ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత వారం నుంచి సీనియర్ లెవల్ ఐటీ(టెకీలు) ఉద్యోగులు పదోన్నత్తుల కోసం కంపెనీలకు రెజ్యూమ్స్ పంపిస్తున్నట్లు సాంకేతిక విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఎక్కువగా నైపుణ్యాలు, కొత్త టెక్నాలజీని నేర్చుకోలేని వారికి ఉద్వాసన తప్పదని ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం డిజిటల్ నిపుణులకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని.. వాటిలో నైపుణ్యం పెంచుకోవడానికి ఉద్యోగులు కృషి చేయాలని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా తెలిపారు.
ఉద్యోగుల డిజిటల్ నైపుణ్యాలకు కంపెనీలు అధిక ప్రాధాన్యత ఇస్తాయని గుప్తా అభిప్రాయపడ్డారు. దాదాపు 40 శాతం మంది సీనియర్ ఐటీ ఉద్యోగులు కంపెనీలకు రిజ్యూమ్స్ పంపిస్తున్నట్లు ఫీనో అనే కన్సెల్టెంట్ సంస్థ తెలిపింది. కరోనా ప్రభావం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు ఉండకపోవచ్చని ఫీనో సహ వ్యవస్థాపకుడు కమల్ కరన్త్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఐటీ దిగ్గజ కంపెనీలు ఐబీఎమ్, కాగ్నిజెంట్ తదితర సంస్థలు ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment