Mekapati Goutham Reddy: Focus On IT Branding In AP - Sakshi
Sakshi News home page

ఐటీ శాఖ బ్రాండింగ్‌పై ప్రత్యేక దృష్టి: మంత్రి గౌతమ్ రెడ్డి

Published Wed, Oct 13 2021 5:08 PM | Last Updated on Wed, Oct 13 2021 5:28 PM

Mekapati Goutham Reddy Says Focus On IT Branding In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఐటీ శాఖ బ్రాండింగ్‌పై ప్రత్యేక​ దృష్టి పెడుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అన్నారు. డిసెంబర్‌ 24 కల్లా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్ల పైలట్‌ ప్రాజెక్టు పూర్తి చేయాలని, ఐటీ బ్రాండింగ్‌ కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆశించారు. ఆయన బుధవారం ‘వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల’ ఏర్పాటులో పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

పైలట్ ప్రాజెక్టును 29 ప్రాంతాల్లో ప్రారంభించే దిశగా ఐటీ శాఖ కసరత్తు చేస్తుందని అన్నారు. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల విషయంలో భారీ ఎంఎన్‌సీ కంపెనీల నుంచి ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు.త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఐటీ శాఖ మంత్రికి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల కాన్సెప్ట్ వివరిస్తానని పేర్కొన్నారు.

ఐటీకి ఏపీ చిరునామా అనేలా బ్రాండింగ్ అవసరమని, ఐటీ బ్రాండింగ్‌పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఐటీ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, ఏపీఎన్ఆర్టీ ఛైర్మన్ మేడపాటి వెంకట్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement