ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ : తీసుకున్నోడికి తీసుకున్నంత! | Company bumper offered employees lays out Rs 70 crore on table viral video | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ : తీసుకున్నోడికి తీసుకున్నంత!

Published Thu, Jan 30 2025 3:10 PM | Last Updated on Thu, Jan 30 2025 3:21 PM

Company bumper offered employees lays out Rs 70 crore on table viral video

ఏడాదికోసారి తమ ఉద్యోగులకు బోనస్‌లు, పారితోషికాలు ఇవ్వడం చాలా  సర్వసాధారణం.  కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు అద్భుతమైన బోనస్‌లు అందిస్తాయి. మరి కొన్ని కంపెనీలు అసాధారణమైన బహుమతులు, కానుకలు అందించిన సందర్భాలూ ఉన్నాయి. ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోయేలా  భారీ కానుకలిచ్చిన సూరత్‌ డైమండ్‌ కంపెనీ గురించి  విన్నాం. అలా తమ కంపెనీ విజయంలో భాగస్వామ్యులైన ఉద్యోగులను గుర్తిస్తాయి. గౌరవిస్తాయి.  అయితే  చైనాకు చెందిన ఒక క్రేన్‌ కంపెనీ కనీవినీ ఎరుగని రీతిలో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా.. అయితే మీరీ కథనం చదవాల్సిందే.!

చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ  ఆసక్తికరమైన ఆఫర్‌ ప్రకటించి వార్తల్లో నిలిచింది.  తమ కంపెనీ ఉద్యోగులకు వార్షిక బోనస్‌ను వైరైటీగా ప్రకటించింది. ఉద్యోగులందరికీ  70 కోట్లు రూపాయలను బోనస్‌గా  ఆఫర్‌  చేసింది. ఇందులో  ఒక ట్విస్ట్‌ ఉంది. ఒక గ్రాండ్‌ పార్టీని  ఏర్పాటు చేసిన కంపెనీ, ఏ ఉద్యోగికి ఎంత మొత్తం లభిస్తుందో నిర్ణయించడానికి ఒక పోటీ పెట్టింది. తాను ప్రకటించిన బోనస్‌ మనీ  రూ.70 కోట్లు  ఒక టేబుల్‌పై పర్చింది. దీంట్లో ఉద్యోగులు 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడితే అంత తీసుకోవచ్చని తెలిపింది. 60 నుంచి 70 మీటర్ల టేబుల్ పై ఈ మొత్తాన్ని ఉంచి, ఉద్యోగులను 30 బృందాలుగా విభజించింది. ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు మాత్రమే రావాల్సి ఉంటుంది. వీరిద్దరూ  15 నిమిషాల్లో ఎంత సొమ్ము లెక్కపెడతారో అంత మొత్తం ఆ టీంకు దక్కుతుందని ప్రకటించింది. దీంతో పోటీ మొదలైంది. చకచకా డబ్బులు లెక్కపెడుతూ ఉద్యోగులు నానా హైరానా పడ్డారు.  అన్నట్టు  ఏదైనా తప్పుగా లెక్కిస్తే... ఆ నగదును బోనస్ నుండి తీసివేస్తారు కూడా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 2023 జనవరిలోనూ ఇదే విధంగా హెనన్ మైన్ క్రేన్ సంస్థ  వార్షిక టీం లంచ్‌లో తమ ఉద్యోగులకు రూ.70 కోట్లను  ఇచ్చిదట.

ఇదీ  చదవండి: సినిమాను మించిన సింగర్‌ లవ్‌ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్‌!

 

హెనాన్ మైనింగ్ క్రేన్ కో. లిమిటెడ్ ద్వారా చైనీస్ సోషల్ మీడియా సైట్‌లు డౌయిన్ ,వీబోలో షేర్ చేసింది. అలాగే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ అయింది.  వీడియోపై  నెటిజన్లు విభిన్నమైన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. కొందరు  ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా, మరికొందరు తమ  కంపెనీలో పరిస్థితిని తలుచుకొని జోక్‌లువేశారు. “నా కంపెనీ కూడా ఇంతే.. కానీ డబ్బులు కాదు సుమా.. టన్నుల కొద్దీ పనిభారాన్ని ఇస్తుంది.” మరొకరు, ‘‘ ఇలాంటి పేపర్‌ పని నాకు కావాలి... కానీ కంపెనీ ప్లాన్‌ మరోలా ఉంది” అని  ఇంకొకరు కామెంట్‌  చేశారు. “ఈ సర్కస్ బదులుగా కార్మికుల ఖాతాల్లో నేరుగా డబ్బుజమ చేయవచ్చుగా అది చాలా అవమానరమైనది.  గ్రేట్ వాల్ వెనుకున్న చైనా ప్రపంచమే వేరు’’  అంటూ ఇంకొకరు నిట్టూర్చారు.

చదవండి: Maha Kumbh Mela 2025: కలియుగ శ్రవణ్‌ కుమరుడు ఇతడు...
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement