Top Best Funny And Most Embarrassing Zoom Moments Of Work From Home In 2020 - Sakshi
Sakshi News home page

జూమ్‌ కితకితలు : ప్యాంట్‌ లేకుండానే

Published Tue, Feb 23 2021 11:34 AM | Last Updated on Tue, Feb 23 2021 2:14 PM

Top Best Funny And Embarrassing Zoom Moments In 2020 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఈ మహమ్మారి విస్తరణకు అడ్డుకునేందుకు మొత్తం ప్రపంచమంతా కఠిన నిబంధనల మధ్య లాక్‌డౌన్‌ అయిపోయింది. ఫలితంగా దేశ ఆర్థికవ్యవస్థలు చిన్నాభిన్నా మైపోయాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయిన వారికి లెక్కే లేదు. దీంతోపాటు లాక్‌డౌన్‌ కారణంగా వర్క్ ‌స్టయిల్‌ పెనుమార్పులకు 2020 ఏడాది సాక్క్ష్యంగా నిలిచింది. చాలామంది ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోంకు పరిమితమై పోయారు. పాఠశాలలు, విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులను ఆశ్రయించక తప్పలేదు.  (జూమ్‌ కాల్‌‌లో ఫన్నీ రొమాన్స్‌ : వైరల్‌)

ఇవన్నీ ఒక ఎత్తయితే.. వర్క్‌ ఫ్రం హోం, జూం మీటింగులు, వీడియో కాల్స్‌లో చోటు చేసుకున్న ఫన్నీ ఇన్సిడెంట్స్‌ కోకొల్లలు. 2020 ఏడాదిలో అత్యంత ఇబ్బందికరమైన జూమ్ క్షణాలు అని  వీటన్నింటిని ఒక చోట చేరిస్తే..పొట్ట చెక్కలవ్వడం ఖాయం. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో నెటిజన్లకు గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఇంట్లోని చిన్నపిల్లలు,పెంపుడు జంతువుల సందడి ఒక ఎత్తయితే.. ఆన్‌లైన్‌లో ఉన్నామనే సోయి లేకుండా, జూమ్‌ బుట్టలో పడ్డ పెద్దవారి గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. ఉదాహరణకు ఒక మీటింగ్‌లో కెమెరా ఆన్‌లో ఉందన్న సంగతి మర్చిపోయి ఒక బాయ్‌ ఫ్రెండ్‌ ప్యాంట్‌ లేకుండా లోదుస్తులతో దర్శమిస్తాడు. మరో వ్యక్తి.. ప్యాంట్‌ లేకుండానే..ఇంటర్వ్యూని ఫినిష్‌ చేస్తాడు.. ఇక పాపం..జెన్నిఫర్‌ గురించి ఏమని చెప్పాలి.. ఆనక విషయం తెలిసి వారు బిక్కమొహం వేస్తే....మనం మాత్రం వై దిస్‌ కొలవెర్రీ అంటూ.. కడుపుబ్బ నవ్వుకోవడమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement