దుబాయ్ అంటే అధికంగా క్రూడ్ ఆయిల్‌పై ఆధారపడే దేశంగా ఉండేది ఒకప్పుడు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచంతో పోటీ పడాలంటే ఇతర రంగాలలోనూ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. అందుకే గత కొనేళ్లుగా ఆయిల్‌తో పాటు ఇతర వ్యాపార రంగాలలోనూ పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈ జాబితాలో యూఏఈ కాస్త ముందు వరుసలో ఉందనే చెప్పాలి. ఇప్పటికే ఫార్మా నుంచి ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల వరకు వివిధ రంగాల కంపెనీలను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సారి కన్ను ఐటీ రంగంపై కూడా పడింది.
ఐటీ రంగంపై కన్న పడింది!
ఇందుకోసం సరికొత్త ప్లాన్‌తో ఐటీ కంపెనీలకు ఆఫర్లను ప్రకటించింది. యూఏఈ తెలిపిన ప్రకారం.. తమ దేశంలో అడుగుపెట్టే కంపెనీలకు వేగంగా వ్యాపార లైసెన్స్‌లతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్‌కు సంబంధించి కూడా సులభమైన రీతిలో పనులు పూర్తి కానున్నాయి. అంతేకాకుండా అందులో పని చేసే ఉద్యోగులకు దీర్ఘకాలిక పౌరసత్వాన్ని కూడా అందించనుంది. దీని ద్వారా ఆసియా, యూరప్‌లోని టెక్ కంపెనీలను ఆకర్షించాలని యోచిస్తోంది.
ఆ కంపెనీలోని ఉద్యోగులకు 10 ఏళ్ల పాటు గోల్డెన్ వీసా, ఉండటానికి స్థలం, పిల్లలకు పాఠశాల వంటి సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. దీనిపై యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి థానీ అల్ జెయోడీ మాట్లాడుతూ.. జూలైలో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా గల్ఫ్ దేశం 300 కంటే ఎక్కువ డిజిటల్ సంస్థలను లక్ష్యంగా పెట్టుకుందని, దాదాపు 40 కంపెనీలు తరలింపు ప్రక్రియలో ఉన్నాయన్నారు. ఇప్పటికే బ్యాంకర్లు, హెడ్జ్ ఫండ్ మేనేజర్లు, కమోడిటీ వ్యాపారులకు అనువైన ప్రదేశంగా యూఏఈ పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: మైండ్‌బ్లోయింగ్ ఐడియా.. మట్టి లేకుండా వ్యవసాయం, ఏడాదికి 70 లక్షల ఆదాయం!
Comments
Please login to add a commentAdd a comment