సాక్షి, హైదరాబాద్ : కరోనా దెబ్బకు ప్రపంచంలోని దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావిత మయ్యాయి. అదేసమయంలో డేటా వినియోగం అనివార్యంగా మారింది. 2020 ఏప్రిల్ తరువాత.. కోవిడ్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ఇంటర్నెట్ ఆధారిత సేవలను అనివార్యం చేసింది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వైద్యం, ఆర్థిక, సామాజిక రంగాలన్నీ ఇంటర్నెట్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 15%లోపు ప్రజలు వర్క్‌ఫ్రమ్ హోం చేసేవారు. కానీ, లాక్‌డౌన్ దెబ్బకు ఇది 50% దాటింది. ఇక రోజువారీ జీవితంలోనూ యాప్స్ వినియోగం అనూహ్యంగా పెరిగింది.
ఆన్ లైన్ కొనుగోళ్లు, నగదు చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలు, షాపింగ్, బుకింగ్స్, వినోదం, సందేశం, సంగీతం, సంప్రదింపులు, సమావేశాలు, శిక్షణ ఇలా ప్రతీది డేటా ఆధారంగానే నడుస్తున్నాయి. ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో టైం జోన్ ఉంటుంది. మనకు పగలైతే, మరో దేశంలో రాత్రి. డేటా ఆధారిత సేవలు పెరిగిపోతుండటంతో మనుషులు నిద్రపోయినా.. డేటా మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. ప్రతీ సెకనుకు అనేక లక్షల ఆర్డర్లు, క్లిక్స్, అప్‌లోడ్సే నిదర్శనం. లాక్‌డౌన్ తర్వాత డేటా వినియోగం ఎలా పెరిగిందో డోమో అనే అమెరికాకు చెందిన క్లౌడ్ సంస్థ అధ్యయనం చేసింది. డేటా నెవ ర్ స్లీప్స్ 8.0 పేరిట తన తాజా అధ్యయనం ఫలితాలను విడుదల చేసింది.
ప్రతీ నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన అప్‌లోడ్స్
జూమ్ మీటింగులు : 2,08,333
ఫేస్‌బుక్ అప్‌లోడ్స్ : 1,47,000
వాట్సాప్ షేర్లు : 4,16,66,667
మొబైల్ యాప్‌ల కోసం వెచ్చించిన మొత్తం : 3805 యూఎస్ డాలర్లు
వీడియోకాల్స్ : 13,88,889
అమెజాన్ ఆర్డర్లు : 6,659
ఇన్‌స్టాగ్రామ్ 1,38,889
స్పాటిఫై : 28 మ్యూజిక్ ట్రాకులు
టిక్‌టాక్ డౌన్‌లోడ్స్ : 2,704
లింక్డ్‌ఇన్ దరఖాస్తులు : 69,444
ఫేస్‌బుక్‌లో షేర్లు : 1,50,000
మైక్రోసాఫ్ట్ టీమ్ వినియోగం : 52,083
ఆన్‌లైన్‌లో వినియోగదారులు వెచ్చించిన మొత్తం : 10,00,000 అమెరికా డాలర్లు
ట్విట్టర్ కొత్త వినియోగదారులు : 319 మంది
యూట్యూబ్ అప్‌లోడ్స్ : 500 గంటలు
ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు : 3,47,222
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన వీడియోలు : 4,04,444 గంటలు
457 కోట్లకు చేరిన వినియోగదారులు..
ఏటేటా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండగా...అదికాస్తా లాక్‌డౌన్‌తో మరింత పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 59% మంది అంటే 457 కోట్ల మంది డేటా ఆధారిత సేవలు పొందుతున్నారు. 2019 జనవరితో పోలిస్తే డేటా వినియోగంలో 6% వినియోగం పెరిగిందని ‘డోమో’తెలిపింది.
సంవత్సరం డేటా
వినియోగదారులు కోట్లలో
2014 300 కోట్లు
2016 340 కోట్లు
2018 430 కోట్లు
2020 450 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment