ఐటీ నియామకాలలో సరికొత్త వ్యూహ్యాలు | IT Companies Plan For Campus Placements In Online | Sakshi
Sakshi News home page

ఐటీ కంపెనీల సరికొత్త వ్యూహ్యాలు

Published Fri, Sep 11 2020 5:53 PM | Last Updated on Fri, Sep 11 2020 5:57 PM

IT Companies Plan For Campus Placements In Online - Sakshi

ముంబై: కరోనా ఉదృతి నేపథ్యంలో మెజారిటీ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌ పూర్తయిన ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలపై సందిగ్ధత నెలకొంది. అయితే కంపెనీలు మాత్రం ఫ్రేషర్స్‌ బయపడాల్సిన అవసరం లేదని, నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం కంపెనీలు నిర్వహించనున్న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ) సాంకేతికతను ఉపయోగించనున్నారు. కాగా ప్రస్తుతం ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించే సందర్భంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా విద్యార్థి వ్యక్తిత్వాన్ని పసిగట్టనున్నారు. టీమ్‌తో కలిసి పనిచేసే నైపుణ్యాన్ని పరీక్షించనున్నారు.

అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అక్టోబర్‌లో నియామకాలు చేపట్టాలని మెజారిటీ ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీలైన ఐబీఎమ్‌, క్యాప్‌జెమినీలు ఎంపిక విధానంలో మార్పులు చేయనున్నట్లు ప్రకటించాయి. అయితే ఇప్పటి వరకు 60,000 మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించినట్లు క్యాప్‌జెమినీ ఉన్నతాధికారి అనిల్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement