కొత్త ఆదాయ వనరు... ఇమోజి! | Live That 'SremmLife' With Rae Sremmurd's New Emoji Set | Sakshi
Sakshi News home page

కొత్త ఆదాయ వనరు... ఇమోజి!

Published Thu, Aug 25 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

కొత్త ఆదాయ వనరు... ఇమోజి!

కొత్త ఆదాయ వనరు... ఇమోజి!

సరికొత్త బ్రాండింగ్‌కు శ్రీకారం చుట్టిన కంపెనీలు
నూతన బిజినెస్ కమ్యూనికేషన్‌కు నాంది
అంతర్జాతీయ భాషగా అవతరిస్తోన్న తీరు
విశేషంగా ఆకర్షిస్తుతులౌతున్న యువత
భవిష్యత్తులో లావాదేవీలు కూడా వీటి ద్వారానే!


భాషలు మారుతున్నాయి. ఆధునిక టెక్నాలజీతో కొత్త సంకేత భాషలూ పుట్టుకొస్తున్నాయి. అలాంటిదే ఇమోజి కూడా. భావోద్వేగాల సంకేతాలే ఇమోజిలంటే. అంటే మన పూర్వీకులు బొమ్మల రూపంలోనే మాట్లాడుకునే విధానం... ఆధునిక టెక్నాలజీతో కొత్త రూపం సంతరించుకుందన్న మాట. ఆన్‌లైన్ సమాజానికి అత్యంత దగ్గరైన ఇమోజి... ‘ఆక్స్‌ఫర్డ్ ఈ ఏడాది పదం’ స్థాయికి చేరిపోయింది. ఎమెషన్లను తెలియజేసే ఈ ఇమోజి... ఇపుడు కొత్త కరెన్సీగా మారుతోంది. బ్రాండ్ కమ్యూనికేషన్ కోసం దీన్ని ఉపయోగిస్తున్న తీరు... కంపెనీలు ఇమోజిలను ఉపయోగించటం వల్ల వాటికి కలుగుతున్న లాభాలపై ప్రత్యేక కథనమిది...

ఇంతకు ముందు ఫేస్‌బుక్‌లో ఇమోజి ఆప్షన్లు ఉండేవి కావు. కేవలం లైక్, కామెంట్, షేర్ ఆప్షన్లే ఉండేవి. కానీ క్రమంగా ఫేస్‌బుక్  కూడా యూజర్ల డిమాండ్‌కు తలొగ్గింది. లైక్ బటన్‌లో పలు ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు వారి ఎమోషన్‌కు అనువుగా సమాధానం ఇవ్వడానికి పలు ఇమోజిలను జత చేసింది. ఇప్పుడు ఎన్ని లైక్స్ వచ్చాయో చూడటమే కాదు.. ఎన్ని ‘లవ్స్’, ‘హహ’, ‘వావ్’, ‘శాడ్’, ‘యాంగ్రీ’లు వచ్చాయో కూడా తెలుసుకోవచ్చు.

 వొడాఫోన్ జోరు..
వొడాఫోన్ జూజూలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఐపీఎల్ టీ20 సందర్భంలో వొడాఫోన్, ట్విటర్‌తో జతకలిసింది. ఇందులో భాగంగా ఇవి సూపర్  జూజూను తెరమీదకు తెచ్చాయి. ఇవి వొడాఫోన్‌కే చెందిన ఇదివకరటి ‘మస్కట్ జూజూ’ని పోలి ఉంటాయి. వొడాఫోన్ వీటి సాయంతో పలు వేల్యూ యాడెడ్ సర్వీసులను ప్రమోట్ చేస్తోంది. జూజూ అభిమానులు వారి అభిప్రాయాలను

కొత్తగా క్రియేట్ చేసిన ఇమోజిలతో బీసూపర్, హకేబకే అనే రెండు హ్యాష్ ట్యాగ్స్ ద్వారా తెలియజేస్తారు. వొడాఫోన్ ఇలాంటి ప్రచారాన్ని ప్రారంభించిన 4 రోజుల్లోనే దాదాపు 9 కోట్ల మంది మనసు గెలుచుకుంది. దీంతో కంపెనీ షేర్ ఆఫ్ వాయిస్ (ఎస్‌ఓవీ) 250 శాతం మేర పెరిగింది.  జూజూ ఇమోజి వినియోగదారులకు చాలా సుపరిచితమైంది. ‘‘గడిచిన కొన్ని నెలల్లో చాలా రోజులు మా బిసూపర్ హ్యాష్‌టాగ్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతూ వచ్చింది’ అని వొడాఫోన్ ఇండియా బ్రాండ్ అండ్ కన్సూమర్ విభాగపు నేషనల్ హెడ్ సిద్ధార్థ్ బెనర్జీ చెప్పారు. ట్విటర్ ప్రకారం.. భారత్ తొలి కార్పొరేట్ బ్రాండ్ ఇమోజి ఈ ‘సూపర్ జూజూ’నే.

3,333 శాతం ఎగసిన ఇమోజిల వాడకం
దేశంలోని ప్రముఖ బ్రాండ్లు ఒక ఏడాది కాలంలో ఉపయోగించిన ఇమోజిల్లో  వృద్ధి 3,333 శాతంగా ఉందని సోషల్ మీడియా ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ అన్‌మెట్రిక్ సీఈవో లక్ష్మణన్ నారాయణ్ తెలిపారు. కంపెనీ, దానికి ట్విటర్‌లోని ఫాలోవర్స్, అది ఉన్న రంగం వంటి పలు అంశాలను ఈ సంస్థ పరిగణలోకి తీసుకొని టాప్-100 బ్రాండ్లను లెక్కించింది. మే నెలలో ఈ వంద బ్రాండ్లు 25,163 సొంత ట్వీట్స్ చేశాయి. ఈ ట్వీట్స్‌లో 309 ట్వీట్స్ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఇమోజిలను కలిగి ఉన్నాయి. ఇమోజిలను ఎక్కువగా వాడిన కంపెనీల్లో కింగ్‌ఫిషర్ (90 ట్వీట్స్), జూమ్ టీవీ(63 ట్వీట్స్), ఎంటీవీ ఇండియా (50 ట్వీట్స్), రెడ్‌బుల్ ఇండియా (34 ట్వీట్స్),  లోరెల్ ఇండియా (25 ట్వీట్స్) ఉన్నాయి. ఈ 100 బ్రాండ్ల ఇమోజీ వాడకం కేవలం ఏడాదిలో 3,333 శాతం పెరిగింది.

 డెడ్‌పూల్ సినిమా ప్రమోషన్‌లో ఇమోజి...
మనకు ఇమోజిలు కొత్తేమో కానీ విదేశాల్లో మరింత జోరు మీదున్నాయి. బీట్‌లెస్ స్పాటిఫై హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించిన వారి కోసం ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ కంపెనీ స్పాటిఫై.. అబే రోడ్ కవర్ ఇమోజీలను ప్రమోట్ చేసింది. అలాగే అమెరికన్  ఫిల్మ్ స్టూడియో ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ తన డెడ్‌పూల్ సినిమా ప్రమోషన్‌కు ఇమోజిలను ఉపయోగించింది. అంతెందుకు!! కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో మేకిన్ ఇండియా కార్యక్రమం కోసం ట్విటర్ ఇమోజిని వాడింది.

‘లైన్’... ఆదాయంలో కీలకం
సోషల్ మేసేజింగ్ యాప్ లైన్.. గతేడాది 1.1 బిలియన్ డాలర్ల అదాయాన్ని ఆర్జించింది. ఇందులో 268 మిలియన్ డాలర్లు వరకు స్టిక్కర్స్, ఖరీదైన ఇమోజిల విక్ర యం ద్వారానే వచ్చింది. ‘ఇమోజి అంతర్జాతీయ భాషగా మారుతోంది. ఆన్‌లైన్‌లో ఎమోషన్స్‌ను, ఐడియాలను తెలుపడానికి ఇమోజిలు ఎక్కువగా వాడుతున్నారు’ అని  పెప్సికో ఇండియా బేవరేజ్ వైస్‌ప్రెసిడెంట్ విపుల్ ప్రకాశ్ తెలిపారు. పెప్సికో బాటిల్స్ దాదాపు 32 ప్రత్యేకమైన ఇమోజి డిజైన్లను కలిగి ఉన్నాయి.

 విజువల్ కంటెంట్ కే ఆదరణ
ఒకరికి మనం చెప్పింది గుర్తులేకపోవచ్చు. మనం చేసిన పనిని మరచిపోవచ్చు. కానీ మన వల్ల ఎలా ఫీల్ అయ్యారో మాత్రం మరచిపోలేరు.  కంపెనీలు కూడా దీన్నే అస్త్రంగా మార్చుకున్నాయి. వాటి బ్రాండ్‌ను కస్టమర్లకు మరింత చేరువ చేయడానికి ఇమోజీలను ఉపయోగిస్తున్నది అందుకే.  ఇది కొత్త బిజినెస్ కమ్యూనికేషన్ విధానానికి నాంది పలుకుతోంది. ఆస్ట్రేలియాలోని కంపెనీలు వాటి బ్రాండింగ్ కోసం అనుసరిస్తున్న ఆరు ప్రధాన వ్యూహాల్లో ఇమోజిలు కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement