Branding
-
విమానాశ్రయాల్లో చేనేత అమ్మకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రధాన కాంప్లెక్స్‌లలో ఆప్కో స్టాల్స్ ఏర్పాటు చేసింది. తాజాగా విమానాశ్రయాల్లోనూ ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో విజయవాడ (గన్నవరం), తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయంతోపాటు మెహిదీపట్నం ( హైదరాబాద్), మృగనాయని(భోపాల్), కర్నూలు జిల్లా లేపాక్షి, మంగళగిరిలోనూ ఆప్కో నూతన షోరూంలను ప్రారంభించారు. ప్రైవేటు వస్త్ర వ్యాపార సంస్థలకు దీటుగా అధునాతన వసతులతో ఆప్కో షోరూంలను ప్రారంభించడం విశేషం. చేనేతను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఒకవైపు దేశవ్యాప్తంగా ఆప్కో స్టాల్స్, షోరూంలను పెంచడంతోపాటు మరోవైపు స్థానికంగా డిస్కౌంట్ సేల్, చేనేత సంఘాల ఎగ్జిబిషన్లు, ఫ్యాషన్ షోలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్లతోను, వినూత్నమైన, నాణ్యమైన చేనేత వస్త్రాల తయారీని ప్రోత్సహిస్తున్నారు. ఉద్యోగులు, ప్రజలు వారానికి ఒక్కరోజైనా చేనేత వ్రస్తాలు ధరించేలా పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం జగన్ చర్యలు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్, ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. ‘నేతన్న నేస్తం’ తదితర కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. చేనేత వస్త్రాల విక్రయాలను ప్రోత్సహించి ఆ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన సుమారు 1.75లక్షల కుటుంబాలకు అండగా నిలిచేలా ఆప్కో ద్వారా పలు చర్యలు చేపట్టినట్టు వివరించారు. రాష్ట్రంలోని చేనేత సొసైటీల వద్ద ఉన్న వ్రస్తాల నిల్వలను క్లియర్ చేసి సొసైటీలను ఆదుకునేలా విక్రయాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆప్కో షోరూంల ద్వారా ఈ ఏడాది రూ.50కోట్ల విక్రయాలు జరపాలని నిర్ణయించినట్లు ఎంఎం నాయక్ తెలిపారు. -
‘డ్వాక్రా ఉత్పత్తులకు కామన్ బ్రాండింగ్’
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా తయారు చేస్తున్న నిత్యావసర, ఇతర వస్తువులకు ఇంకా ఆకర్షణీయంగా లేబిలింగ్, ప్యాకింగ్‌తోపాటు మంచి కామన్ బ్రాండింగ్ ఏర్పాటు చేయాలి. దీనికి తెలంగాణ ముద్ర ఉండేటట్టు చూడాలి. అప్పుడు ఈ వస్తువులకు డిమాండ్ మరింత పెరుగుతుంది’అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం పీఆర్ శాఖ ముఖ్యకార్యదర్శి, సెర్ప్ సీఈవో సందీప్‌కుమార్ సుల్తానియా, ఇతర అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ సంస్థతో ఒప్పందం కుదిరిందని, అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెటింగ్ వంటి సంస్థలతోనూ మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకొని మహిళా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు విస్తృతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా అభివృద్ధి, సంక్షేమంలో మనకు సాటి లేదని, మహిళాసంఘాల అభివృద్ధి, పొదుపు రుణాల్లో దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. ఈ దశలో రాష్ట్రం పేరుప్రతిష్టలు ఇనుమడించేలా, మహిళా ఉత్పత్తులను సులువుగా, ఆకర్షణీయంగా అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముడుపోయేలా ఈజీగా, క్యాచీగా ఉండేట్లుగా బ్రాండింగ్ రూపొందించాలని మంత్రి సూచించారు. త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లి, వారి అనుమతితో కొత్త బ్రాండింగ్ చేయాలని, అందుకు తగ్గట్లుగా పలు పేర్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. -
కొండపల్లి బొమ్మకు ‘టాటా’ బ్రాండింగ్
సాక్షి, అమరావతి: పర్యావరణ హితమైన కొండపల్లి బొమ్మల అమ్మకాలను ప్రోత్సహించేందుకు దేశీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థ టాటా గ్రూపు ముందుకొచ్చింది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయంగా బ్రాండింగ్ కల్పించేందుకు టాటా కన్స్యూమర్ ప్రోడక్స్ట్ విభాగానికి చెందిన టాటా చక్రాగోల్డ్ టీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాస్టిక్ బొమ్మల రాకతో చేతివృత్తి కళాకారులు దెబ్బతింటున్నారని, వీరిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో సహజసిద్ధమైన కలప, రంగులతో తయారుచేసే కొండపల్లి బొమ్మలకు ప్రాచుర్యం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ (దక్షిణాసియా) పునీత్ దాస్ తెలిపారు. ఇందుకోసం దక్షిణాది రాష్ట్రాల్లో నవరాత్రులకు బొమ్మల కొలువులు పెట్టడం సంప్రదాయం కావడంతో ‘నవరాత్రులు.. మన కొండపల్లి బొమ్మలతో..’ అంటూ టాటా చక్రాగోల్డ్ ప్రచారం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా.. కొండపల్లి బొమ్మలతో కూడిన చక్రాగోల్డ్ టీ ప్యాకెట్లను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ బొమ్మల్లో విశేషాదరణ పొందిన 20 రకాలను ఎంపికచేసి వాటిని టాటా చక్రాగోల్డ్ వెబ్సైట్ ద్వారా విక్రయిస్తున్నారని, ప్రతీ కొనుగోలుపై ఈ బొమ్మలు చేసిన కళాకారులకు రూ.100 ఆర్థిక సాయాన్ని చక్రాగోల్డ్ ఇవ్వనుంది. షాపింగ్ మాల్స్‌లో ప్రత్యేక కౌంటర్లు ఇక ప్రత్యేక టీ ప్యాకెట్లను విడుదల చేయడమే కాకుండా వివిధ నగరాల్లోని షాపింగ్ మాల్స్‌లో కొండపల్లి బొమ్మలతో చక్రాగోల్డ్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేసినట్లు పునీత్ దాస్ తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఇన్ఆర్బిట్ మాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్‌కు విశేష స్పందన వచ్చిందన్నారు. మరోవైపు.. ఏపీలోని గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే కొండపల్లి బొమ్మలు ఏ కలప నుంచి చేస్తారు, వాటికి వినియోగించే రంగులు, అతికించడానికి వినియోగించే జిగురు వంటి అన్ని వివరాలను టాటా గ్రూపు ప్రచారం చేస్తోంది. ఇందుకోసం పత్రికా ప్రకటనలతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తోంది. ఇలా కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడానికి టాటా గ్రూపు ముందుకు రావడంపై లేపాక్షి ఎండీ బాలసుబ్రమణ్యంరెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. టాటా ప్రచారం మొదలు పెట్టిన తర్వాత ఆన్లైన్ అమ్మకాలు పెరిగాయన్నారు. ప్రస్తుతం ఈ ప్రచారం కేవలం దేవీనవరాత్రుల వరకు మాత్రమే ఉందని, రానున్న కాలంలో రాష్ట్రంలోని హస్తకళలను ప్రోత్సహించే విధంగా మరిన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. చదవండి: ఏపీలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ -
ఐటీ శాఖ బ్రాండింగ్‌పై ప్రత్యేక దృష్టి: మంత్రి గౌతమ్ రెడ్డి
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ బ్రాండింగ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 24 కల్లా వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ల పైలట్ ప్రాజెక్టు పూర్తి చేయాలని, ఐటీ బ్రాండింగ్ కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆశించారు. ఆయన బుధవారం ‘వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల’ ఏర్పాటులో పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పైలట్ ప్రాజెక్టును 29 ప్రాంతాల్లో ప్రారంభించే దిశగా ఐటీ శాఖ కసరత్తు చేస్తుందని అన్నారు. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల విషయంలో భారీ ఎంఎన్సీ కంపెనీల నుంచి ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు.త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఐటీ శాఖ మంత్రికి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల కాన్సెప్ట్ వివరిస్తానని పేర్కొన్నారు. ఐటీకి ఏపీ చిరునామా అనేలా బ్రాండింగ్ అవసరమని, ఐటీ బ్రాండింగ్‌పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఐటీ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, ఏపీఎన్ఆర్టీ ఛైర్మన్ మేడపాటి వెంకట్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
విమానాశ్రయాల నిర్వహణలో ‘అదానీ’ ఉల్లంఘనలు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాల నిర్వహణలో బ్రాండింగ్, రాయితీల ఒప్పందాల నిబంధనలను అదానీ గ్రూపు ఉల్లంఘించినట్టు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కమిటీలు గుర్తించాయి. దీంతో అదానీ గ్రూపు ఏఏఐతో చేసుకున్న ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా బ్రాండింగ్, ఎయిర్‌పోర్ట్‌ల్లో లోగోల ప్రదర్శనలకు సంబంధించి మార్పులు చేసింది. ఈ విమానాశ్రయాల నిర్వహణ బాధ్యతలను గతేడాదే అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ (ఏఏహెచ్ఎల్) చేపట్టింది. 2020 డిసెంబర్లో ఈ మూడు విమనాశ్రయాలకు సంబంధించి బ్రాండింగ్, డిస్ప్లే నిబంధనలకు అనుగుణంగా లేవని ఏఏఐ గుర్తించి ఆయా విమానాశ్రయ నిర్వహణ కంపెనీలకు లేఖలు రాసింది. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే, తామేమే నిబంధనలను ఉల్లంఘించలేదంటూ అదానీ గ్రూపు విమానాశ్రయాలు బదులిచ్చాయి. దీంతో ఏఏఐ ఈ ఏడాది జనవరిలో మూడు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసి అదానీ గ్రూపు నిర్వహణలోని మూడు విమానాశ్రయాల్లో హోర్డింగ్‌లు,డిస్ప్లే, బ్రాండింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో, లేవో? తేల్చాలని కోరింది. ఈ కమిటీలో తమ అధ్యయనం అనంతరం నిబంధనల ఉల్లంఘనను నిర్ధారించాయి. ఏఏఐ పేరు, లోగో ప్రముఖంగా కనిపించడం లేదంటూ.. ఏఏఐ లోగో, పేరు చిన్నగాను, అదానీ కంపెనీల పేరు పెద్దగాను ఉన్నాయంటూ నివేదికలు ఇచ్చాయి. మెరుగైన సదుపాయాలకు కట్టుబడి ఉన్నాం ఏఏఐ కమిటీలు గుర్తించిన వాస్తవాలతో అదానీ గ్రూపు అంగీకరిస్తోందా? అన్న ప్రశ్నకు.. ‘‘ఒప్పందం ప్రకారం ఇరు సంస్థల లోగోలు (అదానీ, ఏఏఐ) ఒకే సైజులో ప్రముఖంగా కనిపించే విధంగా ఉండాలి. రెండు బలమైన బ్రాండ్లు ప్రముఖంగా కనిపించడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ఒప్పంద స్ఫూర్తి ఫరిడవిల్లుతుంది’’ అని అదానీ గ్రూపు ప్రతినిధి స్పందించారు. -
బ్రాండింగ్ నిబంధనలను కాలరాస్తున్న అదానీ గ్రూప్స్..!
ముంబై: గౌతమ్ అదానీకు చెందిన అదానీ గ్రూప్స్ ఎయిర్పోర్ట్ నిర్వహణ రంగంలో దూసుకుపోతున్నాయి. దేశ వ్యాప్తంగా సుమారు ఎనిమిది ఇంటర్నేషనల్, రిజనల్ ఎయిర్‌పోర్ట్‌ల నిర్వహణ చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను జీవీకే నుంచి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఏర్పాటు చేసిన మూడు కమిటీలు అదానీ గ్రూప్స్ నిర్వహిస్తోన్న అహ్మదాబాద్, మంగుళూరు, లక్నో విమానాశ్రయాల్లో రాయితీ ఒప్పందాలలో ఏఏఐ సూచించిన బ్రాండింగ్ నిబంధనలను ఉల్లఘిస్తున్నట్లు కనుగొంది. దీంతో అదానీ గ్రూప్స్ ఆయా ఎయిర్‌పోర్ట్‌ల్లో బ్రాండింగ్, డిస్ప్లే బోర్డులను మారుస్తోన్నట్లు తెలుస్తోంది. మూడు విమానాశ్రయాల నిర్వహణ కోసం 2019 ఫిబ్రవరిలో అదానీ గ్రూప్ బిడ్లను గెలుచుకుంది. ఎయిర్‌పోర్టుల నిర్వహణ కోసం ఫిబ్రవరి 2020లో ఏఏఐతో అదానీ గ్రూప్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నవంబర్ 2020 నుంచి ఎయిర్‌పోర్టుల నిర్వహణను అదానీ గ్రూప్స్ తీసుకున్నాయి. తాజాగా ఏఏఐ నిర్వహించిన తనిఖీల్లో అదానీ గ్రూప్స్ ఆయా ఎయిర్‌పోర్టులో బ్రాండింగ్ నిబంధనలను కాలరాస్తున్నట్లు గుర్తించారు. హోర్డింగ్స్ డిస్ప్లే విషయాల్లో ఏఏఊ సూచనలను అదానీ గ్రూప్స్ ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఏఏఐ లోగోలను డిస్ప్లే చేయడంలో అదానీ గ్రూప్స్ నిబంధనల ప్రకారం ప్రదర్శించలేదు. కాగా ఈ విషయంపై స్పందించిన అదానీ గ్రూప్స్..ఆయా విమానాశ్రయాల్లో నిబంధనలను అనుగుణంగా డిస్ప్లే బోర్డులను వేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. -
ఏపీ ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్
సాక్షి, అమరావతి: స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2030 నాటికి దేశం నుంచి విదేశాలకు అయ్యే ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవాలని ఏపీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రతి జిల్లాలో ఎక్స్పోర్ట్ హబ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎక్స్పోర్ట్ హబ్‌లను ఏర్పాటు చేసి.. ఆయా జిల్లాల నుంచి ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేస్తోంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డీఐఈపీసీ)లను ఏర్పాటు చేస్తూ గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రతి జిల్లాలో స్థానిక వ్యాపారులకు ఎగుమతుల అవకాశాలను వివరిస్తూ వారికి చేయూత అందించేందుకు నలుగురు అధికారులతో డిస్ట్రిక్ ఇండస్ట్రియల్ సెంటర్ (డీఐసీ)లను ఏర్పాటు చేసింది. ఇవి ఆయా జిల్లాల నుంచి ఎగుమతికి అవకాశం గల ఉత్పత్తులను ఎంపిక చేసి ఆమోదం కోసం డీఐఈపీసీలకు పంపిస్తారు. వీటిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఆమోదిస్తారు. ఆ విధంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 10 జిల్లాలకు సంబంధించిన ఉత్పత్తులకు ఆమోదం లభించగా.. మరో మూడు జిల్లాలకు సంబంధించి ఉత్పత్తులు పరిశీలన దశలో ఉన్నాయి. ఇందులో ఆరు జిల్లాలు ఇప్పటికే ఎగుమతులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నాయి. టాప్–3లో నిలిచేలా.. మన రాష్ట్రం 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,07,730 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. దేశం నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తుల్లో ఇది 5.8 శాతం వాటా కాగా.. ఈ విషయంలో మన రాష్ట్రం ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. 2030 నాటికి దీనిని 10 శాతానికి చేర్చడం ద్వారా టాప్–3 స్థానంలో నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా అదనంగా ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులను గుర్తించి మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీ ఈడీబీ) డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకోసం విదేశీ ఎగుమతులతో పాటు ఆన్లైన్ రిటైల్ మార్కెటింగ్ సంస్థలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు చెప్పారు. ఇందుకోసం వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య సంఘాలతో ఏపీ ఈడీబీ చర్చలు జరుపుతోందన్నారు. కొన్ని ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు పొందేవిధంగా చర్యలు తీసుకోవడంతోపాటు త్వరలోనే ఎగుమతులకు ప్రత్యేక పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. చదవండి : బైక్ ఎగుమతుల్లో రికార్డు సృష్టించిన భారత్..! -
Kia India New Logo: సరికొత్తగా కియా ఇండియా బ్రాండ్
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా భారత్‌లో కొత్త బ్రాండింగ్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొత్తగా రూపొందించిన లోగో, బ్రాండ్ స్లోగన్‌ను ఆవిష్కరించింది. కేవలం కార్ల తయారీకే పరిమితం కాకుండా పర్యావరణ అనుకూలమైన అధునాతన వాహనాల సంస్థగా కొనుగోలుదారులకు చేరువయ్యేందుకు ఇది తోడ్పడగలదని కంపెనీ పేర్కొంది. కొత్త లోగో సెల్టోస్, సోనెట్ వాహనాలను మే తొలి వారంలో ఆవిష్కరించనున్నట్లు కియా ఇండియా ఎండీ కూక్యున్ షిమ్ తెలిపారు. ప్రధాన కార్యాలయం ఉన్న దక్షిణ కొరియా వెలుపల తాము కొత్త బ్రాండింగ్‌కి మారిన తొలి దేశం భారత్ అని ఆయన వివరించారు. తాజా వ్యూహంలో భాగంగా తమ సేల్స్ నెట్‌వర్క్‌ను 218 నగరాల్లో (తృతీయ, చతుర్థ శ్రేణి పట్టణాలతో పాటు) 360 టచ్ పాయింట్లకు విస్తరించుకోనున్నట్లు షిమ్ వివరించారు. కియాకు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో 3 లక్షల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కార్ల ప్లాంటు ఉంది. Join in to experience the inspirational journey of Kia's bold transformation live #MovementThatInspires https://t.co/JrmNKyNfvP — Kia India (@KiaMotorsIN) April 27, 2021 చదవండి: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్! -
ఈ–కామర్స్ వేదికపై మన హస్తకళలు
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న అవకాశాలను రాష్ట్ర హస్తకళాకారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సహకారంతో ఈ–కామర్స్ పోర్టళ్ల వేదికగా తమ ఉత్పత్తులకు ఆన్లైన్ బ్రాండింగ్ చేసుకుంటున్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులైన హస్త కళాకారులు తమ ఉత్పత్తులను ఆన్లైన్ మార్కెట్లో విక్రయించేందుకు మెప్మా చేపట్టిన కార్యాచరణ విజయవంతమవుతోంది. ఇప్పటికే 450 రకాల హస్తకళా ఉత్పత్తులు ఈ–కామర్స్ పోర్టళ్లలో బ్రాండింగ్ దక్కించుకోవడం విశేషం. మెప్మా కార్యాచరణ రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 94,533 మంది హస్త కళాకారులు డ్వాక్రా సంఘాల సభ్యులుగా ఉన్నారు. సంప్రదాయ కళా నైపుణ్యాన్ని ఆలంబనగా చేసుకుని వారు స్వయంఉపాధి రంగంలో రాణించేందుకు మెప్మా కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం ముందుగా స్వయం ఉపాధి పథకాల కోసం గ్రూపు రుణాలు, వ్యక్తిగత రుణాల కింద రూ.118.49 కోట్లు మంజూరు చేసింది. అంతేకాకుండా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే బాధ్యతను కూడా చేపట్టింది. ప్రధానంగా విస్తృతమవుతున్న ఆన్లైన్ మార్కెటింగ్ రంగం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించింది. మహిళలు తమ ఇళ్లలో తయారుచేసిన హస్త కళారూపాలను మార్కెటింగ్ చేసుకునేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ–కామర్స్ పోర్టళ్లలో రిజిస్ట్రేషన్ చేయించింది. అదేవిధంగా ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ సౌజన్యంతో డ్వాక్రా సభ్యులకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించింది. 450 రకాల ఉత్పత్తులు ఈ–కామర్స్ ద్వారా మార్కెటింగ్ కోసం జిల్లాలవారీగా హస్తకళలను మెప్మా ఎంపిక చేసింది. దాంతో ఆయా జిల్లాల డ్వాక్రా మహిళలు ఆ ఉత్పత్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రస్తుతం ఏకంగా 450 రకాల హస్త కళా ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోర్టళ్లలో బ్రాండింగ్ పొందడం విశేషం. మహిళల స్వయంఉపాధికి ఊతం రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెస్తున్న హస్తకళా ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. దీంతో మహిళల స్వయంఉపాధి అవకాశాలు పెరిగి మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. ఇప్పటివరకు 450 రకాల ఉత్పత్తులకు ఆన్లైన్లో బ్రాండింగ్ చేయించాం. రానున్న రోజుల్లో మరిన్ని ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. – వి.విజయలక్ష్మి, మిషన్ డైరెక్టర్, మెప్మా -
భారత సంతతి డ్రగ్స్ ముఠా అరెస్ట్
న్యూయార్క్: నకిలీ బ్రాండింగ్‌తో భారీ ఎత్తున డ్రగ్స్ ఆధారిత మందుల వ్యాపారం సాగిస్తున్న ఓ ముఠా కుట్రను అమెరికా పోలీసులు భగ్నం చేశారు. న్యూయార్క్ పరిధిలోని క్వీన్స్ కేంద్రంగా ఈ ముఠా సాగిస్తున్న కార్యకలాపాలపై నిఘా పెట్టిన పోలీస్ అధికారులు, 8 మంది భారత సంతతి అమెరికన్లను అరెస్ట్ చేశారు. అమెరికాలోని కొరియర్, పోస్టల్ సర్వీసుల ద్వారా వీరు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు విస్తుపోయారు. ఈ విషయమై న్యూయార్క్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘సెషిజాన్ కమల్ దాస్(46), ముకుల్(24), గులాబ్ (45), దీపక్ (43), నారాయణ స్వామి(58), బల్జీత్ సింగ్(29), హర్‌ప్రీత్ సింగ్(28) వికాస్ వర్మ (45)లు భారత్ నుంచి నకిలీ బ్రాండింగ్‌తో నల్ల మందు ఆధారిత మందుల్ని అమెరికాలోకి భారీగా దిగుమతి చేసుకున్నారు. ఈ మందుల్లో హెరా యిన్, ఆక్సికొంటిన్, వికోడిన్, ట్రమడాల్, ఫెంటానేల్ వంటి సింథటిక్ డ్రగ్స్ ఉంటాయి’ అని తెలిపారు. రీ–ప్యాకింగ్‌తో కోట్ల ఆదాయం.. నిందితులు తమ డ్రగ్స్ వ్యాపారానికి న్యూయార్క్ పరిధిలో క్వీన్స్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఈ పట్టణంలోని ఓ గోదామును అద్దెకు తీసుకున్న 8 మంది నిందితులు.. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న సరుకులను తమ వినియోగదారులకు పంపేవారు. ఇందుకోసం ప్రభుత్వ పోస్టల్ సర్వీసుతో పాటు ప్రైవేటు కొరియర్ సంస్థల సేవలను హాయిగా వాడుకున్నారు. మందులను రీప్యాక్ చేసి తమ వినియోగదారులకు, కొన్ని సంస్థలకు అందించడం మొదలుపెట్టారు. ఇలా 2018–19 మధ్యకాలంలో వీరు కోట్ల రూపాయలు ఆర్జించారు. అయితే 2018 జనవరి నుంచి దేశంలోకి భారీగా నల్లమందు ఆధారిత డ్రగ్స్ దిగుమతి కావడంపై అమెరికా విచారణ సంస్థలు దృష్టి సారించగా ఈ అక్రమ అమ్మకాలు వెలుగులోకి వచ్చాయి. డోస్ ఎక్కువైతే మరణమే.. సింథటిక్ డ్రగ్స్ ఉన్న మందులను వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడటం ప్రమాదకరం. డోస్ ఎక్కువైతే కోమాలోకి వెళ్లిపోతారు. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది. ఈ నేపథ్యంలో 8 మంది నిందితులను బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరుపర్చిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నేరం రుజువైతే కమల్దాస్కు 25 ఏళ్లు, మిగతా నిందితులకు ఐదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. -
మన్ననూర్ ‘మచ్చ’లకు బ్రాండింగ్!
ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం తెలంగాణ జీవ వైవిధ్య సంస్థతోపాటు కోనేరు స్వచ్ఛంద సంస్థ, వాస్స న్ సంస్థల సహకారం తో ఈ జాతిని అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు పెద్ద ఎత్తున పరిశోధ నలు జరుగుతున్నాయి. నాగర్‌కర్నూల్ నుంచి బక్షి శ్రీధర్‌రావు : ఒంగోలు గిత్తకు ఏమాత్రం తక్కువ కాకుండా పలు జన్యు ప్రత్యేకతలు కలిగి ఉండి నల్లమల అటవీ ప్రాంతానికే పరిమిత మైన అతి అరుదైన మన్ననూర్ మచ్చల పశువులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్, మన్ననూర్, బి.లక్ష్మా పూర్ ప్రాంతాల్లోని మచ్చల పశువులను సంరక్షించేందుకు ప్రత్యే కంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే గత ఏడాది బి.లక్ష్మాపూర్‌లో మొదటి పశువుల ప్రదర్శన నిర్వహించింది. ♦ మన్ననూరు మచ్చల పశువుల అభి వృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ఆర్గనై జింగ్ కమిటీని నియమించింది. ఇందులో భాగంగా పశువుల పెంపకందారులతో ఓ అసోసియేషన్‌ను ప్రారంభించారు. ♦ ఈ పశువులను సంరక్షిస్తున్న రైతాంగానికి ప్రోత్సాహకాలను ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నారు. మచ్చల కోడెల వీర్యాన్ని సేకరించి వాటి సంతతిని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు. ♦ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన్ననూర్ పొడలను రాష్ట్ర పశువుగా గుర్తించింది. తెలంగాణ జీవ వైవిధ్య విభాగం ప్రతినిధు లు ఈ పశువులోని ప్రత్యేకతలు మరే ఇతర పశువుల్లోనూ లేవని తేల్చి చెప్పారు. ♦ ఎంతటి కరువునైనా తట్టుకుంటాయని, వర్షం రాకను ముందే పసిగట్టి తమ గమ్యస్థానాలకు చేరుకునే తెలివైన పశువులని నాగర్‌కర్నూల్ జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి అంజిలప్ప చెప్పారు. వ్యవసాయం, పాడికి ఉపయోగం.. సహజసిద్ధంగా అడవుల్లోని కొండల్లో నివ సించే మచ్చల పశువులు పలు ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. వీటిని మన్ననూర్, అమ్రా బాద్, బి.లక్ష్మాపూర్, అచ్చంపేట, లింగాల ప్రాంతాల్లోని రైతులు మచ్చిక చేసుకుని వ్యవసాయ, పాడి అవసరాలకు ఉపయోగిస్తు న్నారు. చెంచులు, గిరిజన రైతులు వీటిని తూర్పు పొడలు, మచ్చల పసురాలు అంటా రు. వీటి కాలి పిక్కలు, గిట్టలు దృఢంగా ఉండటం వల్ల ఎంత ధరైనా చెల్లించి రైతులు కొంటారు. మచ్చల ఆవులు రోజూ మూడు నుంచి ఐదు లీటర్ల పాలిస్తాయి. వీటికి తగిన పౌష్టికాహారం అందించి వృద్ధి చేస్తే మెరుగైన ఫలితాలిస్తాయని కోనేరు, వాస్సన్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. నల్లమల గిరుల్లో సంచరించే పొడ జాతి పశువులు -
లోగో,బ్రాండింగ్ మార్చిన వండర్ లా
-
కొత్త ఆదాయ వనరు... ఇమోజి!
• సరికొత్త బ్రాండింగ్‌కు శ్రీకారం చుట్టిన కంపెనీలు • నూతన బిజినెస్ కమ్యూనికేషన్‌కు నాంది • అంతర్జాతీయ భాషగా అవతరిస్తోన్న తీరు • విశేషంగా ఆకర్షిస్తుతులౌతున్న యువత • భవిష్యత్తులో లావాదేవీలు కూడా వీటి ద్వారానే! భాషలు మారుతున్నాయి. ఆధునిక టెక్నాలజీతో కొత్త సంకేత భాషలూ పుట్టుకొస్తున్నాయి. అలాంటిదే ఇమోజి కూడా. భావోద్వేగాల సంకేతాలే ఇమోజిలంటే. అంటే మన పూర్వీకులు బొమ్మల రూపంలోనే మాట్లాడుకునే విధానం... ఆధునిక టెక్నాలజీతో కొత్త రూపం సంతరించుకుందన్న మాట. ఆన్లైన్ సమాజానికి అత్యంత దగ్గరైన ఇమోజి... ‘ఆక్స్ఫర్డ్ ఈ ఏడాది పదం’ స్థాయికి చేరిపోయింది. ఎమెషన్లను తెలియజేసే ఈ ఇమోజి... ఇపుడు కొత్త కరెన్సీగా మారుతోంది. బ్రాండ్ కమ్యూనికేషన్ కోసం దీన్ని ఉపయోగిస్తున్న తీరు... కంపెనీలు ఇమోజిలను ఉపయోగించటం వల్ల వాటికి కలుగుతున్న లాభాలపై ప్రత్యేక కథనమిది... ఇంతకు ముందు ఫేస్బుక్లో ఇమోజి ఆప్షన్లు ఉండేవి కావు. కేవలం లైక్, కామెంట్, షేర్ ఆప్షన్లే ఉండేవి. కానీ క్రమంగా ఫేస్బుక్ కూడా యూజర్ల డిమాండ్‌కు తలొగ్గింది. లైక్ బటన్‌లో పలు ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు వారి ఎమోషన్‌కు అనువుగా సమాధానం ఇవ్వడానికి పలు ఇమోజిలను జత చేసింది. ఇప్పుడు ఎన్ని లైక్స్ వచ్చాయో చూడటమే కాదు.. ఎన్ని ‘లవ్స్’, ‘హహ’, ‘వావ్’, ‘శాడ్’, ‘యాంగ్రీ’లు వచ్చాయో కూడా తెలుసుకోవచ్చు. వొడాఫోన్ జోరు.. వొడాఫోన్ జూజూలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఐపీఎల్ టీ20 సందర్భంలో వొడాఫోన్, ట్విటర్‌తో జతకలిసింది. ఇందులో భాగంగా ఇవి సూపర్ జూజూను తెరమీదకు తెచ్చాయి. ఇవి వొడాఫోన్కే చెందిన ఇదివకరటి ‘మస్కట్ జూజూ’ని పోలి ఉంటాయి. వొడాఫోన్ వీటి సాయంతో పలు వేల్యూ యాడెడ్ సర్వీసులను ప్రమోట్ చేస్తోంది. జూజూ అభిమానులు వారి అభిప్రాయాలను కొత్తగా క్రియేట్ చేసిన ఇమోజిలతో బీసూపర్, హకేబకే అనే రెండు హ్యాష్ ట్యాగ్స్ ద్వారా తెలియజేస్తారు. వొడాఫోన్ ఇలాంటి ప్రచారాన్ని ప్రారంభించిన 4 రోజుల్లోనే దాదాపు 9 కోట్ల మంది మనసు గెలుచుకుంది. దీంతో కంపెనీ షేర్ ఆఫ్ వాయిస్ (ఎస్ఓవీ) 250 శాతం మేర పెరిగింది. జూజూ ఇమోజి వినియోగదారులకు చాలా సుపరిచితమైంది. ‘‘గడిచిన కొన్ని నెలల్లో చాలా రోజులు మా బిసూపర్ హ్యాష్‌టాగ్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతూ వచ్చింది’ అని వొడాఫోన్ ఇండియా బ్రాండ్ అండ్ కన్సూమర్ విభాగపు నేషనల్ హెడ్ సిద్ధార్థ్ బెనర్జీ చెప్పారు. ట్విటర్ ప్రకారం.. భారత్ తొలి కార్పొరేట్ బ్రాండ్ ఇమోజి ఈ ‘సూపర్ జూజూ’నే. 3,333 శాతం ఎగసిన ఇమోజిల వాడకం దేశంలోని ప్రముఖ బ్రాండ్లు ఒక ఏడాది కాలంలో ఉపయోగించిన ఇమోజిల్లో వృద్ధి 3,333 శాతంగా ఉందని సోషల్ మీడియా ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ అన్మెట్రిక్ సీఈవో లక్ష్మణన్ నారాయణ్ తెలిపారు. కంపెనీ, దానికి ట్విటర్లోని ఫాలోవర్స్, అది ఉన్న రంగం వంటి పలు అంశాలను ఈ సంస్థ పరిగణలోకి తీసుకొని టాప్-100 బ్రాండ్లను లెక్కించింది. మే నెలలో ఈ వంద బ్రాండ్లు 25,163 సొంత ట్వీట్స్ చేశాయి. ఈ ట్వీట్స్‌లో 309 ట్వీట్స్ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఇమోజిలను కలిగి ఉన్నాయి. ఇమోజిలను ఎక్కువగా వాడిన కంపెనీల్లో కింగ్‌ఫిషర్ (90 ట్వీట్స్), జూమ్ టీవీ(63 ట్వీట్స్), ఎంటీవీ ఇండియా (50 ట్వీట్స్), రెడ్‌బుల్ ఇండియా (34 ట్వీట్స్), లోరెల్ ఇండియా (25 ట్వీట్స్) ఉన్నాయి. ఈ 100 బ్రాండ్ల ఇమోజీ వాడకం కేవలం ఏడాదిలో 3,333 శాతం పెరిగింది. డెడ్‌పూల్ సినిమా ప్రమోషన్లో ఇమోజి... మనకు ఇమోజిలు కొత్తేమో కానీ విదేశాల్లో మరింత జోరు మీదున్నాయి. బీట్లెస్ స్పాటిఫై హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించిన వారి కోసం ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ కంపెనీ స్పాటిఫై.. అబే రోడ్ కవర్ ఇమోజీలను ప్రమోట్ చేసింది. అలాగే అమెరికన్ ఫిల్మ్ స్టూడియో ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ తన డెడ్‌పూల్ సినిమా ప్రమోషన్‌కు ఇమోజిలను ఉపయోగించింది. అంతెందుకు!! కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో మేకిన్ ఇండియా కార్యక్రమం కోసం ట్విటర్ ఇమోజిని వాడింది. ‘లైన్’... ఆదాయంలో కీలకం సోషల్ మేసేజింగ్ యాప్ లైన్.. గతేడాది 1.1 బిలియన్ డాలర్ల అదాయాన్ని ఆర్జించింది. ఇందులో 268 మిలియన్ డాలర్లు వరకు స్టిక్కర్స్, ఖరీదైన ఇమోజిల విక్ర యం ద్వారానే వచ్చింది. ‘ఇమోజి అంతర్జాతీయ భాషగా మారుతోంది. ఆన్లైన్లో ఎమోషన్స్‌ను, ఐడియాలను తెలుపడానికి ఇమోజిలు ఎక్కువగా వాడుతున్నారు’ అని పెప్సికో ఇండియా బేవరేజ్ వైస్‌ప్రెసిడెంట్ విపుల్ ప్రకాశ్ తెలిపారు. పెప్సికో బాటిల్స్ దాదాపు 32 ప్రత్యేకమైన ఇమోజి డిజైన్లను కలిగి ఉన్నాయి. విజువల్ కంటెంట్ కే ఆదరణ ఒకరికి మనం చెప్పింది గుర్తులేకపోవచ్చు. మనం చేసిన పనిని మరచిపోవచ్చు. కానీ మన వల్ల ఎలా ఫీల్ అయ్యారో మాత్రం మరచిపోలేరు. కంపెనీలు కూడా దీన్నే అస్త్రంగా మార్చుకున్నాయి. వాటి బ్రాండ్‌ను కస్టమర్లకు మరింత చేరువ చేయడానికి ఇమోజీలను ఉపయోగిస్తున్నది అందుకే. ఇది కొత్త బిజినెస్ కమ్యూనికేషన్ విధానానికి నాంది పలుకుతోంది. ఆస్ట్రేలియాలోని కంపెనీలు వాటి బ్రాండింగ్ కోసం అనుసరిస్తున్న ఆరు ప్రధాన వ్యూహాల్లో ఇమోజిలు కూడా ఉన్నాయి. -
'ఆ యాడ్ చేయనుగాక చేయను'
ఏ ఆర్టిస్ట్ అయినా స్టార్ ఇమేజ్ రాగానే ఆ ఇమేజ్ ను అడ్డంపెట్టుకోని క్యాష్ చేసుకోవాలి అనుకుంటారు. ముఖ్యంగా రెమ్యూనరేషన్ పెంచేయటంతో పాటు, మల్టీనేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్లుగా భారీగా సంపాదించేస్తారు.. బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖి మాత్రం అలా చేయటం లేదు. భజరంగీభాయ్‌జాన్, మాంఝీ లాంటి సినిమాలతో ప్రజెంట్ బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ అందుకున్న ఈ విలక్షణ నటుడు, వచ్చిన ప్రతీ యాడ్‌ను అంగీకరించకుండా సెలక్టివ్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు ప్రస్తుతం బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాక సోలో హీరోగా కూడా సత్తా చాటుతున్న నవాజుద్దీన్, ఓ భారీ ఆఫర్ ను కాదన్నాడు. నవాజ్ ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనుకున్న ఓ కండోమ్ కంపెనీ తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని భారీ ఆఫర్‌ను ఇచ్చింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ మాత్రం మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల తనకున్న గౌరవంతోనే ఈ ఆఫర్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాడు. -
ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండింగ్: బాబు
* ఇబ్బందిగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. అందుకే కొత్తగా కార్యక్రమాలు ఆపేశాం * ఏపీకి ప్రత్యేక హోదా అవకాశాలు క్షీణించటం వాస్తవమే * ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై ‘చూద్దాం.. అన్నీ చేస్తాం’ అని సీఎం వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వాణిజ్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు (బ్రాండింగ్) కల్పించడానికి దావోస్‌లో తన పర్యటన దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పర్యటన విశేషాలను మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులకు వివరించారు. పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ వివరాలను ఉత్సాహంగా వెల్లడించిన బాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పీఆర్సీ అమలు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం, ప్రత్యేక హోదా దక్కే అవకాశాలు మందగించడం.. తదితర అంశాలపై నిరుత్సాహంగా స్పందించారు. రాష్ట్రం గడ్డుస్థితినుంచి గట్టెక్కడానికి ఏం చర్యలు తీసుకుంటారో వివరించలేకపోయిన ఆయన.. తాను ఆశాజీవినని, సంక్షోభాన్ని అధిగమించడానికి అంతా సహకరించాలని విజ్ఞప్తి చేయడానికే పరిమితమయ్యారు. రాష్ట్రంలో జీతాలివ్వలేని పరిస్థితులు ఉన్నాయని, నిధుల కొరతతో కొత్త పథకాలు ఆపేశానని సీఎం చెప్పారు. ఏపికి ప్రత్యేక హోదా దక్కే అవకాశం లేకపోవడం, కేంద్రం నుంచి సహాయం అందని విషయం వాస్తవమేనని అంగీకరించారు. దీనిపై తాను దావోస్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడగా.. సానుకూలంగానే సమాధానం చెప్పారన్నారు. దేశంలో వాణిజ్యానికి అననుకూల వాతావరణం భారత్‌లో వ్యాపారాలు నిర్వహించటానికి అనుకూల వాతావరణం లేదనే అభిప్రాయం దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో వ్యక్తమైనట్లు చంద్రబాబు చెప్పారు. మన దేశంలో పరిశ్రమలు ఏర్పాటుకు 28 రకాల అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ స్థితిని మార్చే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పీఆర్సీ అమలుపై దాటవేత: సచివాలయ ఉద్యోగుల సంఘం రూపొందించిన డైరీ, క్యాలండర్‌ను సీఎం ఆవిష్కరించారు. కేలండర్ మీద చంద్రబాబు ఫోటోలు ఉండటాన్ని గమనించి విలేకరులు.. ‘మన డబ్బా మనం కొట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి?’ అని ప్రశ్నించగా.. ‘నీకేంటయ్యా బాధ?’ అంటూ సీఎం ఎదురు ప్రశ్నించారు. పీఆర్సీ అమలు గురించి మాట్లాడాలని విలేకరులు కోరగా.. ‘చూద్దాం. అన్నీ చేస్తాం’ అంటూ పొడి గా సమాధానం ఇచ్చారు. విలేకరులు కూడా పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వానికి అనుకూల వార్తలు రాయాలని బాబు విజ్ఞప్తి చేశారు. దావోస్‌లో అగ్ర కంపెనీల సీఈవోలు, దిగ్గజ సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులతో తాను భేటీ అయ్యాయనని సీఎం చంద్రబాబు చెప్పారు. పెప్సికో సీఈవో ఇంద్రానూయి మొదలు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ వరకు.. పలువురితో చర్చలు జరిపానన్నారు. బిల్‌గేట్స్‌ను విశాఖకు రమ్మని ఆహ్వానించానన్నారు. తనంటే బిల్‌గేట్స్‌కు ఎంతో అభిమానమని, ఆత్మీయంగా మాట్లాడారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులకు సహకరిస్తా: ప్రేమ్‌వత్సా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తానని కెనడా పారిశ్రామికవేత్త, ఫెయిర్‌ఫాక్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్, సీఈవో ప్రేమ్‌వత్సా సీఎం బాబుకు హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో సీఎంతో సమావే శమైంది. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయండి ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలీసింగ్ ద్వారా ఇసుక మాఫియా ఆగడాలను నిరోధించలేకపోవడం సరికాదన్నారు. ఇసుక అమ్మకాలపై సీఎం మంగళవారం సమీక్ష జరిపారు.