లక్ష మంది యువతకు శిక్షణలో విజనెట్‌ ఇండియా | Visionet India plans to make 1 lakh youth employable in 5 yrs | Sakshi
Sakshi News home page

లక్ష మంది యువతకు శిక్షణలో విజనెట్‌ ఇండియా

Published Sat, May 2 2020 5:28 AM | Last Updated on Sat, May 2 2020 5:28 AM

Visionet India plans to make 1 lakh youth employable in 5 yrs - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బీపీఎం రంగాల్లో ఉద్యోగాలకు అనుగుణంగా 1 లక్ష మంది గ్రాడ్యుయేట్స్‌కు తగు శిక్షణ కల్పించాలని బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ విజనెట్‌ ఇండియా నిర్దేశించుకుంది. 500 మంది యువ ప్రొఫెషనల్స్‌తో 45 రోజుల ప్రోగ్రాం తొలి బ్యాచ్‌ను ప్రారంభించిన సందర్భంగా సంస్థ ఎండీ అలోక్‌ బన్సల్‌ ఈ విషయం తెలిపారు. ’ఉన్నతి ఫర్‌ ఇండియా’ ప్రాజెక్టు కింద ఈ శిక్షణ ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు. ప్రోగ్రామ్‌ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేషన్‌ లభిస్తుందని తెలిపారు. ఫ్రెషర్లకు సాధారణంగా తమ సంస్థలో 3–4 దశల్లో వడపోత ఉంటుందని, ఈ శిక్షణ పొందినవారు ఒక్క రౌండును పూర్తి చేస్తే సరిపోతుందని బన్సల్‌ చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement