సాధారణంగా కంపెనీలు.. ఉద్యోగుల నుంచి సాధ్యమైనంత పనిని చేయించు కోవాలనుకుంటాయి. ఇక కొన్ని సంస్థలైతే తమ ఉద్యోగులకు టార్గెట్‌ల పేరుతో వేధిస్తుంటాయి. తాజాగా ఓ బాస్ తన ఉద్యోగులకు విచిత్రమైన శిక్ష వేశాడు. తమ సంస్థలో పని చేసే ఉద్యోగుల పనితో సంతృప్తి లేదని వెరైటీ పనిష్మెంట్ ఇచ్చాడు. ఇదంతా అందులో ఒక ఉద్యోగి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ బాస్ బండారం బయటపడింది.
ఈ వింత ఘటన చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. అదో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కంపెనీ. పేరు సుఝౌ దనావ్ ఫాంగ్‌చెంగ్షీ ఇన్ఫర్మేషన్ కన్సల్టింగ్. ఈ కంపెనీకి సంబంధించిన చాలా మంది ఉద్యోగులు బలవంతంగా చేదు కాకరకాయల్ని బలవంతంగా తిన్నారు. చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, చాలా మంది ఉద్యోగులు పచ్చి పొట్లకాయ తింటున్నారు. కంపనీలో చేరే ముందు వారి పని తీరు సంతృప్తిగా లేకపోతే ఇలాంటి పనిష్మెంట్‌కి ఉద్యోగులు అంగీకరిస్తూ అగ్రిమెంట్ కూడా చేయించుకున్నట్లు కంపెనీ తెలిపింది. అది రివార్డ్, పనిష్మెంట్ స్కీమ్ అని పేర్కొంది.
ఇలా ఎందుకు చేశారని చైనా మీడియా ఆ సంస్థ ప్రతినిధిని అడగగా.. వారు మొండిగా సమాధానం ఇచ్చారు. ఉద్యోగులకు ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో వారు కఠినంగా, హార్డ్ వర్క్ చేస్తారని అన్నారు. తద్వారా మాత్రమే టార్గెట్ రీచ్ అవ్వగలరని అన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ కంపెనీ బాస్‌పై మండిపడుతున్నారు. ఇదేం స్కూల్ కాదు ఇలాంటి శిక్షలు వేయడానికి.. ఆ బాస్ బుద్ధిలేదు, వాడో శాడిస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
చదవండి: రష్యాకి తగిలిన వాగ్నర్ సైన్యం షాక్‌కి..ప్రపంచ నాయకుల రియాక్షన్ ఎలా ఉందంటే..
Comments
Please login to add a commentAdd a comment