సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ ఆంక్షల నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి పూర్తిస్థాయి మినహాయింపులిచ్చి మూడు వారాలైనా ఉద్యోగుల హా జరు శాతం పెరగట్లేదు. వంద శాతం సిబ్బందితో పని చేసుకునే వెసులుబాటు కల్పించినా ఐటీ సంస్థ లు మాత్రం ఆ దిశగా మొగ్గు చూపడం లేదు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని మరికొం త కాలం స్వయం ప్రకటిత లాక్‌డౌన్ అవలంబించాలని భావిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ ఐటీ రం గానికి చిరునామాగా ఉన్న గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో సందడి కరువైంది. గత నెల మూడో వా రంలో లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో పాటు వారానికి 8 నుంచి పది శాతం హాజరు శాతం పెరుగుతుందని ఐటీ వర్గాలు అంచనా వేశాయి. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడం తో మరికొంత కాలం ఇంటి నుంచే పని చేసే విధానం (వర్క్ ఫ్రమ్ హోం) కొనసాగించాలని ఐటీ కం పెనీలు నిర్ణయించారు.
హాజరు 20%లోపే..: మార్చి 22న లాక్‌డౌన్ ఆంక్ష లు విధించడానికి ముందే ఐటీ సంస్థలు వర్క్‌ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేయాలని ఉద్యోగులను ఆదేశించాయి. రాష్ట్రంలో సుమారు 5.50 లక్షల మం ది ఐటీ ఉద్యోగులు ఉండగా, లాక్‌డౌన్ వేళ 5% లోపు మంది మాత్రమే కార్యాలయాల నుంచి పని చేశారు. ఆంక్ష లు సడలించినా ప్రభుత్వం సూచిం చిన విధంగా భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వర్తించడం అటు ఉద్యోగులు, ఇటు సంస్థలకు ఎంతమాత్రం ఆచరణీయం కాదని ఐటీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యమైన ప్రాజెక్టులకు సంబంధించి వర్క్‌ఫ్రమ్ హోం విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటంతో కీలకమైన సిబ్బందిని మాత్రమే పెద్ద ఐటీ కంపెనీలు కార్యాలయాల నుం చి పనిచేయాలని చెబుతున్నాయి. జూలైలో ఐటీ కంపెనీల్లో హాజరు శాతం కొంతమేర మెరుగై ఆగస్టు నాటికి 50 నుంచి 70% మేర నమోదయ్యే అవకాశం ఉందని ఐటీ వర్గాలు చెప్తున్నా యి. కాగా, ఉద్యోగులను కార్యాలయాల నుంచే పని చేయాలని ఆదేశించడం పై ఐటీ సంస్థలు ఆచి తూచి వ్యవహరిస్తున్నాయని హైసియా అధ్యక్షుడు భరణికుమార్ అరోల్ తెలిపారు. సంస్థ కార్యకలాపాలకు ఇబ్బంది లేనంతవరకు ఇంటి నుంచి పనిచేసే విధానానికి అనుమతి ఇవ్వడమే సరైనదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment