్టులు రూ. 14.8 లక్షలు, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ నిపుణులు రూ. 14.6 లక్షలు అందుకుంటున్నారు. -
2018లో దేశీ ఐటీకి మంచి రోజులు..
హైదరాబాద్: అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా మెరుగుపడుతోంది కాబట్టి దేశీ ఐటీ రంగానికి వచ్చే ఏడాది మెరుగ్గా ఉండగలదని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. టెక్నాలజీపై వ్యయం పెరగనుందని, కస్టమర్ల నుంచి డిమాండ్ కూడా ఎక్కువవుతుందని భావిస్తున్నట్లు వారు చెప్పారు. భారత ఐటీ రంగం ప్రధానంగా ఆధారపడే అమెరికా మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకోగలగడమన్నది దేశీ సంస్థలకు కీలకమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో వి.బాలకృష్ణన్ చెప్పారు. ‘అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా బాగా మెరుగుపడింది. వార్షికంగా సుమారు 2–2.5 శాతం మేర వృద్ధి చెందుతోంది. ఇది అమెరికా వంటి దేశానికి మెరుగైన వృద్ధి రేటే. పైపెచ్చు అక్కడ ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్... కార్పొరేట్ పన్నుల్ని తగ్గిస్తామని చెబుతున్నారు. దీంతో ఐటీపై కంపెనీలు చేసే వ్యయాలు కూడా 4–4.5 శాతం మేర పెరగబోతోంది. కాబట్టి వ్యాపార వృద్ధికి అవకాశాలు బాగున్నాయనే చెప్పొచ్చు. కాకపోతే వాటిని మన ఐటీ కంపెనీలు ఎంత మేర అందిపుచ్చుకోగలవన్నదే కీలకం’’ అని ఆయన వివరించారు. ఇక భారత ఐటీ కంపెనీల సమాఖ్య నాస్కామ్.. 2017–18లో ఐటీ ఎగుమతులు 7–8% మేర పెరగొచ్చని, దేశీ మార్కెట్ 10–11% మేర వృద్ధి చెందవచ్చని వేసిన అంచనాలు సహేతుకంగానే కనిపిస్తున్నాయన్నారు. అంతర్జాతీయంగా ఐటీపై ఏటా 3.7 లక్షల కోట్ల డాలర్ల వ్యయాలు ఉంటుండగా.. ఇందులో మూడో వంతు ఐటీ సర్వీసులదేనని బాలకృష్ణన్ తెలిపారు. అటు ఇన్ఫోసిస్ మరో మాజీ సీఎఫ్‌వో టీవీ మోహన్‌దాస్ పాయ్ సైతం డిజిటల్ కార్యకలాపాలు వేగవంతమవుతున్నాయని చెప్పారు. -
ఐటీ సర్టిఫికేషన్స్.. కెరీర్ వెలుగులు
ఇది డిజిటల్ ప్రపంచం! ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వివిధ రంగాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. అన్ని రంగాల్లోనూ ఐటీ వినియోగం ఎక్కువైంది. దాంతో సంబంధిత రంగాల్లో ఐటీ సర్టిఫికేషన్ కోర్సులను అభ్యసించినవారికి అపార అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. రెగ్యులర్ డిగ్రీ కోర్సులతోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీ సర్టిఫికేషన్ కోర్సులను చేస్తే మంచి ఉద్యోగాన్ని దక్కించుకున్నట్లే! వీటి ద్వారా సంబంధిత సబ్జెక్టుల్లో అవసరమైన స్కిల్స్‌ను కూడా మెరుగుపరుచుకోవచ్చు. పరిశ్రమలు, కంపెనీలు కూడా సంబంధిత రంగంలో ఐటీ సర్టిఫికేషన్ కోర్సులు చేసినవారికి పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఐటీ సర్టిఫికేషన్ కోర్సులపై ఫోకస్... స్పెషలైజేషన్ కోర్సులకనుగుణంగా ఐటీ సర్టిఫికేషన్స్‌లో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థి ఎంచుకున్న స్పెషలైజేషన్‌లో కంప్యూటింగ్ స్కిల్స్‌ను నేర్పడమే ధ్యేయంగా ఈ కోర్సులు ఉంటున్నాయి. ఉదాహరణకు క్లౌడ్ కంప్యూటింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, మొబైల్ బేస్డ్ అప్లికేషన్స్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, నెట్వర్కింగ్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ వంటివి. ప్రధానంగా బిజినెస్ సర్టిఫికేషన్ కోర్సుల్లో.. బిజినెస్ ఎనలిటిక్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది. ఇవే కాకుండా.. నేడు అందరికీ తెలిసిన ఆన్లైన్ షాపింగ్‌లో మెళకువలు తెలుసుకోవడానికి ఈ-కామర్స్; సేవారంగంలో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, డిజిటల్ మీడియా వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ముందుగా తమ విద్యా నేపథ్యానికి సరితూగే కోర్సులను, ఆసక్తి, ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్న ఐటీ/ఐటీ బేస్డ్ సర్టిఫికేషన్ కోర్సులను ఎంచుకోవాలి. దీంతోపాటు ఆ కోర్సులను అందిస్తున్న సంస్థల్లో పేరున్న (మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి) వాటిని ఎంచుకోవాలనేది నిపుణుల మాట. ఇంటర్మీడియెట్ తర్వాత ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక సర్టిఫికేషన్ కోర్సులు చేయడం మంచిదనేది నిపుణుల అభిప్రాయం. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం వివిధ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ).. ఐటీఈఎస్-బీపీవో(కస్టమర్‌కేర్) కోర్సును నిర్వహిస్తోంది. దీని వ్యవధి 100 గంటలు. ఈ కోర్సుకు ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూపునకు చెందిన విద్యార్థులైనా అర్హులే. ఇంటి నుంచే ఇంటర్నెట్ బ్రౌజింగ్ ద్వారా కంప్యూటర్ బేసిక్స్, హార్డ్‌వేర్, ఆఫీస్ ఆటోమేషన్ల గురించి తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా కామర్స్ విద్యార్థులు ఫైనాన్షియల్ అకౌంటింగ్‌పై పట్టు పెంచుకోవడానికి ఈ రంగంలో కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులను అభ్యసించవచ్చు. అదేవిధంగా సైన్స్ విద్యార్థులు బయోఇన్ఫర్మేటిక్స్లోని ముఖ్య అంశాలను గురించి తెలుసుకోవడానికి ఈ సర్టిఫికేషన్ కోర్సులు ఎంతో ఉపయుక్తం. అందించే సంస్థలు.. ఈ సర్టిఫికేషన్ కోర్సులను పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. వీటిలో ఎన్ఐఈఎల్ఐటీ, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీడాక్) వంటి పేరొందిన పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇవి.. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డీఈఐటీ), కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. ఐటీలో విద్య, పరిశోధనను పెంపొందింపజేయడం వీటి ప్రధానవిధి. కంప్యూటర్ అప్లికేషన్స్‌కు సంబంధించి దాదాపు అన్ని విభాగాల్లో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులను ఎన్ఐఈఎల్ఐటీ, సీడాక్లు అందిస్తున్నాయి. ఐటీ సర్టిఫికెట్స్ పొందినవారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొందుతున్నారు. కంపెనీలు కూడా నిర్దేశిత అంశంలో సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ కంపెనీలు.. ఏ సంస్థలైతే మంచి సదుపాయాలతో శిక్షణ అందించి, పరీక్షలు నిర్వహించి, విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దుతున్నాయో..వాటిని తరచుగా సందర్శించి, తమకు తగినవారిని ఎంపిక చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీ నిర్దేశిత సర్టిఫికేషన్స్ నేడు ప్రతి ఒక్క రంగంలోనూ.. ఆయా అవసరాలకు అనుగుణంగా ఐటీ అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. బిజినెస్ డేటా విశ్లేషణ, ఫ్యాషన్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్‌ల నుంచి సేవారంగాలైన హెల్త్‌కేర్, ఈ-కామర్స్ వరకూ.. ఐటీ రంగం విస్తరించింది. కంపెనీలు కూడా అభ్యర్థులు నిర్దేశిత అంశాల్లో, ఐటీ టూల్స్‌లో అవగాహన పొంది ఉండాలని, పూర్తిస్థాయీ పరిజ్ఞానం సాధించాలని కోరుకుంటున్నాయి. అందుకే ఐటీ సర్టిఫికేషన్ కోర్సులు పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్లో డిమాండ్ నెలకొంది. ఫ్యాషన్ నిఫ్ట్-హైదరాబాద్.. కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ కోర్సును అందిస్తోంది. 10+2 ఉత్తీర్ణులు మొదటి ఏడాది కోర్సులో చేరి ఫ్యాషన్ బిజినెస్‌లో ఐటీ పాత్రను అధ్యయనం చేయొచ్చు. హెల్త్‌కేర్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. హెల్త్‌కేర్ రంగంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. హెల్త్‌కేర్ మేనేజ్మెంట్, ఆస్పత్రి, రోగి ఆరోగ్య నివేదికలు మొదలైనవాటి రూపకల్పనలో ఐటీ ఉపయోగపడుతుంది. ఈ రంగంలో ఉద్యోగావకాశాలను పొందడానికి సీడాక్.. ఆరు నెలల వ్యవధి ఉన్న పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది. అదేవిధంగా ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్ రీసెర్చ్‌లో బయోఇన్ఫర్మేటిక్స్ది ప్రధాన పాత్ర. ఎన్ఐఈఎల్ఐటీ.. బయోఇన్ఫర్మేటిక్స్‌లో ‘ఎ’, ‘ఒ’ లెవల్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. 10+2, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారు ఈ కోర్సులకు అర్హులు. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ కామర్స్ ఉత్తీర్ణులు, వృత్తి నిపుణులు తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి సీడాక్.. డిప్లొమా కోర్సును అందిస్తోంది. కోర్సు వ్యవధి 144 గంటలు. పవర్‌పాయింట్, ట్యాలీ, అవుట్‌లుక్, ఐఎస్ఎం అండ్ ఎంఎస్ వర్డ్ వంటివి కరిక్యులంలో ప్రధానంగా ఉంటాయి. రోజువారీ ఆఫీసు విధుల్లో భాగంగా ఈ ఐటీ టూల్స్‌ను ఉపయోగించి పనులను త్వరగా పూర్తి చేసుకోవచ్చు. అన్ని ఆదాయ, వ్యయ పట్టికలను అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టూల్స్ ద్వారా ఆన్లైన్లో పొందుపర చుకోవచ్చు. ఈ-కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఉరుకుల పరుగుల జీవితంలో బయట షాపింగ్‌కు వెళ్లి కావలసిన వస్తువులు తెచ్చుకునేంత తీరికా, ఓపిక ఎవరికీ ఉండటం లేదు. ఇంట్లోనే ఉండి ఆన్లైన్ షాపింగ్ ద్వారా తమకు కావాల్సిన వస్తువులను తెప్పించుకుంటున్నారు. దుస్తులు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ఫోన్లు, జ్యుయెలరీ, ఆటబొమ్మలు, గృహోపకరణాలు.. ఇలా ఒకటేమిటి..! ప్రతిదానికీ ఆన్లైన్ షాపింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల వినియోగదారుడికి సమ యం ఆదా కావడంతోపాటు ఖర్చు కలిసి వస్తుంది. కంపెనీలు కూడా షాప్‌ల ఏర్పాటు, అద్దెలు, మానవ వనరుల ఖర్చులు, నిర్వహణా వ్యయం వల్ల తమ ఉత్పత్తులను ఆన్లైన్ షాపింగ్ ద్వారా విక్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్‌లో నిష్ణాతుల కోసం ఆయా కంపెనీలు అన్వేషిస్తున్నాయి. నేడు సంబంధిత కంపెనీల ఉత్పత్తుల ప్రచారంలో డిజిటల్ మార్కెటింగ్‌దే ప్రధాన పాత్ర. కోర్సులో భాగంగా డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి? సోషల్ మీడియాను డిజిటల్ మార్కెటింగ్‌కు ఎలా ఉపయోగించుకోవచ్చు? వంటివాటిని తెలియజేస్తారు. దీని ద్వారా గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులు, ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవచ్చు. తద్వారా చక్కటి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సీడాక్ ఆరు నెలల వ్యవధి ఉన్న డిప్లొమా ఇన్ ఈ-కామర్స్ కోర్సును అందిస్తోంది. దీని ద్వారా ఈ-కామర్స్‌లో ఉన్న వివిధ విభాగాల గురించి, ఈ-కామర్స్‌ను అభివృద్ధి చేయడం, సైట్ నిర్వహణా నైపుణ్యాలను తెలుసుకోవచ్చు. సాఫ్ట్వేర్ - హార్డ్‌వేర్ సర్టిఫికేషన్ కోర్సులు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) అభివృద్ధి వల్ల ఎన్నెన్నో కొత్త, కొత్త టెక్నాలజీలు ఆవిర్భవిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం- ప్రతి 18 నెలలకు కొత్త కంప్యూటర్ టెక్నాలజీ ఆవిష్కృతమవుతోంది. వివిధ రకాలైన కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి రకరకాల సర్టిఫికేషన్ కోర్సులున్నాయి. ఒక్కొక్క టెక్నాలజీలో ప్రావీణ్యం సంపాదించాలంటే దానికి సంబంధించిన కోర్సు చేసి సర్టిఫికేట్ సంపాదిస్తే కంపెనీల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ఈ సర్టిఫికేట్ కోర్సులన్నింటినీ దాదాపుగా ఆయా సాఫ్ట్వేర్ లేదా హార్డ్‌వేర్ కంపెనీలే ప్రోత్సహించడం గమనార్హం. ఒక్కొక్క కోర్సు.. ఒక్కొక్క సబ్జెక్టులో లేదా సాఫ్ట్వేర్ లేదా హార్డ్‌వేర్‌లో నిష్ణాతులను చేయడానికి నిర్దేశించింది. ఏ కోర్సు చేయాలన్నా బేసిక్స్‌లో మంచి అవగాహన అవసరం. ఈ కోర్సుల పరీక్షలన్నీ ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. వీటికి శిక్షణ ఎక్కడైనా తీసుకోవచ్చు. నిర్ధారిత రుసుం చెల్లించి పరీక్ష రాయొచ్చు. ఒకసారి ఏదైనా కోర్సు పరీక్షలో ఉత్తీర్ణులై సర్టిఫికేట్ సంపాదిస్తే దానికి సంబంధించిన ఉద్యోగం రావడం ఖాయం. జీతం కూడా ఎక్కువే. ప్రస్తుతం కనీసం 30 రకాల ఐటీ సర్టిఫికేట్ కోర్సులున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి 15 వరకు ఉంటాయి. ఇవన్నీ మంచి ఉద్యోగాన్ని సంపాదించిపెట్టేవే. వాటిని గురించిన వివరాలు.. హార్డ్‌వేర్ కోర్సులు సిస్కో సర్టిఫైడ్ ప్రొఫెషనల్ సిస్కో అనేది ఒక కంపెనీ. అది కంప్యూటర్ నెట్వర్కింగ్కి కావలసిన సామగ్రిని తయారుచేస్తుంది. ప్రపంచంలోనే ఇది అగ్రగామి సంస్థ. నెట్వర్కింగ్కి కావలసిన స్విచ్‌లు, రూటర్లు, పంచ్‌లు ఈ సంస్థ తయారు చేస్తుంది. కంప్యూటర్ నెట్వర్కింగ్ అనేది మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థకి గుండె వంటిది. ఉదాహరణకు బ్యాంకులు, రైల్వేలు, కరెంటు బిల్లులు కట్టడంలాంటివి అన్నీ కూడా సిస్కో తయారుచేసిన వస్తువులపైనే. వీటన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించడానికి చాలామంది నిపుణులు అవసరం. అంతేకాకుండా ఈ రంగంలో నానాటికీ వాడేవాటి సంఖ్య కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుండటం వల్ల నిపుణుల కొరత కూడా ఎక్కువ. అందువల్ల సీసీఎన్ఏ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు, మంచి జీతం పొందే అవకాశాలు పుష్కలం. సెక్యూరిటీ ప్రొఫెషనల్ ప్రధానమైన కోర్సు ఇది. అటు హార్డవేర్, ఇటు సాఫ్ట్వేర్ రెండింటికీ ఉపయుక్తం. మనం చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా జరగాలని కోరుకుంటాం. ఉదాహరణకు మనం ఆన్లైన్లో డబ్బు ఒక బ్యాంకు ఖాతా నుంచి ఇంకొక బ్యాంకు ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు అందులో ఏదైనా పొరపాటు జరిగి ఇంకొకరి ఖాతాలో జమ అయితే అప్పుడు పరిస్థితి ఏమిటి? దీనికోసం కొన్ని పద్ధతులు, సాఫ్ట్వేర్ డిజైన్ ఉన్నాయి. అందులో నిష్ణాతులను తయారుచేయడమే ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. సెక్యూరిటీ అనేది ఎప్పటికీ అవసరమైనది కాబట్టి, భవిష్యత్తులో దాని అవసరం చాలా ఉంటుంది కాబట్టి ఈ కోర్సు చేసినవారికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. సాఫ్ట్వేర్ కోర్సులు ...మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇందులో దాదాపు 15 రకాల కోర్సులున్నాయి. ఇవన్నీ మైక్రోసాఫ్ట్ తయారుచేసిన సాఫ్ట్వేర్లలో నిపుణతను పెంచడానికీ, పరీక్షించడానికీ ఉద్దేశించినవి. వీటిలో ముఖ్యమైనది మైక్రోసాఫ్ట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోసాఫ్ట్ డేటాబేస్ డెవలపర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్, సర్వర్ అడ్మినిస్ట్రేషన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఐదింటిలో ఏ కోర్సులో సర్టిఫికేటు పొందినా.. మంచి ఉద్యోగం, జీతం ఖాయం. ఒరాకిల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇది ప్రధానంగా డేటాబేస్‌కి సంబంధించిన కోర్సు. ఇందులో ముఖ్యమైనవి రెండు. మొదటిది ఒరాకిల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ జావా ప్రోగ్రామర్. రెండోది, ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్.ఒరాకిల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ జావా ప్రోగ్రామర్: ఇది జావా ప్రోగ్రామింగ్ గురించి మంచి అవగాహనను కలిగిస్తుంది. ఒరాకిల్ డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్: ఒరాకిల్ డేటాబేస్‌లో మంచి ప్రావీణ్యాన్ని పెంపొందిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగావకాశాల్లో 20 వరకు వీటిల్లోనే ఉంటున్నాయి. లైనక్స్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అంటే.. ఇది కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన సాఫ్ట్వేర్. దీనిలో నైపుణ్యం పొందడానికి కూడా చాలా కోర్సులున్నాయి. ఇందులో ముఖ్యమైనది లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. పెద్దపెద్ద కంప్యూటర్ వ్యవస్థలన్నీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం మీదే పనిచేస్తాయి. ఉదాహరణకు విమానయాన సంస్థలు, ఆయిల్ కంపెనీలు, అన్ని సెక్యూరిటీ వ్యవస్థలు లైనక్స్ పైనే పనిచేస్తాయి. అందువల్ల ఈ కోర్సు చేసినవారికి ఉద్యోగాలు అపారం. అంతేకాకుండా మంచి జీతం కూడా పొందొచ్చు. జావా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ జావా అనేది ఒక కంప్యూటర్ లాంగ్వేజీ. ఇది ఇంటర్నెట్ వినియోగంలోకి రావడానికి ప్రత్యేకంగా తయారుచేసిన భాష. ఇది ఫ్లాట్‌ఫారం ఇండిపెండెంట్. అంటే.. ఏ కంప్యూటర్ మీదనైనా దానితో పనిచేయించవచ్చు. అదేవిధంగా ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ కూడా. అందువల్ల ఇంటర్నెట్ ఉపయోగించి చేసే ఏ కంప్యూటర్ అప్లికేషనైనా సరే ఇది తప్పనిసరి. అందువల్ల జావా అనేది అన్ని విశ్వవిద్యాలయాల బీటెక్ (సీఎస్ఈ)పాఠ్యాంశాలలో విధిగా ఉంటుంది. విద్యార్థులు మరింత లోతైన పరిజ్ఞానం పొందాలంటే ఈ పరీక్ష ఉత్తీర్ణులవ్వాల్సిందే. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించడం ఎంత కష్టమో, ఈ జావా రాకపోతే కంప్యూటర్ కంపెనీల్లో పనిచేయడం కూడా అంతే కష్టం. అందువల్ల ఈ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు చాలా ఎక్కువ. ప్రత్యేకమైన కోర్సులు.. ఎస్ఏపీ ఇది ఈ మధ్య చాలా పాపులర్ అయిన కోర్సు. దీనిని ఈఆర్పీ (ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) అని కూడా అంటారు. ఒక ఇండస్ట్రీలో ఉన్న అన్ని విభాగాలను అనుసంధానిస్తూ అన్నింటినీ కంప్యూటరీకరణ చేయడంగా దీనిని పేర్కొనవచ్చు. ఇందులో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఫైనాన్స్, ప్రాజెక్ట్స్, హ్యూమన్ రిసోర్సెస్లాంటివి. ఇందులో ఏ ఒక్కదాంట్లోనైనా ప్రావీణ్యం సంపాదిస్తే చాలు మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని కోర్సుల్లో కష్టమైనదీ, బాగా జీతం వచ్చేదీ ఇదే! టెస్టింగ్ టెక్ ప్రతి సాఫ్ట్వేర్ తయారీలోనూ ఆఖరి భాగం టెస్టింగ్. సాఫ్ట్వేర్ తయారుచేసిన తర్వాత దానిని కూలంకషంగా పరీక్షించి మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఇలా పరీక్షించడానికి కూడా కొన్ని సాఫ్ట్వేర్ ప్యాకేజీలు ఉన్నాయి. వాటినే టెస్టింగ్ టూల్స్ అంటారు. వీటిని నేర్చుకుంటే ఈ ఫీల్డులో మంచి ఉద్యోగం పొందొచ్చు. మెయిన్‌ఫ్రేమ్ ట్రైనింగ్ పర్సనల్ కంప్యూటర్లు లేని రోజుల్లో కంప్యూటర్లు చక్కబెట్టే వ్యవహారాలన్నీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్‌తోనే జరిగేవి. ఇప్పటికీ చాలా వ్యవహారాలకు వీటిని వాడుతున్నారు. వీటిని ఉపయోగించడానికి, నిర్వహించడానికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం. ప్రస్తుతం వీటిని స్పేస్ టెక్నాలజీ వంటి ప్రముఖమైన వాటిల్లో వినియోగిస్తున్నారు. వీటిలో ఉద్యోగాలు బాగున్నా ఎదుగుదల తక్కువ. ఇవి మాత్రమే కాకుండా కొన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సులు కూడా ఉన్నాయి. అవన్నీ ఉద్యోగం చేస్తూ మరింత ఉన్నత పదవులు అధిరోహించడానికి ఉపయోగపడేవి. ఈ కోర్సులన్నింటికీ మంచి ఉద్యోగావకాశాలు ఉన్న మాట వాస్తవమే అయినా ఈ కోర్సుల సర్టిఫికెట్‌తోపాటు బీఈ/బీటెక్ డిగ్రీ కూడా ఉండాలి. అంతేకాకుండా బేసిక్స్ మీద అవగాహన ఉండాలి. ఇవి ఉంటే వీటిల్లో ఏ కోర్సు సర్టిఫికేట్ పొందినా మంచి ఉద్యోగం, భవిష్యత్తు, జీతం సొంతమవుతుంది. కోర్సులు.. అందిస్తున్న సంస్థలు.. కోర్సులు: ఒ లెవల్ వ్యవధి: 13 నెలలు బి లెవల్ వ్యవధి: 14 నెలలు హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ వ్యవధి: 15 నెలలు ఎ లెవల్ వ్యవధి: 24 నెలలు ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ వ్యవధి: ఆరు నెలలు సంస్థ: ఎన్ఐఈఎల్ఐటీ వెబ్సైట్: ఠీఠీఠీ.జ్ఛ్టీఛిజిఛీ.జీ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈ-కామర్స్ వ్యవధి: 144 గంటలు ఈఎల్ఎస్ఐ డిజైన్ హెల్త్‌కేర్ ఇన్ఫర్మేటిక్స్ ఆటోమేషన్ అండ్ ఎస్సీఏడీఏ సిస్టమ్స్ వ్యవధి: ఆరు నెలలు, సంస్థ: సీడాక్ వెబ్సైట్: www.cdac.in కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ వ్యవధి: 16 నెలలు సంస్థ: నిఫ్ట్-హైదరాబాద్ వెబ్సైట్: www.nift.ac.in ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ వ్యవధి: 160 గంటలు ఒరాకిల్ 10జీ: పీఎల్/ఎస్‌క్యూఎల్ వ్యవధి: 40 గంటలు సంస్థ: ఎస్క్యూఎల్ఎస్టీఏఆర్ వెబ్సైట్: www.sqlstar.com సీసీఎన్ఏ సెక్యూరిటీ సంస్థ: సిస్కో సిస్టమ్స్ వెబ్సైట్: www.cisco.com ఎంసీఎస్‌ఏ సంస్థ: మైక్రోసాఫ్ట్ వెబ్సైట్: www.microsoft.com సీఎస్ఎస్ఏ సంస్థ: డెల్ వెబ్సైట్: http://accessories.dell.com ఒరాకిల్ సోలారిస్ 10 సర్టిఫైడ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ సంస్థ: ఒరాకిల్ వెబ్సైట్: www.oracle.com ఐబీఎం సర్టిఫైడ్ అడ్మినిస్ట్రేటర్ - టివోలి మానిటరింగ్ వీ6.2.3 సంస్థ: ఐబీఎం వెబ్సైట్: www.ibm.com గూగుల్ యాప్స్ అడ్మినిస్ట్రేటర్ సంస్థ: గూగుల్ వెబ్సైట్: http://certification.googleapps.com